#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ChinnariVikramarkudu, #చిన్నారివిక్రమార్కుడు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
Chinnari Vikramarkudu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 08/12/2024
చిన్నారి విక్రమార్కుడు - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ధనుంజయరావు.. సత్యవతిల ఒక్కగానొక్క కొడుకు విక్రమ్. ఎనిమిది సంవత్సరాలు. ఫోర్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు.
ఆరోజు స్కూల్ నుంచి విక్రమ్ ఇంటికి వచ్చేసరికి అతని పెదనాన్న కాంతారావు కనబడ్డాడు వీధిలో.
''ఒరేయ్ విక్రమ్! మీ నాన్న, అమ్మ అర్జెంటు పని మీద టౌన్ వెళ్లార్రా. వచ్చే సరికి రాత్రి ఎనిమిది గంటలు అవు తుందట. వచ్చేటప్పుడు నీకు తినడానికి ఏమైనా తెస్తామన్నారు. ఇదిగో తాళం ఇచ్చారు. '' అంటూ తాళం విక్రమ్ కు ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఊరికి చాలా దూరంగా తోటల్లో ఉంది విక్రమ్ ఇల్లు.. ఆ ఇంటికి మరో అర ఫర్లాంగు దూరంలో ఉంది పెదనాన్న కాంతారావు ఇల్లు. ఆ రెండు ఇళ్ళు తప్పించి కను చూపుమేరలో నివాస గృహాలు ఏమీ లేవు.. . రెండు మూడు పశువుల పాకలు తప్పించి. ఇంకా నలుగురు ఐదుగురు ఆ చుట్టుపక్కల ఇళ్ళు కట్టుకోవడానికి శంకుస్థాపనలు చేసుకున్నారు ఇప్పుడిప్పుడే.
అలా పెదనాన్న తాళం ఇవ్వడం.. లాంటి పరిస్థితి ఇదివరకు అనుభవమే కనుక కంగారు పడకుండా ఆయన ఇచ్చిన వీధితాళం తీసుకొని సింహద్వారం తాళం తీసి లోపలకు వెళ్లి పుస్తకాల బ్యాగు బల్ల మీద పెట్టి సింహద్వారం బయట అరుగుకి ఒక పక్కగా ఉన్న కిచెన్లోకి వెళ్ళాడు విక్రమ్.
అతని అమ్మ సత్యవతి.. స్టీల్ బాక్స్ లో తినడానికి ఏదో ఒకటి ఉంచుతుంది విక్రమ్ ఇంటికి వచ్చేసరికి. అయితే అది తెరిచి చూస్తే అందులో ఏమీ లేవు.
కంగారుగా వెళ్ళిపోయి ఉంటుంది అనుకుని విక్రమ్.. కిచెన్ లో చిన్న అటక మీద చిన్న జాడీలో అమ్మ తిను బండారాలు దాస్తుంటుంది కదా అన్న ఉద్దేశంతో అక్కడే ఉన్న ఐరన్ ఫోల్డింగు నిచ్చెన వేసుకొని నెమ్మదిగా పైకి ఎక్కాడు.
ఆకలి దంచి కొట్టేస్తుంది కనుక అటక మీద కూర్చు ని జాడి మూత తీశాడు. అది చేతిలో నుంచి జారి నేల మీద పడి ముక్కలు అయిపోయింది. ఆ జాడీలో చూస్తే అందులో కూడా ఏమీ లేవు. సరే కిందకి దిగి పోదాం అనుకునే సరికి ఫోల్డింగ్ నిచ్చె న బోల్ట్ విరిగి పోయి ఆ నిచ్చెన రెండు ముక్కల్లా నేల మీద పడిపోయింది.
క్రిందకు దిగడానికి అవకాశం లేదు కనుక.. విక్రమ్ కు భయం పట్టుకుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చునే సరికి సడన్గా కిచెన్ లో సీలింగ్ ఫ్యాన్ తిరగడం మొద లెట్టింది. విక్రమ్ అతని తల్లిదండ్రులు బయటకు వెళ్లేటప్పుడు కరెంటు లేకపోవడంతో ఫ్యాన్ స్విచ్ కట్టకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు కరెంటు రావడంతోఅది స్పీడుగా తిరిగేస్తుంది. తిరిగినా పర్లేదు దాని రెక్కలు కరెక్ట్ గా విక్రమ్ శరీరాన్ని కోసేసే విధంగా తిరుగుతున్నాయి.
ఫ్యాన్ సిచ్చు ఆఫ్ చేద్దామంటే అది ఎక్కడో అందనంత కిందన ఉంది. విక్రమ్ ఒక అంగుళం కూడా కదలకుండా బిగుసుకు పోయి కూర్చుండిపోయాడు.
పైగా అతను బాగా భయపడే బొద్దింకలు ఆ మూత తీసిన జాడీలో నుంచి గుంపులు గుంపులు గా వచ్చి అతని మీద ఎక్కేస్తున్నాయి. గట్టిగా అమ్మా.. అంటూ అరిచేశాడు విక్రమ్.
అయితే విక్రమ్ కంగారు పడలేదు. తను వేసుకున్న పొడుగు ప్యాంటు లోపల అండర్ వేరు ఉండడంతో అతను తను కట్టుకున్న ఫుల్ ఫాంటు ఫుల్ హ్యాండ్ షర్టు తీసి నోటి పళ్ళు సహాయంతో చింపి నాలుగు గుడ్డ ముక్కలు గా చేశాడు. అవి అన్ని ఒకదానికి ఒకటి ముడి వేసి పొడవాటి చీర మాదిరిగా తయారుచేసి ఉంచాడు.
కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోతుంది కనుక ఆ గుడ్డ ఒక చివర రాడ్ కి ముడివేసి ఎలాగో దాని ఆధారంతో కిందకు దిగాలి.. అనేది అతని ఆలోచన.
ఇక అతను కరెంట్ పోవడం గురించి చూస్తున్నాడు.. ఈలోగా తన ఇంటి బయట నుండి సింహద్వారం గుండా లోపలకు ఎవరో వెళ్లడం గమనించాడు. భయం వేసింది కానీ భయపడ లేదు విక్రమ్. దొంగే అయి ఉంటాడని గ్రహించేసాడు.
''ఎవరు.. ?'' అంటూ గట్టిగా అరిచాడు.. . కిచెన్లో ఆ అటక మీద నుండే.. విక్రమ్.
ఆ దొంగ వెంటనే అరుగు మీదకు వచ్చి కిచెన్ లోకి వెళ్లి.. అక్కడ పరిస్థితి అంతా చూసి అర్థం చేసుకొని నవ్వుకున్నాడు. విక్రమ్ తనను కిందకు దింపమని ఆ దొంగను బ్రతిమాలాడు.
''పిల్లోడా.. బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పు. నేను వెళ్లేటప్పుడు నిన్ను కిందకు దింపుతాను'' అన్నాడు.. . ఆ దొంగ.
''నా దగ్గర వీధి తాళం మాత్రమే ఉంది. బీరువా తాళాలు మా అమ్మానాన్న పట్టుకెళ్ళి పోతుంటారు''.. . అని విక్రమ్ అనడంతోనే ఆ దొంగ ఇంటి లోపలికి వెళ్లి తాళాల గురించి ఇల్లoతా చిందర వందర చేయడం మొద లెట్టాడు.
విక్రమ్ గట్టిగా అరుద్దామంటే చుట్టుపక్కల ఎవరూ ఉండరు.. పోనీ విక్రమ్ దగ్గర సెల్ ఫోన్ కూడా ఉండదు.
ఇంతలో కరెంటు పోయింది.. . విక్రమ్ తను అనుకున్నట్టు ఫ్యాన్ రాడ్ కు తను తయారుచేసిన ఏక గుడ్డ ఒక కొస ముడివేసి.. దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఎలాగోలా కిందకు దిగిపోయాడు.
చూస్తే అంతా చీకటి. దొంగ దగ్గరకు వెళ్లి ఎదుర్కొంటే వాడు తనను పీకి పట్టుకుని చంపేయొచ్చు.. మరి ఇప్పుడు ఎలా? ఇంకో సమస్య పట్టుకుంది విక్రమ్ కు.. కానీ విక్రమ్ ఏ మాత్రం అధైర్యం పడకుండా.. ఏదో ఆలోచన వచ్చినట్టు తల ఊపాడు.
తను ఉన్న కిచెన్ గది రెండు చెక్క తలుపులు పట్టు కొని గట్టిగా శబ్దం వచ్చేలా గుమ్మానికి దబదబ బాదాడు.
ఆ శబ్దానికి లోపల తాళాలు వెతుకుతున్న దొంగకు భయం పట్టుకుంది.
గట్టిగా గాలి వేయటం లేదు.. ఆ పిల్లోడు కిచెన్లో అటక మీద ఉండిపోయాడు.. . చుట్టుపక్కల మనుషులు ఎవరూ లేరు?.. మరి ఎలా కిచెన్ తలుపులు దబ దబా కొట్టుకుంటున్నాయి అన్న విషయం దొంగకు అర్థం కాలేదు.
కాసేపు ఆలోచించి సిటీకి దూరంగా ఇలాంటి నిశ్శబ్ద ప్రదేశాల్లో దెయ్యాలు తప్పకుండా తిరుగు తుంటాయి. అవే ఈ శబ్దాలు చేసి ఉంటాయి.. . అని.. ఆలోచించి అదే ఆలోచనతో భయం పెంచుకొని చెమటలు పట్టిన ఆ దొంగ బయటకు వచ్చి పరుగు పెట్టుకుని వెళ్లిపోయాడు.
ఇదంతా ఆ చీకట్లోనే ఉండి చూస్తున్న విక్రమ్ కిచెన్ లోంచి బయటికి వచ్చి.. ముసి ముసిగా నవ్వు కుంటూ ఇంటి లోపలకు వెళ్లాడు.
ఇంతలో కరెంటు వచ్చింది.. స్విచ్లు అన్ని వేశాడు విక్రమ్..
ఆ వెంటనే విక్రమ్ తల్లి, తండ్రి మోపెడ్ మీద వచ్చేశారు. గబగబా ఇంట్లోకి వెళ్లి.. జరిగిన విషయం అంతా తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
అయితే వాళ్లు విక్రమ్ గురించి అసలు భయ పడలేదు. ఎందుకంటే విక్రమ్ కు ఆ పేరు పెట్టినప్పటి నుండి ఏ మాత్రం భయం లేకుండా విక్రమార్కుడు లాగే పెరుగుతూ వచ్చాడు. విక్రమ్ తల్లి తను తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్ అందిస్తూ విక్రమ్ ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది.
ఆ మర్నాడు విక్రమ్ ను సిటీకి తీసుకెళ్లి అతని ధైర్య సాహసాలకు బహుమతిగా మంచి సైకిల్ కొనిపెట్టాడు విక్రమ్ తండ్రి.. ధనుంజయరావు.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments