top of page

దీపావళి శుభాకాంక్షలు

Writer's picture: Ayyala Somayajula SubramanyamAyyala Somayajula Subramanyam

'Deepavali Subhakankshalu' - New Telugu Poem Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/11/2023

'దీపావళి శుభాకాంక్షలు' తెలుగు కవిత

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం

దీపేనసాధ్యతే సర్వం సంధ్యా

దీపం నమోస్తుతే.

పరబ్రహ్మ స్వరూపమైన దివ్య

జ్యోతికి నమస్కరించడం మన

సంప్రదాయం.దీపంలో సకల

దేవతలుంటారు.అందుకే మన

ధర్మం దీపారాధనకు అధిక ప్రాధాన్యతనిచ్చింది.అజ్ఞానమనే

చీకటిని తరిమికొట్టి జ్ఞానమనే వెలుగును పొందడమే దీపాలు

వెలిగించడము లోని పరమార్థం.

అసతోమా సద్గుమయ

తమసోమ జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతంగమయ.

ఈ ప్రార్థన వెనుక అసలు అర్థం

బతుకులు చీకటిని,జ్ఞానమనే

వెలుగుతో తరిమికొట్టడమే.

దీపం చీకటులను,చింతలను

కూడా తొలగిస్తుంది.దీపారాధనకు

అంతటి మాహాత్మ్యం ఉంది.

అలాంటి దీపారాధన చేసుకోవ

డానికి అనువైన కాలం కార్తీకమాసం

ఈమాసం హరిహరులిద్దరికీ ప్రీతి

పాత్రమైనది.వారిద్దరి అనుగ్రహం

పొందడానికి దీపారాధన చేయడం

శ్రేష్ఠం.దీపారాధన చేస్తే త్రిశక్తులను

పూజించినట్లే.అందుకని కార్తీక మాసమంతా ప్రమదలు మట్టి

ప్రమిదలతో దీపాలు వెలిగిస్తారు.

కావున ఇది దీపాలమాసం అను

కోవచ్చు.ఈమాసమంతా దీపారాధన చేసుకునే అవకాశం

కలగడం మన అదృష్టం.

అమావాస్య చీకటులను తొలగించి

వెలుగులు నింపడం ఎలాగో దీపావళి పర్వదినం మనకు చెబుతుంది.దీపావళి అంటే దీపాల

వరుస.అందుకే ఈ పండుగ రోజున

ఒకదీపం కాదు.అనేక దీపాలు వెలి

గిస్తారు.

సాయంసంధ్య వేళలో దీపాలు వెలి

గించి మహాలక్ష్మీ దేవిని పూజించిన

వారికి సకలసంపదలు కలుగు

తాయని బ్రహ్మ పురాణం చెబు

తోంది.అందుకే దీపాన్ని మహాలక్ష్మి

రూపంగా భావిస్తారు.

నిష్టగా దీపారాధన చేసే ఇంటిలో

లక్ష్మీదేవి నివాసముంటుంది.

కార్తీక, దీపావళి దీపాల కాంతులలో

మీ జీవితాలు మరింత ఆనంద

మయం కావాలని మనసారా

కోరుకుంటూ అందరికీ

"కార్తీకమాస,దీపావళి

శుభాకాంక్షలు ".

----

అయ్యలసోమయాజుల

సుబ్రహ్మణ్యము &

ఉదయసుందరి.

51 views0 comments

Comentarios


bottom of page