top of page
Writer's pictureGadwala Somanna

ఎంత మంచిది అమ్మ!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ఎంత మంచిది అమ్మ, #Entha Manchidi Amma


Entha Manchidi Amma - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 04/12/2024

ఎంత మంచిది అమ్మ - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


జోలపాట పాడును

చిన్ని బొజ్జ నింపును

ఎంత మంచిది అమ్మ!

ఒడిని పాన్పు చేయును


కనుపాపలా చూచును

గుండెల్లో దాచును

అమ్మ అనిన భరోసా!

పెంచి పెద్ద చేయును


జ్వరమొస్తే అమ్మ 

మది విలవిలలాడును

సేవలెన్నో చేయును

పూజలెన్నో  సల్పును


నాన్న కోపగించిన

ఫిర్యాదులొచ్చిన

మనసున దాచుకొనును

మహిని ఎవరేమనిన


గోల ఎంత చేసిన

ప్రాణం విసిగించిన

సహనమూర్తి అమ్మ!

పక్క రోజు తడిపిన


అమ్మకు లేరు సమము

పరిమళించే సుమము

సృష్టిలోనే మేటి

దేవుని బహుమానము



-గద్వాల సోమన్న



28 views0 comments

留言


bottom of page