'Dishti Chukka' New Telugu Kavitha Written By Lakshminageswara Rao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
పల్లవి: ఓ.ఓ..ఓ... వలపుల దరహాసమా!
చరణం:
మనసే అందాల బృందావనం
విరిసిన గులాబీల సోయగం
సువాసనలు వెదజల్లే సంపెంగల పరిమళం
తెల్లని మల్లెల స్వచ్ఛదనం
కలగలపే నా ప్రేయసి మనసారవిందం!
ఓ.ఓ..ఓ... వలపుల దరహాసమా!
చరణం:
నా మనసులో మనసు వై
నా జీవితంలో అణు అణువునా నీడవై నిలిచి
జీవితమనే నావను
ఒడుదుడుకులు లేకుండా, నా చుక్కానివై
కానరాని తీరాలను కూడా సునాయాసంగా దాటగలిగే
ధైర్యాన్ని ఇచ్చిన ఓ నా ప్రేయసి!
ఓ.ఓ..ఓ... వలపుల దరహాసమా!
చరణం:
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
పవిత్రమైన మూడుముళ్ల బంధంతో ఏకమవుదామా
సిగ్గులొలికే నీ చెక్కిళ్ళకు ఒక దిష్టి చుక్క నై
మన నూరేళ్ల వివాహ బంధానికి ఒక ఉదాహరణగా నిలుద్దాము ప్రియా!
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
��������
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Comments