కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి
'Cyanide Episode 9' New Telugu Web Series
Written By Lakshmi Nageswara Rao Velpuri
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' ఎనిమిదవ భాగం
గత ఎపిసోడ్ లో
శేఖర్ మరణ వార్త తెలుసుకుంది అతని భార్య.
శత్రువులకు దొరక కూడదని, భర్త ఇచ్చిన హార్డ్ డిస్క్ ని ముక్కలు చేసిందామె.
సెలూన్ అతను, చెప్పుల షాప్ సేల్స్ మాన్ హంతకుడి ఆనవాళ్లు చెబుతారు.
ఇక సైనైడ్ తొమ్మిదవ భాగం చదవండి
ఆ రోజు ఉదయం ఏ-వన్ మధురవాడ లో మరో పెద్ద జోళ్ళ షాప్ లోకి వెళ్లి, 6వ సైజు షూస్, 7వసైజ్ షూస్, నల్లని లెదర్ కలర్ వి ఇమ్మని చెప్పి, తను వేసుకున్న జోళ్ళు విప్పాడు. అక్కడే ఉన్న సేల్స్ మెన్ ఏ-వన్ కి కావలసినవి ఇచ్చి, షూలు అతని కాలికి తొడగ బోయాడు.
“నో.. నో.. నేనే వేసుకుంటాను. నువ్వు వెళ్ళు!” అని, ఒక కాలికి 6 వ నెంబరు షూ, మరో కాలికి 7 వ నెంబరు షూ వేసుకున్నాడు. మిగతావి బాక్స్లో పెట్టి, బిల్లు కౌంటర్ లో పే చేశాక ఆయన నడుస్తున్న తీరును చూసి, అనుమానించాడు సేల్స్ మాన్.
అంతకు ముందు రోజే పోస్టర్ లో వేసిన విధంగా ఉన్న ఆ మనిషిని, అతను కుంటుకుంటూ నడుస్తున్న తీరుని అనుమానించి, పోలీసులకు ఫోన్ చేశాడు.
అంతే! ఒక అరగంటలో రాజశేఖర్ గారు తన పోలీస్ స్క్వాడ్ తో జోళ్ళ షాప్ కు వచ్చి, ఆ సేల్స్ మెన్ ని దగ్గర అన్ని వివరాలు సేకరించారు.
“నువ్వు చేసిన ఈ సహాయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు అవార్డు లభిస్తుంది!” అని అతని భుజం తట్టి అభినందించారు రాజశేఖర్ గారు.
వెనువెంటనే తన సెల్ ఫోన్ లో మధురవాడ కనెక్ట్ అయ్యే, అన్ని దారులు మూసి వేయమని, ఎలాంటి అనుమతులు ఉండకుండా, ఒక గంట సేపు ఆపాలని ట్రాఫిక్ పోలీస్ శాఖ వారికి చెప్పారు. ఇది కలెక్టర్ గారు కూడా అనుమతించారని చెప్పి, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయమన్నారు.
అంతే! ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయింది. జనాల్లో ఆందోళన, భయం ఎక్కువైపోయాయి. ఒక యాభై మంది పోలీసులు అన్ని వాహనాలను తనిఖీ చేస్తూ, ఒక్కొక్కటిగా వదులుతున్నారు. అసలే విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందుతున్న టూరిస్ట్ సిటీ కాబట్టి వందలాది వాహనాలు ఆగిపోయాయి.
మరోపక్క ఏ-వన్ నడుచుకుంటూ, హైవే దాటి సందులు, సందులు తిరుగుతూ తన ఇంటికి చేరుకొని, వెంటనే బి-వన్ కి కాల్ చేశాడు.
ఏవన్ గాబరాగా మాట్లాడుతూ, “హలో హలో! నన్ను గుర్తుపట్టారు, పోలీసులు. ఎక్కడపడితే అక్కడ విశాఖపట్నంలో నా ఊహ చిత్రం గీసి పోస్టర్లు పెట్టారు. వైజాగ్ అంతా అణువణువు గాలిస్తున్నారు. ఇప్పుడే, మధురవాడ కూడా తనిఖీలు చేపట్టారు! నేను ఎక్కువసేపు దాక్కోలేను, కనుక నన్ను అర్జెంటుగా వైజాగ్ నుంచి బయట పడేటట్టు చేసి, అక్కడినుంచి దుబాయ్ కి, అట్నుంచి కెనడా కి తీసుకు వెళ్ళిపో! నేను దొరికేనా, నా దగ్గర సైనేడ్ క్యాప్సిల్ కూడా లేదు, వెంటనే చావడానికి!
నా చేత నిజాలు కక్కిస్తారు. అన్నీ తెలిసిపోయాక, నీ విషయం కూడా తెలుస్తుంది. ఇండియన్ గవర్నమెంట్, కెనడియన్ గవర్నమెంట్ మనల్ని ఉరి తీసే వరకు, వరకు వదలరు. ఎలాగూ శేఖర్ దగ్గర నుంచి ఎలాంటి వివరాలు సేకరించలేదు. కనుక మన ప్లాన్ బెడిసికొట్టింది. మన ప్రాణాలు మనమే రక్షించుకోవాలి!
త్వరగా నన్ను ఇండియా నుంచి కెనడా కి తీసుకు వెళ్తే మన ఇద్దరం సేఫ్గా ఉండిపోతాం!” అని చెప్పాడు.
ఏవన్ మాటలు విని బివన్ సావధానంగా సమాధానమిస్తూ, “ఓకే.. డోంట్ వర్రీ! రేపు మార్నింగ్ నీకు న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ లో సీట్ రిజర్వ్ చేశాం. ఎలాగో ఒకలాగా నువ్వు AP express ట్రైన్ ఎక్కితే చాలు. న్యూ ఢిల్లీ లో దిగిన వెంటనే నీకు ఒక క్యాబ్ వచ్చి Delhi ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి, తీసుకు వెళుతుంది.
మరో గంటలో నీకు దుబాయ్ కి EMIRATES flight బుక్ అయ్యింది. ఆ తర్వాత దుబాయ్ నుంచి అదే రోజు సాయంత్రం BRITISH Airways flight లొ Montreal(Canada)వచ్చేయొచ్చు,! దీనికి కావాల్సిన టిక్కెట్లు అన్ని వివరాలతో మీ ఇంటి దగ్గర ఈరోజే డెలివరీ చేయబడతాయి. నువ్వు కంగారు పడకుండా, రేపు పొద్దున్న ఆరు గంటలకు ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి నాకు ఫోన్ చెయ్!
ఏ అనుమానము రాకుండా నువ్వు టాక్సీలు బుక్ చేయకుండ, వీలైతే షేర్ ఆటోలు ఎక్కి రైల్వే స్టేషన్కు వచ్చి, ఏపీ ఎక్స్ప్రెస్లో కూర్చో” అని చెప్పి ఫోన్ పెట్టేసింది బి-వన్.
ఇదిలా ఉండగా, ఎంతో అసహనంగా ఎలాంటి సమాచారం దొరకక పోయేసరికి, వెంటనే పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో కలెక్టర్ తో సహా అందరు హయ్యర్ అఫిషియల్స్ ని అర్జెంట్ మీటింగ్ ఉందని రమ్మని, తను బయలుదేరారు రాజశేఖర్ గారు.
తన 555 ఎక్స్ ప్రెస్ సిగరెట్ వెలిగించి, హాట్ కాఫీ తాగుతూ, వెయిట్ చేస్తున్న సమయంలో అందరూ వచ్చేశారు. జరిగిందంతా రాజశేఖర్ గారు వివరిస్తు, “చూడండి ! నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ప్రెషర్ వస్తోంది. హంతకుడిని ఎలాగైనా పట్టుకోవాలి! మనకు మధురవాడ లో ఒక సెలూన్ నడుపుతున్న వ్యక్తి, ఒక జోళ్ళ షాప్ లో సేల్స్ మెన్ చాలా విలువైన సమాచారం ఇచ్చారు! పోలికలని బట్టి, అతనే హంతకుడని నిర్ధారిస్తున్నాను.
మనం ఇవాళ, రేపు కంటికి నిద్ర పోకుండా, అతని కోసం వెతకాలి. హంతకుడు వైజాగ్ వదిలి వెళ్లి పోయేందుకు, అన్ని సన్నాహాలు చేసుకునే ఉంటాడు. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, ఏర్పోర్ట్, బస్ డిపో ల దగ్గర అత్యంత సమర్థులైన పోలీసు వారు పహారా కాయాలి! అందుకు కలెక్టర్ గారిని అనుమతించమని కోరుతున్నాను.
ఇదే మనకు మంచి అవకాశం. ఒకవేళ హంతకుడు పట్టు బడితే మన దేశాన్ని తీవ్రవాద దాడులు జరిపే ఆటంక వాదుల బారి నుంచి తప్పించ గలం. ఇది కూడా మన హోం మినిస్ట్రీ ఎంతో పకడ్బందీగా అమలు చేయమని ఆర్డర్ ఇచ్చింది! ఇది దేశ భద్రతకే ప్రమాదం. హంతకులు చేజారితే మరొక పది రోజుల్లో తీవ్రవాదుల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
కనుక మీరు మీ శక్తికి మించి కష్టపడి, హంతకులను పట్టుకో వలసిందిగా నా విన్నపం. అంటూ "ok, gentlemen, let us start to end the so called cynade case, and save the nation from terrorists” అంటూ రాజశేఖర్ గారు లేచి కలెక్టర్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, మిగతా పోలీస్ స్క్వాడ్ తో కలిసి వేగంగా మళ్లీ మధురవాడ వైపు బయల్దేరారు.
( సశేషం: రాజశేఖర్ గారు అసలు హంతకుడి జాడ కనిపెట్టారా? లేదా ఏవన్ వైజాగ్ నుంచి తప్పించుకున్నాడా? అన్న విషయాలు 10 భాగం లో చదువుదాం.)
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Comentarios