'Ending Of The Pride' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 15/03/2024
'ఎండింగ్ అఫ్ ది ప్రైడ్' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
స్వామి.. ఈ పేరు వింటే ఎంతో మంచి వ్యక్తిలా దైవభక్తి కలిగి పదిమందికి మేలు చేసే గొప్ప మనిషిలా ఉంటాడు అనిపిస్తుంది కదా.. కానీ.. ! స్వామి ఆందుకు పూర్తి విరుద్దమైన మనిషి.
ఒక్కగానొక్క కొడుకు కావటంతో స్వామి తండ్రి తన ఆస్తులను, తన పేరిట ఉన్న పలు కంపెనీలను స్వామి పేరన ముందే రాసేయగ కొంతకాలానికి స్వామి తండ్రి మరణించాడు. తాత, తండ్రి పోలికలు ఉన్నా.. ఆస్తులు ముట్టినా.. స్వామికి వాళ్ళ బుద్దులు మాత్రం అబ్బలేదు.
నిజమే.. ! తండ్రి సొమ్ము ఉంటే సహజంగానే బలుపు ఎక్కువ ఉంటుంది కదా.. ! స్వామికి చిన్నప్పటి నుండే గర్వం ఎక్కువ. అది డబ్బు వలనే అయి ఉంటుంది. డబ్బుకు ఎవరినైనా, ఎప్పుడైనా మార్చేయగల శక్తి ఉంటుంది. అహంకారంతో బతికే స్వామికి బద్దకం ఎక్కువ అయి కంపెనీ పనులు చూసుకునేందుకు కొందరు వ్యక్తులును పెట్టుకుని చాలా కాలంగా బార్య పిల్లలుతో కలిసి తెగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తు గడుపుతున్నాడు. డబ్బులు కష్టపడకుండా వస్తుండటంతో స్వామి అహంకారం తారా స్థాయికి చేరుకుంది.
చివరకు అతని ప్రవర్తన ఎలా ఉందంటే ఇల్లు కదలకుండా కోట్లు సంపాదించే తెలివి తనకే సొంతమని చెప్పుకునేంత. అక్కడితో ఆగని అతడి ప్రవర్తన తన డబ్బుతో తాను తృప్తి చెందని విధంగా మారింది. తన సత్తా అందరికీ తెలియాలని రకరకాల కార్లలో తిరుగుతూ వెళ్ళిన ప్రతి చోట తోటివారి పట్ల అహంకారం ప్రదర్శించేవాడు.
కోటీశ్వరుడు అయిన స్వామికి డబ్బుకు మధ్య ఎంత లింక్ ఉందంటే దారిన పోయే బిచ్చగాడు, "అయ్యా ఆకలితో ఉన్నాను, పదిరూపాయలు ఇవ్వం"డని అడిగితే
"నీకేమైనా బాకి ఉన్నానా.. ? వెళ్ళవయ్యా! ప్రతి ఒక్కడికి బాగా అలవాటు అయిపోయింది" అంటాడు.
దారిన పోతున్నప్పుడు దురదృష్టవశాత్తు ఎవరివో డబ్బులు పడిపోయినా.. కటిక పేదరికంలో ఉన్న వ్యక్తి డబ్బులు దొరికితే ఎలా సంబరపడి తీసుకుంటాడో అలాగే స్వామి కూడా ఆనందంతో తీసుకుంటాడు. ఆ డబ్బులు ఎవరివి.. ? పోగొట్టుకున్నవాళ్ళు ఎంత బాదపడతారు.. ? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామనే ఇంగిత జ్ఞానం ఈ కోటీశ్వరుడుకి లేదు. అలా స్వామి తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లు అనుభవిస్తున్నాడు.
ఒకరోజు కుటుంబం సభ్యులుతో కలిసి దూరప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో కారు టైరు ఒకటి పేలిపోయింది. స్వామి కారుని కాంట్రోల్ చేసి రోడ్డు పక్కన కాలువ దగ్గర ఆపాడు. చుట్టూ ఎవరు లేకపోవడంతో తానే టైరు మార్చటానికి సిద్దమయ్యాడు. చివరకు టైరు మార్చి బోల్ట్ లు పెడుతుండగా ఆ బోల్ట్ లు అనుకోకుండా కాలువలో పడిపోతాయి. దీంతో స్వామి లబోదిబోమన్నాడు. ఏం చేయాలో తోచటం లేదు. టైం కూడా అవుతుంది.
అలా చాలా సమయం గడిచాక అటునుంచి ఇద్దరు పల్లెటూరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తుండటం చూసి వారితో జరిగిన విషయం చెప్పి
"దగ్గరలో పట్టణానికి వెళ్ళి ఎవరైతే కారు బోల్ట్ లు తెస్తారో వాళ్ళకి లక్షరూపాయలు ఇస్తా"నన్నాడు.
ఆ మాటలకు అందులో ఒకడు
"అయ్యా మీరు లక్షరూపాయలు ఇవ్వకపోయినా మీ బాద అర్థం చేసుకుని తీసుకొచ్చి ఇవ్వగలము కానీ.. !మేము చెప్పే సలహ వింటే మీరు యథావిధిగా మీరు కారుతోనే పట్టణం పోగలరు" అన్నాడు.
"ఎలా " ప్రశ్నించాడు స్వామి.
"ఎలా అంటారేంటి.. ? మిగతా టైర్లలో ఒక్కో బోల్ట్ విప్పి పూర్తిగా బోల్ట్ లు లేని టైరుకి వేసి వెళ్ళవచ్చు మరలా పట్టణంలో నాలుగు బోల్ట్ లు కొనుక్కుని ఒక్కో టైరుకి ఒకటి బిగింఛుకుంటే సరి " అన్నాడు.
ఈ ఆలోచన నాకు ముందే వస్తే బాగున్ను సబాబుగానే ఉందని అలాగే చేసి వెళ్ళాడు. గమ్యం చేరుకున్నాడు.
గమ్యం అయితే చేరుకున్నాడు కానీ.. అతడి ఆలోచనలు మాములుగా లేవు. ఇంత తెలివైనోడినని విర్రవీగే నాకే ఇలాంటి ఆలోచన రాలేదు కానీ.. " పాత లుంగీ, చిరిగిన చొక్కా వేసుకున్న ఒక మనిషికి వచ్చిందా అంటూ అతడి పై అసహనంతో ఉన్నాడు.
కొన్ని రోజులు గడిచాక ఒక పని విషయం మాట్లాడేందుకు వేరొకరితో మీటింగ్ కోసం ఒక పెద్ద రెస్టారెంట్ కి వచ్చాడు. అక్కడ ఫోన్ మాట్లాడుతూ పార్కింగ్ చేసి సూట్కేస్ తో దాదాపు కోటి రూపాయలు కారులో ఉంచి కారు డోర్ కి తాళం వేసినట్లె వేసి డోర్ కే తాళం ఉంచేసి వెళ్ళిపోయాడు. పైగా కారు అద్దం కూడా సగం తీసే ఉంది.
పార్కింగ్ క్రమబద్ధీకరించే పార్కింగ్ బాయ్ ఆ కారు డోర్స్ కి ఉన్న తాళాలు, సూట్కేస్ లో డబ్బులు చూసి కారు అద్దాలు పూర్తిగా వేసి, కారుకి మరియు డోర్స్ కి తాళాలు వేసి తాను పట్టుకుని వెళ్తూ.. డోర్ వద్ద తన ఫోన్ నంబర్ రాసిన ఒక పేపర్ పెట్టి వెళ్ళాడు.
స్వామి మధ్యాహ్నం పని ముగించుకుని కారు దగ్గరకు రాగానే తాళాలు గుర్తుకు వచ్చాయి. డోర్ చూడగా ఏదో పేపర్ ఉంది. వెంటనే ఆ నంబర్ కి ఫోన్ చేశాడు. పాపం ఆ పార్కింగ్ బాయ్ ఆ సమయంలో బోజనం చేస్తున్నాడు. ఎంగిలి చెయ్యితోనే పరిగెత్తుకు వచ్చాడు. ఎందుకంటే తాళం, డబ్బులు విషయంలో అతనెంత కంగారుపడతాడో అతడికి తెలుసు కాబట్టి.
తాళాలు స్వామి చేతికి ఇచ్చి జరిగింది చెప్పాడు. స్వామి కళ్ళలో ఏదో మార్పు కనపడింది. ధన్యవాదాలు అంటూ చెయ్యి ఇచ్చాడు. ఎంగిలి చెయ్యి వలన తిరస్కరించాడు అతడు. తన డబ్బును, తన కారుని సేఫ్ గా ఉంచటమే కాకుండా ఫోన్ చేసిన వెంటనే బోజనం మద్యలో వచ్చాడు. దీంతో
"డబ్బులు తీసుకునే అవకాశం ఉన్నా ఎందుకు తీసుకోకుండా కాపాలకాశావు.. ? ప్రశ్నించాడు స్వామి.
"సార్.. నేను కష్టపడి సంపాదించే డబ్బులకు మాత్రమే విలువ ఇస్తాను. అక్రమంగా పరులు డబ్బును దోచుకుని
బతికితే ఆ బతుకునకు ఒక విలువ ఉండదు. అయినా ఎవరి డబ్బులు వారికి ముఖ్యం కదా.. ! అవి పోతే వారి బాద ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే అలా చేయలేదు. చేయను కూడా” అన్నాడు.
అప్పుడు స్వామిలో అహంకారం పోయి మంచితనం ఒక్కసారిగా మనసునిండా నిండిపోయింది. అయినా ఆ తర్వాత స్వామి మంచాన పడి ఆరోగ్యం చెడి తుదిశ్వాస విడువగా అంత్యక్రియల్లో పూలలో చిల్లర పైసలు వేసి స్వామికి శవ యాత్ర జరిగింది.
మనిషి డబ్బు ఉందని అహంకారంతో బతికినా.. కోట్లు సంపాదించినా.. చచ్చాక శవం పై చిల్లర మాత్రమే చల్లుతారు ఆ చిల్లర కూడా మనము తీసుకెళ్ళలేము.
స్వామి అహంకారం ముగిసి మంచితనం దాపురించే సరికి అతని జీవితం ముగిసిపోయింది.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
@rohin4927
• 3 days ago
Super
Kandukuri Sunitha kumar
•6 hours ago
Super story 🤝👏👏👏