#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #EppatidoIppudenduku, #ఎప్పటిదోఇప్పుడెందుకు, #TeluguMoralStories, #నైతికకథలు
వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (29/12/2024) ఎంపికైన కథ

Eppatido Ippudenduku - New Telugu Story Written By - Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 24/12/2024
ఎప్పటిదో ఇప్పుడెందుకు? - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సుబ్బారావు, రాజా సాయంత్రం పూట వాకింగ్ వెళ్తున్నారు. ఇంతలో వారికి బబ్లూ కుమార్ ఎదురయ్యాడు.
సుబ్బారావు అతన్ని పలకరిస్తూ "హలో సార్ బాగున్నారా" అన్నాడు.
"నేను బాగున్నా. మీరు బాగున్నారా" తిరిగి అడిగాడు బబ్లూ.
సుబ్బారావు రాజాతో "నాది బైపాస్ లో ప్లాట్ ఉండేది కదా! అది అమ్మింది ఈనకే" అని మళ్లీ బబ్లూ వైపు తిరిగి "ఇప్పుడు ఉందా సార్?" అని అడిగాడు.
"అదా! ఇటీవలే అమ్మేశా" బదులిచ్చాడు బబ్లూ.
"ఆహా అమ్మేశారా? ఎంతకు సార్?" అడిగాడు సుబ్రావ్.
"పది లక్షలకు పోయింది" నిజాయితీగా చెప్పాడు బబ్లూ.
దానికి సుబ్బారావు "అవునా! అప్పుడు మీరు రెండు లక్షలకు కదా కొనింది" అన్నాడు.
బబ్లూ వెలుగుతున్న మొహంతో "అవును సార్" అంటూ బదులిచ్చాడు.
సుబ్బారావు రాజా తో "అబ్బా భలే లాభం వచ్చింది కదూ" సంతోషంగా అన్నాడు.
రాజా చిద్విలాసంతో తలూపాడు.
తనకు లాభం వస్తే సుబ్బారావు ఎందుకు సంతోష పడుతున్నాడో అర్థం కాక "అవును సార్! ఏదో అలా కలిసొచ్చింది" అన్నాడు బబ్లూ.
వెంటనే సుబ్బారావు "సరే అయితే.. మీకు ఎనిమిది లక్షలు లాభం కదా! నాకు దాంతో సగం, నాలుగు లక్షలు ఇవ్వండి చాలు" అన్నాడు తనకు రావాల్సిన బకాయి ఉన్నట్లు.
బబ్లూ అర్థం కాక "ఏం మాట్లాడుతున్నారు సార్?" అన్నాడు.
సుబ్బారావు "ఏందేంది సార్. నేను మీకు రెండు లక్షలకమ్మినా. మీరు పది లక్షలకమ్మినారు. ఎనిమిది లాభంకదా! దానిలో సగం ఇవ్వమంటున్నా" అన్నాడు న్యాయబద్ధంగా మాట్లాడుతున్న ఫీలింగ్ తో.
బబ్లూకు బుర్ర తిరిగి "ఎలా ఇస్తారు సార్! మీరు అమ్మిన తర్వాత డీల్ అయిపోయింది. మళ్లీ దాని గురించి ఎలా మాట్లాడుతారు?" అన్నాడు అయోమయంగా.
దానికి సుబ్బారావు "ఏంది సార్ అట్లా అంటారు. నేను రెండు లక్షలకు కదా అమ్మింది. మీరు పది లక్షలకు అమ్మినారు. నాకు లాభం తక్కువ వచ్చింది కదా!" అన్నాడు.
బబ్లూ ఇరిటేట్ అవుతూ "ఏంటి సార్ ఈన మాట్లాడేది. ఎప్పుడో ఐదేళ్ల కిందట నాకు అమ్మాడు. అప్పుడు ఆ రేటు ఉన్నది. అక్కడికి అయిపోయింది. ఇప్పుడు 10 లక్షలు పలికింది అంటే ఇప్పటి రేటు. దాన్ని అడిగితే ఎట్లా?" అంటూ అరిచాడు రాజా వైపు తిరిగి.
"అంటే ఇప్పుడు ఏ పాయింట్ మీద నాకు మళ్ళీ లాభం రాదు అంటున్నారు?" తాపీగా ప్రశ్నించాడు సుబ్బారావు.
"మనం ఏదైనా ఒక పని చేశామంటే అది ఆ టైం కి పూర్తయిపోయినట్టు. ఆ పని అప్పటి పరిస్థితులకు తగినట్లు జరుగుతుంది. మళ్లీ చాలా కాలం గడిచిన తర్వాత ఆ పరిస్థితులు ఉండవు. పోయిన కాలం గురించి, ఆ పరిస్థితుల గురించి మాట్లాడకూడదు" వివరణ ఇచ్చాడు బబ్లు.
అప్పుడు సుబ్బారావు "అవునా! మరి నువ్వు పోయిన వారం ఒకరిని విమర్శించినావు గుర్తుందా" అడిగాడు.
"ఏమో గుర్తులేదు" అన్నాడు బబ్లూ.
"ఒక మహర్షి గురించి మాట్లాడావు. ఆయన ఒక శాస్త్రం రాశాడని, అందులో స్త్రీల స్వాతంత్ర్యం గురించి రాసాడని, అది తప్పని అన్నావు గుర్తుందా?" గుర్తు చేశాడు సుబ్బారావు.
"అవును అన్నాను. అయితే ఏంటి?" ఇంకా అర్థం కాలేదు బబ్లూకి.
"ఏంటి? ఇంకా బల్బ్ వెలగలేదా. అయిదేళ్ల కిందటి పరిస్థితికి ఇప్పటికీ తేడా ఉంటే మరి ఆ మహర్షి ఆ శాస్త్రం రాసేనాటికి ఇప్పటికి వేల సంవత్సరాల తేడా ఉంది. అప్పటి పరిస్థితుల్లో చెప్పింది ఇప్పుడు తప్పని ఎలా చెప్తావ్?"
అసలు పాయింట్ బయటపెట్టాడు సుబ్బారావు.
సమాధానం చెప్పలేక బబ్లూ ఆముదం తాగినట్లు ముఖం పెట్టాడు.
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
@veeraiahkatam4399
• 4 hours ago
nice
shaik maktumsab
•1 day ago
Good story sir ❤❤