
Deepavali Wishes By manatelugukathalu.com
మనతెలుగుకథలు.కామ్ ని ఆదరిస్తున్న రచయితలకు, పాఠకులకు మా హృదయ పూర్వక అభివాదాలు.
దీపావళి రోజున అమావాస్య చీకటిని దీపాలతో పారద్రోలుతాము.
జీవితంలోని అజ్ఞానపు అంధకారాన్ని జ్ఞానపు జ్యోతులతో ఎదుర్కొమ్మని దీని అర్థం.
ఈ దీపావళి మీ ఇంట సకల శుభాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
కష్టాల చీకట్లు తొలగి మీ ఇంట ఆనందం వెల్లి విరియాలని ఆశిస్తున్నాం.
మీ సంస్థకి, సంపాదకులకు, ఉద్యోగులకు, సహ రచయితలకు దీపావళి శుభాకాంక్షలు 🌷
జ్ఞాన వెలుగులు పంచించే దివ్యమైన దీపావళి
ప్రతి ఇంట ప్రతి మనసులోనూ కాంతులీనుతూ
కన్నులు ఆనందాలమతాబులై
మనసులు చిచ్చుబుడ్డలై
ఆశలు తారాజువ్వలై
చెడుతలపులను భూ విష్ణు చక్రాలులాపారద్రోలుతూ
భయాలను బాంబులకు వదిలేసి
సీమటపాకాయిలులా మిడిసి పడకుండా
లక్ష్యం వైపు రాకెట్లులా దూసుకుపోవాలని
ఆనందాల దీపావళి ఆరోగ్య దీపావళి కావాలని ఆశిస్తూ...
సంపాదక వర్గానికి ,మేనేజ్మెంట్ కి, కవులకు రచయితలకు పాఠకులకుఅందరికీ దీపావళి శుభాకాంక్షలు
గోధూళి వేళ
దీపాల హేల
దివ్వెల సాక్షిగా
జువ్వల సాక్షిగా
నవ్వుల సాక్షిగా
దీపావళి శుభాకాంక్షలు
గౌరవనీయులైన మన తెలుగు కథలు యాజమాన్యం వారికి మరియు గౌరవ రచయితలకు మరియు అభిమాన పాఠకులకు మనః పూర్వక దీపావళి శుభాకాంక్షలు..
- వెంకు సనాతని