top of page
Writer's pictureKottha Priyanka

ఎత్తుపల్లాలు



'Etthupallalu' - New Telugu Story Written By Bhanupriya

Published In manatelugukathalu.com On 17/06/2024

'ఎత్తుపల్లాలు' తెలుగు కథ

రచన: భానుప్రియ


ఆరడుగుల అజానుబావుడై, చూడ చక్కని దేహదారుడ్యంతో, చూడగానే ‘అబ్బా.. ఎంత బాగున్నాడు!’ అనిపించే రూపంతో ర్యాంపు పై అలా నడుచుకుంటూ వస్తుంటే ‘ధీరజ్, ధీరజ్’ అంటూ ఆ ప్రాంతమంతా మారు మోగిపోతుంది. 


ఇక ధీరజ్ గతంలోకి వెళితే డబ్బుకు కొదవలేని ధనవంతుల ఇంట్లో పుట్టి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తుండగానే తల్లిదండ్రుల మధ్య "నేను గొప్ప అంటే నేను గొప్ప" అనే అహం, డబ్బు విషయం కారణంగా మనస్పర్ధలు వచ్చి ఎవరికి వారు విడిపోయి ధీరజ్ ని పసివాడు అని కూడా జాలి లేకుండా వారి అహానికి వీధి పాలు చేయగా.... 


ఏ లోటు లేకుండా పెరిగిన ధీరజ్ ఒక్కసారిగా ఏమీ లేని అనాధగా మారి ఎన్నో కష్టాలను, ఎన్నో నిద్రలేని కాలి కడుపు ఆకలి కేకలను చవిచూసాడు. 


అతని జీవన పయనంలో చేయని పని లేదు. పడ్డ కష్టం లేదు తన కష్టం ఫలితంగానే యవ్వనంలోకి అడుగుపెట్టగానే ఒక గొప్ప ఫ్యాషన్ కంపెనీని స్థాపించి కోట్లకు అధిపతిగా మారిపోయి, తన లాంటి ఎంతోమంది అనాధలుగా గల పిల్లలకు, అనాధాశ్రమాలకు సహాయం చేస్తూ, తన కంపెనీని నెంబర్ వన్ స్థానంలోకి నిలబెడతాడు. 

 

 "బెడ్ కాఫీ సార్" అంటూ సర్వెంట్ మాటలతో నిద్రలేచి, కాఫీ తాగి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తాడు. ధీరజ్.

 

"మే ఐ కమీన్ సార్" అని లోపలికి వచ్చి "గుడ్ మార్నింగ్ సార్" అంటూ తన చేతిలోని ఫైల్ ని అందిస్తాడు తన మేనేజర్ మనోజ్... 


"కొత్త పి. ఎ అపాయింట్మెంట్ కదా!" అంటూ సంతకం పెట్టి "తాను రాగానే నన్ను కలవమను" అని చెప్పగా, మనోజ్ కొత్తగా జాయిన్ అయిన ప్రియ ను "బాస్ ను కలవండి" అని ఛాంబర్ వైపు చూపించగా కొంత బెరుకుతో రూమ్ లోకి వెళుతుంది ప్రియ. 


ప్రియ ను చూడగానే మొదటి చూపులోనే ధీరజ్ కు గుండెల్లో ఎదో అలజడి మొదలైంది.. 


"సార్... సార్... " అంటూ ప్రియ పిలుపుకు ద్యాసలోకి వచ్చి "టేక్ యువర్ సీట్" అనగానే గబుక్కున కూర్చోని చాలా కలివిడిగా, చలాకి గా సమాధానాలు చెప్పి, అతి తక్కువ కాలంలోనే చిన్నతనం నుంచి ప్రేమ, ఆప్యాయతలు నోచుకోని ధీరజ్ ప్రియ చూపించే ప్రేమకు దాసోహమవుతాడు. అతి తక్కువ సమయంలో ధీరజ్ ప్రియను వదిలి వుండలేనంతగా ఒకటౌతారు... అలా నెల రోజులలోనే తన విషయాలు, ముఖ్యమైన ఆఫీస్ విషయాలు అన్నీ ధీరజ్ ప్రియతో పంచుకుంటాడు తన మనిషి అని... 


 అలా వారి ప్రేమ చిగురిస్తుండగా... 

"ఈరోజు ముఖ్యమైన టెండర్ ఉంది. కలిసి వెళ్దా”మని ప్రియకి ఫోన్ చేసి చెప్పగా తాను రాలేనని, ‘నువ్వు వెళ్లి రా!’ అని చెప్పటంతో ధీరజ్ తన కారులో బయలుదేరుతాడు.

.. 

అక్కడికి వెళ్లిన ధీరజ్ టెండర్ కోల్పోవడం, "సార్ మీ ఆస్తులన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా వేరే అకౌంట్ లోకి చేరిపోయిందని" కంగారుగా మనోజ్ ఫోన్ చేయగా.. ప్రియా తన ప్రత్యర్థి తో కలిసి రావడంతో ధీరజ్ ప్రియా తనని  మోసం చేసిందని తెలుసుకొని.


"నువ్వు నన్ను మోసగించానని సంతోష పడుతున్నావు కానీ, నేను మోసపోయినందుకు నీ మీద ఎలాంటి కోపం రావడం లేదు. ఎందుకంటే ఒక నెల రోజులలోనే నేను కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, ప్రియురాలి ప్రేమను నువ్వు నాకు చవిచూపించావు. ఇక కష్టాలు, మోసాలు అంటావా! అవి నా చిన్నతనంలోనే నన్ను కౌగిలించుకుని వున్నాయి. నా జీవన పయనంలో ఇలాంటి ఎత్తు, పల్లాలు ఎన్నో చూశాను కాబట్టి వాటి గురించి నాకు బాధ లేదు. ఎలా కష్టపడాలో ఎలా పైకి రావాలి నాకు అన్నీ తెలుసు నేనేంటో నేను నిరూపించుకోగలను. " అంటూ "నెల రోజులలో నాకు నీ ప్రేమను అందించావు. దానికి బహుమతిగా" అంటూ తన చేతి ఉంగరాలను, మెడలో ఉన్న బంగారు గొలుసులు తీసి తలదించుకున్న ప్రియ చేతిలో పెట్టి తన దారిలో వెళ్తాడు.. 

మళ్లీ తన లక్ష్యసాధన దిశగా.... 

***

భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/priyanka

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




28 views0 comments

Comments


bottom of page