'Ee Kshaname' - New Telugu Poem Written By M. Laxma Reddy
Published In manatelugukathalu.com On 17/06/2024
'ఈ క్షణమే..' తెలుగు కవిత
రచన: M. లక్ష్మా రెడ్డి
నువ్వెంత ముఖ్యమైనా .. నువ్వెంత ఆరాధ్యమైనా..
చాలా కఠినమైన వాస్తవమిది..
కాలం మరీ కఠినమైనది..ఎవరినీ వదలదు .
ఈ క్షణం కరిగాక..
నీ ప్రాముఖ్యత కరగొచ్చు.. కనబడక పోవచ్చు..
ఏమో.. హిమలయమంత ఎదగనూ వచ్చు..
అయినా.. ఆ క్షణమూ ..ఒక్క క్షణమే. .
మరు క్షణంలో..మళ్ళీ పోరాటమే..
నువ్వు ఎంత గొప్ప అయినా.. అత్యుత్తమం అయినా ..
నీకో ప్రత్యామ్నాయం ఉంది..
ఇది
గుర్తుంటే..కదిలే కాలంతోనే నువ్వూ..
ఎప్పుడైతే బంధాలు ఉండవో
అప్పుడు గాయాలూ తక్కువే..
మనసుంటే..యంత్రంలా , కష్టమే
స్పందించే హృదయానికి మరీ భారమే..
కానీ..ఏమైనా..ఏదేమైనా .. నువ్వెంత ఉత్తమమైనా
నీకో ప్రత్యామ్నాయం ఉన్న మాట వాస్తవం..
చిత్రంగా . నువ్వు వేరొకరికి ప్రత్యామ్నాయమే..
ఇదో నిరంతర ప్రవాహం..
ఆగి..అలానే గొప్పగా ఉండిపోలేం..
సాగి.. ఎక్కడైనా అలానే ఉండేలా ప్రయత్నిద్దాం..
మరుక్షణం ఏంటో తెలియని జీవితాన..
ఈ క్షణం జీవించు.. ఓ జ్ఞాపకంగా నిలవనీ..
అయినా. ఓ మనసా
బంధమా.. బాధ్యతా..
గాయామా . ఫలితమా
నిర్ణయం నీదే..
ఏదేమైనా. .మంచైనా..ఎంత గొప్ప అయినా.
నీకో ప్రత్యామ్నాయం ఉంది ..
ఈ క్షణం మాత్రమే నీది..
No matter how good u r .
U can always be replaced ఆధారంగా..
***
M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను లక్కీ.. లక్మారెడ్డి
రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..
అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..
నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..
నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...
ధన్యవాదాలు...
Comments