#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #చాక్లెట్సిగరెట్, #ChocolateCigarette
Chocolate Cigarette - New Telugu Story Written By Bhallamudi Nagaraju
Published In manatelugukathalu.com On 16/01/2025
చాక్లెట్ సిగరెట్ - తెలుగు కథ
రచన: భళ్లమూడి నాగరాజు
స్వచ్ఛమైన గాలి, గల గల పారే సెలయేరు.. అమాయక ప్రజలు.. కష్టం వచ్చినా.. సుఖం వచ్చినా మేమున్నాం అంటూ సహకరించే కుటుంబాల మధ్య పల్లెటూరిలో పుట్టి.. పెరిగిన నేను అటు పల్లె కాదు.. ఇటు పట్నం కాని చిన్న ఊరిలో 35 ఏళ్ళు హాయిగా గడిపేను. పిల్లలిద్దరూ దూరంగా వుంటున్నారన్న పేరే తప్పా రోజూ వీడియో కాల్ చేసి నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు.. అదే నాకు కొండంత బలం.
ఆ మధ్య నాకెందుకో బాగా నీరసంగా ఉందంటే,
నా భార్య ఉమ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. అన్ని వైద్య పరీక్షలు చేసిన ఆయన ‘మీకు షుగర్ ఉందండి.. ’అని చేదు వార్త చెప్పేడు.
ఉమ ఒక్కసారిగా భయపడింది.
“భయం ఎందుకు.. 60 వయస్సు దాటేక షుగర్లు కాక పొగర్లు వస్తాయా” అన్నాను, తేలిగ్గా తీసుకొని.
ఈ ముచ్చట రాత్రి పిల్లలు ఫోన్ చేస్తే చెప్పేసింది, దాంతో పిల్లలు ఇద్దరూ మెడికల్ సదుపాయం ఉంటుంది ఇక్కడకు వచ్చేయండి అని ఒకటే గోల
•••••••••••••••••••
కొత్త ప్రపంచంలో పడ్డాము. మొదట్లో కాస్త ఇబ్బంది కరంగా ఉన్నా, ఇప్పుడిప్పుడే అలవాటు పడిపోయాను. సిటీ లో హాయి గానే ఉంది.. పేరుకే కోడళ్ళు కానీ కన్న బిడ్డలు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అందుకే ఇద్దరినీ తల్లీ అనే పిలవడం మొదటి నుంచి అలవాటు చేసుకున్నాను.
సాయంత్రం అలా తిరగి వస్తే బాగుంటుంది అని రెండు రోజులు గా యూనివర్షిటి డౌన్ వరకూ వెళ్లి వస్తూ, కొంత సేపు అక్కడే ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చొని, తిరిగి వెళ్లడం అలవాటు చేసుకున్నాను. అక్కడో పాన్ షాప్ ఉంది. విశేషం ఏంటంటే అక్కడికి కేవలం ఇంజనీరింగ్ చదువుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలే ఎక్కవమంది వస్తుండటం గమనించేను. ఓ పెద్ద మాల్ కి వచ్చినంత జనం వస్తున్నారు, ఏదో మెల్లగా అడుగుతున్నారు.. వాడు.. గుట్టుగానే ఇస్తున్నాడు.
ఏంటి కొంటున్నారా? అన్న కుతూహలం నాలో పెరిగింది. పరిశీలించడం మొదలు పెట్టేను. ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, రెండు చాక్లెట్ సిగరెట్లు అని ఐదొందల నోటు ఇచ్చేరు. దుకాణం వాడు గుప్పెట్లో రెండు పెట్టి తిరిగి వంద నోటు ఇచ్చేడు. అబ్బా!! ఒక్కోటి రెండు వందలా! ఏమిటో ఆ చాక్లెట్ విశేషం.. అంత ధర అని స్వగతం లోనే అనుకున్నాను.
ఇలా వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. అంత ఖరీదైన చాక్లెట్ ఒకసారి రుచి చూడాలని నాకూ కోరిక పుట్టి, ఈ రోజు రెండు వందలు తీసుకొని వచ్చేను. కొందామా ? వద్దా? అని ఆలోచనలో పడి, కొనాలానే నిశ్చయించుకొని, అటుగా రెండు అడుగులు వేసేసరికి, నన్నే గమనిస్తున్న ఓ కుర్రాడు నా చెయ్యి పట్టుకొని ఆపేడు.
“ఏంటి కొంటారు తాత గారూ” అన్నాడు ఆప్యాయంగా. నా మనస్సులో కోరిక చేప్పెను.
“ఇంకా నయం కొన్నారు కాదు..” అంటూ.. “అవి మామ్ములు చాక్లెట్లు కావు గంజాయి సిగరెట్లు..” అనే సరికి నా బుర్ర తిరిగినంత పని అయింది.
‘అయ్యో.. ఇంజనీర్లు కావలసిన యువత ఇలా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా.. అమ్మాయిలు కూడానా.. భగవంతుడా! ఎందుకిలా యువత పెడ మార్గం పడుతున్నారు.. ఆ పిల్లల తల్లి దండ్రులు ఎంతో ఆశ తో చదువుకుందికి పంపిస్తే ఇలా తయారవుతున్నారు.. దీనికి అడ్డుకట్ట వేసేవారే లేరా’
నా మనసంతా పరి పరి విధాలుగా. మారింది. బాధ్యత కల వ్యక్తిగా ఏదోచేయ్యాలి అనుకుంటూ ఇంటికి చేరాను. చిన్ననాటి స్నేహితుడు తులసీదాస్ పోలీస్ శాఖ లో ఏదో పెద్ద పొజిషన్ లో ఉన్నాడని తెలిసి వాడికి ఫోన్ చేసి హాయిగా నిద్రలోకి జారుకున్నాను..
***
సాయంత్రం 5 గంటలు అవుతుండగా వాకింగ్ కి బయలు దేరాను. పాన్ షాప్ దగ్గర సిమెంట్ బెంచి మీద కూర్చున్నాను.. ఎందుకో తెలీదు కానీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.. ఇంతలో ఓ కుర్రాడు వచ్చేడు.. ‘చాక్లెట్ సిగరెట్’ అని రెండు వందలు ఇచ్చేడు. దుకాణం వాడు గుప్పెట్లో పెట్టేసరికి, ఎక్కడి నుంచి వచ్చేరో తెలీదు గాని మఫ్టీ లో ఉన్న పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు.
దూరం నుంచి వచ్చిన తులసీ దాస్ కుర్రాడి కాలర్ పట్టుకొని “నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వెయ్యగలను.. కానీ లాభం ఏంటి.. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి.. అందుకే నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్న. జైల్లో వేస్తె మీ బంగారు భవిష్యత్ పాడై పోతుంది. నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు, ఇక మీదట ఎవరైనా కొన్నారా..” అంటూ కళ్ళు ఎర్ర చేసేసరికి ఆ కుర్రాడు కాళ్ళమీద పడి క్షమాపణ కోరాడు.
దుకాణం లో ఉన్న సరుకు అంతా సీజ్ చేసి, షాప్ యజమానిని అరెస్ట్ చేసి తీసుకొని వెళుతూ.. నా వైపు చూసి ఓ చిన్న చిరునవ్వు విసిరాడు.. అభినందిస్తున్నట్లుగా.. తేలిక పడ్డ మనసు తో ఇంటి వైపు అడుగులు వేసేను.
***
భళ్లమూడి నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం
"చాక్లెట్ సిగరెట్" కథలో పల్లెటూరిలో పుట్టి పట్టణ జీవనానికి అలవాటు పడిన ఒక వృద్ధుడు ప్రధాన పాత్ర. అతను యువత గంజాయి వంటి చెడు వ్యసనాలకు బానిసలవుతున్న విషయాన్ని గమనించి బాధపడతాడు. చాక్లెట్ సిగరెట్ పేరుతో గంజాయి వ్యసనాన్ని ప్రోత్సహిస్తున్న పాన్ షాప్ యజమానిపై తన చిన్ననాటి స్నేహితుడైన పోలీసు అధికారి తులసీదాస్ సహాయంతో చర్యలు తీసుకుంటాడు. యువత భవిష్యత్తు నాశనం కాకుండా వార్నింగ్ ఇచ్చి, చెడు వ్యసనాలపై అవగాహన కల్పించడం కథ ప్రధాన సందేశం. సమాజంపై ప్రభావం చూపే సామాజిక చైతన్యంతో ఈ కథ పాఠకులను ఆలోచింపజేస్తుంది.
చాక్లెట్ సిగరెట్: బి. నాగరాజు
... అన్ని రకాల సిగరెట్ లను, పొగాకు వస్తువులను, మద్యం ను నిషేధించాలి.
పి. వి. పద్మావతి మధు నివ్రితి