#KandarpaMurthy, #కందర్పమూర్తి, #చిట్టిఎలుకలఅనారోగ్యం, #ChittiElukalaAnarogyam, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #బాలలహాస్యకథ
Chitti Elukala Anarogyam - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 15/11/2024
చిట్టి ఎలుకల అనారోగ్యం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
అది ఒక గవర్నమెంటు హాస్పిటల్ మందుల స్టోర్ రూము. ఉదయం తెలవారుతోంది. రాత్రంతా తిండి కోసం కలుగుల్లోంచి బయటి కొచ్చిన మూషిక సమూహాలు వార్డుల్లో పేషెంట్ల మంచాల చుట్టూ, చెత్త బుట్టల వద్ద సంచారం చేసి దొరికింది తిని పేషెంట్లను, అందుబాటులో ఉన్నవి, నోటితో కొరికి పళ్ళ సలుపులు తీర్చుకున్నాయి.
ఎక్కడ పెడితే అక్కడ మలమూత్రాలమయం చేసి వార్డుల్లో ఫినాయిల్ అవుసరం లేకుండా చేస్తున్నాయి. ఎలుకల సమూహాలు కలుగుకు చేరుతున్న సమయాన ఒక చిట్టెలుక "అమ్మా! తల తిరుగుతోంది. వాంతులు అయేటట్టు ఉంది" అంది తల్లి ఎలుకతో.
"ఏం తిన్నావేంటి ? వంటికి పడనివి ఏమైనా మింగేవా !" కసిరింది తల్లి ఎలుక.
“మనం వెళ్లిన వార్డు పక్కన ఒక గది ఉంది. దాని కిటికీ తలుపులు తీసి ఉంటే ఏమున్నాయోనని తొంగి చూస్తే అక్కడ అవేవో చాక్లెట్లులా కనిపించాయి. చాక్లెట్లు తిని చాలా కాలమైందని కిందకు దిగి మెరుస్తున్న వాటి తొడుగులు కొరికి లోపల ఎర్రగా ఉన్న తియ్యటి చాక్లెట్ తిన్నా" అంది భయపడుతూ.
"ఎంత పని చేసావే చిట్టీ, అవి మనుషులకు అజీర్ణానికి వాడే తియ్యటి మాత్రలు.. హాస్పిటల్ వాళ్లు వాటి జీవిత కాలం చూడకుండా అలా స్టోరు రూములలో పడేస్తారు. అవే పేషెంట్లకు తినిపిస్తారు. నువ్వు అటువంటి కాలం తీరిన అజీర్ణ మాత్రలు తిన్నట్టుంది. అందుకే అవి వికటించి నీకు ఈపాట్లు వచ్చాయి" అంటూండగా
"అమ్మా, మత్తుగా ఉందే. నిద్ర వచ్చేస్తోంది. తొందరగా నన్ను ఇంటికి చేర్చు" అని ఊగిసలాడసాగింది మరో బుల్లి ఎలక పిల్ల.
"నువ్వేం తిన్నావ్? పెద్దది ఆ మందుల స్టోరు రూములో కెళ్లి ఏవో మింగి లేని రోగం తెచ్చుకుంది. నువ్వేం నిర్వాకం చేసావ్? చెప్పు " అని క్లాసు తీసుకుంది కోపంగా.
చంటిది భయపడుతూనే "అక్క మందుల స్టోరు రూము కిటికీ ఎక్కి కిందకు దిగగానే నేనూ దాని వెనక మెల్లగా వెళ్లాను.. అక్క ఒక పక్క వెళితే నేను మరో వైపు వెళ్లేను. అక్కడ అల్మారా సొరుగులో చిన్న మాత్రలు మెరుస్తున్న తొడుగులో కనిపించాయి. వాటి రుచి ఎలాగుంటుందోనని కొరికి మింగినాను. అప్పటి నుంచి మత్తుగా నిద్ర వచ్చేస్తోందే" అని మగతగా మాట్లాడసాగింది చంటిది.
"వార్డులో పేషెంట్ల తినుబండారాలు ఉండగా మీకేం పోయేకాలమే, మందుల స్టోరు రూములో కెళ్లి పేషెంట్ల కిచ్చే మత్తు మందు మాత్రలు తినవల్సిన అవుసరం ఏమొచ్చింది. ? " అంటూ ఇద్దరు పిల్ల ఎలుకల్నీ మెల్లగా అవి నివాసముండే కలుగు దగ్గరకు చేర్చింది తల్లి ఎలుక.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comentários