top of page
Writer's picturePitta Govinda Rao

ఛాయిస్ ఈజ్ యువర్స్


'Choice Is Yours' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 04/11/2023

'ఛాయిస్ ఈజ్ యువర్స్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ప్రతి ఒక్కరు తమ జీవితం గూర్చి గొప్పగా కలలు కనటం సహజం. అయితే అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు అనుకున్నవి తమ జీవితంలో జరుగుతాయి. మరికొందరికి జరగవు. ఇంకొందరికి తమ జీవితం తమకు కష్టంగాను, పక్కవారి జీవితం సులభంగాను కనపడుతుంది.


ఇక ఎంత కష్టమైన జీవితం అయినా.. మన ఆలోచన, మన నిర్ణయం పైనే ఆదారపడి ఉంటుంది అనేది నమ్మదగిన అంశం.


రజని, విరాట్ కుటుంబ భేదాలు తెలియకుండా చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నారు.


రజనీ మధ్యతరగతికి చెందిన అమ్మాయి. అయినా అందంగా చక్కగా ఉంటుంది. కాగా విరాట్ పేద కుటుంబానికి చెందిన వాడు.


అయితే వీరిద్దరికి మధ్య విరాట్ ఇంటి పక్కనే డబ్బుగలవారి కుటుంబం లో పుట్టిన వాడు రఘు ఉన్నాడు.

రజనీ లాంటీ అందగత్తె విరాట్ లాంటి పేదవాడిని ప్రేమించటం, అది కూడా తన ఇంటి పక్కనే విరాట్ ఉండటంతో ఈ అంశంపై రఘు అసూయ చెందేవాడు. రజనీ ని లొంగదీసుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ.. రజనీ రఘుకు లొంగలేదు.


వారికి కష్టం, సుఖం, పేద, ధనిక అంటూ ఏమీ లేవు. ఆ ఆలోచన కూడా లేకుండా వారు ఘాడంగా ప్రేమించుకున్నారు.


ఇక ఇద్దరు పెళ్ళీడు వయసుకు వచ్చాకా.. రజనీ కుటుంబంలో రజనీ పెళ్ళి పై రకరకాల ఊహాగానాలు చేసేవాళ్ళు చుట్టుపక్కల వారు.


‘రజనీ చాలా అందంగా కుందనపు బొమ్మలా ఉంటుంది’ అని,

‘ధనవంతులకు కూడా కోడలిగా వెళ్ళి ఏ పని చేయకుండా దర్జాగా ఇంట్లో ఉంటుంది’ అని మాట్లాడుకునేవారు.


ఆ మాటలతో రజనీకి విరాట్ పై, అతను చేసే కూలి పనులు పై అసంతృప్తి ఏర్పడింది.


విరాట్ ని పెళ్లి చేసుకుంటే నిజంగా జీవితం కష్టంగా ఉంటుందని కూలిపనులు చేసుకుని సుఖవంతమైన జీవితం గడపలేమని తనలో తాను అనుకోసాగింది.


చివరిగా తాను ఒక నిర్ణయానికొచ్చింది.


ఎలాగైనా విరాట్ ని వదిలించుకోవాలని, డబ్బు గలవారిని చూసుకుని పెళ్ళి చేసుకుంటే జీవితం పరిపూర్ణంగా ఉంటుంది అని నిర్ణయించుకుంది.


ప్రేమలో చాలామంది ఆడపిల్లలకు తల్లిదండ్రులు సపోర్ట్ అంతగా ఉండదు కదా.. !


తల్లిదండ్రులే తమ ఆడపిల్లలకు మంచి సంబంధం చూడ్డానికి ఇష్టపడతారు. కానీ.. !


రజనీ విషయంలో అలా కాకుండా తల్లిదండ్రులు కూతురు పెళ్లి విషయం తన జీవిత భాగస్వామిని తానే నిర్ణయించుకుంటే సంతోషంగా ఉంటుందని వరుడు ఎంపిక నిర్ణయం నీదే అని రజనీ కి ఆఫర్ ఇచ్చారు.


అదే అదనుగా భావించి, రఘు ని తన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకుంది రజనీ.


రఘు రజనీల పెళ్ళి చూపులని తెలుసుకుని విరాట్ కుమిలిపోయాడు.


చిన్ననాటి నుండి ప్రేమించిన రజనీ ఇలా అనూహ్యంగా తన పక్కింటి వాడిని పెళ్ళి చేసుకోవటానికి రెడి అవ్వటాన్ని జీర్ణించుకోలేకపోయాడు.


అలా చాలా కాలంగా రజనీ జ్ణాపకాలతో కాలం గడిపాడు. తల్లిదండ్రులు పోయాక విరాట్ మరింత కుంగిపోయాడు.


ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

చివరగా ఒక ఆలోచనకు వచ్చాడు.


పాత కాలాన్ని వదిలితేనే కొత్త కాలం చిగురిస్తుందన్నట్లు

పాత జ్ణాపకాలు పక్కనెట్టి కూలి పని చేసుకునైనా సంతోషంగా బతకాలని నిర్ణయించుకున్నాడు.


ఎలాగూ.. రజనీ వచ్చేది తన పక్క ఇంటికే.. రఘు కి ఎంత డబ్బు ఉన్నా.. తృప్తి ఉండదు. పిసనారి బతకు అతనిది. ఎవరికి దానం చేయడు. తాను మాత్రం డబ్బు తో జల్సాలు చేస్తాడు. ఈ విషయాలు అన్ని విరాట్ కి తెలుసు.


రజనీ పై కసితో ఇప్పుడు విరాట్ ఎంత కష్టపడి అయినా బతకాలనే నిర్ణయించుకున్నాడు.


అంతేనా.. !


బాధ అంటే ఏంటో.. రఘు తప్పక చూపిస్తాడు కాబట్టి, సంతోషం అంటే, మంచి జీవితం అంటే ఎలా ఉంటుందో.. తానే చూపించాలనుకున్నాడు.


రజనీ పెళ్ళి రోజే తాను వేరే అమ్మాయి ని పెళ్ళి చేసుకున్నాడు. మంచో చెడో ఎవరి నిర్ణయం వారు తీసుకున్నారు.


ఇక రజనీ కి కూడా విరాట్ పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది. ఎలాగంటే పక్క ఇళ్ళే కదా మరీ..


మొదట్లో రజనీ అంటే ఇష్టం చూపించిన రఘు కుటుంబం రానురాను తమ అసలు బుద్ధులను బయటపెట్టసాగారు.


రఘు, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినడు. అయినా రఘు అంటే వారికి ప్రాణం. రఘు ఏం చెప్పినా వాళ్ళు వింటారు.

రఘు రజనీని పట్టించుకోటం లేదు. తన అవసరాలు గుర్తించి డబ్బులు కూడా ఇవ్వడు, ఏమి కొని పెట్టడు.


రఘుకి ఏ ఉద్యోగం లేదు. పనిచేయటం చేతకాదు. తండ్రి ఆస్థి, అతను తెచ్చిన డబ్బుతోనే జల్సాలు చేస్తూ పరాయి ఆడవారితో పబ్బం గడుపుతు ఏ రాత్రికో ఇంటికి వస్తూ.. ప్రశ్నించే రజనీ ని అత్తమామలు సహా చిత్ర హింసలకు గురి చేసేవాళ్ళు. ఆడదానిగా తమ కోడలిగా రజనీ బాధను రఘు కానీ రఘు తల్లిదండ్రులు కానీ అర్థం చేసుకోలేదు.


మరోవైపు విరాట్ తన బార్య రేష్మ తో చక్కగా కూలి పనులు చేసుకుంటూ సాయంత్రం తిరిగి వస్తూ.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ మరలా తెల్లవారు కాగానే ఇద్దరు పనికి వెళ్ళటం.. ఇదే వారికి దినచర్య.


విరాట్ కి ఏ అప్పు లేదు, ప్రతి రోజు అలవాటైన పని కారణంగా ఏ రోగాలు లేవు. రెండు గదులే అయినా చిన్న ఇల్లు అనే చింతలేని బతుకు విరాట్ ది. ఊరిలో ఎక్కడ చూసినా ఈ రెండు కుటుంబాల గూర్చే మాటలు.


డబ్బు ఉన్నవారి ఇంట్లో కోడలు సంతోషం కంటే పేదోడైనా రేష్మ ని సంతోషంగా చూసుకుంటున్నాడనే వాదన.


ఒకరోజు రాత్రి రజనీ తమ మేడ పై ఉండగా కిందన ఉన్న విరాట్ మేడ పై చూడగా చక్కగా విరాట్ రేష్మలు కల్మషం లేకుండా ఒకరినొకరు హత్తుకొని పడుకున్నారు.


అప్పుడు తాను ఎంత పెద్ద తప్పు చేసిందో బోదపడింది రజనీ కి.


పేదవాడనే కారణంతో అసహ్యించుకున్న రజనీకి ఇప్పుడు పేరుకి మగతోడు ఉన్నా.. కాపురానికి మాత్రం ఆ మగతోడు లేదు. ధైర్యంగా ఎదుర్కోటానికి తన తల్లిదండ్రుల కు అంత బలం లేదు. పోనీ.. ప్రశ్నించినా.. కుటుంబం లో ఒక్కరి మద్దతు కూడా లేకుండా సాధ్యం కాదు.


రజనీ జీవితం ఇప్పుడైతే మరీ దారుణంగా ఉంది. భవిష్యత్ లో ఎలా ఉంటుందో..


జీవితంలో ఎవరిని ప్రేమించినా.. ఎవరిని పెళ్ళి చేసుకున్నా.. తుది నిర్ణయం వారిదే కానీ.. పరాయి వారిది కాదుకదా.. ?


తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించటం ఒక ఎత్తు అయితే.. తాను వద్దనుకున్న వ్యక్తి తన కళ్ళ ముందే ఇంకో ఆడదానితో సంతోషంగా ఉండటం ఇక్కడ మరో ఎత్తు.


ఇక్కడ ఎవరి జీవితం వారిది. ఎవరి నిర్ణయం వారిది. ఎవరి తప్పుకు వారే బాధ్యులు. ప్రస్తుతం రజనీ, తను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోంది.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం




33 views0 comments

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page