దెయ్యాల నౌకలు
- Mavuru Vijayalakshmi
- Mar 10, 2023
- 3 min read

'Deyyala Noukalu' New Telugu Article
Written By Mavuru Vijayalakshmi
'దెయ్యాల నౌకలు' తెలుగు కథ
రచన: మావూరు విజయలక్ష్మి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఘోస్ట్...” “దెయ్యం...” చాలామందిని అట్రాక్ట్ చేసే మాట. ఆ... ఈ
రోజుల్లో ఇంకా దెయ్యాలెంటి... ట్రాష్ అనుకుంటాం. కానీ కొన్ని సంఘటనలు
విన్నపుడు మాత్రం ఖచ్చితంగా ఇవి నిజమే! అని నమ్మకతప్పని పరిస్థితి
ఉంటుంది.
దెయ్యాల భవనాలు, దెయ్యాల కోటలు, దెయ్యాల గ్రామాలు ఇలా దెయ్యాలకు
సంబంధించిన చాల విషయాలు వింటూ ఉంటాం. అలాగే దెయ్యాల నౌకలు కూడా ఉన్నాయి.
అలాంటి దెయ్యాల నౌకల రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతమంది ఎన్ని పరిశోధలను
చేసినా వాటి రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అవన్నీ మిస్టరీగానే
మిగిలిపోయాయి. అలాంటి మిస్టరీ దెయ్యం నౌకల గురించి తెలుసుకుందాం.
టి.టి జియాన్
అది 2012... తూర్పు లాస్ ఒలాస్ బౌలివార్డ్‌లోని ఫోర్ట్ లాడర్ డాల్
బీచ్‌లో 31 అడుగుల సెంటర్ కన్సోల్ జూపిటర్ అనే బోట్ ఒంటరిగా తిరుగుతూ
చాలామందికి కనిపించిందట. పట్టపగల్ని తలపించేలా లైట్లు వెలుగుతున్నాయి.
ఇంజన్ కూడా ఆన్ లోనే ఉంది. ఇంకా విచిత్రమేమిటంటే ఇందులో మనుషులెవరూ
కనిపించలేదు. చివరికి బోట్ ను నడిపే కెప్టెన్ కూడా లేడు. మరి ఎవరూ
లేకుండా, ఎవరూ నడపకుండా ఆ బోట్ ఎలా నడుస్తోంది? ఎన్ని పరిశోధనలు చేసినా,
ఈ నౌక దానంతటదే ఎలా నడుస్తోంది అన్నది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది.
దాంతో ఇది దెయ్యాల బోట్ గా స్థిరపడిపోయింది.
ఎస్.వి. లునాటిక్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రాన్ని చుట్టేయాలనే కోరికతో ఉన్న 70
సంవత్సరాల వయస్సున్న జురి స్ట్రెక్ అనే వ్యక్తి 2007 లో ఈ లునాటిక్
బోటును సిద్దం చేసుకున్నాడు. ఇందులో సమాచారం కోసం రేడియోను
వినియోగించేవాడు. దీనిని బ్రాడ్ కాస్టింగ్ సంస్థ 2009 జనవరి 1 న
సేవలందించడం నిలిపివేసింది. సరిగ్గా నెల తిరిగే సరికి ఆ బోటు ఆస్ట్రేలియా
తీరంలో కనిపించింది. అయితే అందులో ఎవరూ లేరు. మూడు నెలల తరువాత అదే బోటు
సముద్రానికి మధ్య భాగంలో ఉన్నట్లు సైన్స్ వెస్సల్ ఆర్‌వి వెగర్ రివెల్లి
అనే వారు గుర్తించారు. అప్పటికీ ఇందులో ఎవరూ లేనట్లు గుర్తించారు.
కాజ్
11 33 అడుగులు పొడవున్న ఈ నౌకను ఆస్ట్రేలియా సముద్ర తీరానికి సుమారుగా 88
నాటికల్ మైళ్ల దూరంలో 2007 లో గుర్తించారు. దీనిని గుర్తించిన సమయంలో
ఇందులోని ఇంజన్, రేడియో, సాంకేతిక వ్యవస్థ అన్నీ కూడా పనిచేస్తున్నాయి.
అదేకాదు ఈ బోటులోని డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేయడానికి ఆహార పదర్థాలు
కూడా సిద్దంగా ఉన్నాయి. అయితే ఇందులో మనుషులే లేనప్పుడు ఇవన్నీ ఎలా
జరిగాయి అనేది ప్రశ్నగా మిగిలిపోయింది
లేడి లోవిబాండ్
1748 కాలంలో ఈ లేడి లోవిబాండ్ నౌక ఆగ్నేయ ఇంగ్లాండ్‌లేని కెంట్ అనే
తీరంలో శిథిలమైపోయింది. అదే ఏడాది ఫిబ్రవరి 13 న ఈ నౌక యొక్క కెప్టెన్ తన
పెళ్లి తంతును ఆనందించడానికి పోర్చుగల్ మార్గంలో తన భాగస్వామితో
బయలుదేరాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని తన మిత్రుడు ఆ నౌకను నడుపుతూ
సముద్రంలో ఉన్న పెద్ద ఇసుక కొండలకు ఢీకొట్టించాడు. దాంతో అందరూ మృత్యువాత
పడ్డారు. అప్పటి వరకు ఇది ఒక ప్రమాదం మాత్రమే. కాని ప్రతి 50 ఏళ్లకొకసారి
ఇక్కడ ఒక నౌక ప్రమాదానికి గురికావడం మొదలైంది అది అలాగే కొనసాగుతూ
వస్తోంది. 1998 లో కూడా ఒక ప్రమాదం ఇదే ప్రాంతంలో జరిగింది.
యంగ్ టీజర్
1813 లో ఈ యంగ్ టీజర్ అనే నౌకను మహోని బే అనే ప్రాంతంలో నోవ స్కాటియ్ అనే
వ్యక్తి చేత ధ్వంసం చేయబడింది. ఇందులోని దెయ్యం బాధ భరించలేక ఆ కోపంతో
దీనిని అంతం చేసినట్లు తెలిసింది. దీనిని నిర్మించిన తరువాత ఇది కేవలం
రెండు సంవత్సరాల పాటు మాత్రమే సేవలందించింది.
జెబ్రినా
జెబ్రినా అనే ఈ నౌక 1917 లో బొగ్గును రవాణా చేయడానికి సిద్దమైంది. ఇందులో
ఐదుగురి వరకు సిబ్బంది ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రమాదానికి
గురైనట్లు లేదా ఇబ్బందిని ఎదొర్కొన్నట్లు ఎటువంటి సమాచారం ఆ నౌక నుండి
రాలేదు. కాని అందులోని ఐదుగురు కూడా అదృశ్యమయ్యారు. దెయ్యాలను కలిగి ఉన్న
ఈ నౌక వారిని అంతం చేసిందని తరువాత రోజుల్లో స్పష్టమైంది.
జింగ్ సెంగ్
2006 లో ఆస్ట్రేలియాకు చెందిన తీర దళం దీనిని గుర్తించింది. ఇందులో
ఎటువంటి మానవ చర్యలు జరగలేదని వారు గుర్తించారు. కాని ఇందులో ఎన్నో
అనధికారక కార్యకలాపాలు జరిగినట్లు తెలిసింది. ఒకవేళ ఇందులో మత్సకారులు
వెళ్లి ప్రమాదానికి గురయ్యారేమో అని అనుమానాలు కూడా వచ్చాయి. వారు మునకకు
గురైతే నౌక కూడా మునిగిపోవాలి కదా అనే సందేహం వచ్చింది. అలాగే ఒటరిగా
తిరుగుతున్న నౌక ఎట్టకేలకు నావికా దళ సిబ్బందికి దొరికిపోయింది.
ఔరంగ్ మేడమ్
ఇది 1947 కాలం నాటి డచ్‌కు చెందిన సరుకు రవాణా నౌక. ఇండోనేషియా సముద్రంలో
ఇది మునిగిపోయింది. ఇది మునిగిపోవడానికి కారణం వెతకడానికి దర్యాప్తు
బృందాలు కూడా వచ్చాయి. ఇందులో ప్రయాణిస్తున్న అందరి చేతులు, మొహాలు
భయంకరమైన రీతిలో దాడి చేయబడి ఉన్నాయి. అయితే ఒక చోట చార్ట్‌రూమ్‌లో ఉన్న
బ్రిడ్జి కూలిపోవడం వలన ఆఫీసర్లు మరియు కెప్టెన్ అందరూ మరణించారు అని
రాసి ఉంది. అందరూ మరణించి ఉంటే ఇలా ఎవరు వ్రాస్తారు అనే విషయం ఇప్పటికీ
అంతు చిక్కకుండా ఉంది.
బెల్ అమికా
2006 లో క్లాసిక్ స్టైల్‌కు చెందిన స్కూనర్ నౌక ఇంతకు ముందు గుర్తించిన
నౌకల్లా కాకుండా ఇది సార్దినియా దీవికి సమీపంలో ఉన్న తీర ప్రాంతంలో
నిలిచి ఉన్నప్పుడు దీనిని గుర్తించారు. దీనిని గుర్తించిన సమయంలో ఇందులో
ఈజిప్ట్‌కు చెందిన సగం భోజనం, దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్రెంచ్ మ్యాపులు,
కొన్ని దుస్తులు మరియు లక్సెంబర్గ్‌కు చెందిన జాతీయ పతాకం ఇలాంటివి
ఇందులో కనిపించాయి. వేరు ప్రాంతాలకు చెందిన వేరు పదార్థాలు ఇందులో ఉండటం
అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
పరిశీలించాలేగాని ఇలాంటి అంతుచిక్కని రహస్యాలెన్నో ఎన్నెన్నో..
======================= ***=================
మావూరు విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నమస్తే...
నేను మావూరు. విజయలక్ష్మి.(విశాఖపట్నం). M,A.Music చదువుకున్న నేను ఆల్ ఇండియా రేడియో, రెడ్ ఎఫ్ ఎమ్ లలో రేడియో జాకీగా పనిచేసి, ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా న్యూస్ చానల్స్ కి వాయిస్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వనిత, వనితాజ్యోతి, పల్లకి, నవ్య, చిత్ర, వార, మాస, దిన పత్రికలలోను, ఈనాడు, సాక్షి పత్రికల ఆదివారం పుస్తకాలలోను, సంచిక సహరీ లాంటి వెబ్ పత్రికలలోనూ నా కథలు, వ్యాసాలు ప్రచురించబడ్డాయి. మహానటి, కలకంఠి నవలలు ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే వీటన్నిటికీ కారణం నేనేం రాసినా ఏదో పెద్ద రచయిత్రిని అయిపోయానని మురిసిపోయి ప్రోత్సహించిన అమ్మా, నాన్నగారు మావూరు. అన్నపూర్ణమ్మ, సాంబమూర్తి గార్లు... ముఖ్యంగా నేను ఓ నాలుగు లైన్లు రాసినా నేనేదో పెద్ద నవల రాసినట్టు సరదా పడిపోయి ప్రోత్సహించిన మా అన్నయ్య డాక్టర్ మురళీమోహన్.
ఇప్పుడు మన తెలుగు కథలు లో నన్ను కూడా ఒక రచయిత్రిగా చేర్చిన మనతెలుగు కథలు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Comments