#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#ChirunavvulaChinnari, #చిరునవ్వులచిన్నారి
Chirunavvula Chinnari - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 17/11/2024
చిరునవ్వుల చిన్నారి - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
పాపాయి అర నగవులు
పరిమళించు పూవులు
సదనంలోన అవే
వెలుగులీను ప్రమిదలు
చూడు చూడు సొగసులు
చిన్నారుల మనసులు
జగతిలోన అందము
వారుంటే మోదము
జీవమున్న బొమ్మలు
అనురాగపు కొమ్మలు
కల్మషం కానరాని
బాలలు ఇలవేల్పులు
చిరు నవ్వులు కురిసిన
మరు మల్లెలు విరిసిన
అందమే అందము
పసి పిల్లలు గృహమున
-గద్వాల సోమన్న
Comentários