చిన్నారులు చిరు దివ్వెలు
- Gadwala Somanna
- Jan 25
- 2 min read
Updated: Feb 4
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChinnaruluChiruDivvelu, #చిన్నారులుచిరుదివ్వెలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 5
Chinnarulu Chiru Divvelu - Somanna Gari Kavithalu Part 5 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 25/01/2025
చిన్నారులు చిరు దివ్వెలు - సోమన్న గారి కవితలు పార్ట్ 5 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
చిన్నారులు చిరు దివ్వెలు
----------------------------------------
సదనంలో చిన్నారులు
గగనంలో తారకలు
చీకటిని పారద్రోలే!
వెలుగులీను చిరు దివ్వెలు
దీపావళి దీపాలు
కాంతులకు ప్రతిరూపాలు
నగుమోముల పసి పిల్లలు
విరబూసిన సిరిమల్లెలు
ఆకసాన హరివిల్లులు
అందమైన పొదరిల్లులు
చిన్ని చిన్ని పిల్లలే!
సన్నజాజి సుమములే
ముద్దులొలికే బాలలే!
చల్లని మనసు చుంద్రులు
తెల్లని మల్లెల జల్లులు
"రేపటి భారత పౌరులు"
దేశాభివృద్ధికి బాటలు
దేశానికి సారథులు
బంధాలకు వారధులు
వారే! వారే! బాలలు

కొరగానివి భువిలో!
----------------------------------------
వాసన లేని పూవులు
గురువులు లేని పురములు
కొరగానివి పరికింప
దేవుడు లేని బ్రతుకులు
మహిళలు లేని గృహములు
చుక్కలు లేని రాత్రులు
వీక్షింప వీలుకాదు
కనువిందు కానేరదు
జలములు లేని చెరువులు
ఫలాలు లేని తరువులు
ఉండి ఫాయిదా ఏది?
విలువలు లేని మనుషులు
బాలలే లేని బడులు
దైవమే లేని గుడులు
కొరగానివి భువిలోన!
అడవి కాచిన వెన్నెల!

మానసిక ఒత్తిడికి గురి కాకు
----------------------------------------
చిన్ని చిన్ని విషయాలకు
అంతలా చింతించకు
ఒంటరి పక్షి మాదిరి
కుమిలి కుమిలి ఏడ్వకు
గుండె దైర్యముంటేనే
ఏదైనా సాధ్యమే!
నిలకడగా ఉంటేనే
అణువణువునా విజయమే!
నిరీక్షణ అనివార్యము
సత్ఫలితాల కోసము
తొందరపాటుతనమే
అనర్థాలకు స్థావరము
లోతుగా యోచించుము
తీసుకొనుము నిర్ణయము
క్షణికావేశం వద్దోయ్!
సావధానం ముఖ్యమోయ్!

విచక్షణ కోల్పోకూడదు!!
----------------------------------------
అసహ్యం పెంచుకోకు
బంధాలను త్రెంచుకోకు
విరోధులైనా సరే!
నాశనాన్ని కోరుకోకు
చెప్పుడు మాటలను వినకు
తప్పుడు మార్గం కనకు
బుర్రను వినియోగించి
పెంచుకో! మదిని మంచి
ఎవరినీ వంచించకు
పగతో అవమానించకు
లోలోన కృంగిపోకు
విజయాలకు పొంగిపోకు
నిదానమే ప్రధానము
కొన్ని కొన్ని వేళల్లో
"ఆలస్యం అమృతం విషము"
మరికొన్ని సమయాల్లో

నోటితో జాగ్రత్త!
----------------------------------------
హద్దులో ఉంటేనే
బంధాలే! పదిలము
లేకుంటే మాత్రము
జీవితాలు ఛిద్రము
నోటితో జాగ్రత్త!
తెచ్చిపెట్టును కీడు
దాన్ని నియంత్రిస్త
భువిలో మగధీరుడు
నోరు జారితే ముప్పు
కుటుంబాలకు నిప్పు
మాట్లాడే ముందే
ఆలోచిస్తే ఒప్పు
వ్యర్ధమైన మాటలు
దాటునోయి! కోటలు
వాటి వలన నష్టము
బ్రతుకులగును శిథిలము

అండదండ దేవుడు
---------------------------------------
మహోన్నతుడు దేవుడు
కడు కరుణసంపన్నుడు
చూడ న్యాయవంతుడు
అన్యాయమే చేయడు
హృదయము చూచు వాడు
ధర్మాన్ని కోరువాడు
తప్పులను మన్నించి
హితుడై కాచు వాడు
భక్తికి వశమవుతాడు
శక్తిని ఇచ్చువాడు
దయామయుడు దైవము
పెట్టు వాడు ప్రాణము
బ్రతుకులో తోడుగా
ఆపదలో అండగా
ఉండువాడు దేవుడు
బలమైన కొండగా

నిర్ణయం నీదే!!
---------------------------------------
మనుషులను నమ్మితే
నట్టేట ముంచుతారు
కనులతో కవ్విస్తారు
వెనుక గోతులు తీస్తారు
భగవంతుని నమ్మితే
బ్రతుకంతా క్షేమమే!
అడుగడుగునా గొడుగై
నిలబడును అన్నీ తానై
ఎన్నడు ఆధారపడకు
ఈ మానవ మాత్రులపై
వాడుకుని వదిలేస్తారు
ద్రోహమే తలపెడుతారు
నీకు నీవు తెలుసుకో!
మేలైనది కోరుకో!
దేవుడా! మానవుడా!!
వివేచనతో ఎన్నుకో

గోరు ముద్దలు
---------------------------------------
అమ్మ గోరు ముద్దలు
కొమ్మకున్న ఫలములు
చూడ వెన్న ముద్దలు
నింపు చిట్టి బొజ్జలు
సృష్టిలోన శ్రేష్టము
అమ్మ గోరు ముద్దలు
చిన్నారులకిష్టము
ఆమె చేతి మెతుకులు
తినడానికి పిల్లలు
మొరాయిస్తే గనుక
అమ్మ చూపు సహనము
ఉండును దాని వెనుక
అలనాటి ఆ దృశ్యము
మిక్కిలి అపురూపము
కళ్లెదుటే మెదులును
ఈనాటికి పదిలము
అమ్మ ప్రేమ మధురము
అక్షరాల సత్యము
అందుకే గుండెలో
అనుదినమూ కొలువుము

మహా ఘనుడు దేవుడు
---------------------------------------
సర్వశక్తిమంతుడు
సృష్టిలో భగవంతుడు
సృష్టి లయ కారుడే
విశ్వానికి కారకుడు
సకల జగతి పాలకుడు
జీవకోటి ప్రేమికుడు
విశ్వసించు వారిని
సదా కాపాడు వాడు
గుణమున శ్రీమంతుడు
ఇహమున ఆరాధ్యుడు
సాటిలేని దేవుడు
కొలవాలి మానవుడు
పొరపాట్లు వీడాలి
భక్తితో వేడాలి
జీవకోటిలో ఇక
దైవాన్ని చూడాలి

అమ్మ చేతి వంటలు
---------------------------------------
అమ్మ చేతి వంటలు
ఆరోగ్య ప్రదాతలు
అత్యంత రుచికరము
జిహ్వకెంతో ప్రియము
శుచిగా ఉండునోయి!
మమతలు పండునోయి!
బయట తిండి కంటే!
చాలా శ్రేష్టమొయి!
ముఖ్యంగా పిల్లలు
చిరుతిండ్లు మానాలి
అమ్మ చేతి వంటను
మాత్రము భుజించాలి
ఇంటి తిండిలోనే
ఆరోగ్యమెక్కువ
ఇకనైనా బాలలు
చూపించాలి మక్కువ
***
-గద్వాల సోమన్న
చిన్నారులు-చిరుదివ్వెలు: సోమన్న
పేరు లోనే తెలిపింది కవిత ఏమిటో.
వారిని వారికి ఇష్టం మరియు తగిన రంగం లి ఎదిగేలా చేయాలి ... మంచి మాటలు - చేతలు - ఆచరణ నిర్వహణ లో.
మార్కుల కోసం బట్టీ చదువు కాదు, అర్థం చేసుకొని చదవాలి జ్ఞానం - విజ్ఞానం కొరకు. ఆటలు - పాటలు కూడా రోజూ ఉండాలి విద్యా కేంద్రాల్లో. మానస వికాసం మరియు వ్యాయామం కొరకు. నాయకుల మరియు బృందంగా పని చేసే లక్షణాలు కూడా వస్తాయి. ఎన్నో తేలికైన బోధనా పద్దతులు ఉన్నాయి ఈ కాలం లో (మార్జాలం లో కదిలే బొమ్మల తో పాఠాలు చెప్పటం మంచిది ... అవసరం ఉన్నప్పుడు ... అందరికీ అర్థం అవుతుంది).
పట్టుదల యే కాదు, మనశ్శాంతి - సంతోష పూరిత నిర్వహణ - సంతోష పూరిత పరిష్కారాల రీతి కూడా అవసరం ... ప్రతి మనిషి ఉన్నతి కొరకు ... ప్రతి ఇంట్లో, విద్యా కేంద్రాల్లో, కార్యాలయాల్లో, రోడ్లో.
ప్రాజెక్టు లు విద్యా కేంద్రాల్లో నే చేయాలి ... టీచర్ల సహకారం తో.
చిన్న సిలబస్…