'Devudunnadu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally
'దేవుడున్నాడు' తెలుగు కవిత
రచన: సుదర్శన రావు పోచంపల్లి
ఎక్కడ ఎక్కడ దేవుడని
ఎకసక్కాలాడకు
నీలోనే ఉన్నాడు కాస్త
మేలుకొని చూడు మరి
కనబడలేదని దేవుడు
మనసులోన గూడ లేడనుకోకు
నొప్పి నీకు కనబడదు
తప్పునా ఆ బాధ నీకు
చీకటే లేదనినప్పుడు
వెలుతురునకు ప్రాముఖ్యముండునా
ఉన్నడనే నమ్మకం ఉదయించినప్పుడే
లేడనే నినాదం లేవదీయుచుందురు
పసిబిడ్డ పుట్టగానె
పాలకొరకు వదకును
ప్రకృతి మాయలోన
మనమంతా పసివాళ్ళమె
దేవుడెక్కడని దేవురించు మనసంత
సృష్టి అంతా చీకటి మయం అది నిజం
ఆ చీకటిలో కనిపించుటకు
తోడ్పడు ఆ వెలుతురె దేవుడు
నీలోనే ఉన్నాడు దేవుడు
నీ చేరువలోనె ఉన్నాడు దేవుడు
తెలిసిన మార్గం నమ్మలేక
తెలువని త్రోవలు వెదుకబోకు
పలుతీరులు తిరిగిన ఫలితమేమి
ప్రాణమంటె దేవుడు కదలికంటే దేవుడు
ప్రకృతి వింతలకు
పరమాత్మయె కారణమ్ము
మిణుగురు పురుగులోన
మినుకుమనును వెలుతురు
ఆ వెలుతురెక్కడిదో ఆలోచన చేస్తివా
ఆ శక్తియె దేవుడు ఆ యుక్తియె దేవుడు
అయస్కాంత శక్తిలోన
ఆకర్షణ వికర్షణలు అణిగియుండు
ఇనుము చెంత చేరగానె
ఇనుమడించు దాని శక్తి
ఇనుములాంటి దృఢత్వం
మనలోన ఉన్నప్పుడు
అయస్కాంతమను దేవుడు
ఆకర్షించును మన మనసును
పంచేంద్రియ జ్ఞానమైనా
పంచాంగ పరిజ్ఞాన మైనా
నిక్కముగా భగవంతుని మాయయె
ఆ దేవుడె లేకుంటె
ఈ జీవుడు మనగలుగునా
నీటిలోన గాలి లోన
నీ లోన నా లోన
ఎక్కడైనా దేవుడు
నిక్కముగా ఉన్నాడు ---
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments