'Ee Tharam Athha Kodallu' - New Telugu Story Written By Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 22/05/2024
'ఈ తరం అత్తా కోడళ్ళు' తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“వాణీ! తొందరగా రా. గుడి కట్టేసే సమయం అవుతోంది”.
“వచ్చాను హత్తయ్యా!” అని ఎదురుగా నిలబడుతుంది.
“లక్షణంగా చీర కట్టుకు రావాల్సింది కదా! జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొచ్చావ్ ఏంటి?”.
“మీరు అస్తమాను చీర కట్టుకునే రమ్మంటే వీలవదు. హత్తయ్యా! మీకో సంగతి తెలుసా”, అని జవాబు కోసం ఎదురు చూడకుండా చెప్తుంది.
“ఈమధ్య ఉత్తరప్రదేశ్లో అత్తగారు కోడల్ని జీన్స్ ప్యాంట్ వేసుకోమని సతాయిస్తే, ‘నేను పల్లెటూరు నుంచి వచ్చాను నాకు అలవాటు లేదు’ అంటుంది. ‘సాంప్రదాయం దుస్తులు వేసుకోవడం అలవాటు’ అని చెప్తుంది. కోడలు.
‘ఇక్కడ మేమంతా మోడ్రన్ గా ఉంటాము మాతోపాటు నీవు కూడా జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకోవాలి’ అని గట్టిగా చెప్తుంది అత్త.
కోడలు అత్తగారి బాధ భరించలేక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. హత్తయ్యా! అదే నా లాంటిది అయితే కోర్టులో కేసు వేస్తుంది” అని చెప్తుంది వాణి.
“అంత పెద్ద మాటలు ఎందుకులే.. నేను నిన్ను జీన్స్ వేసుకోవద్దు అని చెప్పానా. పండగలకి పేరంటానికీ మన సాంప్రదాయ ప్రకారం చీరలు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పాను. సినిమాలకి షికారులకి నీకు ఇష్టమైన డ్రస్సులు వేసుకో”మని చిరు కోపంగా చెప్తుంది అత్తగారు.
“హత్తయ్యా! మీకు కోపం వచ్చినట్టుంది. సరే ఇక మీదట మీరు చెప్పినట్టే చేస్తాను. అయితే మీరు కూడా నేను చెప్పినట్టు చేస్తారా” అని అడుగుతుంది వాణి.
“సరే, నీకు ఏం కావాలి?” అని అడుగుతుంది అత్తగారు.
“హత్తయ్యా! లేడీస్ పార్టీలో అందరూ మోడరన్ డ్రెస్సులు వేసుకొని వస్తారు కదా! మీరు కూడా జీన్స్ ప్యాంటు, టీ షర్టు వేసుకుని రావాలి” అంటుంది వాణి.
“సరే ఇప్పుడు మనం గుడికి వెళుతున్నాం కదా” అని ఇద్దరు కారు ఎక్కి గుడికి వెళ్తారు
“హత్తయ్యా! అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నట్టు ఉంది. అందరూ ఎలా తోసుకుంటున్నారో చూడండి” అంటుంది వాణి.
“వాళ్లు ఆకలి మీద ఉన్నారు కాబట్టి తోసుకోవడం సహజము. ఈ రోజుల్లో నాగరికులు కూడా విందు భోజనములో ఏదో ఒక వంటకం తక్కువ అయిందని గొడవ చేయడము మామూలు విషయం అయ్యిం”దని చెప్తుంది.
“ మీరు చెప్పింది నిజమే హత్తయ్యా! ఈమధ్య ఉత్తరప్రదేశ్లో ఒక విందు భోజనంలో రసగుల్లాలు తక్కువయ్యాయని కొట్టుకున్నారు. ఆ గొడవలో 8 మంది గాయపడ్డారని వార్తల్లో వచ్చింది” అని చెప్తుంది వాణి.
“ఇదివరకటి రోజుల్లో, ఆడపిల్ల వారు మగ పెళ్లి వారు వేరువేరు పంక్తిలో భోంచేసేవారు. సాధారణంగా ఏదో కారణంతో మగపెళ్లి వారు అలిగేవారు. ఆడపిల్ల వారి సద్ది చెప్పి మగ పెళ్లి వారికి కావలసినవి ఇచ్చేవారు. అదొక వేడుకగా ఉండేది. అంతేగాని ఇబ్బందికరమైన ఘటనలు జరిగేవి కాదు”.
ఇద్దరూ తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత గట్టుమీద కూర్చుంటారు.
“హత్తయ్యా! నేను పూజారి గారిని ఒక సందేహం అడుగుతాను” అని చెప్తుంది వాణి.
సరే అని ఇద్దరూ పూజారి దగ్గరికి వెళ్తారు.
“పూజారి గారూ! ‘మాతృదేవోభవ పితృదేవోభవ’ అని అంటారు కదా మరి ‘అత్తదేవోభవ మామ దేవోభవ’ అని ఎందుకు అనరు?” అని అడుగుతుంది వాణి.
“అమ్మా! నీకు వివాహ ఘట్టం గుర్తుందా?” అని అడుగుతాడు పూజారి.
“కొంతవరకు గుర్తుంది” అని చెప్తుంది వాణి.
“ మీ నాన్నగారు కన్యాదానం చేస్తున్నప్పుడు అల్లుడిని నారాయణ గా భావించి కాళ్లు కడిగారు. ఇంకో మాట. నీవు పతియే ప్రత్యక్ష దైవం అనే మాట విన్నావు కదా” అంటాడు పూజారి.
“మీ వారే ప్రత్యక్ష దైవం అయినప్పుడు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంతకంటే ఎక్కువే కదా” అని సందేహం తీరుస్తాడు పూజారి. వారు వారసత్వానికి మూలపురుషులు అని విపులంగా చెప్తాడు.
సరే అని ఒప్పుకుంటుంది అత్తగారు. అనుకున్న విధంగా అత్తా కోడళ్ళు లేడీస్ పార్టీకి వెళ్తారు.
పార్టీలో విమల వాణిని “ఈవిడ మీ సిస్టరా” అని అడుగుతుంది.
‘కాదు’ అని జవాబు ఇస్తుంది వాణి.
ఇంతలో వనజ మధ్యలో వచ్చి “ఈవిడ సుభద్రమ్మ గారి సిస్టరా” అని అడుగుతుంది.
“ఈవిడ సుభద్రమ్మ గారే” అని వాణి క్లారిటీ ఇస్తుంది. క్లబ్ లో అందరూ సుభద్రమ్మ గారిని ప్రశంసిస్తారు.
పార్టీ అయి ఉత్సాహంగా అత్తా కోడళ్ళు మెట్లు దిగుతుండగా అలవాటు లేని జీన్స్ వలన మడమ బెనికి సుభద్రమ్మ కింద పడుతుంది.
వాణి మడమకి కొంచెం మర్దన చేస్తే నొప్పి తగ్గి మామూలుగా నడుస్తుంది సుభద్రమ్మ.
“వాణీ! నీవు నన్ను హత్తయ్య అని ఎందుకు పిలుస్తావు అత్త అని పిలవచ్చు కదా” అంటుంది.
“నాకు చిన్నప్పటినుంచి హలో హాయ్ అని పలకరించడం అలవాటు. అందుకు హత్తయ్య అని పిలవడం తేలిక” అని చెప్తుంది.
ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్లి పోతారు.
--------------------------------------------------------------------------------------------------------------------------
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Komentarze