top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

దొంగ ఎవ్వరు???

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #DongaEvvaru, #దొంగఎవ్వరు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Donga Evvaru - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 12/12/2024

దొంగ ఎవ్వరు - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అలా బ్యాంకు కి వెళ్ళి వస్తాను, తలుపు వేసుకో జానకి” అంటూ 

 బయలుదేరాడు రామారావు. 


“ఆటోలో వెళ్ళండి, నడిచి వెళ్ళద్దు” అని హెచ్చిరించింది జానకి. 


వంటగదిలో పని పూర్తి చేసుకుని, కాసేపు పడుకుందాం అనుకుంటే ఈయన బ్యాంకు పని వుంది అంటూ వెళ్లారు. యిహ ఆయన వచ్చేవరకు మెలుకువ గా ఉండాలి అనుకుంటూ సోఫాలో పడుకుని పేపర్ చదవటం మొదలుపెట్టింది. 


ఇంతలో కాలింగ్ బెల్ చప్పడుకి, అప్పుడే వచ్చేసారే అనుకుంటూ తలుపు తీసింది జానకి. ఎదురుగా ఒక 25 ఏళ్ళ కుర్రాడు నుంచుని వుండటంతో, ‘ఎవ్వరు కావలి బాబు.. ’ అంది. 


“పక్కింటి వాళ్ళ కోసం వచ్చాను, వాళ్ళు యింట్లో లేరు అనుకుంట, దాహం గా వుంది కొద్దిగా మంచి నీళ్లు యిస్తారా” అని ఆడిగాడు. 


“దానికేం భాగ్యం, ఫ్రిజ్ వాటర్ తాగుతారా” అంటూ వెళ్ళి, ఫ్రిజ్ తలుపు తీసింది. 


అంతే! నెత్తిమీద దేనితోనో కొట్టినట్టు అయ్యి క్రింద పడిపోయింది. 


వచ్చిన అపరచితుడు, , వెంటనే బీరువా దగ్గరికి వెళ్ళి డబ్బులు, నగలు మూటకట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. 


ఇంటికి వచ్చిన రామారావు కి ఫ్రిజ్ దగ్గర నెత్తురు కారుతో పడివున్న జానకి ని చూసి కెవ్వున అరిచాడు. బెడ్ రూమ్ లోని అల్మారా తెరిచి వుంది. మంచం మీద అన్ని వస్తువులు పడేసి వున్నాయి. ముందుగా భార్యని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుని పక్క ఇంటి రాజారావు ని పిలిచి, అంబులెన్సు ద్వారా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసాడు. 


హాస్పిటల్ లో బెంచి మీద కూర్చుని రాజారావు, “ఎందుకు రామారావు గారు.. మీరు మీ అబ్బాయి దగ్గర ఉండక, యిలా యిద్దరూ ఒంటరిగా ఉండటం? నాకంటే పిల్లలు లేరు నాకు తప్పదు, మీకు ఏం ఖర్మ” అన్నాడు. 


“మీరు అన్నది నిజమే రాజారావు గారు, మా అబ్బాయి మమ్మల్ని అక్కడికి వచ్చేయండి అని చాలా సారులు ఆడిగాడు. అయితే మా ఆవిడ కి పూజలు పిచ్చి, అదికాక మన కాలనీలో వున్న బ్రాహ్మణ కుటుంబాలలో మేమే పెద్ద వయసు వాళ్ళం. దానితో కాలనీలో ఎవ్వరింట్లో ఏ ఫంక్షన్ మొదలు పెట్టుకున్నా మా ఆవిడని పిలుస్తారు. అందుకే ఈ ఊరు వదిలి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు”. 


“నిజమే అనుకోండి, యిలా ఒంటరిగా వున్న వృద్ధులని మోసం చేసే గ్రూప్ ఒకటి డబ్బుల కోసం హత్యలు కూడా చేస్తున్నారు”. 


“మరి మీరు కూడా ఇద్దరేగా, మీకు భయం లేదా” అని ఆడిగాడు రాజారావుని రామారావు. 


“మా యింట్లో నగా నట్రా బ్యాంకు లో పెట్టేసాను. నెల ఖర్చులకి కొంత ఉంచుకుంటాం అంతే. ఒక ఫంక్షన్ చెయ్యం ఒక హార్బాటం వుండదు” అన్నాడు రాజారావు. 


“ముందు మా ఆవిడ తల పగలకొట్టిన వాడు ఎవ్వరో తెలియాలి. అప్పటి వరకు వేరే ఆలోచన లేదు” అన్నాడు రామారావు. 


పోలీసులు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు దొంగ ఎవడో తెలుసుకోవడానికి. 


జానకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. రామారావు కూడా భార్య ని వదిలి ఎక్కడకి వెళ్ళటం లేదు. 


ఒక రోజు ఉదయం రాజారావు యింటి దగ్గర హడావుడి గా ఉండటం తో బయటకు వచ్చి చూసాడు. పోలీసులు రాజారావు కి సంకెళ్లు వేసి రామారావు యింటికి తీసుకుని వస్తున్నారు. 


“అదేమిటి, ఆయనని అరెస్ట్ చేశారెందుకు?” అన్నాడు పోలీస్ తో. 


“మీ ఆవిడ తల మీద దెబ్బ తగలాటానికి ఈ రాజారావు గారే కారణం”. 

 

“అబ్బే.. ఆయన మా స్నేహితుడు, అటువంటి పని ఆయన ఎందుకు చేస్తాడు?” అన్నాడు రామారావు. 


“ఈ రాజారావు కి పిల్లలు లేకపోవడం వలన రేపు ఏదైనా జరిగితే చూసే వాళ్ళు లేరు అని భయం పట్టుకుంది. దానితో అతనికి ఒక బావమరిది వున్నాడు ఉద్యోగం లేకుండా అల్లరి తిరుగుడు తిరుగుతో. అయితే తండ్రి నుంచి వచ్చిన ఆస్తి వుంది. ఆ ఆస్తి రాజారావు రక్షణ లో వుంచాడు రాజారావు మామగారు. 


రాజారావు కి తన బావమరిది కుటుంబాన్ని తెచ్చుకుని తన యింట్లో పెట్టుకోవడం యిష్టం లేదు. అయితే బావమరిది తన పక్కన వుంటే అవసరం అయితే తమని చూసుకుంటాడు అన్న ఆలోచన తో, మీరు భయపడి ఈ యిల్లు అమ్మేసి మీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతే, తను ఈ ఇంటిని బావమరిది పేరున కొని తన పక్కన ఉంచుకుందాం అని ప్లాన్ చేసి, బావమరిది కి చెప్పాడు ఎవ్వరినైనా పంపి మీ భార్య తల మీద ప్రాణం పోకుండా కొట్టమని. 


అయితే ఆ బావమరిది తనే వచ్చి మీ భార్య తలమీద కొట్టి ఆవిడ పడిపోగానే నగలు పట్టుకుని పోయి జల్సా చెయ్యడం మొదలు పెట్టాడు. అయితే మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం తో కంగారు పడిన రాజారావు తన బావమరిది ని పిలిచి ‘నగలు ఎందుకు దొంగతనం చేసావు’ అని ఆడిగాడు. వాళ్ల యిద్దరి మధ్య గొడవ జరిగింది. మిమ్మల్ని ఒంటరి గా ఉండటం మంచిది కాదు అని భయపెట్టి మీ కొడుకు దగ్గరికి పంపటానికి ఎన్నో విధాలుగా చెప్పాడు మీకు. 


మాకు ఏ విధంగా చూసినా మీ మీద విరోధం వున్నవాళ్లు కనిపించలేదు. మీ ఇంటికి ఎదురుగా వున్న పాన్ షాప్ వాడిని ఎంక్వయిరీ చేస్తే ‘ఒక అతను సంఘటన జరిగిన రోజు తన షాపులో షోడా తాగి, మీ యింటి వైపుకి వెళ్ళాడు, అతనే వారం రోజులు తరువాత రాజారావు గారి యింటికి వచ్చాడు’ అని చెప్పి, అక్కడకి దగ్గరలో వున్న ఎటిఎం లో వున్న సీసీ కెమెరా చూపించితే పాన్ షాప్ అతను రాజారావు బావమరిదిని గుర్తించాడు. 


మేము అతనిని పట్టుకుని మా పద్ధతి లో విచారణ చెయ్యగా జరిగింది తెలిసింది. మీ పైన కక్ష లేకపోయినా మీరు యిల్లు అమ్ముకుని వెళ్తే మీదగ్గర చవకగా కొని బావమరిది ని తనకి సహాయం గా ఉంచుకుందామని ఐడియా వేసాడు రాజారావు” అని పోలీసులు చెప్పడం తో తెల్లబోయిన రామారావు, “అయ్యా, ఏదో తన వాళ్ళు దగ్గర వుంటే పిల్లలు లేని దంపతులు తమని కనిపెట్టుకుని చూస్తారు అనే భ్రమ తో వున్నాడు తప్ప రాజారావు గారు దుర్మార్గుడు కాదు. అతని బావమరిది రేపు రాజారావు ని కూడా డబ్బు కోసం యిదే విధంగా చేసేవాడు. 


మాకు ఆరోగ్యం బాగుండనప్పుడు ఈ రాజారావు గారు ఎంతో సహాయం చేసాడు. అందుకే నేను పెట్టిన కేసు ని వెనక్కి తీసుకుంటున్నాను. మీరు కూడా పెద్దమనుసుతో ఆలోచించండి, ఈ వయసులో రాజారావు ని జైలు కి పంపితే అతని భార్య ఏమవుతుంది” అన్నాడు. 


రామారావు భార్య యిచ్చిన కాఫీ తాగి కప్పు కింద పెట్టిన ఇన్స్పెక్టర్ “ఏమిటో సార్.. మీ సీనియర్ సిటిజన్స్ మరీ మంచి తనం చూపిస్తారు తమకి నష్టం జరిగినా. సరే మీ యిష్టం. అయితే రాజారావు బావమరిది ని స్టేషన్ కి తీసుకొని వెళ్ళి బుద్ది చెప్పి పంపుతాం” అని వెళ్ళిపోయాడు. 


శుభం 


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













33 views0 comments

Comments


bottom of page