top of page

ఈశ్వరా! పరమేశ్వర!

Writer: Yasoda GottiparthiYasoda Gottiparthi

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఈశ్వరాపరమేశ్వర, #EswaraParameswara


Eswara Parameswara - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 04/03/2025

ఈశ్వరా పరమేశ్వర - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


ఈశ్వరా! పరమేశ్వర!

ఈప్సితార్థ సంహరాణా!

విశ్వం నీవే కన్నులు మూసుకున్న

మనసుకు వెలుగువు నీవే


 శాశ్వతమగు శివ ప్రేమే సకల ఆధారము సృష్టి సమస్తము 

స్వయం ప్రకాశం 

నశ్వర మగు నా దేహమును భగవన్మయం చేసుకుని భక్తి 

మార్గమున నీ సన్నిధియే

 నా నివాసం 


అర్ధనారీశ్వరా! గంగాధర నాగాభరణా ! విష కoఠరా పార్వతీ హృదయేశ్వరా కరుణేందు శేఖరా! తరుణేందు మౌళి !కరుణాపూర్ణ సుధాబ్ధి! త్రిశూలధారీ !

త్రిలోచనా!

 నేత్రాలను కప్పి లోకాలను చీకటిమయం చేసే చిత్తవాంఛలను చేరినీయక ఆది జగదాంబ అర్థనారీశ్వరం తో

ఆద్యంత రహిత ఈశ్వరా!

గంగాతరంగిణి జలతరంగా 

భారమైన మా నిర్భాగ్యులను 

పాప సంచితుల లౌకిక భౌతిక తాపములను తీర్ధోకములతో 

శుద్ధితో నశింపజేయు గంగేశ్వరా!

 మృత్యుభయాన్ని శేషుల సైతం ముప్పుగా భావింపక ముక్తి కోసమే నిరంతరం నిన్ను ప్రార్ధింతుము మహేశ్వరా! నాగాభరణా మహేశ్వర !


ముల్లోకాలను ముంచి వేసే పన్నాగు ల విష ప్రజ్వల్లిన అగ్ని రూపమై మణికాంతి ధాతవై వాహిని

రక్షించిన మహాదేవ నీలకంధర!

అపర్ణగా తపస్సుతో వియోగాగ్నిని తపస్సాగ్నిగా సంస్కరించి పార్వతి దేవిని ప్రకాశంప చేశావు 

పార్వతీ హృదయేశ్వర!


మహిలోక వాసులకు మాత ఇచ్చిన శాపమును మన్నించి మౌళి శిరస్సున నెలవంక పైన చంద్రశేఖరుడువై 

వేడక ముందే వడి వడిగా వరాలను ప్రసాదించే ఉబ్బులింగడూ భోళా శంకరా!  శంభో శంకర!

***

-యశోద గొట్టిపర్తి





 
 
 

Comments


bottom of page