#SudhavishwamAkondi, #Friends Goppalu, #ఫ్రెండ్స్, #గొప్పలు , #సుధావిశ్వంఆకొండి, #TeluguStories, #తెలుగుకథలు

Friends Goppalu - New Telugu Story Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 25/03/2025
ఫ్రెండ్స్ గొప్పలు - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఘనంగా చేశారు. ప్రసాద స్వీకరణ, భోజనాలు అన్నీ అయిపోయాయి. హాజరు అయిన కొద్దిమంది బంధువులు వెళ్లిపోయారు.
ఇద్దరు చెల్లెళ్ళ కుటుంబాలు మాత్రం ఉండిపోయారు. మరునాడు ఆదివారం అవ్వడంతో ఓ రోజు కలిసి ఉన్నట్టు ఉంటుందని అనుకున్నారు.
కేటరింగ్ వాళ్ళు సర్దుకుని, సామాను తీసుకుని వెళ్లిపోయారు. పని అంతగా లేకపోవడంతో కాస్త తీరుబడిగా అందరూ ఒకచోట కూర్చున్నారు.
రంగప్రసాద్ వాళ్ళు ముగ్గురు. చెల్లెళ్ళు ఇద్దరూ దగ్గర్లోనే వుంటారు. వాళ్ళ భర్తలు ఇద్దరూ వ్యాపారం చేస్తుంటారు. తల్లిదండ్రులు అతనితోనే వుంటారు.
పిచ్చాపాటి మాట్లాడుతూ ఆ ఇంటి పెద్ద అల్లుడు బావ అయిన రంగప్రసాద్ తో ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఉపయోగాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఏదో ఒక రకంగా తన గొప్ప ప్రదర్శించి, రంగప్రసాద్ ను కించపరచాలని అతని ఆలోచన.
"బావా! లైఫ్ లో ఫ్రెండ్స్ ఉండాలి! నీకు ఫ్రెండ్ షిప్ చేయడం రాదు. అందుకే ఫ్రెండ్స్ లేరు! నాకు చాలామంది ఫ్రెండ్స్ వున్నారు. నేను ఫంక్షన్ చేస్తే ఎంతమంది వస్తారో తెలుసా..?" అంటూ ఉపన్యాసం మొదలుపెట్టాడు.
వెంటనే చిన్న అల్లుడు అందుకున్నాడు.
"అన్నయ్య చెప్పింది నిజం బావా! నాక్కూడా బోలెడు మంది ఫ్రెండ్స్ వున్నారు..."
రంగప్రసాద్ చాలా నెమ్మదస్తుడు. అవసరం ఉన్నవాళ్లకు తనకు వీలైనంత సాయం చేస్తాడు. తను ఎవరినీ సాయం అడగడు! అందరితో బాగానే మాట్లాడతాడు కానీ మందు పార్టీ అనీ, బయట తిరగడానికి రమ్మని పిలిస్తే వెళ్ళడు!
ఉచిత సలహాలు ఇవ్వడు, అడగడు కూడా! అనవసరంగా పనికిరాని సలహాలు ఇచ్చేవాళ్లను పట్టించుకోడు! అందుకని అలాంటివారు ఫ్రెండ్స్ కాలేదు. ఈ కాలంలో తన చుట్టూ ఎక్కువగా అలాంటి వారే ఉండడంతో తనకు ఫ్రెండ్స్ తక్కువే! ఫ్యామిలీ తోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు రంగప్రసాద్.
ఆ చెల్లెళ్లకు అన్నయ్యను తమ మొగుళ్లు తూలనాడడం నచ్చలేదు. అలా కోపంగా చూస్తూ నిలుచున్నారు.
"ఫ్రెండ్స్ సలహాలు పాటిస్తే జీవితంలో ఎదుగుదల ఉంటుంది. నా ఫ్రెండ్స్ సలహా వల్ల నా టూ వీలర్ అమ్మేసి, ఆ మనీ పెట్టుబడితో బిజినెస్ ద్వారా డైలీ సంపాదిస్తున్నా!" అని గొప్పగా చెప్పాడు పెద్దల్లుడు.
ఆ పక్కనే నిలబడి వింటున్న అతని భార్య ఇలా అంది.
"అవునవును! అన్నయ్యా! నువ్వు పెట్టించిన షాప్ బాగా నడుస్తుండేది. ఆ ఫ్రెండ్స్ సలహతోనే షాప్ మూసేసి, నువ్వు ఇచ్చిన టూ వీలర్ అమ్మి, ఇప్పుడు ఆటో నడుపుకుంటూ డెయిలీ సంపాదిస్తున్నాడు. డెయిలీ సంపాదించకపోతే మరి మింగడానికి తిండి ఉండదు కదా!" అంది అతడి నిర్వాకం ఇదీ అని వెటకారం చేస్తూ
దెబ్బకు అతడి నోరు మూతపడింది.
చిన్నల్లుడు పౌరుషంగా అన్నాడు..
"ఆటో నడిపిస్తే మంచి ఆదాయం వస్తుంది. అన్నయ్య మంచిపనే చేస్తున్నాడు కదా! నేనైతే నా ఫ్రెండ్స్ ఈజీగా మనీ సంపాదించే సలహా చెప్పారు. అది నేను పాటించి, టూ వీలర్ ప్లేస్ లో ఫోర్ వీలర్ కొన్నా తెలుసా! ఇప్పుడేమంటారు?" అన్నాడు గొప్పగా
అప్పుడు అతని భార్య అంది.
"అవును గొప్ప సలహా చెప్పారు నీ ఫ్రెండ్స్! టూ వీలర్ అమ్మేసి, ఆ వచ్చిన డబ్బు పెట్టి పేకాట ఆడమని సలహా ఇచ్చారు. పెళ్లప్పుడు అన్నయ్య ఇచ్చిన హీరో హోండా అమ్మేసి, పేకాటలో పెట్టేసి పోగొట్టేసాడు. ఇప్పుడు ఫోర్ వీలర్ నే అంటే కూరగాయల బండి పెట్టుకుని అమ్ముతున్నాడు" అని అంది.
ఈ విషయం పెళ్ళానికి తెలియదని అనుకుని గొప్పగా చెప్పినందుకు తనను తాను తిట్టుకున్నాడు మనసులో.
బావను ఎలాగైనా కించపరిచి ఆనందించాలని అనుకుని, వాళ్లే అభాసుపాలు అయ్యారు పాపం!
ఇలాంటివారు కనిపిస్తూ వుంటారు చాలాచోట్ల.
మీకు కనిపించారా ఇలాంటివారు..?
###
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments