#దేశభక్తి, #Desabhakthi, #AnuradhaYalamarthy, #యలమర్తిఅనూరాధ, #TeluguStory, #తెలుగుకథ

Desabhakthi - New Telugu Story Written By Anuradha Yalamarthy
Published In manatelugukathalu.com On 19/03/2025
దేశభక్తి - తెలుగు కథ
రచన: యలమర్తి అనూరాధ
చార్మినార్ ముందు నిలబడి దాన్ని చూస్తుంటే ఇన్నాళ్ళ తన కల నెరవేరినట్లే అనిపించింది. ఎంత అరుదైన అపురూపమైన కట్టడం? ఎప్పటినుంచో దాన్ని తనివితీరా చూడాలని ఉబలాటం. చదువులకు ఫారిన్ వెళ్ళిపోవటంతో ఇప్పటికి ఈ నేలను ముద్దాడే అవకాశం దొరికింది. అమ్మ ఒడిలో ఓలలాడినట్లే ఉంది. ఎప్పుడూ నెట్ లో చూసి ఆనందించటమే. పుట్టటం పెరిగింది అంతా విదేశాలల్లోనే. ఈ ముచ్చట తీర్చుకోవటానికి పాతిక సంవత్సరాలు పట్టింది.
ఇక్కడంతా ఎంతో సందడి గా ఉంది. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండే ఈ స్థలం ఇప్పుడు ఇసుక వేస్తే రాలనంత జనసమూహంతో కిటకిటలాడుతోంది. ఈ మధ్యే ఎక్కడో చదివింది ఈ విషయం. ఎంత మంది ఉన్నా ఎవరూ లేనట్లే తన ఆలోచనల్లో తను ఉండటం తనకే విచిత్రంగా ఉంది.
రేపు సాలార్జంగ్ మ్యూజియం కి వెళ్ళాలి. ఒక రోజంతా చూసినా తనివితీరదట. పన్నెండు గంటలకు గడియారంలో బెల్ కొట్టటం అసలు మిస్ అవ్వకూడదని అమ్మ మరీ మరీ చెప్పింది. అలాగే బిర్లా మందిర్ కూడా. రాత్రిపూట వెన్నెల్లో ఎలా మెరిసిపోతుందో.. ఎంత చూసినా ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుందట. చెబుతుంటే వింటేనే ఇంత బాగుంది నిజంగా చూసినప్పుడు ఇంకెంత బాగుంటుందో! ఏదీ వదలకూడదు. ఇక్కడ ఉన్నవి అన్నీ చూసెయ్యాలి.
''ఈ రోజు ఇది ఉంది. రేపు ఇక్కడ ఏమీ కనిపించదు'' గుసగుసగా వినిపిస్తున్న ఆ మాటలకు అదిరిపడింది అపర్ణ.
వీళ్ళు దేని గురించి మాట్లాడుకొంటున్నారు? సందేహం రావటంతో ఇక వాళ్ళను, వారి మాటలను శ్రద్ధ గా వినటం ప్రారంభించింది.
వాళ్ళకు అనుమానం రాకుండా వాళ్ళను అనుసరించటం మొదలు పెట్టింది. ఇదేదో చాటుమాటు వ్యవహారం లానే ఉంది.
''హుష్! పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటివి మాట్లాడొద్దని ఎన్ని సార్లు చెప్పాను? వినవు కదా'' విసుక్కుం టున్నాడు ఇద్దరిలో ఒకతను.
ఇక నా అనుమానం రూడి అయిపోయింది. నా సందర్శనలను ప్రక్కన పెట్టి వీళ్ళ వెంటపడటమే పనిగా పెట్టుకోవాలని ఆ నిముషానే మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. మన సంపదను మనమే కాపాడుకోవాలిగా!
కాసేపు వాళ్ళు మౌనం పాటించారు.
అది తుఫాను ముందు ప్రశాంతతలా తన మనసును కలవరపరుస్తోంది.
వాళ్ళను అనుసరిస్తోందే కానీ మనసు మనసులో లేదు. అంటే వీళ్ళు చార్మినార్ ని కూల్చేద్దామనా అనుకునేది.. అది తలచుకుంటుంటేనే గుండె గుభేల్ మంటోంది. ఒళ్ళు గగుర్పు పుడుతోంది. తన గుండె చప్పుడు తనకే భయంకరంగా వినిపిస్తోంది.
వాళ్ళు నడక వేగాన్ని పెంచడంతో తన నడకను కూడా స్పీడు పెంచింది. తను ఇలా చెయ్యటం తప్పో ఒప్పో తెలియటం లేదు. మనసు చెప్పినట్లు ప్రయాణిస్తోంది. అంతే!
సందులు గొందులు తిరిగి ఒకింట్లోకి వారు ప్రవేశించటం చూసాక కానీ ఆమె మనసు శాంతించ లేదు. అప్పటి దాకా వాళ్ళు తనని గమనిస్తారేమో నని దూరం దూరంగా నడిచింది. ఇప్పుడు కాస్త ఉపిరి తీసుకునే సమయం దొరికినట్లయింది.
దగ్గరలో ఉన్న టీ కొట్టుకి వెళ్లి కూర్చుంది. అలవాటు ప్రకారం సర్వర్ టీ తెచ్చి ఇచ్చేసాడు. వేడి టీ గొంతులోకి దిగాక కానీ తన లోపల ఉన్న వణుకు తగ్గలేదు. ఇంకా కాళ్లు వణుకుతూనే ఉన్నాయి. టీ త్రాగుతూ చుట్టుప్రక్కల వాతావరణాన్ని గమనించసాగింది. బిజీ సెంటరే. కానీ ఎవరితో ఎవరికీ సంబంధం లేనట్లు ఎవరి పనుల్లో వారున్నారు. ఇప్పుడు జనాలకు డబ్బు సంపాదించుకోవటం తప్ప ప్రక్క వాళ్ళతో మాట్లాడాలనే ధ్యాసే ఉండటం లేదు. అలా ఉన్నారు మనుషులు. పోనీలే అదే మంచిది. అందువలనేగా ఇప్పటి వరకు తనని ఎవరూ పట్టించుకోలేదు.
కాస్త సమయం గడవటం వలన ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా అనిపించసాగింది. అయినా గుండెల్లో గుబులుగానే ఉంది. తను అనుసరించింది మాములు వ్యక్తులతో కాదు. ఆత్మాహుతి దాడిలో తమను తాము బలిచేసుకుంటూ వందల, వేల మంది ప్రాణాలతో చెలగాటమాడే ఉగ్రవాదులతో తను తలపడబోతోంది.
'అప్పుడే అంత ఊహించేసుకుంటావ్ ఎందుకని?' మనసు మందలించింది. తన కెందుకో పూర్తి నమ్మకంగా ఉంది వాళ్ళలాంటి వాళ్ళేనని. వాళ్ళకి దగ్గరలో తనకొక ఇల్లు దొరికితే బాగుంటుంది. ఈ విషయాన్ని తను అంత తేలికగా తీసుకోదలచుకోలేదు. ఒకవేళ తనది ఊహే అయితే అంత కంటే ఆనందం ఏముంటుంది? అప్పుడే ఈ విషయాన్ని సంతోషంగా మరిచిపోతుంది. ఇప్పుడు ఎవరినీ వాళ్ళ గురించి అడగలేదు. ఏ మాత్రం తన మీద అనుమానం వచ్చినా అసలుకే మోసం వస్తుంది. హ్యాండ్ బాగ్ లోంచి టీ కి డబ్బులు తీసిచ్చింది.
అప్పటికే వాళ్ళంతా ఎవరీ కొత్త అమ్మాయి అని చూపులతో సైగలు చేసుకోవటం గమనిస్తూనే ఉంది. ఆడపిల్ల అందులో అందమైనది.. ఆ మాత్రం టీ కొట్టులో పని చేసే వాళ్ళు పట్టించుకోవటం లో తప్పు లేదు. ముందు ముందు వీళ్ళతో తనకు పని పడినా పడవచ్చు. అయినా తనేమిటి ఏదో పెద్ద డిటెక్టివ్ లా ఆలోచించేస్తోంది. తన ఆలోచనలకు తనకే నవ్వు వస్తోంది. ఇంత హడావిడి లో కూడా.
ఇక వాళ్ళ ఆలోచనలకు తెరదింపెయ్యాలి అనుకుని నవ్వుతూ వారి వైపు చూస్తూ ''దగ్గరలో ఏమైనా ఇల్లు దొరుకుతుందా?'' అని అడిగింది.
''అదుగో ఆ పచ్చ బిల్డింగ్ ప్రక్క ఇల్లు ఖాళీనే. వెళ్లి కనుక్కోండి'' అన్నాడు టీ కొట్టు యజమాని.
జీవితంలో అంత ఆనందం ఎప్పుడూ పడలేదు. అంత సంతోషం ఎందుకంటే ఇందాక వాళ్ళు లోపలికి వెళ్ళిన ఇంటి ప్రక్క ఇల్లే ఇది. ఇంకేముంది ఉత్సాహంగా కాళ్ళు కదిలాయి. అక్కడకు వెళ్లి మాట్లాడింది. వాళ్ళు పెట్టిన షరతులు అన్నిటికీ తన అంగీకారాన్నితెలిపి అడ్వాన్సు ఇచ్చి ఇప్పుడే చేరిపోతానని చెప్పేసింది. తాళం కొనుక్కుని తెచ్చుకునే వరకూ మీవి వాడుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళింది.
వాళ్ళ కిటికీ తన కిటికీ ఎదురెదురుగా ఉంది. భలే బాగుందే అని అనుకునేలోపే వాళ్ళు వచ్చి కిటికీ తలుపులు వేసేసారు. కాస్త గమనించే సమయం కూడా ఇవ్వలేదు. ఇన్నాళ్ళూ ఎవరూ లేరని తీసి ఉంచారన్నమాట. అయితే తను ఉహించినదే నిజమన్నమాట. ఇక ఇప్పటికి చేసేదేమీలేదని నిశ్చయించుకుని బయట పడింది.
ఆ తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ గురించి, అక్కడ యస్ ఐ ఎలాంటివాడో కూడా ఎంక్వయిరీ చేసింది. ఈ మధ్య స్మగ్లర్లకు సహాయం చేసే పోలీసులు ఎక్కువై పోతున్నారు. అలాంటివారికి ఇన్ఫర్మేషన్ అందించటమంటే దొంగ చేతికి తాళాలు అందించినట్లే కదా! ఆమె ఎంక్వయిరీ లో అతను సిన్సియర్ అని తెలిసాక 'హమ్మయ్య !'అనుకుంది. లేదంటే ఏ ఆధారం లేకుండా ఏమిటిదని తనని ఇంటరాగేట్ చేస్తే తెలిసి తెలిసి చిక్కుల్లో పడినట్లు అవుతుందని ముందు జాగ్రత్త పడింది. అప్పుడు ఆయన్ని కలిసి ప్రొద్దున తను వచ్చిన దగ్గర నుంచీ జరిగినదంతా పూసగ్రుచ్చినట్లు చెప్పింది. మీకు చెబితే ప్రయోజనం ఉంటుందని చెప్పటానికి వచ్చాను. ''
''భలేవారే. ఇది మాకు మంచి ఇన్ఫర్మేషన్. ఇంతకు ముందే మాకు ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెతుకుతున్నాం కానీ ఏమీ జాడ తెలియటం లేదు. సరైన సమయంలో మీ సహాయం అందింది. అందుకు మీకే నేను థాంక్స్ చెప్పాలి''
''నేను అనుకున్నది కరెక్టో కాదో తెలియకుండా ఎలా నిర్ధారించుకోగలం సర్?'' అని అడగటంతో ఆతను నవ్వేస్తూ ''ఇప్పుడు మనకంత టైం లేదు మేడం, తీరిగ్గా అవన్నీ తర్వాత చర్చించుకుందాం. ముందు ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియాలి. ఆ పనిలో పడాలి" అంటూనే ఎవరికో ఫోన్ చేశాడు.
వెంటనే ఓ కుర్రోడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు.
''ఏమిటి సర్, పని పడిందా?'' అని అడిగాడు.
''అవునురా. చాలా అర్జెంట్. ''
''చెప్పండి సార్, అల్లుకుపోతాను. ''
బాబా టీ కొట్టు దగ్గరకు వెళ్లి అక్కడ పని లో చేరిపో. చొక్కానే చిం పేసుకుంటావో, ఏడుపు ముఖం పెడతావో నాకు తెలియదు. ఆ పచ్చ బిల్డింగ్ లో వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో, ఏంచేస్తున్నారో ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. అలాగే వాళ్ళు బయటికి వెళుతుంటే వెంటనే ఈ నెంబర్ కి కాల్ చెయ్యాలి. మిగతాది వాళ్ళు చూసుకుంటారు. ''
''అలాగేనండీ''అంటూ ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు.
''ఇక కంగారుపడవల్సింది ఏమీ లేదు అపర్ణ గారూ'' అన్నాడు రిలాక్స్ అవుతూ కృష్ణ కిరణ్.
''అంతా సవ్యంగా జరుగుతుందంటారా?''అనుమానంగా అడిగిన ఆమెతో
''క్లూ దొరకటం వరకే కష్టం. అది తెలిసిందంటే పనులు వాటంతటవే జరిగిపోతాయి. మనకు మంచి నెట్ వర్క్ ఉంది. దానిని ఉపయోగించుకుంటే చాలు. ''అన్నాడు ధీమాగా.
"అలా అయితే మంచిదే సార్ "అంది తృప్తిగా.
"అయినా ఈ మధ్య బెదిరింపులు ఎక్కువై పోయాయి. ఏదో వాళ్ళ అత్తగారి సొమ్ములా అన్నట్లు తిరుపతి కొండ మీద బాంబు వేస్తాం. భద్రాచలం రాముడి గుడి లేపేస్తాం అంటూ. మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా ఏమిటి? వాళ్ళ ఉద్దేశం ఏమిటో అర్ధం కాదు. అసలు కట్టడం ఎంత కష్టం?ఎంత డబ్బు, ఎంత మంది కూలీలు, ఎందరు శిల్పులు తమ శ్రమను ధారపోస్తే ఇవన్నీ మన కళ్ళముందు నిలబడ్డాయో ఎవరికీ అక్కరలేదు. "
అతని మాటల్లో ఎంతో వేదన.. గొంతులో స్పష్టంగా ధ్వనిస్తోంది.
"మీరు ఇక వెళ్లిపోవచ్చు. "
''వద్దు లేండి సార్. మళ్ళీ ఏ అవసరమైనా పడచ్చు. ఇక్కడే ఉంటాను. "
ఓ పౌరురాలిగా అలా ఆమె అంత భాద్యతగా వ్యవహరిస్తుంటే అతనికి ఎంతో ముచ్చటగా ఉంది. అందరూ అలా ప్రవర్తిస్తే దేశంలో ఇన్ని నేరాలే జరగవు'' అనుకున్నాడు మనసులో.
ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది.
"వాళ్ళు బయటికి వచ్చారు సర్. ఫాలో అవుతున్నాం. ఓవర్"
అవతల ఫోన్ కట్టయ్యింది.
"ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది మిస్ అపర్ణా! వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ వద్ద ఏ చిన్న ఆధారం దొరికినా వాళ్ళ పని మటాష్. "అన్నాడు పళ్ళు కొరుకుతూ.
"వీళ్ళకు ఇల్లు ఎలా ఇస్తారు సార్?"
"వీళ్ళ దగ్గర లెక్కలేనన్ని ఆధార్ కార్డులు ఉంటున్నాయి. ఎలా సంపాదిస్తున్నారో అర్ధం కావటం లేదు. మన యంత్రాంగం అంత వీకా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. "
"ఇప్పుడేం చేస్తారు? నాకంతా టెన్షన్ గా ఉంది. "
"రిలాక్స్ అపర్ణా!వాళ్ళ ఫోన్ టాప్ చేశారు మా వాళ్ళు. ఈ విషయం గురించి ఒక్కమాట మాట్లాడినా చాలు. వాళ్ళ పని అయిపొయినట్లే"
మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది.
"వాళ్ళు ఒక్కచోట కాదు. మన రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకేసారి బాంబులు పేలేటట్లు ప్లాన్ చేసారు. అందులో మన బిర్లామందిర్, ట్యాంక్ బండ్, బాసర, భద్రాచలం గుడులు.. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇక మనం ప్రొసీడ్ అవటమే! మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం"
"ఓ. కే. ప్రొసీడ్. కానీ వాళ్లకు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. వాళ్ళు రూమ్ కి రాగానే నాకు ఫోన్ చెయ్యండి. పబ్లిక్ లో పట్టుకుంటే వాళ్ళ వాళ్ళు మన మీద అటాక్ చెయ్యవచ్చు. మీ కాల్ రాగానే నేనూ, మన సిబ్బంది అక్కడకు వచ్చేస్తాం "
"అపర్ణా!పదండి. మనం మీ రూమ్ కి వెళ్లి అక్కడ వెయిట్ చేద్దాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యటానికి వీళ్ళేదు. " అంటూనే లోపలికి వెళ్లి నిముషంలో బయటికి వచ్చాడు ముస్లిం వేషంలో.
''పదండి'' అని అతను అనే వరకూ ఆమె గుర్తుపట్టలేదు అతనే కృష్ణ కిరణ్ అని.
ఆటోలో బయలుదేరారు.
''వాళ్ళకు గానీ, వాళ్ళ వాళ్లకి కానీ ఏ మాత్రం అనుమానం వచ్చినా మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది కదండీ.. అలాంటప్పుడు మనం రూమ్ దగ్గరకు వెళ్ళటం కూడా మంచిది కాదేమో? "
"అబ్బో!కాసేపు ఉన్నావో లేదో అప్పుడే నీకు మా బుద్దులు అబ్బేసాయి. " అని నవ్వేస్తూ "మనం ఆ సందు దగ్గరే ఉంటాం కానీ అక్కడకు వెళ్ళం" అన్నాడు.
టీ కొట్టు బాబ్జీ కి ఫోన్ చేసాడు. "వాళ్ళు రాగానే ఎప్పుడూ మీరు పంపే అబ్బాయితోనే టీ పంపండి. కాకపొతే మా వాడు ఇచ్చే మత్తు మందు అందులో కలపండి. "
''అలాగే సర్ "అన్నాడు ఉత్సాహంగా.
తనూ ఈ ఆపరేషన్ లో భాగమవుతున్నానన్న ఆనందం అతని మాటల్లో కనిపిస్తోంది.
అంతా అనుకున్న ప్రకారమే జరిగింది.
కాసేపటి తర్వాత వెళ్లి తలుపులు బ్రద్దలు కొట్టి వాళ్ళిద్దరిని కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్ళతో చేతుల్ని, కాళ్ళని కట్టేశారు. ఆ తర్వాత నీళ్ళు జల్లి మత్తు విడకొట్టారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా పెదిమ విప్పితే ఒట్టు.
వాళ్ళ దార్లు వాళ్లకు ఉంటే మన దార్లు మనకి ఉంటాయి.
వాళ్ళ సెల్ లోంచి వాళ్ళు మాట్లాడినట్లే మాట్లాడటంతో గుట్టు రట్టు అయ్యింది. మిమిక్రి అలా ఉపయోగపడింది. కథ సుఖాంతమయ్యింది. నిజంగానే అన్నంత పని చేసి చూపించాడు కృష్ణ కిరణ్.
మొత్తం ముఠా అంతటిని ఆరు గంటల్లో పట్టేసాడు.
రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచీ కాపాడాడు. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ ముఠా సభ్యులు అందరూ బయటకు వచ్చారు ఈ దెబ్బతో తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు.
అప్పటిదాకా వెళ్లిపొమ్మన్నా వెళ్లనని అక్కడే ఆ రూమ్ లోనే ఉంది అపర్ణ.
ఆమె దేశభక్తికి అచ్చెరువొందాడు కృష్ణ కిరణ్.
టీ వీ లు అన్నీ అపర్ణను ఆకాశానికి ఎత్తేసాయి. ఇదంతా ఆమె చొరవ వల్లే జరిగిందని అందరూ కొనియాడారు.
ముఖ్యమంత్రి శ్రీ గుణశేఖర రావు ప్రత్యేకంగా ఆమెను పిలిచి సన్మానించారు.
''మీకు ఆ సమయం లో భయం వేయలేదా?'' అన్న విలేఖర్ల ప్రశ్నకు "మన చార్మినార్ ని కాపాడుకోవటానికి నా ప్రాణం పోయినా పర్వాలేదనుకునే నేను ఈ రంగంలోకి దిగాను''' అని ఆమె చెప్పటం తో అక్కడ అంతా చప్పట్లు మారుమ్రోగాయి.
దీనితో ప్రతి వ్యక్తీ దేశం పట్ల భాద్యతతో వ్యవహరించాలని అందరికీ భోధపడింది.
సమాప్తం
యలమర్తి అనూరాధ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : యలమర్తి అనూరాధ
విద్యార్హత : బి.యస్సీ.హోం సైన్స్
ఫుట్టిన గ్రామము : ముదునూరు (క్రిష్ణా జిల్లా)
స్వగ్రామము : కైకలూరు (క్రిష్ణా జిల్లా)
తండ్రి : లక్కింశెట్టి శ్యామల క్రిష్ణ మోహన రావు
తల్లి : లక్కింశెట్టి సీతారావమ్మ
సాహిత్యపు వయసు : 45 సంవత్సరాలు
చదువు : 6-10జిల్లా పరిషత్ బాలికల హైస్కూలు,శ్రీకాళహస్తి
ఇంటర్-యస్.వి.ఎ. గవర్నమెంట్ కాలేజీ,శ్రీకాళహస్తి
డిగ్రీ-సెంట్ ధెరిసా కాలేజీ,ఏలూరు
తొలి ప్రచురణ : 1973- కాలేజీ మాగజైన్ -దండిద్దాం !దండిద్దాం !-కవిత
St . theresa కాలేజీ మాగజైన్ -స్నేహం -కవిత
పత్రికా ప్రచురణ : 1978 ఆంధ్ర పత్రిక (దిన) రాధిక, కవిత
ఆకాశవాణి(AIR) : 1980 నుంచి ఇప్పటివరకు - కథ, కవిత, వ్యాసాలు,నాటికలు,టాస్క్,humerous స్కెచ్ , ల రూపాలలో ..
దూరదర్శన్ : మహిళా కవి సమ్మేళనం (అమ్మ మనసు),ఉగాది కవిసమ్మేళనం
బుల్లి తెర : ఈ టి వి టు- 'సఖీ’ లో ఎనిమిది ప్రోగ్రాంస్
అవార్డ్స్ : 50 కి పైగా
ఒకే సంవత్సరంలో ఐదు ప్రభుత్వ అవార్డు
1.రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఉత్తమ సాహితీవేత్త అవార్డు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా
2. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పై సందర్భంగా అభినందన సభ
3. గుర్రం జాషువా అవార్డు- డాక్టర్ అంబేద్కర్ యువజన సాంస్క్రతిక సమాఖ్య, విజయవాడ
4. సోమేశ్వర సాహితీ అవార్డు--సాహిత్య సేవా సమితి ట్ర స్ట్, విశాఖపట్నం
5. కళ్యాణ సాహితీ అవార్డు,విజయవాడ
6. నిధి అవార్డు, దేవి ఫౌండేషన్,విజయవాడ
7. లక్కోజు దుర్గాచార్యుల వారి అవార్డు,విజయవాడ
8. బూర్గుల రామక్రిష్ణారావు గారి అవార్డు, హైదరాబాదు
9. సావిత్రి అవార్డు,కొత్తపేట
10.వేలూరి పాణిగ్రాహి అవార్డు,విజయవాడ,
11.కొనకళ్ళ వెంకటరత్నం అవార్డు,ఏలూరు
12. సోమేపల్లి అవార్డు,నర్సాపురం
13.మక్కెన రామసుబ్బయ్య అవార్డు ..
14. వాకాటి పాండురంగారావు అవార్డు ..
15. దాశరధి రంగాచార్య అవార్డు
16. రావూరి భరద్వాజ అవార్డు
మొ || 50 దాకా
జాతీయ అవార్డు :
సాహితీ జ్యోతీరత్న అవార్డు - కంకణాల జ్యోతీరత్న చారిటబుల్ ట్రస్ట్ ,వరంగల్
పురస్కారాలు :
1. కృష్ణా జిల్లా, జిల్లా సాంస్కృతిక మండలి, మచిలీపట్నం--ప్రభుత్వ పురస్కారం ఉగాది నాడు---2సార్లు
2. జిల్లా సాంస్కృతిక మండలి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ ఉగాది పురస్కారం--2సార్లు
3.మాడుగుల నాగ ఫణిశర్మ గారితో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షెత్రం లో తెలుగు పండుగ సందర్భంగా కవి పురస్కారం
4.కృష్ణ మహోత్సవం, విజయవాడ -- ప్రముఖ మహిళా రచయిత్రులు - పాటిబండ్ల రజని, నిర్మల తదితరులతో మహిళా కవి సమ్మేళనం, సత్కారం
5. అభ్యుదయ వేదిక, నాగాయలంక--ఉగాది పురస్కారం
6. దేవీ, విజయవాడ --ఉగాది పురస్కారం
7. విజ్ఞాన వేదిక, ఉండి -- ఉగాది పురస్కా రం
8. విజ్ఞాన వేదిక, భీమవరం -- ఉగాది పురస్కారం
9. శ్రీ గోపీకృష్ణ కళా పరిషత్, నూతలపాడు వారి ద్వారా`విశిష్ట రచయత్రి’గా
10. యస్.వి.కె.పి. కాలేజ్. పెనుగొండ వారి ద్వారా`గౌరవ అతిథి’గా పురస్కారం --'మహిళా దినోత్సవం' సందర్భంగా
11. తణుకు--కళాంజలి వారిచే రచయిత్రి పురస్కారం
12. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయం,తణుకు వారిచే రచయిత్రి పురస్కారం
13. వైశ్యా బ్యాంకు ,విజయవాడ వారిచే ఉగాది పురస్కారం
14. అభ్యుదయ రచయితల సంఘం ,జంగారెడ్డిగూడెం వారిచే ఉగాది పురష్కారం
15. భారత్ వికాస్ పరిషత్ ,విజయవాడ వారితో ఉగాది పురష్కారం
16. అభ్యుదయ రచయితల సంఘం,తణుకు వారితో ఉగాది పురష్కారం
17.ఇన్నర్వీల్ క్లబ్ వారితో మహిళాదినోత్సవం సందర్భంగా పురష్కారం
18.నన్నయ్య భట్టారకఫీఠం,తణుకు వారితో ఉగాది పురష్కారం
19.ఎక్స్ రే పురష్కారం,విజయవాడ
20. వాసవీ క్లబ్ ,భవానీపురం వారితో రచయిత్రిగా పురష్కారం మొదలైనవి
21. ఉగాది పురష్కారం -10,116రూ .లు జిల్లా కలెక్టర్ గారితో సన్మానం-ఏప్రిల్ 2016.
22. కృష్ణా పుష్కరం - కవి పురష్కారం . రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ,రాజమండ్రి
23. ప్రపంచ కవితా దినోత్సవం - ప్రభుత్వ కవి పురష్కారం మంత్రి పల్లె రఘునాధ . రెడ్డి గారితో ,విజయవాడ
24. రచయిత్రి పురష్కారం - గ్రంధాలయ వారోత్సవం ,గాయత్రినగర్ ,హైదరాబాద్ . 25. ప్రభుత్వ కవి పురష్కారం - తెలంగాణా ప్రపంచ మహా సభలు ,హైదరాబాద్ .
26. సుచిత్ర ఫౌండేషన్ &గజల్ లోగిలి ,హైదరాబాద్ -కవి పురష్కారం
27. బి. ఎస్ . రామకృష్ణ మిత్రమండలి ,హైదరాబాద్ -కవిపురష్కారం
28 . స్పందన టీం ,హైదరాబాద్ - ఉగాది పురస్కారం
29. అస్తిత్వం ,హైదరాబాద్ -కవి పురస్కారం
30. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం -నెల్లూరు
31. షిర్డీ కవితోత్సవం -కవి పురస్కారం
32. మేడ్చెల్ రచయితల సంఘం -కవి పురస్కారం
33. తానా (అమెరికా ) - కవి పురస్కారం . మొ ||
34. పారడైస్ పీ.జీ.యూనివర్సిటీ పురస్కారం
35. తెలంగాణా జాగృతి పురస్కారం
సభా కార్యక్రమాలు :
ముఖ్య అతిథిగా :
1. శ్రీ మొగుళ్ళూరి వెంకట పేరయ్యగారి అభినందన సత్కార సభ --శ్రీ తేలప్రోలు
రాజా హైస్కూలు పూర్వవిద్యార్థి సంఘం, విజయవాడ.
2. శ్రీ వాసవి క్లబ్, భవాని పురం, విజయవాడ
3. బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్,తెలుగు పండుగ, భీమవరం.
4. జిల్లా గ్రంధాలయం ,తణుకు
5.చైతన్య స్కూల్ వార్షికోత్సవం,తణుకు
6. రేడియో టోరీ -telugu one.com-26-1-2019.
ఆత్మీయ అతిధిగా :
1. వై యం జి మ్యూజిక్ అకాడమీ 2 వ వార్షికోత్సవం,హైదరాబాద్
2. ఇంటర్ నేషనల్ వాసవీ సేవా సమాఖ్య ,హైదరాబాద్
3. ఇండస్ట్రీ షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో ,రవీంద్రభారతి ,హైదరాబాద్
4. Unique pre school - mee &mom food festival celebrations
ప్రధానవక్తగా:
1. సాహితీమిత్రులు, కైకలూరు, 2002 ఉగాది
2.ఇన్నర్ వీల్ క్లబ్, పెనుగొండ,మహిళాదినోత్సవం
3.సాహితీ సంస్థ ,తణుకు
4. జిల్లా గ్రంథాలయం,తణుకు
5. బ్రౌనింగ్ జూనియర్ కాలేజీ ,భీమవరం
కవి సమ్మేళనాలు:
నిర్వహణ:
1. హనుమంతరాయ గ్రంథాలయం, విజయవాడ, 1994.
2. బెజవాడ యువకలాలు, 2002.
3. ఆంధ్ర రచయిత్రుల ప్రధమ మహా సభలు -కవిసమ్మేళనం అధ్యక్షత
పాల్గొనటం :
200కి పైగా
ఆహ్వానం:
1. తానా అమెరికా వారు, స్పెషల్ గెస్ట్.
2. లక్నో జాతీయ కవి సమ్మేళనం , ప్రభుత్వ యువజన శాఖ.
3. ప్రపంచమహా సభలు . గెస్ట్ గా .. తిరుపతి-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
4. ప్రపంచ మహా సభలు -కవియిత్రుల సమ్మేళనం -తెలంగాణా ప్రభుత్వం
ఇంటర్వూస్ :
ఆకాశవాణి ,మార్కాపురం
డీడీ-8 సప్తగిరి -నేనూ -నా రచనలు
మారిషస్ తెలుగు తల్లి ప్రేమ
పత్రికా ప్రచురణలు:
1. కథలు (200 కి పైగా}
2. కవితలు (500 కి పైగా)
3. వ్యాసాలు (500కి పైగా)
4.నవల -పచ్చబొట్టు-ఆంధ్రభూమి దిన పత్రిక -సీరియల్ గా వచ్చింది.
5. 'విలువల లోగిలి 'ఆంధ్రభూమి ,దినపత్రికలో సీరియల్ గా ప్రసారం అవుతోంది.
ప్రచురింపబడిన పత్రికలు:
ఆంధ్ర భూమి, దిన, వార, మాస పత్రికలు, స్వాతి, ఆంధ్ర జ్యోతి,వనితా జ్యోతి, సుమన, అంజలి, వార్త, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక,నేటి నిజం, త్రికాలాలు, విశాలాంధ్ర, ఆంధ్ర ప్రదేశ్, భావ తరంగిణి, రచన,కధాకేళి,ప్రహేళిక, విజ్ఞాన సుధ, గ్రంథాలయ సర్వస్వం, మల్లెతీగ,రమ్యభారతి ,హెల్త్ -హెల్ప్ స్వర్ణాంధ్ర, సువర్ణలేఖ,భక్తిసుధ,,వండర్ వరల్డ్, ధ్యానమాలిక,చతుర, నవ్య, ప్రజా డైరీ, నెలవంక- నెమలీక,సాహితీకిరణం మొదలైనవి
నిర్వహించిన శీర్షికలు :
1. మనస్విని- వనితాజ్యోతి[ సైకియాట్రిక్ స్టోరీస్]--15నెలలు
2. నేస్తం, వార్త, చెలి -- 19 వారాలు
3. సంసారంలో సరిగమలు--వండర్ వరల్డ్ --17 సం,,లు
4. కవితాసుమాలు--స్వర్ణాంధ్ర--50 కవితలు
5. వ్యాసావళి -- స్వర్ణాంధ్ర -- 116 వ్యాసాలు
6. జీవన జ్యోతి -హెల్త్ హెల్ప్ పత్రిక -- 12 నెలలు
7. ఆలోచిద్దాం -- ఆంధ్ర ప్రదేశ్ -- 3 నెలలు
8. మేలుకో, తరుణి, ప్రజా డైరీ, బళ్ళారి, (కర్ణాటక),
నిర్వహిస్తున్న శీర్షికలు :
కొత్త బంగారు లోకం, వండర్ వరల్డ్--విజయవాడ
మొగుళ్ళందు పుణ్య పురుషులు వేరయా -వండర్ వరల్డ్ -విజయవాడ
పుస్తక ప్రచురణలు :
1. వెజిటేరియన్ వంటకాలు -- విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ
2. చిట్కాల పుస్తకం, ఋషి పబ్లికేషన్స్, విజయవాడ
3. సంసారంలో సరిగమలు, గొల్లపూడి, రాజమండ్రి
4. ప్రేమ వసంతం, నవల
వండర్ వరల్ద్ అనుబంధ పుస్తకాలు :
1. మీ పిల్లలు సూపర్ కిడ్స్ లా కీర్తింపబడాలంటే
2. ఇల్లాలు తలుచుకుంటే ఇల్లంతా స్వర్గధామమే
3. బేబీ కేర్ టిప్స్
4. డెకరేషన్
5. నిరుద్యోగ యువతకు దోసె క్యాంప్
6. సర్దుకుపోండి
7. సమస్య - స్పందన
8. విలువలు
కవి పరిచయాలు:
వార్త, విజేత, ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్, భావ తరంగిణి, సాక్షి, ఆంధ్ర జ్యోతి, విశాలాంధ్ర 64 కళలు com ,నవతెలంగాణా లలో ప్రచురింపబడ్డాయి.
నూరేళ్ళ దళిత సాహిత్య ప్రస్థానం -26&27 nov.2010.s.v.k.p.&Dr.k.s.raju ARTS&SCIENCE COLLEGE,పెనుగొండ .
గోదావరి జిల్లాల రచయితలు - సాహిత్యం . 19,20 sep 2015.పెనుగొండ
నాటకం .స్త్రీ పాత్రలు s.v.k.p.&Dr.k.s.raju ARTS&SCIENCE COLLEGE,పెనుగొండ .
రికార్డ్స్ : 1 . తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్
2. బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్
3. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్
4. ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్
సీరియల్ : పచ్చబొట్టు -ఆంధ్రభూమి దిన పత్రిక -52 ఎపిసోడ్స్
బిరుదు : సాహితీరత్న -విజ్ఞానవేదిక ,శ్రీకాళహస్తి
సాహితిరత్న -భారతీయ సాహిత్య అకాడమీ ,ఖాజీపేట
సమాజ సేవ :
సృజనా మహిళా మండలి అధ్యక్షురాలు, మార్కాపురం.
ఆశ్రిత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షురాలు.-2012 - గత 6 సం \\లు గా సమాజసేవ
పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం,తణుకు అధ్యక్షురాలు
పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఏలూరు
జిల్లా గ్రంధాలయం ఎగ్జిక్యూటివ్ మెంబరు, పెనుగొండ
జిల్లా గ్రంధాలయం,మహిళాప్రతినిధి, తణుకు
మరచిపోలేని అనుభూతులు:
1. 'మంచి వ్యక్తిత్వం మనిషికి ఉండాలి ' వ్యాసం చదివి ఆరేండ్లుగా మాట్లాడుకోని తండ్రీ కొడుకులు కలవటం
2. ' ఫ్యామిలీ ఒక పూలతోట ' వ్యాసం చదివి 'ఈవిడ కౌన్సిలింగ్ ఇస్తే ఏ జంటా విడాకులు తీసుకోదు ' అని విజయవాడ లోని ఓ జడ్జిగారి ప్రశంస
3. ' మనిషి - మనిషి ' వ్యాసం చదివి ఆరేండ్లుగా విడాకులు తీసుకుంటామని చెబుతున్న ఓ జంట ' మేము విడిపోము, కలిసే ఉంటాము ' అని చెప్పటము.
4.యువతా నీ పయనం ఎటు ?అనే వ్యాసం చదివి ఓ యువకుడు రహస్యం గా తన స్నేహితుడికి చేస్తున్న పెళ్లిని ఆపటమే గాక ఇద్దరూకూడా తల్లి తండ్రులకు చెప్పి,ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటామని నిర్ణయించుకున్నా రు.
5. ‘సర్దుకుపొండి’అనే అనుబంధ పుస్తకం చదివి స్నేహితులు లేని తనకు చుట్టుప్రక్కల అందరూ స్నేహితులుఅయ్యారని ,ఎప్పుడూ కొట్టుకునే అత్తా కోడళ్ళు కూడా కొట్టుకోవటం మానేసారని ,అదంతా మీ పుస్తకం చదివించటం వల నే జరిగిందని ఓ అభిమాని ఆనందంగా చెప్పటం .
6. ఆదివారం వార్త లో వచ్చిన `మేమింకా ప్రేమపావురాలమే `అనే వ్యాసం చదివి
విజయవాడ కెనడీ హై స్కూల్ ప్రిన్సిపాల్ `ఈ వ్యాసాన్ని ఫొటోస్టాట్ తీసి ఇంటింటికి పంచిపెడితే సంసారాలు బాగుపడతాయని అనటం .
7.నా నవల `ప్రేమవసంతం `చదివి రామాయణం లా ఇంటింటా ఉండాల్సిన పుస్తకం అని పలువురు కొనియాడటం .
8.` పచ్చబొట్టు` నవల చదివి మరో యద్దనపూడి నవల చదివినట్లున్నదని ప్రశంసను పొందటం
సాహిత్య ప్రేరణ:
1. ప్రకృతి, కాసా గార్డెన్స్, శ్రీ కాళహస్తి లో బాల్యం రుచి చూడటం
2. ఆడపిల్లననే భావన రానీయక ప్రతి అంశాన్ని పరిశీలించే సహకారాన్ని అందించిన తల్లితండ్రులు
3.ఖాళీ సమయం అంతా పుస్తకాలు చదవటానికే కేటాయించటం .
.
సాధించినవి:
దేశ విదేశాలలో అభిమానులు
లక్ష్యాలు :
సామాజిక స్పృహ ఉన్న రచనలు చేయటం
సమాజంలో ఉన్న వ్యక్తులలో మార్పుకై కృషి చేయటం
స్త్రీలల్లో చైతన్యం తీసుకురావటం
నవలా రచయిత్రిగా స్థిరపడటం
గీత రచయితగా వెలుగొందటం
అలవాట్లు:
చదవటం, వ్రాయటం, సభా కార్యక్రమాలలో పాల్గొనటం
అభిమానుల సమస్యలను పరిష్కరించటం
ఉద్యోగ అనుభవం:
విజయవాడలోని శ్రీ తేలప్రోలు రాజా ఇంగ్లీషు మీడియం హైస్కూలులో ఆరేండ్లు టీచరుగా అనుభవం .
జీవిత భాగస్వామి:
శ్రీ యలమర్తి శ్రీ రామ చంద్ర వర ప్రసాద రావు, బి.కాం
జీవితంలోనే కాక సాహిత్యంలో కూడా సగ భాగమై ప్రోత్సాహాన్ని అందించే శ్రీవారు దొరకటం .
పిల్లలు:
యలమర్తి అన్వేష్. బి..టెక్., సాఫ్ట్ వేర్ ఇంజనీర్
యలమర్తి మానస లక్ష్మి, బి.టెక్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్
Comments