top of page

ఎవరు కారణం?

#AAnnapurna, #Aఅన్నపూర్ణ, #EvaruKaranam, #ఎవరుకారణం?, #తెలుగు కథ



Evaru Karanam - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 16/03/2025

ఎవరు కారణం? - తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


అనిరుధ్ వేగంగా బైక్ మీద కంపెనీకి వెడుతున్నాడు.. లంచ్ బ్రేక్లో బయటకు వచ్చి.. తిరిగి వర్క్ కి వెడుతూ. 


బయటకు రావలసిన పని లేదు. ఆఫీసులోనే రెస్టారెంట్ వుంది. ఎప్పుడూ అక్కడే తింటాడు. 


ఆరోజు ఎందుకు బయటకు వచ్చాడూ అంటే.. అతనికి నెల క్రితం శాంతి తో పెళ్ళికుదిరింది. ఆ అమ్మాయి అనిరుద్దు పనిచేసే కంపెనీ ఎదుట బిల్డింగ్లోనే వర్క్ చేస్తోంది. 


ఇద్దరమూ కాసేపు కలిసివుండచ్చు అని లంచికి పిలిచింది. 

ఇంకేముంది వెళ్ళేడు. ముద్దులు ముచ్చటలు అయ్యాక బైక్ తీసుకుని రోడ్డుమీదకు వచ్చాడు. 


కనిపించడం ఎదురుగా కనిపిస్తుంది శాంతి కంపెనీ. కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలి. 


టర్న్ తిరిగితే అతడి ఆఫీసులో గేటు వస్తుంది వచ్చేసాడు దగ్గిరగా. టర్న్ తిరగడమే.. తరువాయి. 

శాంతి మెస్సేజ్ పెట్టింది లవ్ యు అని. 


అక్కడే ఉండబట్టలేక ఫోను చూసాడు. కొంపమునిగింది. మలుపు తిరిగే క్షణంలో బైక్ స్కిడ్ అయి డివైడర్ ను కొట్టేసాడు అనిరుధ్. చుట్టూ జనం మూగి దగ్గిరలోవున్న హాస్పిటల్లో చేర్చారు. 


డాక్టర్ వెంటనే సర్జరీ చేసాడు బ్రైన్కి. ఆక్షణంలో తప్పనిసరి. ఎవరో తెలియదు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మెడలో వున్నా ఐడీ కార్డు వలన తెలిసింది. వెంటనే అనిరుధ్ మామయ్యకి కబురు తెలిసి చెల్లికి బావకి ఫోను చేసాడు. 


వారం రోజుల్లో పెళ్లి. అన్ని సిద్ధం చేసుకుని రెడీగా వున్నారు. ఇంతలో దారుణం జరిగింది. డాక్టర్ 48 గంటలు గడిస్తేకాని చెప్పలేం.. అన్నారు. శాంతి తల్లి తండ్రి కుటుంబం వచ్చి చూసి వెళ్ళేరు. వాళ్లకి నమ్మకంలేదు. బతికి బయట పడతాడని. ఆలోచనలో పడ్డారు. 


అసలు ఏమి జరిగింది? ఎవరికీ తెలియదు. పోలీసులు ఫోను తీసుకున్నారు. శాంతికి - అనిరుద్ధుకి మధ్య జరిగిన సంభాషణలు మెస్సేజ్లు వలన కొంత అర్ధమైంది. ఎలా తప్పు పెట్టగలరు? కాబోయే భార్యా భర్తలు.. కోటి ఆశాలు కలబోసుకుంటూ ఆ మధుర క్షణాలకోసం ఎదురుచూసే ఆ యువతీ యువకులను ఏమని అనగలరు ? విధి నిర్ణయం అనుకోడం తప్ప. 


''అయ్యో వీడు ఆ మాయదారి ఫోను చూడకుండా వుండాల్సింది.. అని కొడుకు గురించి సుధా - మధు అనుకున్నారు. వాళ్ళు పెళ్లినాటి అనుభూతులు మరిచిపోయారు. 

''ఇంకా నయమే.. పెళ్లి అయ్యాక జరిగివుంటే.. అని ఊపిరి పీల్చుకున్నారు శాంతి అమ్మా నాన్నలు. 


''నాదే పొరబాటు. ఆరోజు శుక్రవారం. మరునాటినుంచి ఇద్దరం లీవు తీసుకున్నాం. వొకచోటనే ఉండేవాళ్ళం.. '' అని శాంతి గుండెలు పగిలేలా ఏడ్చింది. 


''ఏమిటో ఈ కాలం పిల్లలు అన్నిటికి తొందరే! ఇంతకీ జరగవలసిన ప్రమాదం ఎదో రకంగా జరుగుతుందేమో. ఎవరూ ఏమి చెప్పగలరు? విద్ధి నిర్ణయం. అని కొందరు అనుకున్నారు. 


''అసలు ఏమిటో ఈ సంబంధం కుదిరేనా నాటినుంచి.. అపశకునాలే. నేను భయపడుతూనే వున్నాను. ''

అన్నాడు అనిరుధ్ తాత. 


పదేళ్లనుంచి రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ఆయన 90 ఏళ్ళ కురువృద్ధుడు. 


ఈ అమ్మాయి జాతకం చూసినవాడు నిజం చెప్పలేదా? వాడికి చూడటం చేతకాదా! అనుకుంది ఆయన అర్ధాంగి. 


ఇలా ఎవరికివాళ్లు అనుకున్నారు. అనిరుద్ధు కి మెలుకువ రాలేదు. కోమాలోకి వెళ్ళిపోయాడు. 


ఇది ఇలా ఎంతకాలమో తెలియదు అన్నారు డాక్టర్. 


''మీరు శాంతికి మరో సంబంధం చూసుకోండి.. ''అన్నారు సుధా - మధులతో. 


అబ్బాయి కోసం ఇచ్చిన డబ్బు వెనక్కి పంపేశారు. 

అలాగే శాంతి పట్టుచీరలు నగలకు కోసం ఇచ్చిన డబ్బు కూడా సుధా మధు తిరిగి తీసుకున్నారు. 


కానీ శాంతి ఆరోజు లంచ్ కోసం పిలిచి ఈ ప్రమాదం జరగడానికి కారణం ఐనది నేను. అని బాధపడసాగింది. 

ఫ్రెండ్స్ ఎంత చెప్పిన సరిపెట్టుకోలేక కుమిలిపోఇన్ది. 


 ''ఏమండి శాంతి కి మొదట వద్దనుకున్న సంబంధాల వాళ్ళను వెళ్లి అడగండి.. అంది సుధ. 


మధు వాళ్లకి ఫోను చేస్తే 'మాకు వొద్దు లెండి.. అమ్మాయి జాతకం బాగాలేదు.' అనేసారు అంతకుముందు కుదిరింది అన్న వాళ్ళే. 


''ఎవరికీ తెలియదు అనుకున్నాను. ఎలా తెలిసిందో..” అని సుజాత అనుకుంటే, “టీవీ పేపర్లు వున్నాయి గా పుణ్యం కట్టుకోడానికి” అన్నాడు ఆనంద్. 


మధు చెల్లెలు ఎప్పుడో నా కొడుక్కు చేసుకుంటాను అని అడిగినరోజున వొద్దంది సుజాత. తాహతుకి సరిపోదని. 

ఇప్పుడు వెళ్లి బతిమాలుకుంది. 


కానీ శాంతి ''నేను ఎవరిని చేసుకోను.'' అనేసింది. 

''అదేమిటమ్మా.. జరగవలసిన అనర్ధం ఎవరూ తప్పించలేరు. నువ్వు పెళ్లి మానుకోడం సరికాదు..” అన్నారు సుజాత ఆనంద్. 


''వద్దు, కొంతకాలం నన్ను ఇలా వదిలేయండి..” అని చెప్పింది శాంతి.. 


ఎప్పుడు ఏ వార్త వినాలో అని దిగులుగా రోజులు గడుపుతున్నారు సుధా - మధు. 

అలా ఒక ఏడాది గడిచింది.. 


శాంతి నిరీక్షణ ఫలించాలని, అనిరుధ్ కోలుకొని, వారి వివాహం జరగాలని కోరుకుందాం. 

*************************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


Comments


bottom of page