top of page

క్రిమినల్‌ జస్టిస్‌



'Criminal Justice' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 17/04/2024

'క్రిమినల్‌ జస్టిస్‌' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



మనీషా తండ్రి 1984 వ సంవత్సరం డిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతలో హత్య చేయబడ్డాడు. తండ్రి శవం కూడా దొరకలేదు. వాళ్ళది హోల్‌సేల్‌ ఆటోమోబైల్‌ వ్యాపారం. యిల్లు, కారు, ఆస్తి సర్వస్వం అగ్నికి ఆహుతి అయిపోయాయి. కుటుంబసభ్యులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పంజాబ్‌ లోని సొంతూరుకు పారిపోయారు. 


పంజాబ్‌రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌ నుండి అమృత్‌సర్‌కు వెళ్ళేదారిలో వచ్చే అంబాలా పట్టణంనుంచి కుడివైపుకు తిరిగితే పదిమైళ్ళ తరువాత వచ్చే రాంపూర్‌ అనే ఊరిలో మనీషా బాల్యం అత్యంత దుర్భర పరిస్థితులలో గడిచింది. 


తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తలచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ కృంగి కృశించి కూతురిని అనాథగా వదిలి మనీషా పన్నెండేళ్ళ వయసులో తల్లి మరణించింది. 


మనీషా ఊళ్ళో ఏర్పాటు చేసిన ‘ లంగర్‌’ ( అన్నదానసత్రం) లో తినీతినక గురుధ్వారలో. ఆశ్రయం పొంది ఇంటర్మీడియేట్‌ వరకూ చదువుకుంది. గ్రాడ్యుయేషన్‌ చేసేటప్పుడు ఎన్‌సీసీ లో చేరి మిలిటరీ శిక్షణ పొందింది. రైఫిల్‌షూటింగ్‌లో ఇండియాలోన నంబర్‌ వన్‌ గా నిలిచింది. 


మనీషా తాను అనాథగా మారడానికి కారణమెవరో తెలుసు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఆమె దగ్గరున్న పెట్టుబడి కేవలం ఆమె శరీరమే. దానిని విరివిగా తెలివిగా ఉపయోగించుకుంది. 

సమానపు అట్టడుగు స్థాయి పొరల్లో మురికికూపాల్లో, అనాథశరణాయాలలో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఆమెకు తెలుసు. ఎంతో లౌక్యంగా లేకపోతే అక్కడి నుంచి జీవితం ఇంకా దిగజారి వ్యభిచార గృహాల్లో, మురికికాలువల్లో తేలుతుంది. అందుకే చిన్నప్పుడే గుండె దిటవుగా, కఠినంగా మార్చుకుంది. ఆమె మనస్సు మొద్దుబారిపోయింది. 


న్యాయాన్యాయాలు మరిచిపోయింది. ఏం చేసినా బత

కాలి. గెలవాలి. అందుకే అధ్బుతసౌందర్యరాశి అయ్యి, ఆమె మనసు మాత్రం పాషాణం లా మారిపోయింది. 


ఇరవై ఒక్క ఏళ్ళలోనే ఎవరెవరిని ఎలా సంతృప్తి పరచాలో తెలుసుకుని ఆ పని దిగ్విజయంగా ముగించుకుని, పంజాబ్‌పోలీస్ లో సబ్‌ఇనస్పెక్టర్‌ గా ఉద్యోగంలో చేరింది. ఉద్యోగబాధ్యతలను పూర్తి నియమనిష్టలతో నిర్వహించింది. సమర్థురాలని పేరు తెచ్చుకుంది. 


పోలీస్‌డిపార్ట్‌మెంట్‌ ‌లో సమర్థత అంటే పై అధికారుల ఆజ్ఞలకు అనుగుణంగా, క్రిందటి ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా ప్రెస్సువారి కోరికలను ఎప్పటికప్పుడు లోపాయకారిగా తీరుస్తూ, స్నేహంగా అధికారుల రాజకీయనాయకుల గొంతెమ్మా కోరికలలకు పట్టుగొమ్మగా ఉంటూ, వీలైతే ప్రజలకు అప్పుడప్పుడూ అంతో ఇంతో మేలు చేస్తూ సమర్థత గుర్తించబడుతుందని మనీషా అన్నీ తెలుసుకుంది. ఆచరించింది. 


ఆమెకు న్యాయం, అన్యాయం, నీతి, అవినీతి వంటి విషయాల్లో పెద్దగా పట్టింపులేదు. కాబట్టి సులభం గానే సిస్టమ్లో ఇమిడిపోయింది. 


గురుదాస్‌పూర్‌ నియోజకవర్గపు అధికార పార్టీకి చెందిన ఎమ్‌ల్‌ఏ కర్తాల్‌సింగ్‌ మీద ఘోరమైన దాడి జరిగింది. ఆ దాడిలో ఎమ్‌ల్‌ఏ దంపతులను చంపి నగలు, డబ్బు దోచుకోవడంతో పాటు ఎమ్‌ల్‌ఏ ఇరవైఏళ్ళ కూతురు పూనమ్‌ను కిడ్నాప్‌ చేశారు. 


ఆ సంఘటనతో గురుదాస్‌పూర్‌ మాత్రమే కాదు. పంజాబ్‌ రాష్ట్రమంతా ఈ హత్యాకాండతో అట్టుడికిపోయింది. ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది. ఇది కేవలం దొంగతనం, హత్య మాత్రమే కాదని ఏవో పాతకక్షలవల్ల ఈ దారణమారణ కాండ జరిగిందని పేపర్లు కూడా కూశాయి. 


అధికార పా ర్టీ ఎమ్‌ల్‌ఏ హత్య చేయబడ్డాడు. కాబట్టి కేసు సాల్వ్‌ చేయమని పైనుంచి ఒకటే ఒత్తిడి. గురుదాస్‌పూర్‌ జిల్లాలోని పోలీస్‌ యంత్రాంగం మొత్తం రంగం లోకి దిగినా వారం రోజులవరకూ ఒక చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు. 


లోకల్‌ పోలీస్‌స్టేషన్‌లో యస్సైగా ఉన్న మనీషా కొన్ని అనుమానాస్పద కదలికలను గమనించింది. హంతకుల వాసన పసిగట్టింది. అయితే మనీషా పద్దతే వేరు. చిన్నప్పటినుండీ వీధుల్లో పెరిగింది కాబట్టి

కామన్‌మ్యాన్‌లా, సాధారణ మనిషిగా ఆలోచిస్తుంది. పోలీసుల థియరీ ప్రకారం కాకుండా మరో రకంగా ఆలోచించింది. 


అందుకే ధైర్యం చేసి ఒక అర్ధరాత్రి నేరుగా వెళ్ళి గుర్‌గావ్‌పూర్‌ యస్పీ గారిని కలిసింది. తనకు అను

మతిస్తే హంతకులను పట్టుకుంటానని హామీఇచ్చింది. 


అయితే కేసు ఒక కొలిక్కి వచ్చేవరకూ అత్యంత

రహస్యంగా, గోప్యంగా ఉంచాలని, ఈ హత్యాకాండలో పోలీసుల హస్తం కూడా ఉండి ఉండొచ్చు. 


కాబట్టి డిపార్ట్‌మెంట్‌లో కూడా ఎవ్వరికి తెలియకూడదనీ, దానివల్ల మీకే లాభమని, ఎస్పీగారిని ట్రాప్‌లో పడేసింది. ఎస్పీగారు ఆలోచించారు. లాభనష్టాలా మాట అటుంచి తన కేసు సాల్వ్‌ కావడం ముఖ్యం. పోలీసు ఉన్నతాధికారుల నుంచీ, హోంమినిష్టర్‌ నుంచీ వచ్చే ఒత్తిడిని ఆయన తట్టుకోలేక పోతున్నాడు. అందుకే ఓకే అన్నాడు. 


మనీషా ఒకనాటి అర్దరాత్రి పూట డైరక్ట్‌గా కర్తార్‌స్ంగ్‌ చేతిలో ఓడిపోయిన అపోజిషన్‌ పార్టీ నాయకుడిని దిలీప్‌సింగ్‌ ఇంటిమీదికి రైడ్‌ చేసి అతనిని, అతని భార్యని, కూతురు రకూల్‌ లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌ లో కాకుండా ఊరికి అవతల ఉన్న పాడుబడిన ఒక పాతభవంతిలో దాచిపెట్టింది. ఆమె తనకు బాగా నమ్మకమైన ముగ్గురు కానిస్టేబుల్స్‌ ను మాత్రం ఇన్వాల్వ్‌ చేసింది. 



దిలీప్‌సింగ్‌ కూతురు రకూల్‌ బట్టలువిప్పి నగ్నంగా నించోబెట్టి తనే ఫోటోలు తీసింది. అలాగే దిలీప్‌

సింగ్‌ను ఫోటోలు తీయించింది. దిలీప్‌సింగ్ కట్లువిప్పి నించోబెట్టి నోటిలో కుక్కినగుడ్డలను తీయకుండానే అతనిని నగ్నంగా నిలబెట్టి ఆముదం రాసిన లాఠీతో ఒళ్ళంతా కుళ్ళబొడిచింది. దిలీప్‌సింగ్‌ దెబ్బలకు కుయ్యోమొర్రో అని మొత్తుకోవడంతో పాటు విభ్రాంతికి గురయ్యాడు. 


ఒక రాజకీయనాయకుని, మూడుసార్లు ఎమ్‌ల్‌ఏ గా, ఒకసారి మంత్రిగా చేసిన తనను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంతమాత్రాన ఇంత ఘోరంగా హింసిస్తారని, అతను కలలో కూడా ఊహించలేదు. పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో అతని

శిష్యులు ఎంతోమంది ఉన్నారు. ఎస్‌పీ. లెవల్లో ఉన్నారు. ఎవ్వరికి ఈ విషయం చెప్పనందుకు కోపంతో

రగిలిపోయాడు. 


నోటిలో గుడ్డలు తీయగానే బూతులు లంకించుకున్నాడు. మనీషా మళ్ళీ లాఠీకి పనిచెప్పింది. 


‘బాత్‌ మత్‌ కర్‌నా; నేను మాట్లాడమనేంత వరకూ నోరు విప్పొద్దు’ అంటూ లాఠీని ఆసనంలో ఎక్కించింది. దిలీప్‌సింగ్‌ కెవ్వుమన్నాడు. రెండు చేతులతో నోరు మూసుకుని మాట్లాడనన్నట్లుగా సైగచేశాడు. అప్పుడు ఆ ఫోటోలని పట్టుకుని మనీషా దిలీప్‌సింగ్‌ ముందు కూర్చుని

“ ఇప్పుడు చెబుతావా?” అని ప్రశ్నించింది. 


“ ఏమిటీ?”


“ కర్తార్‌సింగ్‌ను ఎందుకు చంపావ్‌? ఎలా చంపావు? పూనమ్ ఎక్కడుంది?”


“ నాకేమీ తెలియదు. నమ్ము” అన్నాడు. 


“ నేనే ఇంకొక్క సారే అడుగుతాను. ఉస్‌కేబాద్‍నయ్‌”; అంటూ తన చేతిలోని దిలీప్‌సింగ్‌ కూతురు నగ్నంగా ఉన్న ఫోటోను చూపించింది. 


“ ఇదెవరో తెలుసుకదా; నీ కూతురే కదా; నువ్వు నోరు విప్పితే ఇంతటితో ఆగిపోతుంది. లేదంటే అటుచూడు” అంటూ తన ముందు కేవలం డ్రాయర్లమీద నిలబడి ఉన్న బుల్స్ ను చూపించింది. 


వీళ్ళిలా నీ కూతురిని నంజుకు తింటారు. అంతే కాదు. ఆ తరువాత నీ భార్య ఫోటో, నీ కూతురు తరువాత నీ భార్యను తరువాత నిన్ను …..” అంటుంటే దిలీప్‌సింగ్‌ కళ్ళలో భయం స్పష్టంగా కనుపించింది. 


“ ఈ ఎపిసోడ్స్‌ అన్నీ వీడియోల్లో షూట్‌ చేస్తాను. అప్పటికీ నువ్వు నోరు విప్పకపోతే వాళ్ళిద్దరినీ బొంబాయి లోని కామాటీపూరా రెడ్‌లైట్‌ ఏరియాకి అమ్మి పారేస్తా”. 


దిలీప్‌స్ంగ్‌ మాట్లాడలేదు. కానీ కళ్ళలో భయం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. తను విడుదలైన

తరువాత ఈ మనీషానీ మూడు చెరువుల నీళ్ళు త్రాగించవచ్చు. కానీ ఈలోపలే తన కూతురు శీలం పోతే, తన భార్యను రేప్‌ చేస్తే వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు. తన పరువు కాపాడుకోవాలంటే

తన వాళ్ళ మానమర్యాదలు క్షేమంగా ఉండాలంటే ఈ మనీషా చెప్పినట్టు వినాల్సిందే అని అను

కుంటుండగానే, 


“ నా దగ్గర టైం లేదు. నువ్వేదో అనుకుంటున్నావేమో. నీ కూతురు శీలం పోయిన తరువాత నీ బతుకు

ఎందుకు రా? అప్పటికీ నీవు నోరు విప్పకపోతే మీ ముగ్గురిని ఎన్‌కౌంటర్‌ చేసి తీవ్రవాదుల చేతిలో

నీ భార్యను, నీ కూతురిని బలత్కారం చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని

చెబుతాను……


లేదా…. ఇదంతా వద్దనుకుంటే చెప్పు…చచ్చి నువ్వు సాధించేదేమీ లేదు. నువ్వు పోలీసులకు సహకరిస్తే నీపేరు బయటకు రాకుండా నిన్ను ఇన్వాల్వ్‌ చేయకుండా కేసు క్లోజ్‌ చేస్తా.


మరో విషయం.. నీ కూతురి ఫోటో నేనే తీశా; ఆమె గౌరవానికి భంగం రానీయలేదు. మా వాళ్ళ కంట పడనీయ లేదు. ఆమె గౌరవాన్ని కాపాడే భాద్యత నాదే. ”

 

అని నెమ్మదిగా, నింపాదిగా ఒక్కొక్కమాట తూటాలా ఎదుటివాడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా పదునుగా పలికింగి. సామా దాన భేద దండోపాయాలను ప్రయోగించింది. 

దిలీప్‌సింగ్‌ కాళ్ళ బేరానికొచ్చాడు. మనీషా కౌన్సిలింగ్‌ ఫలితమిది. 


అప్పటినుంచే మనీషా ఇంటరాగేషన్‌కు కౌన్సిలింగ్‌ అని పేరు. మనీషా కౌన్సిలింగ్‌ అంటే రౌడీలు, గూండాలు పాంట్లు తడుపుకునే వారు. 


పూనమ్‌ను ఎక్కడ దాచిపెట్టాడో దిలీప్‌స్ంగ్‌ చెప్పాడు. ఇద్దరు పోలీసులను పంపింది పూనమ్‌ను వెంటబెట్టుకు రమ్మని చెప్పింది. పూనమ్‌ను తీసుకు వచ్చిన తరువాత మిగిలిన ముఠా విషయాలు, ‘ఆ ముఠా సభ్యులెవరు?ఎక్కడ దాక్కున్నారు?నగలు, డబ్బు, ఎక్కడ దొరుకుతాయో’ వంటి విషయాలు వివరాలన్నీఅడిగింది. దిలీప్‌సింగ్‌ను అక్కడే ఉంచి అతని భార్యని, కూతురిని తీసుకుని వెళ్ళి

దిలీప్‌సింగ్‌ వాళ్ళింటిలో వదిలింది. వాళ్ళు మనీషాకు చేతులెత్తి నమస్కరించారు. 


తిరిగి వచ్చేటప్పుడు మనీషా దిలీప్‌సింగ్‌ భార్య కాళ్ళకు మొక్కి——

“ క్షమించండి, మీతో దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. కానీ మీ భర్త నీచుడు. కర్తార్‌సింగ్‌ దంపతులను అతి కిరాతకంగా చంపించారు. వాళ్ళ అమ్మాయిని, ఇదిగో మీ అమ్మాయి రకుల్‌ వయస్సున్న అమ్మాయిని కిడ్నాప్‌ చేయించాడు. ఈ అమ్మాయిని మీ భర్త, అతని అనుచరులు గాంగ్‌రేప్‌ చేసి నరకం చూపించారు. ఈ పరిస్థితులలో వాళ్ళను పట్టుకోవడానికి పోలీసులు ఏం చేయాలి మీరే చెప్పండి. 


రాజకీయ కక్షలకు అభం శుభం తెలియని ఆడవారిని బలిచేయడం ధర్మమా? న్యాయమేనా? ఇప్పటికి

వారం రోజులయ్యింది. అందుకే మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలియజాయాలనే మిమ్మల్ని కూడా బాధ పెట్టాలి వచ్చింది. లేకపోతే ఇంకొక్క రోజు ఆలస్యమైనా అభం శుభం తెలియని ఈ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోయా ఉండేది. మీ బిడ్డలాంటి మరో తల్లి కన్నబిడ్డే కదమ్మా; ఇంత ఘోరం చేయవచ్చా? వాడు చేసిన పాపానికి మీరు బలికావలిసి వచ్చింది. ”అన్నది మనీషా. 


దిలీప్‌సింగ్‌ భార్య బోరుమని ఏడ్చింది. మనీషాను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని “ హమే మాఫ్‌ కరో భేటీ” అని అంటూ లోపలికి పరిగెత్తింది. 


తరువాత మనీషా పూనమ్‌ను తీసుకుని డైరక్ట్‌గా ఎస్‌పీ ఆఫీసుకు వెళ్ళి ఆయనకు పూనమ్‌ ను అప్పజెప్పి, తనకు తెలిసిన విషయాలు చెప్పి ఈ క్రెడిట్‌ మధ్యలో ఉండే వేరే ఆఫీసర్‌కు దక్క కుండా ప్లాన్‌ చేసింది. అప్పటికి రాత్రి మూడు గంటలయ్యింది. ఎస్పీగారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. గుండెల మీదనుండి పెద్దభారం తొలగించినట్లయింది. కానీ మనీషా ఇప్పుడే ఈ విషయం లీక్‌ కావొద్దని కాషన్‌ చేసింది. 

ఎస్పీగారు భృకుటి ముడిచారు. కానీ, మనీషా చెప్పింది విన్న తరువాత ఒంట్లోని నవనాడులు బుసలు కొట్టాయి. సరేనని తల ఊపాడు. 


మనీషా తనకు కావలసిన బలగం గురించి చెప్పి వాళ్ళను తీసుకుని ఆ తీవ్రవాదుల ముఠా డెన్‌ పై దాడి చేసి ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి నగలు, నగదు స్వాధీనము చేసుకుంది. నగదు ముప్పైకోట్లలో సగం అంటే పదిహేను కోట్లు తను తీసుకుని ఐదు కోట్లు సిబ్బందికి పంచి, మిగిలిన పదికోట్లు ఎస్పీగారి క్యాంప్‌ బంగళాకు తరళించింది. 


అంత డబ్బు నగలూ చూసి ఎస్పీగారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. మనీషా తెచ్చిన నగదులో కొంత అంటే ఎనిమిది కోట్లు మాత్రం తను తీసుకున్నారు. నగల్లో తనకు నచ్చినవి తీసుకొమ్మని భార్యను పిలిచారు. ఆమె ఎస్పీ గారి కంటే రెండాకులు ఎక్కువే చదివింది. ఒక్క మంగళసూత్రం తప్ప మనీషా తెచ్చిన పదికిలోల నగల్లో పదిగ్రాముల మంగళసూత్రం మిగిలింది. 


ఎస్పీగారు ఇబ్బందిగా మనీషా వైపు చూశారు. ” మరేం ఫరవాలేదు సార్‌, ఐ విల్‌ మేనేజ్‌; అని చెప్పింది. ఆ రాత్రి దొంగలముఠా మీద దాడి చేసి వాళ్ళు ఎక్కడో దాచుకున్న, దోచుకు వచ్చిన నగలను ఎస్పీగారి బంగళాకు చేర్చింది. 


ఎస్పీగారు మరునాడు మిగిలిన నగదును అంటే రెండుకోట్ల నగదును, మనీషా రాత్రికిరాత్రి ఇచ్చిన రెండు కిలోల నగలను ప్రెస్‌ ముందు నిలిపారు. ఇంకేముంది- ప్రెస్‌ ఎస్పీగారికి నీరాజనాలు పలికింది. ఇంతగొప్ప కేసును చేధించినందుకు ఆకాశానికి ఎత్తేసింది. పోలీస్‌ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు మంత్రులు, హోంమంత్రి, ముఖ్యమంత్రి తదితరులు ఎస్పీని అభినందనలతో ముంచెత్తారు. గమ్మత్తుగా దిలీప్‌సింగ్‌ పెద్ద బొకే‌ని తీసుకుని వెళ్ళి ఎస్పీగారికి అభినందనలు తెలి

పాడు. 


కానీ, ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మనీషా బ్యాక్‌గ్రౌండ్‌ లో ఉండిపోయింది. ఆమెకు ఈ కేసు

తో ఎస్పీగారి దగ్గర ముఖ్యంగా మేడం దగ్గర చాలా చనువు ఏర్పడింది. 


ఆమె లక్ష్యం కూడా అదే. తనకు కావలసిన అండ దొరికింది. దానికి తోడు అందరికంటే ఎక్రువగా తనకే పదిహేనుకోట్లు లభించాయన్న విషయంలో మరో నరమానవుడికి తెలియదు. తెలిసిన దిలీప్‌సింగ్‌ ఆ మొత్తాన్ని ఎస్పీ నొక్కేశాడనుకున్నాడు. గనుక నోరెత్తక తనకు అంతే చాలనుకున్నాడు. 


ఎందుకంటే కేసులో తన ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందని తెలిస్తే అదనపు బెనిఫిట్‌ ఏమీ లేకున్నా, అడిషనల్‌

ఎస్పీ నుండి తన స్టేషన్‌ సర్కిల్‌ఇనస్పెక్టర్‌ వరకూ శత్రువుల్లా మారిపోతారు. ఆ సొమ్మును తమలో తాము పరచుకోవడానికి కుక్కల్లా కొట్లాడుకుంటారు. లేదా వాళ్ళను అవకాశం దొరికినప్పుడల్లా తనను

నొక్కేసే ప్రయత్నం చేస్తారు. అందుకే జరుగుతున్న తతంగమంతా అందరితోపాటు తను కూడా ఆశ్చర్య

పడుతూ చూసింది. 


కానీ ఎస్పీగారి దైర్యసాహసాలను చీఫ్‌మినిస్టర్‌ నుండి లోకల్‌ లీడర్ల వరకూ ఎందరో మెచ్చుకుని అందలమెక్కించారు. యస్పీ గారికి ప్రభుత్వం కోటిరూపాయల క్యాష్‌ అవార్డ్‌ ప్రకటించింది. యస్పీగారు ఉబ్బితబ్బిబయ్యారు. మనీషా తన పాలిట దేవత అనుకున్నాడు. దానికి తోడు యస్పీగారు డిల్లీకి వెళ్ళి ఆ క్యాష్‌అవార్డ్‌ తీసుకుంటున్న సమయంలో డిల్లీ లోకల్‌ఏరియాలో డ్యూటీ పడేలా ఆర్డర్‌ జారీ

చేశాడు. 


దానికి తోడు యస్పీగారికి లభించిన పురస్కారానికి సంతోషపడుతూ అభినందించడానికి డిల్లీలోని ఆయన గెస్ట్‌హౌజ్‌ కు వెళ్ళి యస్పీగారిని కలిసింది. అందరూ వెళ్ళేవరకూ వెయిట్‌ చేయమన్నాడు. ఆ సందేశం లోని గూఢార్థం మనీషాకు అర్థమయ్యింది. 


యస్సై ఉద్యోగం కోసం కావలసిన సర్టిఫికేట్స్ కోసం కాలేజీ క్లర్క్‌కు, ఫారం నింపినందుకు ఎగువశ్రేణి గుమాస్తాకూడా, పోలీస్‌వెరిఫికేషన్‌ కోసం తెలిసిన యస్సైకి పంచిన తన శరీరాన్ని యస్పీకి అందించటానికి పెద్దగా సంకోచించలేదు. 


తన పాలిట దేవత అనుకున్నది కాస్తా శృంగారదేవత అయి ఆనందడోలికల్లో ముంచివేసినందులకు యస్పీగారు ఖుషీ అయిపోయారు. ఆ రాత్రి అక్కడే గడిపింది. 


జీవితం మొత్తానికి కావలసినవి పేరు, ప్రఖ్యాతులను, భార్యకు తనివితీరేటట్లు నగలు, తన కూతురు పేరు మీద ఫాంహౌజ్‌ కొనడానికి కావలసిన నగదు, కోటి రూపాయల రివార్డ్‌, రాబోయే ప్రమోషన్‌ తో పాటు అందమైన శరీరాన్ని భక్తిగా తనకు అందించిన మనీషాకు యస్పీగారు ముద్దులతో ముంచెత్తారు. 


బాగా తాగిన తరువాత ఏం చేస్తున్నాడో తెలియని మైకంలో ఆమె కాళ్ళు మొక్కాడు. పట్టుకుని ఏడ్చాడు. మనీషా కూడా అవన్నీ ఫోటోలుగా తీసుకుని మధురస్మృతులుగా దాచుకుంది. 


పంద్రాగస్ట్‌ కు, రిపబ్లిక్‌డేకు ఇచ్చే ఉత్తమ పోలీస్‌అవార్డ్‌లు, రివార్డ్‌లు ఆమెను, ఆమెతోపాటు ఆ ఆపరేషన్‌లో పాలుగొన్న కానిస్టేబుల్స్‌ను వరించాయి. 


ప్రభుత్వం నుండి ఆమెకు చండీఘడ్‌లో పెద్ద క్వార్టర్‌, కారు అలాట్‌ అయ్యాయి. యస్పీగారు గురుదాస్‌ పూర్‌ నుండి వెళ్ళేలోగా అంటే రెండేళ్ళలోనే మనీషాకు సీఐ గా ఔటాఫ్‌ఫెర్‌ఫార్‌మెన్స్‌, సీనియారిటీ కోటాలో ప్రమోషన్‌ కూడా వచ్చింది. ప్రమోషన్‌తో పాటు చండీఘడ్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. 


చంఢీఘడ్‌ అంటే పంజాబ్‌, హర్యానా రెండు రాష్ట్రాల రాజధాని. ఛండీఘడ్‌ చేరుకున్న తరువాత మనీషా “ డిల్లీ బహూత్‌ దూర్‌ నహీ హై” అనుకుంది. 

తన కలల సామ్రాజ్యాన్ని కాల్చేసిన చోటు దగ్గరకు వస్తోంది. అని మనసులో కసిగా అనుకుంది. పోలీస్‌అధికారిగా డిల్లీ చేరాలనే తన లక్ష్యానికి అతి కొద్ది దూరంలో ఉన్నందుకు సంతోషించింది. 


డిల్లీకి చంఢీఘడ్‌కు చాలా క్లోజ్‌ సంబంధాలుంటాయి. గురుదాస్‌పూర్‌ లో యస్పీగారికి కూడా డీఐజీ గా ప్రమోషన్ వచ్చింది. ఆయన కూడా చంఢీఘడ్‌ వచ్చారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో మంచి పొజిషన్‌ లో ఉన్నారు. అధికార పార్టీ కనుసన్నలలోనే మెదలుతుంటాడు. కాబట్టి మంచి రిలేషన్స్‌

మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. డీఐజీ గారిని ఎంటర్‌టైన్‌ చేస్తూన్ మేడంను బాగా చూసుకుంటోంది. 


దాంతో డీఐజీ గారితోపాటు హైప్రొఫైల్‌ వ్యక్తుల పరిచయాలు ఏర్పడ్డాయి. హైప్రొఫైల్‌ వ్యక్తులకు కూడా చిన్న చిన్న అవసరాలుంటాయి. వాటికొరకు డీఐజీ గారి దగ్గరకు వెళ్ళటంకన్నా మనీషా దగ్గరకు వెళితేనే పనులు తొందరగా అయిపోతాయి. ఆయన దగ్గరకు వెళ్ళినా ఆయన

తన వాటా తాను తీసుకుని మనీషా దగ్గరకే పంపుతాడు.


కాబట్టి పంజాబ్ హర్యానా రెండు రాష్ట్రాలలో ఎక్కువ ఏ అవసరం ఉన్నా మనీషా నే ఆశ్రయించేవారు. ఒక హై సొసైటీ అమ్మాయిని ఎవరో రోడ్‌సైడ్‌రోమియో ప్రేమపాఠాలు చెప్పి ట్రాప్‌ చేసి లేపుకుపోతాడు. మోజు తీరుగానే ఏ బొంబాయి లోనో అమ్మేస్తాడు. ఇలాంటి విషయాలు బయటకు

తెలిస్తే కుటుంబపరువు గంగలో కలుస్తుంది. కానీ మనీషాకు చెబితే రెండు రోజులలో అమ్మాయిగుట్టు చఫుడు కాకుండా ఇంటి కొచ్చేస్తుంది. 


మూడో రోజున ఆ రోడ్‌సైడ్‌రోమియో నేరతీవ్రతను బట్టి

డ్రగ్స్‌తో పాటు పట్టుబడతాడు. అంటే పోలీసుల మీద దాడి చేసి పారిపోయే క్రమంలో ఎదురు కాల్పుల్లో మరణిస్తాడు. 

ఎవరి డిమాండ్‌ను బట్టి వారికి జస్టిస్‌ లభించేది. 

“ అలా తొందరలో పాపులర్‌ అయిపోయింది ‘ మనీషా’”. 


సమాప్తం


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు. 



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






137 views0 comments

コメント


bottom of page