'Cinema Kashtalu' - New Telugu Story Written By Vijayasundar
Published In manatelugukathalu.com On 07/01/2024
'సినేమా కష్టాలు' తెలుగు కథ
రచన: విజయా సుందర్
"అక్కా! ఎలా ఉన్నారే మీరంతా... ఇన్నాళ్ళకి కుదిరింది ఫోన్ చేసేందుకు?"
"మేమంతా బాగున్నామే"
ఎంతో నీరసంగా, నిర్వేదంగా చెప్తున్న వల్లెక్కతో పల్లవి,
"అదేమిటి అలా చెప్తున్నావు... ఏమయ్యింది?" ఒకింత ఆందోళనగా అడిగింది, ఎప్పుడూ హుషారుగా ఉండే అక్క ఇలా డల్ గా ఉండేప్పటికి.
"ఏం చెప్పేది... మా అచ్చు గాడి గురించి నా దిగులు."
"వాడికేమైందే శుభ్రంగా పొన్నకాయల్లే బానే ఉన్నాడే మొన్న నేనొచ్చినప్పుడు?" అంది పల్లవి..
"పాపం వాడికి వానాకాలం వస్తే కష్టాలే... వాడి అవస్థ చూసి నాకు కలత!"
"అదేమిటి వానాకాలమొస్తే కష్టమెందుకో... బాగా జలుబు చేస్తుందా? ఉన్నాడుగా మీ ఆస్థాన వైద్యుడు?"
"ఈ బాధ ఆ వైద్యుడు తీర్చేది కాదులే"….
"మరి?"
"అక్కడ ఎవ్వరూ లేరుగా" అంటూ అక్క గొంతు తగ్గించి మహా ఆదుర్దాగా చెప్పబోతున్న విషయాన్ని చెవులు రిక్కించి వింటోంది పల్లవి... ఓ దీర్ఘ నిస్వాసం తరవాత వల్లి
"ప్చ్.. ఏ జన్మ ప్రారబ్ధమో ఒక్కటంటే ఒక్క సంబంధం కుదరట్లేదు అచ్చుగాడికి. అక్కడికీ నెలనెలా స్పా కి బోలెడంత తగలేస్తోనే ఉన్నాను" దిగులుగా చెప్పింది వల్లి.
"ఏమీ?" ఆశ్చర్యపోయింది పల్లవి.
"మొన్న ఒకావిడ వీణ్ణి చూసి పొట్టి, మాకు మిస్ మ్యాచ్ అయితుంది అనీ, ఇంకో ఆవిడ వీపుమీద మచ్చ నచ్చలేదని, మరో ఆయనకి వంశ చరిత్ర నచ్చలేదుట"
"బానే ఉంది సంబడం... మెడకేస్తే కాలికి, కాలికేస్తే
మెడకీ నన్నమాట. అయినా ఆ మధ్య ఓ సంబంధం ఆల్మోస్ట్ కుదిరినట్లే అన్నావు కదే?"
"అదీ... మేము పొరపాటు పడ్డాము... వీడికంటే బాగా ఛాయ తక్కువ. ఏం బాగుంటుంది చెప్పు కాకి ముక్కుకు దొండపండు లాగా! పిల్లలు పుడితే అంతా నల్లగా కాకులల్లే ఉండరూ!"
పల్లవికి దిమ్మ తిరిగి బొమ్మ చేతిలోకొచ్చింది... 'అక్క కూడా తక్కువ తినలేదు’ అనుకున్నది.
"మరేం చెయ్యాలని?"
"ఏం చేస్తాం ఇంక ఆ సొసైటీ వాళ్ళ దగ్గరకే పంపాలి మేటింగ్ కోసం... పిల్లలు గట్రా వాళ్ళే కదా చూసుకునేది! అయినా నాకొచ్చిందే చావు... అటు వీడి తరవాత వాళ్ళ డేటింగ్...ఇటు వీడి మేటింగ్ సమస్య..." చెప్పింది వల్లి.
'అయ్యబాబోయ్! మనిషి మగపిల్లలు సంబంధాలు దొరక్క అలమటిస్తున్న రోజుల్లో మా అక్క ‘ఆస్కర్' అనే తన కుక్కపిల్ల గురించి మనోవ్యథ చెందుతోంది... అంతే లెండి పాపం ఎంతైనా పెంచిన ప్రాణం కాదూ మరి!' అనుకుంది పల్లవి.
***
విజయా సుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar
నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.
'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!
Comentários