ఏమి దౌర్భాగ్యం ఇది!
- A . Annapurna
- Nov 22, 2024
- 3 min read
Updated: Dec 6, 2024
#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #ఏమిదౌర్భాగ్యంఇది, #EmiDourbhagyamIdi, #TeluguSpecialArticle, #StreetBeggars, #AnnapurnaArticles, #సామాజికసమస్యలు

Emi Dourbhagyam Idi - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 22/11/2024
ఏమి దౌర్భాగ్యం ఇది - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
స్కూల్లో చదువుకోమని పంపవలసిన కన్న తల్లి తండ్రులే వారి పిల్లలను బిచ్చగాళ్లుగా రోడ్డు మీద కూర్చోబెట్టడం చూస్తుంటే ఇంకా మనం ఎక్కడవున్నామో తెలియడంలేదు. ఇది చూసే విదేశీయులు ''పూర్ ఇండియా'' అని జాలి పడుతూనే వున్నారు. వాళ్లకి తెలియని రహస్యం ఏమంటే ఇలా బిచ్చం ఎత్తుకున్న యాచకులు దగ్గర లక్షల కొద్దీ డబ్బు ఉంటుందనీ, వాళ్లకి బ్యాంకు అకౌంట్స్ ఉంటాయనీ, ఇదికూడా ఒకరకం ఉపాధి అనీ తెలియదు. అదిసరే! కానీ చిన్న పిల్లలచేత ఇలాంటి పనులు చేయిన్చ కూడదని బాలల సంఘాలు, బాల కార్మిక వ్యవస్థ అధికారులు ఏమి చేస్తున్నారో తెలియదు. లోక్సత్త సంస్థలో నేను పనిచేసినప్పుడు బాలల సంఘం అధ్యక్షులు అచ్యుత రావుగారు సమావేశాలకు వచ్చినపుడు పరిచయం. వారు, ఇలాంటి వేధింపులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుని మాన్పించేవారు. వారు చనిపోయాక ఏమి జరిగిందో పట్టించుకునే వారు లేరు కాబోలు. తెలంగాణా విడిపోయాక కె సి ఆర్ యాచకులు ఎక్కడా కనిపించ కూడదని వారికి ఆశ్రయం కల్పించి, అడుక్కుతినడం నిషేధించారు. కొన్ని రోజులు బాగానే గడిచింది. ఆతర్వాత మళ్ళీ ఇప్పుడు మామూలే. అయితే పెద్దవాళ్ళు అడుక్కోడం, పిల్లలచేత బొమ్మలు, పళ్ళు అమ్మించడం కనిపిస్తోంది. ఈ యాచకత్వం వెనుక మాఫియా ఉందని, రక రకాల వేషాలు మారుస్తూ నడిపిస్తూనే వున్నారని, పత్రికలూ టీవీ చానళ్లు చెబుతున్నారు. వొళ్ళంతా రంగులు పులిమి దేశ నాయకుల వేషాలు వేశారు. అప్పుడు ఎవరికో వెలిగినట్టు వుంది.. దేశంకోసం పోరాడిన వారు తీరా స్వతంత్రం వచ్చాక అడుక్కోవడం బాగాలేదని. (చిన్న పెద్దా గాంధీ నెహ్రు వేషాలు వేయడం చూసాను ). కాలం మారింది అన్నిటిలోను మార్పు వచ్చింది కనుక బెగ్గింగులోనూ మార్పు రావాలి అని మూడేళ్ళ పిల్లాడిని రోడ్డుమీద అడుక్కోడానికి కూర్చోబెట్టిన తల్లితండ్రుల కసాయితనం చెబుతోంది. వొంటిమీద బట్టలు లేకుండా ఎండలోనూ చలిలోనూ కునికిపాట్లు పడే పసివాళ్లను చూసినపుడు తల్లి తండ్రి చేసిన తప్పుకు ఏమిచేయాలి? తేలికగా డబ్బు సంపాదించే సమిధలు కన్నబిడ్డలు కావడం సిగ్గుచేటు కదూ! ఇప్పుడు బాలల హక్కుల నేతలు ఏమయ్యారు? బాల కార్మిక చట్టం దుమ్ములో కలిసిందా? మారని మనుషులమీద విసిగిపోయి మవునంగా వున్నారా ? ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ప్రజలు కూడా పైసలు ఇవ్వకూడదు. ఈ బిచ్చగాళ్లను తయారు చేసింది కూడా రాజకీయాలా! అన్నీ ఉచితాలు పంచి, ఓటును నోటుతో కొని, జనాలకు కష్టం తెలియని సోమరులుగా తయారు చేశారు. ఎవరో చేసిన తప్పుకు బాలలు బలి అవుతున్నారు. తాగుడికి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి తల్లి తండ్రులు నిషాలో మునిగి కన్న బిడ్డలను డబ్బుకోసం శిక్షిస్తున్నారు. ఇది తీవ్రాతి తీవ్ర మైన దారుణం. మన చేత నైనది వారికి డబ్బు అందుబాటులో లేకుండా చేయడం. బాలలకు హక్కు చట్టం అంటూ సజీవంగా సరిగ్గా నడిస్తే ఫిర్యాదు చేయడం. ఈ అడుక్కోవడం ఎప్పటినుంచో చూస్తున్నాం. ఇప్పటికి ఇంకా అదే ధోరణిలో వ్యవస్థ ఉందీ అంటే అవమానం, బాధ, సిగ్గు కదూ! ******** |
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)

Komentarze