top of page
Writer's picturePitta Govinda Rao

ఈ పెళ్ళి యమా కాస్ట్లీ



 'Ee Pelli Yama Costly' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 26/07/2024

'ఈ పెళ్ళి యమా కాస్ట్లీ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


దేశం కాని దేశం మన భారతదేశం స్వాతంత్య్రం 

రాకముందు నుంచి, వచ్చిన తర్వాత కూడా ఎన్నో సవాళ్ళను, మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. దేశంలో ఎందరో పేదల నుండి నేడు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతు పేదరికాన్ని కూడా జయిస్తుంది. అయినా కూడా మన దేశంలో ఇంకా పేదవాళ్ళు ఉంటున్నారంటే నమ్మక తప్పదు. పేదవాళ్ళు ఉన్నారు. కానీ.. ! వాళ్ళు నిజంగా పేదలేనా అని ఆశ్చర్యపోక తప్పదు. 


తుంపార అనే గ్రామంలో దాదాపు అందరూ వ్యవసాయదారులే. వ్యవసాయంపై ఆధారపడి బతికే కుటుంబాలే. ఆ ఊరు పచ్చని చెట్లు, పంట పొలాలు, చెరువులు, పక్షుల కిలకిలల నడుమ, చల్లని పైరుగాలులతో అహ్లాదకరంగా ఉంటుంది. ఊరికి చివర్లో అమ్మవారి గుడికి సమీపంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. గ్రామస్తులు చందాలు వేసుకుని ఆ మర్రిచెట్టుకు మొదులు నుండి కొంతమెర కూర్చోటానికి సిమెంట్ తో పెద్ద వరండావలె కట్టారు. అక్కడ పొలాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు, ఊరిలో పనిపాటు లేక ఖాళీగా ఉన్నప్పుడు విశ్రాంతి కోసం అక్కడికి వచ్చి సేద తీరేవాళ్ళు. 


ఒకరోజు ఆ చెట్టు నీడలో సూరన్న, రంగయ్య, ఎరకయ్య మేక-పులి ఆడుతున్నారు. అదే సమయంలో అటుగా మల్లన్న ఒక చేతిలో కొడవలి, మరో చేతిలో గోనెసంచి పట్టుకొని వస్తుండటం చూశాడు సూరన్న. 


"అరేయ్ మల్లన్న ఇలా రారా "సూరన్న పిలిచాడు. 


"ఏంటో చెప్పురా సూరన్న అవతల నాకు బోలెడు పని ఉంది" రావటానికి ఇష్టం లేక తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తు అన్నాడు మల్లన్న. 


రంగయ్య నడుపుతున్న పులి నుండి మేకను తప్పిస్తు 

"అరే మల్లిగా, దమ్ములు పూర్తి అయి వారం రోజులు అయ్యాయి. అప్పుడే ఏదో పని అంటూ తప్పించుకుంటావ్ ఏంట్రా రారా ఇలా" అన్నాడు ఎరకయ్య. 


తన ఆలోచన ఎరకయ్య పసిగట్టాడని వెళ్ళకపోతే ఏమనుకుంటున్నారో అని మనసులో అనుకుంటు వెళ్ళాడు. 


"మొన్నీమధ్యే మీ పెద్దమ్మాయికి పట్నంలో కుర్రవాడికి ఇచ్చి ఘనంగా పెళ్ళి చేశావ్ కదరా.. ఇంతకీ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టావ్ రా.. ? అడిగాడు సూరన్న. 


"మా పెద్దబ్బాయి పెళ్లికి ఎనిమిది లచ్చలతో పెళ్ళి చేశాను కదరా.. అందుకే ఈసారి ఎలాగోలా కష్టపడి అమ్మాయి పెళ్లికి పన్నెండు లచ్చలు పెట్టాను రా " మీసం మొలేస్తు చెప్పాడు మల్లన్న. 


వాళ్ళందరు పకపకమని నవ్వటం మొదలెట్టారు. 


"అరేయ్ కూతురు, కొడుకుల పెళ్ళి కోసం మీరు కూడా నా ఆంత ఖర్చు పెట్టినట్టు లేరు కదరా మరెందుకు ఈ నవ్వు.. ? వెటకారంగా అడిగాడు


"మల్లిగా.. నీకంటే తక్కువ ఖర్చు పెట్టినా.. మేం కూడా లచ్చలు లచ్చలు పౌసి పెళ్ళిళ్ళు చేశాం రా. నువ్వు కూడా మాతో సమానంగా చేరిపోనావురా" అన్నాడు రంగయ్య. 


"అరేయ్ మీరు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. చెప్పేదేదో బుర్రకు ఎక్కేలా చెప్పండ్రా " బుర్ర గోక్కుంటు అన్నాడు మల్లన్న. 


"నేను చెబుతాను కూర్చోరా" అని ఇలా చెప్పాడు సూరన్న. 


"మన ఊరిలో ఆ వీరయ్య గాడు ఉన్నాడా.. ?”


"హ... ఉన్నాడు”. 


"వాడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారా.. ?”


"హ.. ఉన్నారు”. 


"వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా..?”


"హ.. చేస్తున్నారు”. 


"వాళ్ళ చదువులు కోసం ఆ వీరగాడు ఎంత ఖర్చు చేశాడో తెలుసా.. ?”


"తెలియదురా"


"హ... ఇప్పుడు విను. 

 మొదటి అమ్మాయి విమల. సాప్ట్వేర్ చదవటానికి ఐదు లచ్చలు పోశాడు. 


రెండో అమ్మాయి తేజ ఎస్. ఐ. ఆమె చదువు కోసం, శిచ్చణ కోసం దాదాపు రెండున్నర లచ్చలు పెట్టాడు. 


మూడో అమ్మాయి భార్గవి. ఏ ఉద్యోగమంటే... ఉద్యోగమూ.......” పేరు గుర్తు రాక ఆలోచిస్తుండగ 

"మున్సిపల్ కమిషనర్ రా" ఎరకయ్య చెప్పాడు. 


"ఆ... మునిసిపల్ కమీషనర్. ఆ ఉద్యోగం కోసం ఆమె చదువుకు లచ్ఛ రూపాయలు పెట్టాడు”. 


"హ.. అయితే ఇప్పుడు ఏమైంది వాళ్ళు అత్తోరింటికి పోనారు కదరా... ?” నవ్వుతూ అన్నాడు మల్లన్న. 


"నేను చెప్పేది వినరా.. బాబు.. ఆ ముగ్గురు కూతుళ్ళకి పెళ్ళి చేసే సరికి ఇంచుమించు ముప్పై లచ్చలు తెచ్చారు. 


"ఓరినాయినా.. ముప్పై లచ్చలా.. " చెమటలు తుడుస్తు అన్నాడు మల్లన్న. 


"అప్పుడే కళ్ళు తిరుగుతున్నాయా.. ఇంకా ఈ మధ్యనే మూడో కూతురు బార్గవి పెళ్ళి కూడా పూర్తి అయింది కదా.. ముగ్గురు అమ్మాయిలకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి కట్పం లేకుండా పెళ్ళి చేశాడ్రా”. 


" నిజమేన్రా సూరి…” 


పులులను మేకలతో కంట్రోల్ చేసి 

"సూరిగాడు చెప్పింది నిజమేన్రా మల్లిగా" అన్నాడు రంగయ్య. 


"అక్కడితో కథ ఆగలేదురా.. పెళ్ళి అయిపోయినా.. ! తమకు ఈ స్థాయిలో ఉంచిన తండ్రి ఋణం తీర్చుకోవటానికి వాళ్ళ జీతంలో కొంత మొత్తం ఈ ముగ్గురు కూతుళ్ళు తండ్రికి పంపుతున్నార్రా. ఆస్తులు అమ్మి కూతుళ్ళని చదివిస్తే మనందరం వెక్కిరించాం కదరా... ఆడపిల్లైనా మగపిల్లడు అయినా పెళ్ళి ఘనంగా చేసేస్తే మనమేదో మన పిల్లలేదో పెద్ద ఘనకార్యం సాధించేసినట్లు..

 

ఆస్తులు అమ్మి చదివిస్తే.. ఆ చదువు తిరిగి వీరయ్య ఆస్తులు తెచ్చి పెట్టడమే కాదు. వీరయ్య ఇప్పుడు పెద్ద భూయజమాని అయిపోనాడురా” అన్నాడు సూరన్న. 


"అరేయ్ సూరి, ఎవడో గొప్పవాడు అయిపోనాడని బాధెందుకురా. మనం ఎందుకు కాలేకపోయామో.. ఆలోచించు " అన్నాడు ఎరకయ్య. 


"ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు ఘనంగా జరుగుతుంటే మనము కూడా పేరు కోసమో.. , మొప్పు కోసమో మన పిల్లల పెళ్ళిళ్ళకి లచ్చలు, లచ్చలు పోసేశాం. మనం కూడా మన పిల్లల పెళ్ళిళ్ళకి చేసిన ఖర్చు వాళ్ళ చదువులకు పెడితే మన పిల్లల్లో కనీసం ఒక్కరైన గొప్పవాళ్ళు కాకుండా పోతారా.. మన తెలివితక్కువ ఆలోచనలు ఇలా ఉన్నాయి" అన్నాడు రంగయ్య. 


"ఒరెయ్, నా కంటే తక్కువ ఖర్చు పెట్టిన మీరే ఇంత కంగారు పడుతుంటే.. రెండు ఆవులు తప్ప భూమి మొత్తం అమ్మేసి పెళ్ళిళ్ళు చేసిన నేను ఎంత కంగారు పడాల్రా... ?” బోరుమన్నాడు మల్లన్న. 


నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం. వ్యవసాయం చేసుకునే వాళ్ళందరు పేద మద్యతరగతికి చెందిన వాళ్ళే. వారు కూడా పిల్లల చదువుల కోసం డబ్బులు పెట్టాలంటే పేదరికం గుర్తు వస్తుంది కానీ.. ! పెళ్ళి అంటే చాలు లక్షలు లక్షలు పెట్టడానికి ఎంత కష్టమైన పడతారు. ఎంత ఆస్తి అయినా అమ్ముతారు. 


ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెళ్ళిళ్ళ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పిల్లల చదువుల ఖర్చు విషయంలో ప్రపంచ దేశాల కంటే భారతదేశం చాలా వెనుకబడి ఉంది. 


ఇప్పటికైనా పెద్దలు, తల్లిదండ్రులు ఆలోచించాలి. పెళ్ళి ఖర్చులు కంటే చదువు ఖర్చులపై దృష్టి పెట్టాలి. 


**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం




42 views0 comments

Comments


bottom of page