#ఎవరికిఎక్కువఅక్కర, #EvarikiEkkuvaAkkara, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ
'Evariki Ekkuva Akkara' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 06/10/2024
'ఎవరికి ఎక్కువ అక్కర' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
రాఘవయ్య, రంగమ్మల ఒక్కగానొక్క కొడుకు గోపాల్. రాఘవయ్య గారి చెల్లెలు అంజమ్మ. వారి భర్త రాజారావు. ఆ దంపతులకు ఒక కొడుకు శాంతారామ్. పెద్ద కూతురు సుగుణ. చిన్న కూతురు మానస.
రాఘవయ్య వ్యవసాయాదారుడు. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్నతనం నుండి ఒక్కడే కొడుకు అయినా ఆ దంపతులు గోపాల్‍ను కట్టుదిట్టంగా క్రమశిక్షణతో పెంచారు. స్కూలు, కాలేజీల్లో గోపాల్ ఉత్తమ విద్యార్థి. సాటి విద్యార్థులు, మాస్టర్లు గోపాల్‍ను ఎంతగానో అభిమానించేవారు. ఎం.ఎ ఫస్ట్ క్లాసులో పాసైన గోపాల్ సబ్ రిజిస్టార్‍గా ఉద్యోగంలో చేరాడు. స్కూలు, కాలేజి సెలవు రోజుల్లో గోపాల్ తన తండ్రితో పొలానికి వెళ్ళి ఆ పనులన్నీ నేర్చుకొన్నాడు. కాలాన్ని వృధాగా గడపటం, స్నేహితులతో కలిసి బలాదూరు తిరుగుళ్ళు తిరగడం, అనవసర ప్రసంగాలు గోపాల్‍కు చిన్నతనం నుండి ఇష్టం లేదు.
రాఘవయ్య, రంగమ్మల దాంపత్యం ఎంతో అన్యోన్యమైనది.
ఉద్యోగం రాగానే గోపాల్‍కు వారి చెల్లెలు అంజమ్మ, రాజారావుల కుమార్తె సుగుణతో వివాహం ఘనంగా జరిపించారు. అంజమ్మ, రాజారావుల దాంపత్యం సజావుగా సాగలేదు. తన నిర్ణయాన్ని భర్త కాదంటే అంజమ్మకు ఆవేశం వస్తుంది. భర్తను ఎదురించి నోటికొచ్చినట్లు ఆవేశంగా మాట్లాడే తత్త్వం. కొడుకు శాంతారామ్ చిన్న కూతురు మాసన వివాహం రాజారావు గొప్ప సమస్య. అర్థాంగి ఇరువురు పిల్లలు ఒక మాట. వారికి నచ్చిన సంబంధాలు రాజారావుకు నచ్చలేదు. రాజారావు కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్. ఎం.ఎ, పి.హెచ్.డి డాక్టరేట్ సాధించాడు. ఎంతో సౌమ్యుడు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. కొడుకు శాంతారామ్ ముమ్మూర్తులా తండ్రి పోలిక. కూతురు మాసన తల్లికి డిటో.
సంస్కారం అనేది పుస్తకాలను చదివినంత మాత్రాన రాదు. అది జన్మతః రక్తంలో రావాలి. రాజారావు, రాఘవయ్య కలవడానికి ఇంటికి వచ్చారు. వారు తోటకు వెళ్ళారని రంగమ్మ చెప్పగా రాజారావు తోటలో వారిని కలిశారు. విచారంగా వున్న రాజారావుతో రాఘవయ్య.
“ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం, ఆవేదన కలిగేది తన అర్థాంగి తత్త్వాన్ని అనుసరించి అంతకుముందు, తన తల్లితండ్రుల ఆదరాభిమానాలను స్థితి గతులను అనుసరించి పురుషుని జీవిత సారథి స్త్రీమూర్తి ప్రథమ దశలో (వివాహం వరకు) తల్లిగా వివాహానంతరం ఇల్లాలుగా భాసిల్లుతుంది. రాజా నీ సమస్యలన్నీ నాకు తెలుసు. చెప్పేది విను. హిందూ పురాణాల ప్రకారం స్త్రీల (వర్గీకరణ) రకాలు నేను చెప్పే వివరాలు మన వేదాలు మనుస్కృతి, ఋషి, వాత్సాయన సంకలనాలపై ఆధారపడినవి.
అన్ని హిందూమత గ్రంథాలు స్త్రీ మూర్తిని దేవుని సృజనాత్మక శక్తి ’శక్తి’ స్వరూపంగా వర్ణించాయి. ఒక స్త్రీ ఈ మొత్తం విశ్వాన్ని (ప్రపంచాన్ని) సృష్టించడానికి భగవంతుడు స్త్రీ కోణాన్ని ప్రతిబింబించాడు. మరియు దేవుడు సర్వాంతర్వామి, ప్రేమ, ధర్మం, బలం, అందం మరియు త్యాగం వంటి దైవీక లక్షణాలను కూడా స్త్రీలో ఉంచుతాడు. స్త్రీలు అత్యంత శ్రద్ధ, గౌరవం మరియు అభిమానంతో వ్యవహరించడానికి అర్హులు. హిందూ స్త్రీలు పురుషులను గురించి వాత్సాయనుడు కళ్యాణమల్లుడు అనేక వివరాలను విశదీకరించారు. పాష, అశ్వ, పుషభ అను పురుష జాతులను శరీర ఆకృతిని బట్టి పద్మిని, చిత్రిణి శంకిణి, హస్తిణి మెహ్రాయిణి అని స్త్రీ జాతులను గురించి కళ్యాణ మల్లుడు అనంగరంగ అను గ్రంథమును 15వ శతాబ్దమున ఢిల్లీని రాజధానిగా చేసుకొని (1451 నుండి 1526 వరకు) పాలించిన లోడి సామ్రాజ్యానికి చెందినవాడు అనంగరంగ భారతీయ్య శాస్త్రం ఆ శాస్త్రం సుప్రసిద్ధి. వాత్సయనుడు రచించిన కామశాస్త్రాన్ని పోలి వుంటుంది.
స్త్రీల వివరణ:
1. పద్మిని (కమల స్త్రీ) :- అరుదైన కొందరు స్త్రీలు అత్యంత అందంగా పవిత్రమైన, మనోహరమైన భావాలతో తల్లిదండ్రులకు అత్తామామలకు సేవలు చేస్తారు. భర్తతో అతి ప్రియంగా వుంటారు. వారి వంటి వాసన కమలం, వంటి వాసనను వెదజల్లుతుంది. పద్మిని తెగ స్త్రీకి మహారాణి చిత్తూరు పద్మిని దేవి ఉదాహరణ.
2. చిత్రాణి (కాళామహిళ) :- సన్నని శరీర రూపాన్ని కలిగి వుంటారు. వీరు మంచి విశ్వాస పాత్రులు. వీరు తమ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ఇష్టపడతారు. స్వభావంతో మంచి తెలివైనవారు.
3. శంకిని (శంఖం స్త్రీ) :- ఎత్తుగా వుండి సవ్వడితో నడుస్తారు. చురుకైన మరియు తెలివైన మహిళలు. స్వతంత్ర్యంగా ఉండడానికి ఇష్టపడతారు. ఆధిపత్యాన్ని కాంక్షిస్తారు. ఆ కారణంగా భర్తతో వివాదాలు కలుగుతాయి.
4. సద్మిని (పిరికి స్త్రీ) :- వీరు పిరికి స్వభావులు. సిగ్గు అధికం, మరియు ఉల్లాసంగా ఉంటారు. వీరు తమ భర్తలను సంతోషం పెట్టడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు. వీరు శరీర ఆకృతి మరియు లక్షణాలు సగటు.
5. మెత్రాయిణి (దురదృష్టవంతురాలు) : అందంగా చామనఛామ మరియు ఆకర్షణీయంగా ఉంటారు. వీరి భర్తలు క్రూరంగా మరియు బలహీనంగా వుంటారు. కాబట్టి వారి కుటుంబ జీవితం కష్టతరంగా వుంటుంది.
భిన్న వర్గీయులైన అత్తాకోడళ్ళ మధ్యన సఖ్యత వుండదు. ఒకే వర్గీయులైన తల్లీకూతుళ్ళు. అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా వుంటారు. మన హైందవ శాస్త్ర పరిజ్ఞానం లేనివారికి స్త్రీ వర్గీకరణ చేయడం అసాధ్యం.
ప్రతి స్త్రీ మూర్తిని గౌరవించడం, అభిమానించడం వారు కష్టాల్లో ఉండిన, మనం చేయగల సహాయం చేయడం ప్రతి పురుషుని కర్తవ్యం. బాధ్యత. ఆ తత్త్వం కల వ్యక్తి ఎంత కష్టాన్నయినా లెక్క చేయదు. అలాంటి తత్త్వం గల పురుషునితో అన్ని వర్గ స్త్రీలు సహకరిస్తారు. ఆనందిస్తారు. అర్థాంగి సహన సంపత్తి. అండదండల వలన అవలీలగా కష్టకాలాన్ని సహనంతో పురుషుడు దాటగలడు.” చెప్పడం ఆపాడు రాఘవయ్య.
పురుషులు మూడు తెగలు:-
1. షాష :- వీరు సౌమ్యులు. సహనశీలురు. శాంతమూర్తులు. కుందేలు వలె.
2. అశ్వ : భారీ విగ్రహం, స్వాతిశయం, ఆడంబరం, స్త్రీ పట్ల అవిశ్వాసం, అవసరానికి వాడుకోవడం, భోజనప్రియులు.
3. పుషచ :- చంచల స్వభావులు. అందరినీ తమ స్వార్థానికి వాడుకొనేవారు. స్త్రీలతో వాదన, వారిని కొట్టడం, పరుషంగా మాట్లాడటం, మాయమాటలతో అవసరాలను తీర్చుకోంటారు.
ఆ కోవకు చెందినవాడు రాఘవయ్య. దానికి వ్యతిరేక వర్గీయుడు రాజారావుగారు.
రౌతు కొంది గుర్రం అన్నట్లు భర్తననుసరించి భార్య తల్లిదండ్రులను బట్టి సంతతి. మన భారతదేశ సనాతన ధర్మాలు. ఆచార వ్యవహారాలు మనకు పాలకులుగా ఉండిన ఆంగ్లేయులు వారి విద్యావిధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టి మన భాషా విద్యా విధానాన్ని కలుషితం చేశారు. మన భారతదేశంలో ఆంగ్లేయులు మన భారతజాతి ప్రజావాహినీ మనోతత్వాలను ఎలాగైనా బ్రతకాలి అనే రీతికి మార్చి, ఇలాగే బ్రతకాలి, అనే మన పూర్వీకులు జీవన విధానానికి మనలను, మన సంతతిని దూరం చేశారు. విద్యావిధానం, భాష, కట్టు, బొట్టు, సంస్కృతి ఆచార వ్యవహారాలు మారిపోయాయి. జాతిలో భావాలలో ఆచరణలో సంకరత సంతరించుకొంది.
పాశ్చాత్య నాగరీకత అనుసరణగా స్త్రీ పురుషుల మధ్యన వుండవలసిన సద్భావనం, గౌరవాభిమానాలు, పెద్దా చిన్నా అనే గుర్తింపు గౌరవాలు మారిపోయాయి. చాలామందిలో దానికి కారణం పిల్లల తల్లిదండ్రులు వారి జీవిత విధానాలు. సమస్యను పెద్దలతో చర్చించి పరిష్కరించుకొనే రోజులు పోయాయి. బాగా చదువుకొన్నంత మాత్రాన స్త్రీ, పురుషుడు కాలేడు. పురుషుడు స్త్రీ కాలేదు. దైవ సృష్టిలో ఎవరి ప్రత్యేకతలు వారివే. పురుషుని తప్పు అతని ఒంటికి అంటదు (తప్పించుకోగలడు) స్త్రీ తప్పు చేసిన తప్పించుకోలేదు. (తప్పు ఆమెకు అంటుకుంటుంది)” రాఘవయ్య చెప్పడం ఆపాడు.
*
రాజారావు విచారంగా రాఘవయ్య ముందు కూర్చొని వున్నాడు. అతని భార్య అంజమ్మ వారి మాటలను లెక్కచేయరు. వినదు. వారి కొడుకు శాంతారాం తల్లి మాటను తప్ప అతని మాటను వినడు. ఈ మధ్యన తల్లీ కొడుకులకూ ఏదో విషయంలో వాదోపవాదాలు జరిగాయి. వారి అసభ్యపు ప్రసంగం రాజారావు చెవికి సోకింది. వినడమే తప్ప, అతను ఎవరికీ ఏమీ చెప్పలేడు. చెప్పినా వారు వీరి మాటలను లెక్కచేయరు.
"బావా!.... నా సమస్యకు పరిష్కారం ఏమిటి బావా!" దీనంగా అడిగాడు రాజారావు.
"రాజా!... నీకు వుండేది ఒక సమస్య కాదు. రెండు. ఒకటి నీ భార్య మూలంగా..... రెండవది నీ కొడుకు, కుమార్తె వలన. రెంటికీ పరిష్కారం ఒక్కటే...." చిరునవ్వుతో చెప్పాడు రాఘవయ్య.
"ఏంటి బావా అది?" దీనంగా అడిగాడు రాజారావు.
"రాజా!... జనాలు కొందరు కాలం మారిపోయింది అని తమ అసమర్థతను, అప్రయోజనత్వాన్ని కాలంపై తోసేస్తున్నారు. అది తప్పు. కాలం మారలేదు. తాతాముత్తాతల కాలం మన తండ్రుల కాలంలో, మన కాలంలో ఎలాంటి మార్పు లేదు. మార్పు కలిగింది మనుషుల్లో. స్త్రీ పురుషుల్లో. దానికి కారణం తరం లేని పాశ్చాత్య విద్య. మితిమీరిన డబ్బు. నేడు ఎవరి విషయంలోనైనా, జీవిత విధానం సాగడం అనేది కేవలం డబ్బు మీద ఆధారపడి వుంది. అందుకే జ్ఞానులు అన్నారు ’ధనం మూలం ఇదం జగత్’ నీ భార్య కుమారుడు నిన్ను గౌరవించి అభిమానించి నిన్ను లెక్కచేయాలంటే నీవు కొంతకాలం వారికి కనబడకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. వారికి చేతులకు డబ్బును అందకుండా చేయాలి. పదిమంది అప్పులవాళ్లను ఏర్పరచి వారిని నీవు లేని సమయంలో ఇంటికి వచ్చి బాకీలను అడుగుతూ గొడవలు చేసేలా చేయాలి. వారి వద్ద వున్న ఇల్లు, వస్తు వాహనాలను వేలం వేయించాలి. వారు ఆ ఆడంబర ప్రపంచం నుండి క్రిందికి జారి వీధిపాలు కావాలి.
వారు ఒకనాడు అహంకారంతో అసహ్యించుకొన్న వారి పంచన తలదించుకొనేలా చేయాలి. వారిలోని అహంకారం నశించాలి. ఆత్మావలోకనం జరగాలి. గతాన్ని తలచుకొని (తప్పులను) నిత్యం కన్నీరు కార్చాలి. వారిలో ఆ కష్టాల మూలంగా మనో పరివర్తన కలగాలి. వారి ఆ దుస్థితి సమయంలో వారిపై ఎవరికి ఎక్కువ అక్కర!? అన్న విషయాన్ని వారు గ్రహించగలగాలి. ఈ విషయంలో నీకు నా సహకారాన్ని పూర్తిగా అందిస్తాను రాజా. తాత తండ్రుల కాలంలో కులగోత్రాలను, పారంపర్యాన్ని వెతికి ఎంచి జరుపుకొని ఆ వివాహ బంధాలు దంతుల జీవితాంతం అన్యోన్యతగా, ఇతరుల ఆదర్శప్రాయంగా నిలిచాయి. నేడు ఆ రీతికి పూర్తి విరుద్ధం. కులం లేదు గోత్రం లేదు. లవ్ పేరుతో (Love) తల్లితండ్రుల ఇష్టానుసారంగా కొన్ని, ఆడ మగ ఇష్టానుసారంగానే కొన్ని వివాహాలు జరుగుతున్నాయి. ఆరునెలల లోపలే విడాకులకు (ఆలుమగలు అభిప్రాయ బేధంతో తల్లితండ్రుల సపోర్టుతో) భార్యాభర్యలు సిద్ధం అయ్యి విడిపోతున్నారు.
ఈ తీరు మారాలంటే తల్లితండ్రులు పిల్లలను పద్ధతిగా సాంప్రదాయ పద్ధతిలో పెంచాలి. మంచిచెడ్డలు నేర్పించాలి. తప్పును విమర్శించి ఒప్పును నేర్పాలి. సంసార జీవితం ప్రశాంతంగా సాగేలా చూడాలి. నేను చెప్పినట్లు చెయ్యి. నీ సమస్యలు సమసి నీకు శాంతి కలుగుతుంది రాజా!..." నవ్వుతూ చెప్పాడు రాఘవయ్య.
చిరునవ్వుతో చేతులు జోడించాడు రాజారావు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments