top of page

చిట్టి పాపలు - వేడుకలు

Writer: A . Annapurna A . Annapurna


'Chitti Papalu Vedukalu' - New Telugu Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 24/07/2024  

'చిట్టి పాపలు - వేడుకలు' తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


మా లిటిల్ ప్రిన్సెస్ ఫస్ట్ బర్త్ డే పార్టీ అని బంధువులు ఫోనుచేసి ఇన్విటేషన్ పెట్టేరు. 


''మేము ఎందుకు.... పిల్లలను తీసుకుని పేరెంట్స్ వస్తారు. మీ ఫ్రెండ్స్ వస్తారు. సరిపోతుంది'' అన్నాం. 


“అలా కాదు, మీరు వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి.... రాకపోతే మీఇంటికి ఎప్పుడూ రాము....” అన్నారు స్కూల్ పిల్లలు చెప్పినట్టు.

 

''మమ్మల్ని వదిలేయండి. లేటుగా భోజనం చేయడం అలవాటు లేదు'' అన్నాకూడా వినలేదు. 


సరే దగ్గిరేకదా త్వరగా వచ్చేద్దాం.... అనుకుని ఇన్విటేషన్ రాత్రి 7 గంటలకు అని మెస్సేజ్ వున్నా 7 -౩౦ ని.  వెళ్ళేము. అక్కడ ఒక్కరు రాలేదు. సరే వెళ్ళేక వెయిట్ చేయాలిగా... అనుకుని కూర్చున్నాము. మరోగంటకి ఒకొక్కరు వచ్చారు. 


పలకరింపులు కేక్ కటింగులు అయ్యాక పిల్లలను ఆటపాటలు డాన్సులు అంటూ మరోగంట అయ్యాక డిన్నర్ పెట్టేరు. తిని బయటకు వచ్చేసరికి హోరున వాన పడుతోంది. 


పార్టీ హాలు చిన్నది. కారు పార్కింగ్లేదు. స్ట్రీట్ కాదు అది గల్లీ. అందుకని క్యాబ్ ఆటోలు బుక్ చేసాం. 


రాత్రి పదిదాటింది. ఒక్కడు రాలేదు. ఎదురు చూడగా ఎలాగో ఒక ఆటో దొరికింది. వంద కంటే అవదు... మాఇంటికి, కానీ టైము రాత్రి కదా అయిదు వందలు అన్నాడు. ఎలాగో ఇంటికి చేరాలి కనుక అడిగినంతా ఇచ్చి ఎక్కాము. 


సరే ఎదో ఒకరోజు.... ఇబ్బంది అంతే అనుకున్నా.... పిల్లలకు ఎంత కష్టం!


అసలు బర్త్డే బేబీ వయసునుబట్టి పార్టీకి పిలిచేవారి లిస్ట్ తయారు చేయాలి. ఏడాదిపాపను ఎంగేజ్ చేయడం పెద్ద సమస్య. 


అంతా కొత్తగా జనాలను చూసి చిరాకు పడతారు పిల్లలు. డ్రెస్ ఏమో తళుకులు బెళుకులు సిల్క్ వేస్తారు.. ఎంత ఎయిర్ కండిషన్లు ఐనా ఫ్రీగా ఉండదు వాళ్లకి. ఇక హై వోల్టేజ్ లైట్స్ కళ్ళలోపడి ఇబ్బంది పడతారు. 


ఇంట్లోవున్నట్టు ఫ్రీగా ఉండలేరు. ఆకలిని నిద్ర తో ఏడుపు మొదలుపెడతారు. చేతిలోనే వుండరు. కిందకి దిగి పరుగులు పెడతామంటారు. కొందరు ఆవయసుకి నడవరు. వాళ్ళని ఆతల్లి అలా ఎత్తుకునే వుంది. ఏకధాటిగారెండు గంటలు. ఇక ఫోటోలు వీడియోలు లెక్కలేదు. వచ్చిన వారందరూ స్టేజ్ మీదకెళ్ళి పాపా తల్లి తండ్రితో ఫోటోలు తీసుకోడం పెద్ద గందర గోళం. 


పార్టీ ఇచ్చిన వాళ్ళు డిన్నర్ చేసి అర్ధరాత్రి రెండు గంటలకి ఇంటికి వెళ్లేరుట. అందరికీ శ్రమేగా. 

అయితే వేడుకలు చేయవద్దని అనలేము. ఒక పధ్ధతి పాటించడం మంచిదని నా అభిప్రాయం. 


బర్త్ డే పార్టీ కనుక పిల్లలు వున్నవారిని మాత్రమే పిలిస్తే బాగుంటుంది. రెండవది టైము. వర్కింగ్ డే కాకుండా వీకెండ్ చేయాలి. నాలుగింటికి మొదలుపెట్టి ఏడు గంటలకు పూర్తి చేసేయాలి. 


సీనియర్ సిటిజన్లను పిలవకూడదు. కొందరు బేబీ పుట్టేక ఆఫీసువారికి పార్టీ ఇవ్వలేదు అని అంతా కలిపి కలిసి వస్తుంది... అని చేస్తారు. పైగా వేరే ఊరినుంచి బంధువులు కేవలం పుట్టినరోజు పార్టీకి రావడం అవసరంలేదు. 


ఎప్పుడైనా రావచ్చు. అమెరికాలో మా మనవలకి బర్త్ డే పార్టీ చేయడం చూస్తే చాలా హాపీగా ఎంజాయ్ చేసాం. మా అల్లుడు అమెరికన్. కోడలు బ్రెజిల్. వాళ్ళు పిల్లలకు పెద్దలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్లాన్ చేశారు. వూళ్ళో వుండే పేరెంట్స్ బాగా క్లోజ్ అయినా నలుగురు ఫ్రెండ్స్ అదీ పిల్లలు వున్నవారిని, కొంచెం ఏడూ ఆరు వయసు పిల్లలను మాత్రమే పిలిచారు. (వీరిని వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ దిగబెట్టి, పార్టీ ముగిశాక వచ్చి తీసుకుని ఇంటికి వెడతారు. బాగుందికదూ!)


స్కూల్లో వేసే వయసువారు ఐతే స్కూల్లో పిల్లలకు కేండీలు పంచి, శనివారం స్నేహితులను పిలిచారు. 


వాళ్లకి ఎంటర్ టైన్మెంట్ ఆటలు స్విమ్మింగ్ ఉంటుంది. కొందరు ఇంట్లో చేస్తే కొందరు బయట సీజన్ ను బట్టి రాత్రి ఏడూ- ఎనిమిది దాటకుండా పూర్తి చేశారు. 


మన ఇండియాలో ఎలా ఉందంటే నీ బంధువులను పిలిస్తే నా బంధువులనూ పిలవమని పోటీలు, పంతాలు పడతారు తప్ప ప్రశాంతంగా కంఫర్టుగా ఉండేలా చేద్దాం అనుకోరు. 

సో నాలాంటివారు పిలిచినా వెళ్లకపోడం మేలు. నాకు ఐనా బుద్ధి ఉండాలి అనుకున్నాను. 


********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





 


Comments


bottom of page