'Five Star Mahila' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 16/04/2024
'ఫైవ్ స్టార్ మహిళ' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ప్రపంచంలో నలుమూలల మహిళలు, మగవారితో సమానంగా పని చేస్తున్నారు అనటానికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. ఎందుకంటే..
ఝాన్సీ లక్ష్మీభాయ్, రాణి రుద్రమదేవి, సరోజిని నాయుడు, అనిబ్ సెంట్, సావిత్రి భాయ్ పులే, దుర్గభాయ్ దేశ్ ముఖ్, విజయలక్ష్మి పండిట్ మొదలైన నారీమణులు భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీర మహిళలు. అలాంటి కాలంలో కూడా అనేకమంది మహిళలు వంటింటికే పరిమితం అయ్యారంటే కారణం.. ? మహిళలు తమ శక్తిసామర్ధ్యాలనూ తాము గుర్తించలేదు. అలాగే సమాజం కూడా గుర్తించలేదు.
అయితే.. ఇప్పటి సమాజంలో మహిళలు మగవారికి మించి అన్ని రంగాల్లో రాణించటం కాదు వారిని మించిపోతున్నారు. కారణం.. ? విద్యాభ్యాసం! నేడు విద్య అనేది ఆడ-మగ అందరికీ సమానంగా అందుతుండటం.
అభివృద్ధి చెందుతూ ఏ సమాజంలో అయితే మహిళలు అభివృద్ధిలో దూసుకుపోతున్నారో.. ఆ సమాజంలోనే మహిళలకు భద్రత కూడా కరువయింది. ఒక మహిళ ఒంటరిగా, ఏ భయము లేకుండా స్వేచ్ఛగా తన పని చేసుకోలేకపోతుంది అనేది అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే.. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్ళు దాటుతున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొందరు మహిళలు తమ సత్తా ప్రపంచానికి చూపించలేకపోతున్నారు. కారణం.. ?
తల్లిదండ్రులు పేదరికం కావొచ్చు లేదా ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకు అనుకునే తల్లిదండ్రుల ఆలోచన కావచ్చు. కారణం ఏదైనా ఇంకా ఎన్నో ప్రాంతాల్లో మహిళలు ఇల్లుకి, ఊరికే పరిమితం అవుతున్నారు. కొత్త లోకంలో పాత విధానాలు అన్నట్లు సాగుతుంది ఒక్కోచోట.
అలాంటి ఊర్లలో రావిపాడు ఒకటి. ఆ ఊరిని ‘ఆడపిల్ల నిధి’ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ ఊరిలో ఎక్కువమంది ఆడపిల్లలే పుడుతున్నారు. ఊరిలో అందరూ పేదలే. వ్యవసాయమే వారి జీవనం. ఒక్కో ఇంటికి కనీసం ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటారు. ఊరిలో అందరి ఆడపిల్లల తల్లిదండ్రులది ఒకటే ఆలోచన. అది ఏంటంటే.. !
ఎంత డబ్బు అయినా కట్నంగా ఇవ్వటానికి సిద్ధం. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడినే వెతికి మరీ వాళ్ళు అడిగిన లక్షల కట్నం ఇచ్చి తమ పిల్లలను అత్తారింటికి పంపటమే. అలా అయితే తమ పిల్లలు ఆనందంగా ఉంటారని.
అదే ఊరిలో అంకయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడి భార్య కూతురుకి జన్మనిచ్చాక చనిపోయింది. కూతురు కిరణ్ బేడిని తానే తల్లి, తండ్రి అయి అందరి ఆడపిల్లల వలే పెంచాడు. అంకయ్య ఊరిలో అందరి కంటే తెలివైనోడు. అతడి ఆలోచనలు వెరైటీగా ఉంటాయి. వాస్తవానికి అంకయ్య చిన్నప్పుడు చాలా బద్దకస్తుడు. ఆ బద్దకం వలనే చిన్నప్పుడు అంకయ్య తండ్రి ఏదైనా పని అప్పజెబితే చాలా సులభంగా, వేగంగా పని ఎలా పూర్తి చేయలో ఆలోచించి అలాగే ప్రయత్నించి చేసేవాడు.
ఆ ఆలోచన శక్తి రానురాను అంకయ్యకు ఉట్టిపడి బద్దకం వదిలి బాగా కష్టపడటం నేర్చుకున్నాడు. ఊరిలో అల్లుళ్ళు అందరూ ఉద్యోగస్తులే. కొందరికి పిల్లలు కూడా పుట్టారు. కిరణ్ బేడి వయసు ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. అందులో కొందరు ఆడపిల్లలకు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు లక్షల కట్నం పోసి మరీ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి వెతికి మరీ పెళ్లి చేస్తు మహా ఆనందం పొందుతు...
ఊరిలో మేధావి అయినటువంటి అంకయ్య కూతురుకి ఇంకా పెళ్లి కాకపోవటం పై ఊరి జనాలంతా రకరకాల సెటైర్లు వేసేవాళ్ళు. కానీ.. !అంకయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. అతడి ఆలోచన అందరిలా లేదు. తన కూతుర్ని బాగా చదివించి తాను ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేయాలని అతడి ఆలోచన. అసలే అంకయ్య మొండివైఖరి కలవాడు. పట్టు విడువని వ్యక్తి.
మరీ పులి కడుపున పులే పుడుతుంది కదా.. అచ్చం తండ్రి ఆలోచనలే కిరణ్ బేడికి కూడా. విదేశాల్లో మహిళలు రిక్షా లాగుతూ కుటుంబంను పోషిస్తున్నారు. అదేంటో మన దేశంలో మహిళలు పోలిస్ స్టేషన్లో పని చేస్తున్నా కూడా రక్షణ ఉండదు. అందుకే తాను IPS అవ్వాలనే బలమైన పట్టుదలతో చదువుతుంది.
ఊరిలో కిరణ్ బేడి కంటే చిన్నవారికి కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. వారి తల్లిదండ్రులు ఎన్నో ఏళ్ళుగా కష్టపడి లక్షలు సంపాదించి వాటిని ఆడపిల్లల పెళ్ళి కోసం దాచి పెళ్ళిలో కట్నకానుకలు ఇస్తుంటే.. అంకయ్య తన కూతురి కల నెరవేర్చుకునేందుకు ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించి లక్షలు ఖర్చు చేసి మంచి శిక్షణ ఇప్పించి చివరకు IPS సాధించేలా చేస్తాడు.
ఇన్నాళ్లు ఊరి జనాల మాటలు మనసులో దాచుకుని కూతురు గమ్యం చేరే వరకు ఓపిక పట్టాడు అంకయ్య. కిరణ్ బేడి కూడా పదిమందితో మాటపడింది. అయినా ఎవరిని ఏమీ అనలేదు. అవును నిజమే...
గెలవకముందు మనం ఏం చేస్తున్నామన్నది ఇతరులకు అనవసరం. గెలిచాక ఇతరులు ఏం అనుకుంటున్నారన్నది మనకు అనవసరం. అంతే.
ఇప్పుడు రావిపాడు గ్రామం ఉలిక్కిపడింది. ఎందుకంటే.. ! కనీస సౌకర్యాలు లేని ఆ పేద గ్రామం నుండి ఒక ఆడపిల్ల IPS సాదించటం అద్భుతం.
కాదు కాదు మహాద్భుతం..
గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోళ్లే తమ ఆడపిల్లలకు భర్తలుగా రావటంతో అంకయ్య తప్ప అందరి జీవన స్థితిగతులు మారాయి. ఇప్పుడు అంకయ్య వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం లేకుండా కూతురు గొప్ప విజయం సాధించింది. అక్కడితో ఆగిందా అంటే అది లేదు. సమాజంలో ఆడపిల్లల రక్షణ బాధ్యతను తాను తీసుకుని ఎందరికో రక్షించగల్గింది. మరెందరికో స్ఫూర్తి నింపింది. ఇప్పుడు కిరణ్ బేడి ఒక 5స్టార్ మహిళ వలే పెరుగాంచింది.
తల్లి లేదు, కళ్ళ ముందే పేదరికం, తండ్రి కష్టం, ఇరుగుపొరుగు వ్యతిరేకత ఒక ఆడది ఇవన్నీ దాటి గమ్యం చేరాలంటే అంత ఆషామాషీ కాదు కదా.. ? గతంలో ఆమె వస్తే కూర్చోమ్మ అని కూడా అనని వాళ్ళు ఆమె వస్తుంటే లేచి నిలబడి నమస్కారం చెప్పే స్థాయికి వెళ్ళింది కిరణ్ బేడి.
కష్టపడి తన కూతుర్ని ఇంత గొప్ప స్థానంలో ఉంచిన అంకయ్య ప్రపంచం అంత గాఢా నిద్రలో ఉన్నప్పుడు ఆమె తిప్పిన పేజీల చప్పుళ్ళే ఆమె గెలుపు ఆని ఆ క్రెడిట్ మాత్రం కూతురుకే ఇచ్చేశాడు. ఇలాంటి గొప్ప తండ్రికి గొప్ప కూతురన్నమాట. వారి ప్రయాణం ఐలా సాగుతుంది.
**** **** **** **** **** ****
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments