#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #Ekadasi, #ఏకాదశి
Ekadasi - New Telugu Poem Written By - Bulusu Ravisarma
Published In manatelugukathalu.com On 10/01/2025
ఏకాదశి - తెలుగు కవిత
రచన: బులుసు రవి శర్మ
ఏకాదశి ఉపవాసం
పదిహేను రోజులకు ఒకసారి
అనుక్షణం ఆకలి
ఎప్పటికన్నా ఎక్కువ ఆకలి
కడుపు కణ కణ మంటుంది
ఏ పని చెయ్యనివ్వదు ఏమీ తోచదు
మరునాటి తిథి కోసం
ఉవ్విళ్లూరుతోంది
ద్వాదశి భోజనం తర్వాత
మరో ఏకాదశి వరకు బెంగ లేదు!
నాతో పాటు కొన్ని కోట్ల మంది
ఉపవాసం చేస్తారు
ఎంత పుణ్యాత్ములో....
అవును మరి
వాళ్లకి ప్రతిరోజూ ఏకాదశి
తిథి మారదు
ద్వాదశి రానే రాదు!!
బులుసు రవి శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు బులుసు రవి శర్మ
పుట్టింది, పెరిగింది బరంపురం (ఒడిశా)లో.
చదువు ఎం టెక్ సివిల్.
ఒడిశా ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉద్యోగం.
ఒడియా మాధ్యమం లో చదువుకున్నప్పటికీ తెలుగు ఇంట్లో నేర్చుకుని కథలు, కవితలు, నాటికలు రాయడం, కొన్ని ప్రచురితం అవ్వడం జరిగాయి.
బరంపురం వికాసం కార్యదర్శి గా వున్నాను. రాయగడ స్పందన కార్యదర్శిగా సాహితీ కార్యక్రమాలు
పర్యవేక్షించాను.
ఫోటోగ్రఫీ, కార్టూన్, నాటకాలు , చిత్రలేఖనం హాబీలు.
మంచి తెలుగు కథలను షార్ట్ ఫిలిమ్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
రావి శాస్త్రి గారి కథలు, శ్రీ శ్రీ కవిత్వం
అంటే ప్రాణం.
Commentaires