#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #DongaDorikaduEvaru, #దొంగదొరికాడుఎవరు, #TeluguChildrenStories

Donga Dorikadu Evaru - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 26/01/2025
దొంగ దొరికాడు!... ఎవరు? - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1). ఆ రోజు, పాఠశాల యొక్క ఆరవ తరగతి గది లో ఉపాధ్యాయుడు గిరి గారు హింది-పాఠం బోధిస్తున్నారు. అంతలో అతడి షర్ట్ జేబు లోని చరవాణి మ్రోగింది. ఏదో మాట్లాడారు.
ఆ తరువాయి 'మంచి - మాధవ్' అనే విద్యార్థి తో "నాకు అర్జెంట్ - తొందర పని ఉన్నది. ఈ ఐదు వేల రూపాయిలు జాగ్రత్తగా నీ స్కూల్ - సంచి లో ఉంచు. ఇది రాము విద్యార్థి ఇచ్చిన ఫీస్ డబ్బు. భోజన - విరామం సమయంలో, నీ భోజనం అయ్యాక, సంచి పట్టీని భుజానికి వేసుకొని, పాఠశాల - ఆఫీస్ - గదికి వెళ్లి రాము పేరు మీద 'ఫీస్ డబ్బు' జమ చెయ్యి. నేను ఇచ్చానని చెప్పు ఆఫీసు ఉద్యోగులకి. ఈ రోజు ఆఖరి తేదీ ఫైన్ లేకుండా కట్టటానికి", అని చెప్పి గబ గబ హుటాహూటిన బయిటికి వెళ్లి పోయారు.
---- X X X ----
2). భోజన - విరామం తరువాత ఇంకో రెండు క్లాసులు అయ్యాయి (వివిధ విషయాల పై). మూడవ క్లాస్ మళ్లీ హింది విషయం / పాఠం. ఈ సారి గిరి గారు క్లాస్ కు తిరిగి వచ్చారు, హింది పాఠం బోధించటానికి (చిరు నవ్వుతో).
'మంచి మాధవ్' ని ఉద్దేశించి, "రాము యొక్క ఫీజ్ డబ్బులు... అదే ₹5000... స్కూల్ ఆఫీసు గదిలో అతడి పేరు మీద జమ చేశావా"? అని అడిగారు గిరి సార్.
"వెళ్ళాను సార్. అక్కడ సంచిలో మరియు దానిలో ఉన్న అన్ని పుస్తకాల్లో వెతికాను. కానీ సంచిలో పెట్టిన ఐదువేల రూపాయిల నోట్లు - డబ్బు కనిపించలేదు" అని ఢీలా పడిన ముఖంతో చెప్పాడు..
గిరి సార్ మాధవ్ సంచి నుండి అన్ని పుస్తకాలు తీసి టేబుల్ మీద పెట్టారు. నిదానంగా ప్రతి పుస్తకం లోని పేజీలు తిరగేసి వెతికారు. కానీ డబ్బు కనిపించలేదు. ఉత్తి బ్యాగ్ లో వెతికారు. డబ్బు జాడ లేదు.
గిరి సార్, 'మంచి మాధవ్' మరియు అందరి పిల్లల ముఖాలు వెల వెల పోయాయి. మాధవ్ తన జేబులో కూడా వెతికాడు. (₹5000) డబ్బు లేదు.
పిల్లలు ఎవ్వరూ తీయరు. ఆ స్కూల్ లో అందరూ మంచి పిల్లలే. హాస్యంగా - జోకులు గా కూడా అలాంటి బాధ - టెన్షన్ ఇచ్చే పనులు చేయరు.
మరి సంచిలో పెట్టిన డబ్బు ఏమైంది?
----- X X X ------
3). వెంటనే చిన్నారి 'అందాల వింధ్య' అనే 'తెలివైన' విద్యార్థిని ఇలా అన్నది "ఈ తరగతి లో 50 మంది విద్యార్థులు, తలా ఓ ₹100 (పాకెట్ మనీ) వేసుకొని రాము విద్యార్థి ఫీస్ కట్టేస్తాం, స్నేహపూరిత ఐకమత్యపు జట్టు రీతిలో. అప్పుడు ఎవ్వరికీ భారం కాదు. ఒక వేళ ₹100 భారం అయితే, పాఠశాల పిల్లలు అందరూ కలసి జట్టుగా... తలా ఓ ₹10 వేసుకుంటే చాలు... ₹5000 వేల రూపాయిలు తేలికగా ప్రోగు అవుతుంది. ఫీస్ కట్టి వేయవచ్చు రాము పేరు మీద", అని.
అప్పుడు అందరి ముఖాలు తేలిక పడ్డాయి. సంతోషం తో నిండుకుంది. ఆనందంతో వెలిగి పోయాయి అనటం సబబు. "ఔను, మంచి ఉపాయం" అంటూ అందరూ చప్పట్లతో చిన్నారి 'అందాల వింధ్య' ను మెచ్చుకున్నారు.
------ X X X ------
4). అంతలో 'చిన్నారి అందాల వింధ్య' కు ఏదో సందేహం కలిగింది. "ఒక్క క్షణం ఆగండి" అంటూ మాధవ్ సంచి లో చెయ్యి పెట్టి తడిమింది. వెంటనే చిరు నవ్వుతో "ఇప్పుడే వస్తాను సార్" అంటూ చక - చక బయిటికి వెళ్ళింది. కాసేపు అయ్యాక తిరిగి వచ్చింది ఐదు వేల రూపాయిల తో.
"దొంగ దొరికాడు", అని అరిచింది.
"దొంగ ఎవరు?!" అంటూ పిల్లలు, గిరి సార్ అడిగారు ఆశ్చర్యంగా.
"దొంగ మాధవ్ సంచి కి ఉన్న రంధ్రం", అన్నది కిల కిల నవ్వుతూ 'చిన్నారి అందాల వింధ్య'.
"సందేహం వచ్చి, పరిశీలనగా 'మంచి - మాధవ్' సంచి లో చేయి పెట్టి వెతికాను. డబ్బు కొరకు కాదు. రంధ్రం కొరకు. రంధ్రం వేలికి తగిలింది. డబ్బు దారిలో, రంధ్రం గుండా జారీ కిందికి - బయిట పడి ఉంటుందని గ్రహించాను. అదే రూఢీ అయింది. పాఠశాల ఆఫీసు గది కెళ్ళే దారి లో చూస్తూ నడిచాను. మధ్య దారి లో డబ్బు నోట్లు పడి ఉన్నది. దొరికింది" అన్నది నవ్వుతూ.
------- X X X ------
5). ఇలా కొనసాగించింది 'చిన్నారి అందాల వింధ్య'
"ఇక్కడ రెండు నీతులు కూడా నేర్చుకున్నాం మనమందరం ఈరోజు.
1) సమస్య వచ్చినప్పుడు దిగులు పడకూడదు. పరిష్కారం కొరకు ఆలోచించాలి ప్రశాంతంగా మరియు స్నేహపూరిత - ఐకమత్యం జట్టు రీతిలో.
2) అపాయంలో ఉపాయం అవసరం. కొయ్యబారి పోవద్దు. దిగులు పడొద్దు", అని ముగించింది.
అందరూ పిల్లలు ఆనందంగా నవ్వుతూ 'చిన్నారి అందాల - వింధ్య' తెలివికి చప్పట్లతో జోహార్లు అర్పించారు.
'మంచి - మాధవ్' నవ్వుతూ "మూడవ నీతి కూడా ఉన్నది ఇక్కడ", అన్నాడు.
"ఏమిటది", అని అందరూ అడిగారు ఆశ్చర్యం తో.
"రోజూ జేబులు, సంచులు, బట్టలు తడిమి చూడాలి చిల్లులు, రంధ్రాలు ఉన్నాయా అని. ఉంటే వెంటనే సూది - దారం తో కుట్టి వేయాలి, పెద్దవి కాకుండా, అయ్యే ముందే. A stitch in time saves nine. సమస్యలు వచ్చినప్పుడు వెను వెంటనే పరిష్కరించాలి. వాయిదా వేయకూడదు. అలాగే అట్టే పెట్ట వద్దు".
"డబ్బు వృధా చేయ వద్దు కొత్త సంచి కొనటానికి. డబ్బును దుబారా చేయవద్దు. పొదుపుగా వాడాలి", అని, ముగించాడు మంచి - మాధవ్.
అందరూ "శభాష్ అందాల వింధ్య, మంచి మాధవ్ ల జోడీకి", అంటూ అభినందించారు, కొనియాడారు రెండింతల చప్పట్లతో.
హింది టీచర్ గిరి గారు ఆశీర్వదించారు మనస్పూర్తిగా 'మంచి మాధవ్ - అందాల వింధ్య జోడీను, "బహు చక్కటి... దేవుడు చేసిన జంట" అని.
------- X X X ----------
నీతి:-
I) సమస్య వచ్చినప్పుడు దిగులు పడకూడదు. పరిష్కారం కొరకు ఆలోచించాలి ప్రశాంతంగా మరియు స్నేహపూరిత జట్టు రీతిలో.
Ii) అపాయం లో ఉపాయం. దిగులు కాదు.
IIi) డబ్బును దుబారా చేయవద్దు. పొదుపుగా వాడాలి.
iv) A stitch in time saves nine. సమస్యలు వచ్చినప్పుడు వెను వెంటనే పరిష్కరించాలి ఓ జట్టు లా. వాయిదా వేయకూడదు. అలాగే అట్టే పెట్ట వద్దు.
--------- కథ సమాప్తం------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
"దొంగ దొరికాడు!... ఎవరు?" అనే కథలో రచయిత పి. వి. పద్మావతి మధు నివ్రితి ఒక సాధారణ సంఘటనకు తెలివైన పరిష్కారాన్ని చూపించారు. కథ ప్రారంభం పాఠశాలలో జరుగుతుంది. హిందీ ఉపాధ్యాయుడు గిరి సార్ ₹5000 ఫీజు డబ్బు ఒక విద్యార్థి మాధవ్ సంచిలో ఉంచి స్కూల్ ఆఫీస్ గదికి ఇచ్చి రావాలని చెబుతారు. కానీ డబ్బు మాయం కావడంతో అందరూ ఆందోళనకు గురవుతారు. పిల్లల మధ్య చిన్నారి వింధ్య తన తెలివితో సమస్యను పరిష్కరిస్తుంది. మాధవ్ సంచిలో రంధ్రం ఉండటంతో డబ్బు దారిలో పడిపోయిందని గుర్తిస్తుంది. ఆమె చూపిన స్నేహపూరిత ఐకమత్యంతో అందరుపిల్లలు కలసి రాముకు ఫీజు డబ్బు సమీకరించాలని నిర్ణయించుకుంటారు. ఈ కథ ద్వారా ప్రశాంతంగా ఆలోచించడం, జట్టు పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వడం, అప్రమత్తతతో వ్యవహరించడం వంటి నీతులను రచయిత అందించారు.