'Desam Kosam' - New Telugu Story Written By Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 22/06/2024
'దేశం కోసం' తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చైనా తో యుద్ధము జరుగుతున్న రోజులు. దేశమంతా యుద్ధవాతావరణము నెలకొంది. రాజు రెండు నెలల సెలవలు గడిపేందుకు ఇంటికి వచ్చాడు. మిలిటరీ యూనిట్ నుంచి ‘రాజూ! నీవు వెంటనే వచ్చి డ్యూటీ లో చేర’మని టెలిగ్రామ్ వచ్చింది..
మానాన్న యుద్దానికి వెళ్తున్నారని పిల్లలు వాళ్ళకి తెలుసున్నవారందరకి చెప్పారు.
రాజుకు దేశానికి సేవ చేసే అవకాశము వచ్చిందని తల్లితండ్రులు, శ్రీమతి కి తెలిసిన తర్వాత వాళ్ళు ఉత్సాహముగా ఉన్నా వాళ్ళకళ్ళలో భయము కనిపించింది.
“మీకు ఏదయినా అభ్యన్తరమయితే చెప్పండి, నేను ఏదో సాకు చెప్పి మానేస్తాను” అన్నాడు.
“మాకు ఎటువంటి ఆలోచన లేదు, మీరు దేశము కోసము యుద్దానికి వెళ్ళడము మానేస్తే మన మాతృ భూమికి ద్రోహము చేసిన వారవుతారు. మీలాగే సైనికులు వెనకడుగు వేస్తే మరలా మనము బానిస జీవితము అనుభవించ వలసి వస్తుంది.
బ్రిటిష్ వారిని ఎదురించి, అహింసామార్గములో స్వాతంత్రము సంపాదించాము. ఈ సందర్భముగా ఎంతోమంది సమరయోధులు అసువులు బాసారు. ఎట్టి పరిస్థితుల లోను మాతృ భూమికి హాని కలుగకూడదు” అని హితవు పలుకుతుంది భార్య వాణి.
“నా మనసిప్పుడు హాయిగా ఉంది వాణి” అని అంటాడు రాజు.
మరుసటి రోజు వాణి తమ్ముడు, రాజు అన్నయ్య దంపతులు, రాజు యుద్దానికి వెళ్తున్నాడని తెలిసి చూసేందుకు వస్తారు.
మిలిటరీ యూనిట్ నుంచి రాజు కి ఇంకో టెలిగ్రాము వస్తుంది.
“రాజు.. నీకు సోమాలియా దేశానికి వెళ్లే అవకాశము వచ్చింది. వెంటనే రావలెను” అని సందేశము.
ఇంట్లో ఉన్న సభ్యులు రాజు ని యుద్దానికి బదులు సోమాలియా వెళ్ళమని సలహా ఇస్తారు. వాణి మరియు రాజు తల్లి తండ్రులు నీకు ఏది మంచిదని అనుకుంటే అదే చేయమని సలహా ఇస్తారు.
రాజు మిలిటరీ యూనిట్ లో రిపోర్ట్ చేస్తాడు. కమాండింగ్ ఆఫీసర్ రాజుని అడుగుతాడు “నీవు యుద్ధము చేసేందుకు బోర్డర్ కి వెళ్తావా లేక సోమాలియా వెళ్తావా. ఛాయస్ నీది” అంటాడు ఆఫీసర్
“సార్! దేశానికి సేవచేయాలి అనే ఉద్దేశముతో సైన్యములో చేరాను. అదే ప్రధమ కర్తవ్యముగా భావిస్తాను. విదేశాలకు వెళ్లే అవకాశము రాబోయే రోజుల్లో రావచ్చు, మాతృ భూమికి సేవ చేసే అవకాశము ఎంతో అదృష్టముగా భావిస్తాను. మీరు నన్ను బోర్డర్ కి పంపమని కోరుతున్నాను” అని రాజు తన అభిప్రాయము చెప్తాడు.
దేశము కోసము యుద్ధ భూమిలో వీరోచితముగా పోరాడి అమరుడవుతాడు.
రాజు అసువులు బాసాడు అనే విషయము తెలిసిన తర్వాత కళ్ళలో నీళ్లు బయటకు రాకుండా పిల్లలకి ధైర్యము చెప్పింది వాణి.
కేంద్ర ప్రభుత్వము వాణి కుటుంబానికి అన్నివిధాలా సహాయము చేసింది.
--------------------------------------------------------------------------------------------------------------------------
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Commenti