#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #DasaraVuru, #దసరాఊరు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ఆ ఊరి పేరు "దసరా ఊరు' ఎలా అయ్యింది?
Dasara Vuru - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 01/04/2025
దసరా ఊరు - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
ఆ రోజు దసరా పండగ (2025 సంవత్సరం).
అప్పుడు 'అందాల సంధ్యా' సమయం.. సాయింత్రం వేళ.. చల్ల గాలి హాయిగా వీస్తూ.. అక్కడ ఉన్న అందరి హృదయాలను - మది లను రెండింటినీ హాయిగా పులకరింప జేస్తుంది.
ఆ ఊరికి "దసరా ఊరు" అని నామకరణం చేశారు. ఎందుకు ఆ పేరు? ఎందుకు అలాంటి చిత్ర - విచిత్రంమైన పేరు.. ?
అస్సలు విషయం ఏమిటంటే, ఆ పండగ రోజు, ఊరి ప్రజలు అందరూ కలసి ఆ ఊరి పేరు "రామయ్య గారి ఊరు" అని మార్చాలి అనుకున్నారు. ఎందుకలా?
రామయ్య కూతురు 'చిన్నారి అందాల వింధ్య' వెంటనే కలుగ చేసుకొని, "వద్దు వద్దు.. 'దసరా ఊరు' అనే పేరు యే సరి అయినది" అని సూచించింది. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.
ఎందుకలా.. ?
'రామయ్య గారి ఊరు' పేరునే ఎందుకు నిర్ధారించారు ఆ ఊరివారు ఆ ఊరికి?
..
మరి 'చిన్నారి అందాల వింధ్య' 'దసరా ఊరు' పేరు ఎందుకు ఖరారు చేసింది? అందరూ ఎందుకు ఒప్పుకున్నారు?
తెలుసుకోవాలని ఉత్సుకత గా వున్నదా? అయితే గతం లోకి వెళ్ళ వలసిందే..
---------------------------
2)
----------- గతం (FLASH BACK) ------------
క్రితం ఏడాది (2024 సంవత్సరం) దసరా పండగ రోజున రామయ్య గారు ఇంట్లో కూర్చుని ఉన్నారు. అతడు ఆ ఊరిలోనే కాదు.. ఆ జిల్లాకే అతి పెద్ద ధనవంతుడు. అతడు చేయని వ్యాపారం లేదు అనటం సబబు. పైగా అంద వేసిన చెయ్యి. అన్నిట్లో లాభాలే! తెలుగు మిడాస్ ఇతడేనేమో?
అతడి ఉద్యోగులు పండుగ ఉషారుగా వచ్చి దసరా మామూలు ఇవ్వమని అడిగారు రామయ్య గారిని.
రామయ్య కసురుకున్నాడు వాళ్ళను చూసి, "ఏమిటీ ఆడుక్కోవటం?.. కష్టపడి పని చేసుకోవచ్చు కదా.. చేసే పనికి జీతాలు తీసుకుంటారు కదా.. ఇంకా ఈ పండుగ మామూలు ఎందుకు ఇవ్వాలి", అని.
అతడి ఉద్యోగులు చకితంతో - చిరునవ్వుతో ఇలా జవాబు ఇచ్చారు, "అదేమిటి రామయ్య గారు, అలా అంటారు? ఇది మన భారతీయ ఆచారం, సాంప్రదాయం.. 'దసరా బుల్లోడు' 1971 సినిమాలో ఏ. ఎన్. ఆర్ మరియు అతడి స్నేహితుల బృందం కూడా దసరా మామూలు అడిగావారు కదా! అందరూ ఇచ్చావారు వారికి సంతోషంగా.. ఆ చిర్రుబర్రులాడె.. రుసరుసలాడే వాణిశ్రీ తప్ప" అని.
రామయ్య గారికి మండి పోయింది. చదువుతున్న దిన పత్రిక గిరాటు వేసి ఇలా అరిచారు, "నేను ఒక్క పైసా ఇవ్వను. మామూలు అంటే అడుక్కోవటం కు సమానమే", అన్నారు అహంకారం తో.
----------------------------------------------------------
3)
అక్కడే ఉన్న అతడి కూతురు 'చిన్నారి అందాల వింధ్య' (పాఠశాల లో 6 వ తరగతి చదువుతున్న విద్యార్ధిని).. "నాన్నా! వారి ఇళ్లకు వెళ్లి చూడండి.. వారి దీన స్థితి, అసహాయ పరిస్థితి.. ఎంత కష్ట పడ్డ కూడా సరిపోని డబ్బులు. వారంతా శ్రమ తో చెమటోడ్చి తెచ్చిన డబ్బులు.. వచ్చిన లాభాలు.. అన్ని మీ బ్యాంకు ఖాతా లో నే పోతుంది కదా నాన్నా!" అన్నది తీవ్ర కంఠంతో.
రామయ్య గారు ఆశ్చర్య పోయారు తన కూతురి మాటలకు. వెంటనే వారి పూరి గుడిసెల వద్దకు వెళ్లారు. ఎండకు ఎండు తూ - వానలకు తడుస్తూ బ్రతికే వారి నిరుపేదల బ్రతుకులు - దయానీయమైన పరిస్థితి చూసి అతడికి దిమ్మతిరిగి పోయింది. వారి ఇళ్ల కప్పులకు రంధ్రాలు. పాపం ఆ కష్ట జీవుల వద్ద కనీసం మరమ్మతు పనులకు కూడా డబ్బుల్లేవు.
ఆయ్యో!.. బట్టలను గోడలు లా కట్టిన బాత్రూం లు. అవి బాగు చేసుకోడానికి డబ్బు లేదు. అసలు మూడు-పూట్ల తినటానికి కూడా చాలీ చాలని జీతాలు.. అదీ, రోజంతా అంత కష్ట పడ్డా కూడా.. చమటోడ్చినా కూడా! రక్తం చిందించినా కూడా!
ఆ పేదవారి పిల్లలకు పాఠశాల అంటేనే తెలీదు. ఫీజు కట్టడానికి డబ్బు లేక వారిని కూడ పనులకు పంపుతారు పాపం రామయ్య ఉద్యోగులు. జబ్బు - జ్వరం వచ్చిన కూడా ఇంట్లో నే పడి ఉంటారు. ఎందుకు? ఆసుపత్రి ఖర్చులకు, డాక్టర్ ఫీసు లకు డబ్బు లేదు కాబట్టి. రోజుకు రెండు సార్లు మాత్రమే తింటారు. మంచి బట్టలకు నోచుకో లేని బ్రతుకులు.
రామయ్య గారి కళ్ళలో నీళ్ళు వర్షం లా కురిసి.. ఆ తరువాయి వరద లా పారింది.. వారి నిస్సహాయత యొక్క నిజాలు చూసి.. అంటే తిండి - గుడ్డ - ఇల్లు ఉన్నా లేనట్లే. మనిషి బ్రతుకుతున్నా బ్రతక లేనట్లే.
అతడి ఉద్యోగులు రామయ్య గారిని ఈ సారి మళ్లీ అడిగారు, 'దసరా మామూలు'. అప్పుడే అక్కడికి చేరిన 'చిన్నారి అందాల వింధ్య' కూడా ఎక్కువగా దసరా మామూలు ఇవ్వమని ప్రాధేయ పడింది తన తండ్రి ను. ఆమె కళ్ళు కూడా చెమర్చాయి, తమ పనివారి - ఉద్యోగుల దీన స్థితి చూసి.
కానీ.. ఆశ్చర్యం.. రామయ్య గారు ముక్తసరిగా చెప్పేశారు అందరి ముఖం మీద, "ఒక్క పైసా కూడా దసరా - మామూలు ఇవ్వను" అని చెప్పి.. చర చర నడుచు కుంటు తన ఇంటికి వైపుకు వెళ్లి పోయారు
ఈ సారి అందాల వింధ్య మరియు అక్కడ ఉన్న బీద బిక్కి హృదయాల్లో - మది ల్లో.. ఆశ్చర్యం, చకితం, నిరాశ.. తారాస్థాయికి చేరింది.
"ఇంతే లే ఈ ఈ నిరుపేదల బ్రతుకులు.. ", 1967 సినిమా 'పుణ్యవతి'.. లోని పాట యాదృచ్ఛికంగా వస్తుంది ఒక పాక నుండి.. రేడియో నుండో.. టివి నుండో మరి?
--------------------------------------------------------------------
4)
------- మరునాడు / మరు రోజు -----
ఆ ఊరు లో.. అత్యద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది!
రామయ్య గారు పెద్ద డేరా వేయించారు. ఉచిత పాఠశాల ప్రారంభించారు ఆ ఊరి లోని పేద వారి పిల్లలకు. అమాంతం వేతనం - జీతం - రోజూ కూలి పెంచేశారు తన అందరి ఉద్యోగులకు.. అన్ని పనుల వారికి. పాఠశాలలో ఉదయం మరియు మధ్యానం ఉచిత భోజన పథకం అమలు చేశారు ఆ రోజు నుండే.. తన స్వంత డబ్బు తో. ఒక్క ఉచిత
ప్రయాణ బస్సు కూడా వేయించారు, తన స్వంత డబ్బు తో (.. నిజం చెప్పాలంటే (అందరి చెమటోడ్చి న) డబ్బు తో)!
ఇంకో డేరా వేయించారు, దాని పక్కనే, ఆసుపత్రి లాగా. ఒక డాక్టర్ మరియు నర్సు ను నియమించారు.
పక్క ఊరి నుండి సివిల్ ఇంజనీర్లను పిలిపించి.. మూడు - ఆరు నెలల్లో ఆసుపత్రి మరియు పాఠశాల - కళాశాల బంగళాలు, ప్రతి ఇంట మరుగు దొడ్లు, అవీ ఇటుక గోడలు ఉన్న గదులలో. అన్ని ఇళ్లకు - గుడిసెలను మరమ్మత్తులు.. ఇంకా పలు నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అందరికీ పక్కా ఇళ్ళు (Employee Quarters) కట్టించే ప్రణాళిక సిద్ధం చేయించారు.
"ఆ ఊరిలో.. కేవలం.. సంతోష పూరిత నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాల తీరు - నిర్మాణాత్మక త నిర్వహణ.. శాంతి - అభివృద్ధి - అభ్యుదయం - ఐశ్వర్యం నీర్వాహకము".. అనే ఫలకం - బోర్డ్ తయారు చేయించి పెట్టించారు.
వ్యాపారాలు చేస్తాం అనే వారికి వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు - దుకాణాలు పెట్టించారు. నెల నెలా వాయిదా పద్దతి లో తన డబ్బులు వసూలు చేసే వారు.. వారికి వచ్చిన లాభాలను బట్టి. మరీ తక్కువ లాభాలు వచ్చిన వారి వద్ద వసూలు చేసే వారు కాదు. ఆ నెల వాయిదా మాఫ్ చేసే వారు.
రామయ్య గారు, తన పొలం ను తన ఉద్యోగులకు (వ్యవసాయం చేసే వారికి) తక్కువ ధర కే కౌలుకు ఇచ్చారు.. ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇతరత్రా పండించు కోవటానికి. వారికి వచ్చిన లాభాన్ని బట్టి, ఆ నెల వాయిదా (loan repay instalment) డబ్బు ఇవ్వ వచ్చు. తమ ట్రాక్టర్లను ఊరికే - నామ మాత్రం అద్దెకు వాడుకోవచ్చు అన్నారు. ఏ పంట ఎప్పుడు వేయాలి శిక్షణ ఇప్పించారు. మార్కెట్ లో మంచి విత్తనాలను కొని.. చవకగా ఇచ్చారు ఆ పేదలకు.
పంట బాగా పండి.. ఆ ధాన్యన్ని - తిండి గింజలను పక్క పెద్ద ఊరు మార్కెట్ కు వెళ్ళటానికి తమ లారీ లను నామ మాత్రం - తక్కువ డబ్బుల అద్దెకు ఏర్పాటు చేశారు.
పొలాల దగ్గర గోడౌన్ లు కట్టించారు, చేతికొచ్చిన పంట.. అమాంతం వచ్చే వానకు తడిసి ముద్ద అయ్యి.. వ్యర్థం అవ్వ కూడదని. అలాగే మార్కెట్ యార్డ్ లో రేకుల "పై కప్పు" (డాబా) వేయించారు, ధాన్యాలు సంరక్షణ కొరకు.. ఆడప దడపా వచ్చే వాన నుండి నాశనం అవ్వకుండా.
వ్యవసాయ భీమా, ఆరోగ్య భీమా ఇప్పించారు తన డబ్బులతో, అందరికీ. నెల నెలా వాయిదా పద్ధతిలో. ఉద్యోగుల వద్ద నుండి, వారి వారి స్థోమత - సంపాదించిన లాభాలను బట్టి.. వసూలు చేసేవారు. మరీ తక్కువ ఆదాయం - లాభాల వారి వద్ద నుండి ఒక్క పైసా కూడా తీసుకొనే వారు.. ఆ నెల. మాఫీ చేసేసే వారు.
తమ రాబడి - లాభాలలో, తమ ఉద్యోగులకు మరియు ఊరి వారికి.. కొంత శాతం ప్రతి నెల వారి వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేటట్లు ఏర్పాటు చేశారు.
అందరూ ఆశ్చర్యం గా నోర్లు వెళ్ళబెట్టి చూస్తుంటే..
"మీ శ్రమ, రక్తం, చమట ల ఆదాయమే కదా ఇది", అని నవ్వేసేవారు రామయ్య గారు. ఆ ఊరిలో "నిజమైన సూర్యోదయం" అయింది అనవచ్చు.. అంటే?.. డబ్బులు అందరివి అనే మేలుకొలుపు, జ్ఞానోదయం అయ్యింది అన్న మాట.. కాదు కాదు ఉన్న మాటే!
-------------------------------------------------------------------
5)
ఆ ఊరిలో మద్యం, పొగాకు, జూదం, బెట్టింగ్, కోడి పందాలు ఇతరత్రా వ్యసనాల తీరు వ్యాపారాలను నిషేధించారు. పక్క ఊరి నుండి కూడా ఎవ్వరూ తెచ్చుకో కూడదు - పక్క ఊర్లకు వెళ్లి అవి చేయరాదు.. అని శాసనం కూడా చేశారు. జూదం గృహాలను గ్రంధాలయాలు గా మార్చారు. అక్కడే, ఇంకో పెద్ద గది కట్టించి, పెద్ద వారికి కనీస అక్షర జ్ఞానం తరగతులు నిర్వహణ చేశారు.
పక్క ఊరి నుండి మంచి ఉపాధ్యాయులను తెప్పించారు.. ఎక్కువ జీతాలు, సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి.
ఒక్క సంవత్సరం లో.. ఆ ఊరు తిరుగు లేని ఊరు, ఎదురు లేని ఊరు గా ప్రసిద్ధి గాంచింది.
అక్కడ అందరూ ధనవంతులు - కనీస అక్షర జ్ఞానం, వసతులు ఉన్న ఊరు గా మారిపోయింది.
ఆ జిల్లాలోనే కాదు, దేశంలోనే మేటి ఊరు గా మారి పోయింది అనటం సబబు.
-----------------------------
6)
----- ప్రస్తుత కాలంలో.. 2025 సంవత్సరపు దసరా రోజు --------
------- (గతం అయిపోయింది.. Flashback over) -------
ఒక్క ఏడాది ఇట్టే గడిచి పోయింది.
ఇప్పుడు 2025 సంవత్సరం, దసరా రోజు. అందరూ ఊరి వారు కృతజ్ఞతా భావం తో ఇలా అన్నారు..
"రామయ్య గారు నిజం గా రాముడు లాగా.. మంచి అనే రామ బాణం వేసి.. ఊరు నుండి అన్ని చెడులు.. అదే పేదరికం, వ్యసనాలు, ఆకలి, భూత సర్ప పిశాచి తత్వం ను.. అదే రావణుడి దశ కంట వంటి.. పలు చెడులను రూపుమాపారు.. హత మార్చారు. అందుకే ఈ ఊరు పేరు 'రామయ్య గారి ఊరు' అని పెట్టుకోవాలని నిర్ణయించాం" అని
----------------------------
7)
'చిన్నారి అందాల వింధ్య' యొక్క తియ్యటి కంచు కంఠం వారి మాటలను చేదిస్తూ ఇలా అన్నది
..
"ఆగండి.. ఒక క్షణం ఆలోచించండి.. ఈ రోజు 'రామయ్య గారి ఊరు' అని పేరు పెడితే.. మాలో తిరిగి అహంకారం పెరగ వచ్చు. తిరిగి దోపిడీ, పీడన మొదలు పెట్ట వచ్చు".
".. ఇది అందరి సంపాదన.. అందరి కష్ట పడే తత్వం - చమటోడ్చే తత్వం వల్లనే.. మాకు ఇంత ఐశ్వర్యం మరియు సంపద వచ్చిందని మరచి పోయే లా చేయ వచ్చు".
"నిజాయితీగా చెప్పాలంటే 'అందరి కష్టం తో లాభం వచ్చే ఊరు' అని పేరు పెట్టాలి. కానీ 'దసరా ఊరు' అనే పేరు యే సబబు" అని ముగించింది.
అందరూ అడిగారు, "ఎందుకు 'దసరా ఊరు' పేరు? అందులోని మర్మం.. రహస్యం ఏమిటి", అని.
"క్రితం ఏడు 2024 లో, ఇదే దసరా రోజున మీరు ప్రజలంతా మరీ మరీ 'దసరా మామూలు' అడిగారు కాబట్టే.. మా నాన్న రామయ్య గారికి ఈ మేలుకొలుపు అయ్యింది. అహంకారం, డబ్బు దురాశ, డాలర్ మోజు, హాని చేయటం, ఇతరులకు దోపిడీ - పీడన ఇవ్వటం.. వగైరా 'రాక్షస భూత సర్ప పైశాచిక గుణాలు' పోవటానికి దారి తీసింది. మీ కష్టం కు తగ్గ ఫలితం, డబ్బులు - మంచి (ఎక్కువగా) వేతనం, సదుపాయాలు, సౌకర్యాలు ఇవ్వాలి అనే మంచి తలంపు వచ్చింది మాకు.. అందుకే 'దసరా ఊరు' పేరు ఖరారు చేశాను", అని ముగించింది.
కొందరు హాస్యంగా "దసరా మామూలు ఊరు' అనే పేరు పెట్ట వచ్చు కదా" అంటూ బెట్టు చేశారు.
రామయ్య గారు, "అందరికీ అన్నీ ఉన్న ఈ ఊరు పేరులో మళ్లీ మామూలు అనే పదము కూడానా" అని తల పట్టుకున్నారు.
అందరూ గట్టిగా నవ్వారు.. "ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్న - ఊరు ఇది.. ఎవ్వరికీ యే మామూలు అవసరమే లేదు.. శ్రమకు తగ్గ ఫలితం, మంచి వేతనం దొరుకుతుంది కదా", అంటూ.
--------------------------------
8)
త్వరలో ఆ జిల్లాలోని చుట్టు పక్కల ఉన్న ఊర్లు ఈ విషయం తెలుసు కొని.. వీరి సూచనలతో, సాయం తో, నెల నెలా తీర్చే వాయిదా పద్దతి యొక్క చిన్న రుణాలతో.. అతివృష్టి - అనావృష్టి సమయం లో రుణ మాఫీ తో.. ప్రగతి - అభ్యుదయం - ఐశ్వర్యం - సౌభాగ్యం - సంతోష పూరిత నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాల తీరు అవలంభించి.. 'అందరూ ధనవంతు లే' ఊర్లు గా మారి పోయాయి. అసలు మామూలు అడుక్కునే అవసరమే లేదు కదా!
అప్పుడే ఏదో రేడియో నుండో.. టి. వి. నుండో పాట వస్తుంది, 1983 సినిమా 'నేటి భారతం' లోని పాట.. "మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం.. " అని యాదృచ్ఛికంగా.
అంటే.. 'చిన్నారి అందాల వింధ్య'.. ఒక దేవత.. కరుణ తో నిండిన హృదయం అనే హృదయ ఘోష అందరిలో.. అక్కడ చేరిన వారి మనస్సులోని మాట.. పాట రూపం లో ప్రసార మవుతుంది.
----------------------------------------------------------
నీతి:
I)
పేద వారికి ఉచితాలు, మామూళ్లు వద్దు.
మరి ???
పేద వారికి.. మంచి వేతనం, సంతోష పూరిత - నిర్మాణాత్మక త నిర్వహణ - అన్ని కనీస సదుపాయాలు - సౌకర్యాలు - తిండి గూడు గుడ్డ కావాలి. అవి కల్పించాలి మనందరి బాధ్యత గా.. ప్రపంచం - లోకం భాధ్యత గా.
Ii)
ఎందుకు?
దేవుడు ఇచ్చిన ఈ ప్రపంచం - లోకం అందరికీ చెందుతుంది. ప్రపంచం అందరి వల్ల.. అందరి శ్రమ - పని వల్ల నడుస్తుంది.. ముందడుగు వేస్తోంది.. అభివృద్ధి - అభ్యుదయం చెందుతుంది.. ఐశ్వర్యం పొందుతుంది. (ఏదో కొందరి వల్ల కాదు).
అందుకే!
Iii)
అందరూ ఓ రోజు పోయేదే. జీవితం శాశ్వతం కాదు. మరి ఎందుకు ఈ భేద భావాలు.. భూత సర్ప పైశాచిక తత్వాలు.. డాలర్ వ్యామోహం, డబ్బు దురాశ.
అందరూ సహృదులుగా, మంచి వారుగా జీవించాలి. అందరికీ ప్రగతి - సుఖ సంతోషాలు - ప్రగతి అభ్యుదయం అభివృద్ధి ఐశ్వర్యం సౌభాగ్యం కల్పించాలి. అదే నిజమైన ఉత్తమ మానవ జన్మ.
----------- చిన్న కథ - నీతి సమాప్తం -----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Comments