top of page

క్లూ

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Clue, #క్లూ, #TeluguKathalu, #తెలుగుకథలు, #TeluguCrimeStory, #Kosamerupu, #కొసమెరుపు


Clue - New Telugu Story Written By - Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 04/04/2025

క్లూ - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల



ప్రైవేట్ డిటెక్టివ్ రాజేంద్ర తన ఆఫీసు లో కూర్చుని "క్లూ" మేగజైన్ చదువుతున్నాడు. 


అప్పడు ప్రవేశించింది. నలభై ఏళ్ల యువతి. ఆవిడ పేరు మాధవి. 

"చెప్పండి" అన్నాడు రాజేంద్ర.


"నేను చెప్పబోయే విషయాలు రహస్యంగా ఉంచాలి."

 

"ష్యూర్" 


"మా ఇంటి పనిమనిషి కూతురుకి నెల తప్పింది. దానికి కారణం మా ఇంట్లో వాళ్లు అంటోంది. పనిమనిషి పది లక్షలు డిమాండ్ చేస్తోంది. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటోంది." 


"మీ ఇంట్లో ఎవరు ఉంటారు?" 


"నేను, ఆయన. అప్పుడప్పుడు మా మరిది కాంపిటేటివ్ 

పరీక్ష లు రాయడానికి వస్తాడు"


"పనిమనిషి ఉండగా కూతురు ఎందుకు పని లోకి వస్తోంది? " అనుమానంగా అడిగాడు రాజేంద్ర.

 

"దాని కూతురు కి సొంత తల్లి కాదు. సవితి తల్లి. ఆరోగ్యం బాగులేదని వంకపెట్టి కూతుర్ని పంపిస్తోంది" 


"కూతురు ప్రెగ్నెంటని ఎప్పుడు తెలిసింది "


"రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడం తో తల్లి వచ్చి పంచాయితి పెడుతోంది"


"మీ వివరాలు ఇచ్చి వెళ్ళండి" 


 ********

మాధవి భర్త వంశీ ని కలిసాడు రాజేంద్ర. అతనితో మాటలు

కలిపి అతన్ని వివరాలు రాబట్టడానికి ప్రయత్నించాడు. 


"మీ భార్య నన్ను కలిసారు. మీరు నిజం చెబితే మంచిది. పనిమనిషి కూతురి పై.."


"ఛ ఛ.. అలా కక్కుర్తి పడే మనిషి ని కాదు. వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు తల్లి వచ్చిందో, కూతురు వచ్చిందో 

పట్టించుకునే వాడిని కాదు. టేబుల్ మీద ‘టీ’ పెట్టి వెళ్లి పోయేవారు. ప్రాజెక్టు డెడ్ లైన్ హడావిడి లో పట్టించుకునే వాణ్ణి కాదు. ఐనా నా భార్యకి అనుమానం ఎక్కువ. ఏదైనా కేస్ ని త్వరగా క్లోజ్ చెయ్యండి"


"అలాగే. ఏమయినా వివరాలు తెలిస్తే చెప్పండి"


రాజేంద్ర వెడుతూ మాధవి భర్త మోబైల్ చూసాడు. 

అందులో పదునాలుగేళ్ళ అమ్మాయి తో తీసుకున్న సెల్ఫీ ఉంది. 


 *******

మాధవి మరిది మురళి ని కలిసాడు రాజేంద్ర. 


"త్వరగా ఉద్యోగం దొరికితే బాగుణ్ణు. అన్నయ్య కి భారం తగ్గుతుంది ". 


"మీ ఇంట్లో పనిచేసే పనిమనిషి కూతురు ప్రెగ్నెంట్ తెలుసా?" 


"అంతేనండి! అమాయకుల మీద అరాచకాలు ఎక్కువ అయ్యాయి" అన్నాడు మామూలు విషయం లా. 


"మీరని అనుమానం" 


"ఇదో కొత్త గొడవా? ఉద్యోగం లేక నేను ఏడుస్తుంటే. ఉద్యోగం దొరికే దాకా ఆడదాని ఊసే లేదు జీవితం లో"


మురళి మాటల్ని బట్టీ అంత అనుమానించ దగ్గ వ్యక్తి లా

కనబడలేదు రాజేంద్ర కి. 


 *******

ఆ రోజు ఆదివారం. రాజేంద్ర మాధవి ఇంటికి వచ్చాడు. 

మాధవి మార్కెట్ కి వెళ్ళింది. వంశీ లాప్ టాప్ తో కుస్తీ పడుతున్నాడు. 

"బాగున్నారా?"


"బాగున్నా, రండి " ఆహ్వానించాడు వంశీ. 


మాట్లాడుతున్న రాజేంద్ర దృష్టి యాష్ ట్రే మీద పడింది. 

"మీరు స్మోక్ చేస్తారా?" 


"అప్పుడప్పుడు" 


"కాస్ట్లీ యు. కే బ్రాండ్ కాలుస్తున్నారా?" 


"లేదు ఇండియన్ బ్రాండ్. ఇది శేఖరం పని" 


 "శేఖరం ఎవరు?" 


"శేఖరం మా ఆఫీస్ లో కొలీగ్" 


"మీ ఇంట్లో సిగరెట్ కాల్చాడా?" 


"ఆ రోజు నేను, మాధవి పెళ్ళికి వెడుతూ శేఖరాన్ని మా

 ఇంటి ని చూడమని," కీ" స్ ఇచ్చాం. దొంగల భయం కదా" అని నానుస్తూ చెప్పాడు వంశీ. 


"శేఖరం మీ ఇంట్లో ఎప్పుడు ఉన్నాడు? "


"మార్చి 12"


"ఇది మే 12" 


"మీ పనిమనిషి కూతురు ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్పింది?" 


"మే 11" 


 ******

రాజేంద్ర ఇల్లంతా పరిశీలించాడు. ఒక చోట "రుచి" యాప్ 

స్టిక్కర్ కనబడింది. కప్ బోర్డ్ లో రుచి యాప్ నుండి వచ్చిన బిల్ కనబడింది. బిల్ డేట్ మార్చ్ 12 అని ఉంది. 


అంటే మార్చి 12 న ఎవరో ఆన్ లైన్ ఆర్ఢర్ పెట్టారు. ఎవరు? శేఖరా? శేఖరే కదా మార్చి 12 న వంశీ ఇంట్లో ఉన్నది. 

వంశీ, మురళి, శేఖర్ ముగ్గరు లో ఎవరు? 


రాజేంద్ర బయటికి వచ్చి చూసాడు. వంశీ అపార్ట్మెంట్ కి ఎదురుగా ఉన్న సిసి టీవి మీద దృష్టి పడింది. 

సిసి టీవి ఫుటేజ్ పరీశీలించాడు. కాని ఫుటేజ్ బ్యాకప్ 

మార్చి 11 వరకే ఉంది. 


రాజేంద్ర నిరుత్సాహ పడ్డాడు. 

రాజేంద్ర రుచి యాప్ ఆఫీసు కి వెళ్ళి మార్చి 12 న డెలివరి

ఇచ్చిన ఎడ్రస్ లు పరిశీలించాడు. 


అందు లో వంశీ ఎడ్రస్ ఉంది. ఉదయం 12 గంటలికి డెలివరీ ఉంది. ఆ రోజు శేఖర్ ఆఫీసు లో ఉన్నట్టు ఆఫీసు వాళ్ళు ధృవీకరించారు. శేఖరం కాక పోతే ఎవరు? 


 *******

రాజేంద్ర వంశీ ఇంటి పనిమనిషిని, కూతుర్ని కలిసాడు. 

పనిమనిషి కూతురు "రుచి" యాప్ స్టిక్కర్ ని గుర్తు పట్టింది. 


"నీ మీద అత్యాచారం చేసినతన్ని గుర్తు పట్టగలవా?" 


పనిమనిషి కూతురు షాక్ లో ఉంది. 

"ఆడే సారు. వంశీ బాబు" అంది పనిమనిషి. 


"అంకుల్.. ఆ రోజు మాస్క్ వేసుకున్న బూచాడు నా మీద పడి.. బుగ్గలు కొరికి..." ఆ తరువాత చెప్పలేక పోయింది.


ఖచ్చితం గా ఇది రుచి యాప్ డెలివరి బాయ్ పనే అని

నిర్ధారణ కి వచ్చాడు. 


మళ్లీ రుచి యాప్ ఆఫీసు కి వచ్చాడు. 


"మార్చ్ 12 న వంశీ ఇంటి కి పిజ్జా డెలివరీ ఇచ్చింది ఎవరు?"


" అలా చెప్పలేము ఒకే అతను నాలుగు మూడు వీధులు

 కవర్ చేస్తారు. "


"అందరీ పేర్లు ఇవ్వండి" 

"మిగతా డెలీవరి బాయ్స్ సెలవు లో ఉన్నారు కాబట్టి 

 ఆ రోజు డెలివరీ బాయ్ ఒక్కడే" చెప్పింది రిసెప్షనిస్ట్. 


 ********

 రుచి యాప్ డెలివరి బాయ్ రంగా ని గట్టిగా పట్టుకుని 

 దబాయిస్తే అసలు విషయం చెప్పాడు. 

 *******

మాధవి ఎదురుగా పనిమనిషి, రంగా ఉన్నారు. 


"మార్చ్ 12 న శేఖరం పిజ్జా ఆర్డర్ పెట్టి ఆఫీసు కు వెళ్లి పోయాడు. ఆఫీస్ పని లో పడి ఆ విషయం మర్చిపోయాడు. రంగా ఒంటరి గా ఉన్న పనిమనిషి కూతురి పై అత్యాచారం జరిపి, స్పృహ తప్పిన ఆ అమ్మాయిని వదిలి వస్తుండగా తల్లి ఎదురయ్యింది. 


తన కూతురికి అన్యాయం చేస్తావా అని నిలదీసింది. 


"నీ కూతుర్ని వీడియో లో బంధించాను. ఎవరికైనా చెప్పావా జాగ్రత్త" అని బెదిరించాడు. 


ఆ రోజు రాత్రి శేఖరం మామూలు గా మీ ఇంటికి వచ్చి పిజ్జా తిని పడుకున్నాడు. 


ఆ తరువాత రంగా డబ్బు ఇమ్మని పనిమనిషి ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. మీ పనిమనిషి నెంబర్ రంగా కాల్ రిజిస్టర్ లో ఉంది" చెప్పాడు రాజేంద్ర.


రంగాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


"వెల్డన్ రాజేంద్ర గారు మా పరువు కాపాడారు."

అభినందనలు తెలిపింది మాధవి. 


"మీ ఫీజు తీసుకోలేదు " అడిగాడు వంశీ.


"వచ్చే ఆదివారం ఇంటికి వచ్చి తీసుకుంటా, క్యాష్ "

అని చెప్పి బైక్ స్టార్ట్ చేసాడు రాజేంద్ర 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comentarios


bottom of page