#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #ఫన్ఆర్సిన్, #FunOrSin, #TeluguSpecialArticle, #StreetBeggars, #AnnapurnaArticles, #సామాజికసమస్యలు
Fun Or Sin - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 06/12/2024
ఫన్ ఆర్ సిన్ - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
పాత తరం నటులు అక్కినేని, ఎన్ టీ ఆర్, శోభన్బాబు, కృష్ణ నటించినప్పుడు కూడా అభిమానులు లేకపోలేదు. వున్నారు. కానీ ఇప్పటిలా జనాలు మొదటి రోజు మొదటి షో కి ఎగబడటం.. కొట్టుకోడం.. చివరికి ప్రాణాలు పోగొట్టుకోడం లాంటి వేలం వెర్రి లేదు. ఎవరికీ నచ్చిన నటులు ఉండటం తప్పుకాదు. కానీ మరీ ఇంత పిచ్చి అవసరంలేదు. ఆ సినీ హీరోలు వస్తే తోసుకుంటూ వెళ్లి ఫోటోలు తీసుకోవలసిన అవసరమూ లేదు. అందులోను మహిళలు ఉబలాటపడటం దారుణం. ఈ రోజు ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోనుతో మనకు నచ్చిన నటీ నటులతో అందమైన లొకేషన్ సహా ఫోటోలు తీసుకునే అవకాశాలు చాలా వచ్చాయి. కావాలంటే అలా మీ ముచ్చట తీర్చుకోవచ్చు. అంతేకానీ ఎందుకిలా సినిమాలకు ఎగబడి ప్రాణాలు పోగొట్టుకుంటారో అర్ధం కాదు. దెబ్బలు తగిలించుకుని హాస్పిటల్ పాలై డబ్బు వదిలించుకునే అభిమానం అవసరమా? సినిమాల తీరు చూస్తే అంతా విజువల్ ఎఫెక్ట్ కాపీ చేయడం, ఏవో పిచ్చి ప్రయోగాలు చేయడం, ఎక్కడాలేని పాత్రలు సృష్టించి సినిమా పేరుతొ దోపిడీ చేస్తున్నారు.. నిర్మాతలు. ఇక డైరెక్షన్ గురించి చెప్పక్కరలేదు. ఒంటిమీద హీరోయిన్కి మీటర్ చీర- రెండు అంగుళాల బ్లవుజు. మా ఆడవాళ్లకే రోత కలిగిస్తున్నారు. అందరికి వుండే సహజమైన అవయవాలేగా! అవి మరుగున ఉంటేనే అందం- మర్యాద. బయట పెట్టుకుంటే చులకనకు గురి అవుతారు. అసహ్యం కలుగుతుంది. గతంలో కుటుంబ కథా చిత్రాలు, సమస్యలు- పరిష్కారాలు చెప్పేరు. సందేశాలతో అలరించారు. ఎప్పటికి సజీవంగా నిలిచిపోయే పాటలు, కథ, నటన, పాత్రలు, సాహిత్యం.. అన్నీ అమూల్య రత్నాలు! అప్పటి నటీ నటులమీద ఆరాధన, గౌరవం ఉండేది. ఇప్పుడు దరిద్రపు ఆలోచనలు పుట్టి నేరాలు ఎక్కువ అవడం యువత పెడత్రోవ పట్టడానికి కారణం అవుతున్నాయి. పేరున్న నటీమణులు ఐటం డాన్సులు చేస్తూ దరిద్రపు ప్రదర్శన చేస్తున్నారు. డబ్బుకోసం తెరమీద ఎలాగో అలా కనిపిస్తే చాలు అనే ధోరణి చిరాకు కలుగుతోంది. ఏరంగంలో ఐనా నటులు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. సహజమైన అందం లేదు ఎవరికీ. సర్జరీలు చేయించుకోడం, రీప్లేస్ చేసుకోడం అని అందరికి తెలుసు. ఎవరికీ స్వంతం వాయిస్ లేదు. హీరో అలసిపోకుండా, దుస్తులు నలిగిపోకుండా డూపులు కష్టపడతారు. అందులో ఇప్పుడు సీనియర్ నటుల కుటుంబాల వారి సంతానం రాజ్యం ఏలుతోంది. తండ్రులు సినిమాలు తీస్తే కొడుకులు నటిస్తారు. (ఖర్చులేకుండా) కొందరు నిర్మాతలు, దర్శకులు హీరోల చెప్పు చేతల్లో వుంటారు. సినీ రంగం కూడా రాజకీయాలే! ఇప్పటి తరం కూడా పాత సినిమాలే చూడండి. అందులో నీతి, ఆదర్శం, చక్కని కట్టు బొట్టు సాంప్రదాయం చూసి నేర్చుకోండి. కొత్తదనమ్ కొన్నిటికి పరిమితం చేయాలి. గౌరవం, నైతిక విలువలు ఎప్పటికీ ఆచరణీయాలే. సినిమాని వినోదం కోసమే చూస్తాం. అంతటితో వదిలేయండి. నటులను చూడాలని, మొదటి రోజే సినిమా చూడాలని వెళ్లి నష్ట పోకండి. చెత్త తప్ప ఏమిలేని సినిమా చూస్తే ''ఫన్ కాదు ''సీన్''. |
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments