#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ఎలుకతెచ్చిననష్టం, #ElukaThechhinaNashtam, #TeluguKathalu, #తెలుగుకథలు
Eluka Thechhina Nashtam - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 11/12/2024
ఎలుక తెచ్చిన నష్టం - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
నిరుద్యోగి అయిన మాధవ్ ఉపాధి నిమిత్తం తన భార్య లక్ష్మి పేరిట బాంకులో లోను తీసుకుని, లక్ష్మీ సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించాడు. విద్యావంతురాలైన లక్ష్మి కూడా వ్యాపారంలో భర్తకు సాయంగా ఉండేది. ముద్దులు మూటగట్టే ముచ్చటైన ఇద్దరు పిల్లలు, చక్కని సంసారం. రోజులు సాఫీగా గడచిపోతున్నాయి.
అతికొద్ధి కాలం లోనే వ్యాపారంలో మెళకువలు తెలుసుకుని, పదిమందితో మంచిగా, కలుపు గోలుగా ఉంటూ కష్టపడి వ్యాపారాన్ని వృద్ధి చేశారు. లోను కూడా తీర్చేసి మరికొంతమంది వర్కర్లను పెట్టుకుని ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నారు. క్రమేణా షాపును ఫర్నిచర్ సెంటర్ గా మార్చి ఇతర ప్రాంతాలకు కూడా ఎక్స్ పోర్ట్ చేయసాగారు. సహజంగానే దైవ భక్తులయిన ఆ జంట ఉదయాన్నే ఇంట్లోనే కాక, షాపులో కూడా షాపు తెరిచాక పూజారి పూజ చేయందే కౌంటర్ వద్ద కూర్చునేవారు కాదు. ఇది సహజంగా వ్యాపారస్తులందరూ చేసేదే అయినా వీళ్ళు మరికాస్త భక్తి శ్రద్ధలతో చేయించసాగారు. క్రమేణా సాయంత్రం వేళలలో కూడా షాపులో పూజ చేయించ సాగారు.
ఇంకేముంది ! ఆ ధనలక్ష్మి వాళ్ళను కరుణించి లక్షలలో ఫర్నిచర్ వ్యాపారం మూడు పువ్వులు - ఆరు కాయలుగా చేయించింది. మాధవ్ వాళ్ళు మరికొన్ని సహాయ సంస్థలకు, అనాథలకు థన, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించసాగారు. షాపును కూడా ఇన్సూర్ చేశారు. ఆ దంపతులు పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
ఆరోజు సాయంత్రం కూడా యాథావిథిగా షాపులో పూజ చేయించి ఫర్నిచర్ అమ్మకాలు అయాక రాత్రి 9 గం. లకు వ్యాపారంలో లెక్కలు చూసుకుని వర్కర్లను ఇంటికి పంపి షట్టరు మూసి తాళాలు వేసుకుని ఇంటికి వచ్చారు మాధవ్ వాళ్ళు.
ఇంట్లో యథావిధిగా భోజనాలు అయి నిద్రపోయాక అర్థరాత్రి ఫోన్ కాల్ తో త్రృళ్ళి పడి లేచారు ఆ దంపతులు. షాపులో అగ్ని ప్రమాదం జరిగి షాపు దగ్ధమైంది అని పోలీసులనుంచి ఫోను. అంతే ఒక్కసారిగా గుండె జారిపోయింది. ఉన్నపళంగా షాపుకు వెళ్ళి చూడగా లక్షల విలువైన ఫర్నిచర్ అంతా కాలి బూడిదయ్యింది. ఇంక ఆ దంపతుల బాధ వర్ణనాతీతం.
ముందు పోలీసులు తమ దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగింది అనుకున్నారు. కానీ ఆ దగ్గర ఉన్న సిసి పుటేజ్ ల విచారణలో అసలు నిజం బయట పడింది. షాపులో ఒక ఎలుక దేవుని వద్ద వెలుగుతున్న దీపారాధన వత్తిని నోటకరుచుకుని ప్రక్కనే కౌంటర్ టేబుల్ వద్ద పొరబాటున జార్చేసింది. అంతే ఉవ్వెత్తున ఆ ఫర్నిచర్ మీదకు మంటలు ఎగబ్రాకి మొత్తం షాపంతా దగ్ధమొంది. పాపం ఆ ఎలుక కూడా సజీవ సమాథి అయ్యింది. ఇదంతా తమ విచారణలో తెలిసి పోలీసులు నివ్వెరపోయారు.
పాపం మాధవ్ వాళ్ళకు 5 కోట్ల రూపాయల ఫర్నిచర్ నష్టం. ఎంత ఇన్సూరెన్సు ఉన్నా నష్టపోయిన దంతా రాదుగా. ఒక చిన్న ఎలుక వలన ఇంత ఆస్తి నష్టం, పైగా మూగ జీవి చావు. తమ అతిభక్తితో దీపారాధన ఎడల అప్రమత్తంగా లేకపోవడంతో ఇంత అనర్ధం జరిగిందని నెత్తి, నోరు బాదుకున్నారు. ఎవరితో చెప్పినా తమదే తప్పని బాధని దిగమింగుకున్నారు.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Commentaires