తెలుగు బాలల కథ
'Evari Jeevitham Varidi' - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 20/09/2024
'ఎవరి జీవితం వారిది' తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
విస్తారంగా పెరిగిన జామ చెట్టు మీద ఉడుత ఒకటి దోరగా మగ్గిన జాంపండును ముందు కాళ్లతో పట్టుకుని తింటోంది.
ఆకు మీద వాలిన దోమను చూసి పట్టుకోడానికి అటుగా వచ్చిన ఒక ఊసరవెల్లి(తొండ) ఉడుత చేతిలోని జాంపండును చూసి " అదేంటి ?" అని అడిగింది ఆశ్చర్యంగా.
"దీన్ని జాంపండు అంటారు. తియ్యగా ఉంటుంది. నువ్వూ తిను" అని అందివ్వబోయింది.
"లేదు, లేదు. మేము మాంసాహారులం. కీటకాలు, పురుగులే మాకు ఆహారం. ఇటువంటివి తినకూడదు" అంది ఊసరవెల్లి.
"ఒక ప్రాణిని మరో ప్రాణి చంపుకు తినడం పాపం. అవీ మనలాగ జీవరాసులే కదా! "అని సానుభూతిని ప్రదర్శించింది ఉడుత.
"ప్రకృతిలో జీవరాసులు ఒకదాని మీద మరొకటి ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అందరూ మాంసాహారులైనా కష్టమే, అందరూ శాఖాహారులైనా ఇబ్బందే. సమతుల్యం పాటించాలంటే సృష్టిలో ప్రాణులు వాటికి అందుబాటులో ఉండే ఆహారం తింటూ మనుగడ సాగించాలి" ఉద్బోధ చేసింది తొండ.
"పోనీలే, నువ్వు శాఖాహారివి కావద్దు. ఈ జాంపండు చిన్న ముక్క రుచి చూడు" అని బలవంత పెట్టింది ఉడుత.
ఇష్టం లేకపోయినా ఉడుత మాటను కాదనలేక చిన్న జాంపండు ముక్కను అందుకుని నోట్లో పెట్టుకుని కొరికి "ఔను, తియ్యగాను రుచిగా ఉంది ఈ ఫలం. మెత్తగా ఉండే చిన్న చిన్న కీటకాలను, పురుగులను మింగే నాకు ఈ జాంపండు ముక్క తింటుంటే అదోలా ఉంది. నీకు నోట్లో దంతాలు వాడిగా గట్టిగా ఉంటాయి. కనక నమిలి మింగ గలుగుతున్నావు. నావి కోర దంతాలు. అదీగాక చెమ్మగా ఉండే నా నాలికను విసిరి కీటకాల్ని ఇరికించి నోట్లోకి లాక్కుంటాను. తిండి కోసం పరుగులు పెట్టనవుసరం ఉండదు" అంది ఊసరవెల్లి తల ఆడిస్తు.
మాటల సందర్భంలో, "ఏమిటి నీ వీపు మీద నల్లగా మూడు గీతలు కనబడుతున్నాయి? తోక కూడా కుచ్చుతో పొడవుగా కనబడుతోంది" అనుమానం వెలుబుచ్చింది.
"మేము రామభక్తులమట. త్రేతాయుగంలో మా పూర్వీకులు శ్రీరాముల వారు లంక మీద యుద్ధానికి వెళ్లేటప్పుడు వానర సైన్యం బండరాళ్లను సముద్ర జలాలలో బాటగా వేస్తుంటే ఈ పొడవైన కుచ్చు తోకను సముద్ర జలంతో తడిపి మెత్తటి ఇసుకను దారి పొడవునా జల్లారట. మా పెద్దల సేవను మెచ్చి శ్రీరాముడు ఆప్యాయంగా చేతి మూడు వేళ్లతో వీపు మీద నిమిరారట.
అప్పటి నుంచి ఆ చేతి వేళ్ల గుర్తులు మా వీపుల మీద ఉండిపోయాయి. మేము కూతలతో ఒకరినొకరం పలకరించుకుంటాం" ఊసరవెల్లి సందేహం తీరుస్తూ, "నీ తల వీపు నిండా అలా ముళ్లు ముళ్లుగా ఉన్నా”యేంటని అడుగుతూ, “తల కూడా ఆడిస్తున్నా”వని తన మనసులోని మాటను బయట పెట్టింది ఉడుత.
ఊసరవెల్లి తల ఆడిస్తు "త్రేతాయుగంలో జరిగిన రామాయణంతో మా జాతికీ సంబంధం ఉంది. దశరథ మహరాజు అభ్యసించిన శబ్ధవేది విలువిద్య వల్ల అంధులైన తల్లిదండ్రుల దాహం తీర్చడం కోసం మునికుమారుడు శ్రావణుడు నీటి కోసం నదిలో దిగి మట్టి పాత్రలో నీరు నింపుతుండగా వచ్చిన శబ్దాన్ని వన జంతువుగా బావించి విల్లుతో బాణం ఊస సంధించగా, వచ్చి మునికుమారుని హృదయానికి గుచ్చుకుని ప్రాణాలు వదిలాడట.
జరిగిన పొరపాటును గ్రహించి మహరాజు మునికుమారుని విగత శరీరాన్ని తీసుకుని అంధ వృద్ధ తల్లిదండ్రుల వద్దకు రాగా వారు విషయం తెల్సుకుని కోపించి "నువ్వూ మాలాగ పుత్ర శోకంతో మరణించు " అని శపిస్తు, శ్రావణ కుమారుని హృదయంలో దిగిన బాణం ఊసను పైకి లాగి మా కుమారుని మరణానికి కారణమైన నువ్వు తల భారంతో శరీరమంతా ముళ్లతో రంగులు మార్చే వనజీవిగా క్రిమి కీటకాలు భుజిస్తూ బతకమని శాపమిచ్చాడట. అప్పటి నుంచి మా జాతంతా ఊసరవెల్లి బ్రతుకుతో జీవనం వెళ్లదీస్తున్నా”మని తన గోడు చెప్పుకుంది తొండ.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు : శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు :
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments