top of page

క్రిస్మస్ పండుగ

Updated: Jan 1

#Yasoda Gottiparthi, #యశోదగొట్టిపర్తి, ChristmasPanduga, #క్రిస్మస్పండుగ#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Christmas Panduga - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 25/12/2024

క్రిస్మస్ పండుగ - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


అవనికి కారణ జన్మo 

తూర్పు ఆకాశమున ఆభరణం 

అంధకారం చీల్చుకుని నక్షత్రం 

ఏసుక్రీస్తు జననం


యూదులకు తోచే పరిశుద్దాత్మ పుట్టేనని పశువుల పాకన కన్య మేరీ మాతకు ముద్దుబిడ్డడై మురిపించే ప్రజలను పెరిగెను ప్రేమకు రూపమై

 ప్రతి ప్రాణిని ప్రేమించే తన ప్రాణమై


పాపములను పారద్రోల 

పుడమి మీద సత్యాన్ని రక్షించ అరుదెంచే ప్రేమ తత్వమును బోధించి పునీతు లను గావించే గొర్రెల కాపరి యై గతిని మార్చే గమనాలను తీర్చిదిద్దే 


అజ్ఞానుల అమాయకుల 

అండగా అధికారులపై ఆగ్రహం తో దేవదూతనని సన్మార్గాలకు దారి చూపకఠిన శిక్షలకు గురిఅయ్యే

 

ముళ్ళ కిరీటంతో శిలువ చేయబడే విక్టోరియా రాణి ఇష్టమైన చెట్టు క్రిస్మస్ చెట్టు మార్టిన్ లూథర్ చేసిన అలంకారం చెట్టు ఆనందమని పచ్చదనానికి,సిరిసంపదలకు చిహ్నమని


ఇంటింటి పైన క్రీస్తు రాకకు నక్షత్రం అలంకరణ నిశీధివియోగ నివృత్తికై

క్రొవ్వొత్తులకాంతి క్రీస్తు ప్రార్ధన గీతాలతో శాంతి క్రిస్మస్ తాత తెచ్చే అందరికీ బహుమతి



--యశోద గొట్టిపర్తి




Comments


bottom of page