#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ఎందుకనీ, #Endukani
Endukani - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 03/12/2024
ఎందుకనీ - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
చుక్కలు మెరియును ఎందుకనీ!
వెలుగులు పంచేటందుకనీ!
మొక్కలు పెరుగును ఎందుకనీ!
ఇల సాయపడేటందుకనీ!
వానలు కురియును ఎందుకనీ!
పంటలు పండేటందుకానీ!
పూవులు విరియును ఎందుకనీ!
సొగసులు రువ్వేటందుకనీ!
యేరులు పారును ఎందుకనీ!
దాహం తీర్చేటందుకనీ!
కోయిల కూయును ఎందుకనీ!
మనసులు దోచేటందుకనీ!
వెన్నెల పూయును ఎందుకనీ!
చల్లదనమిచ్చేటందుకనీ!
చిలుకలు పలుకును ఎందుకనీ!
తీపిని తెలిపేటందుకనీ!
దేవుని కొలుచుటెందుకనీ!
దీవెనలొందేటందుకనీ!
గురువును చేరేటెందుకనీ!
జ్ఞానం పొందేటందుకనీ!
పుస్తక పఠనమెందుకనీ!
విషయాలెరుగేటందుకనీ!
చదువులు చదివేటెందుకనీ!
రాతలు మారేటందుకనీ!
స్నేహం చేసేటెందుకనీ!
ప్రేమ రుచి చూసేటందుకనీ!
కవితలు వ్రాసేటెందుకనీ!
హాయిని పొందేటందుకనీ!
కలమును పట్టేటెందుకనీ!
నిజమును చెప్పేటందుకనీ!
పొలమును దున్నేటెందుకనీ!
కడుపులు నింపేటందుకనీ!
-గద్వాల సోమన్న
"ఎందుకనీ" అనేది గద్వాల సోమన్న గారు రాసిన ఒక కవిత. ఈ కవితలో ప్రకృతి, జీవితం మనుషుల చర్యలు ఒకసారి ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నలు లేపుతూ, వాటి వెనుక ఉన్న కారణాలను అన్వేషిస్తుంది.
ప్రకృతి సూత్రాలు, జీవుల పెరుగుదల, వానలు, పూవులు, కోయిల గానం, దేవుని కొలుచుట, గురువు దగ్గర జ్ఞానం పొందడం, స్నేహం, ప్రేమ, కవితలు రాయడం వంటి అనేక అంశాలను కవి వివరిస్తాడు. ఈ కవితలో ప్రతి కార్యానికి ఒక సమాధానమైన అర్థం, ప్రయోజనం ఉంటుంది.
ఇది జీవితం గురించి లోతైన దృక్పథం తీసుకొని, ప్రతి చిన్న అంశానికి విశేషమైన అర్థాన్ని ఇవ్వడంలో ఆసక్తిని కలిగిస్తుంది.