గ్యాంగ్ లీడర్
- Mohana Krishna Tata
- Mar 15
- 4 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #GangLeader, #గ్యాంగ్లీడర్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Gang Leader - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 15/03/2025
గ్యాంగ్ లీడర్ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
సిటీకి దూరంగా ఉన్న ఒక చీరల షాప్ లోకి వెళ్ళింది హారిక తన ఫ్రెండ్ తో కలిసి..
"ఏం కావాలి మేడం.. ?" అడిగాడు సేల్స్ మాన్
"బయట చల్లటి వాతావరణం.. చినుకులు పడుతున్నాయి.. వేడిగా మాకు ప్లేట్ పునుగులు కావాలి.. "
"మేడం మంచి కామెడీ చేస్తున్నారు.. "
"అదే మరి.. చీరల షాప్ లో చీరలే కదా ఉండేది.. మాకూ అవే చూపించండి.. ఆల్ వెరైటీస్" అంది హారిక
"ఏదైనా ఫంక్షన్ ఉందా మేడం.. ? నా పేరు ఓపిక ప్రసాద్.. నాకు చాలా ఓపిక మేడం. మీకు అన్ని చీరలు చూపిస్తా.. మీకు కావలసినంత సేపు చూడండి.. "
"మాకూ అదే కావాలి.. మీలాంటివారు ఉంటే మాకు టైం పాస్ బాగా అవుతుంది.. "
"అర్ధం కాలేదు మేడం.. "
"ఏమీ లేదు.. మీలాంటివారు ఉంటే, మాకు అన్నీ బాగా తెలుస్తాయి" అంది హారిక
"మీరు మరీ పొగిడేస్తున్నారు మేడం.. "
( 'వీడు హారిక బుట్టలో పడిపోయినట్టున్నాడు' అనుకుంది పక్కన ఉన్న ఫ్రెండ్ జానకి )
ఈలోపు హారిక ఫోన్ రింగ్ అయింది..
"హారికా.. ! నేను ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్నానే.. వాన మొదలైంది.. ఇది తగ్గేలాలేదు. ఏం చెయ్యను.. ?" అడిగింది పావని
"మన ప్లాన్ కొంచం మార్చాను.. ఈ వాతావరణంలో ఎక్కడికి వెళ్తాం.. అందుకే పక్కనే ఉన్న చీరల షాప్ లోనే మన మీటింగ్. బస్ స్టాప్ పక్కన బట్టల షాప్ ఉంది చూడు.. అక్కడకి వచ్చెయ్.. నేను, జానకి కూడా ఇక్కడే ఉన్నాము.. "
"చీరలు కొంటున్నారా.. ? ఏమైనా ఫంక్షన్ ఉందా.. నాకూ రెండు చీరలు తీసుకోండి"
"మనం చీరలు కొనడానికి రాలేదు.. వచ్చాక అంతా చెబుతాను.. నీట్ గా చీర కట్టుకుని వస్తున్నావుగా.. ఇది అసలే చీరల షాప్.. "
"కట్టుకున్నాను.. అదేగా మన డ్రెస్ కోడ్ " అంది పావని తాను కట్టిన చీర చూసి మురిసిపోతూ..
పావనికి చీరల షాప్ లోకి స్వాగతం పలికారు అక్కడ.. ఎంతైనా పట్టుచీరలో వస్తే అంతేగా మరి.. !
"ఎందుకు హారిక ఇక్కడకు రమ్మన్నావు.. ?ఎంచక్కా పక్కన ఉన్న కాఫీ షాప్ లో కలవొచ్చుగా.. ఇక్కడెందుకు?" అడిగింది పావని
"ఒసేయ్ మొద్దు మొహం.. ! ఆడవాళ్ళు అయిన మనం చీరల షాప్ లో కలుసుకుంటే ఆ ఫీలింగ్ యే వేరు కదా.. కాఫీ షాప్ కి వెళ్తే, ఆ బిల్ మనమే కట్టాలి. దాని బదులు చీరల షాప్ కి వస్తే, అక్కడ చీరలు చూసినట్టుంటుంది.. మనకీ చీరల వెరైటీస్ తెలుస్తాయి. పైగా, మనల్ని ఇలా చీరలో చూస్తే, కాఫీ అడిగి మరీ ఇస్తారు. బయట చల్లటి వాతావరణంలో వేడి కాఫీ తాగుతూ.. మనం చిట్ చాట్ చేసుకుంటే భలే ఉంటుంది.. ఇంతకన్నా మంచి గెట్ టు గెదర్ పాయింట్ ఎక్కడైనా ఉంటుందా.. ? మన మొగుళ్ళు మనకి డబ్బులు ఏమైనా లక్షలు ఇస్తున్నారా ఏమిటి.. ? అంది హారిక
"నిజమే హారికా.. ! ఫ్రీగా చీరల గురించి ఇక్కడకన్నా ఎవరు బాగా చెబుతారు చెప్పు.. ?"
"మొత్తానికి ఒప్పుకున్నారు.. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఈ చీరలే కట్టాలి.. మనకీ వాటి గురించి తెలిస్తే మంచిదే కదా.. "
"మా ఆయనని డబ్బులు అడిగితే, నువ్వు ఏమైనా కొంటే చెప్పు, బిల్ నేనే పే చేస్తాను అని.. పది రూపాయలు ఇచ్చి పంపించారు.. " అంది జానకి
"వూరుకో.. మన మొగుళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం.. మనం కలవడం మానేస్తామా.. ?మన కష్టాలు చెప్పుకుంటేనే కదా మనకి మనసు తేలికవుతుంది. అసలే మన ఆడవాళ్ళు.. మనసులో ఏ మాటలు దాచుకోలేరు.. దాచుకుంటే, గుండె బరువెక్కి హార్ట్ ఎటాక్ వచ్చినా వస్తుంది.. అది మనకు వద్దు"
"నిజమే హారిక.. ! మనకి వద్దు.. వద్దు.. !" అంది పావని
"మేడం లంచ్ టైం అవుతోంది.. మీరు కొంచం రెస్ట్ తీసుకోండి.. ఒక గంట తర్వాత మళ్ళీ చీరలు చూపిస్తా.. ఫ్రెష్ స్టాక్ కూడా వచ్చింది. ఇంతకీ మీరు లంచ్ కి వెళ్ళరా.. ?" అడిగాడు సేల్స్ మాన్
"బయటకు వెళ్ళడానికి మూడ్ లేదు.. పర్వాలేదు లెండి.. ఇందాకల మీరు తెప్పించిన కాఫీ చాలా బాగుంది.. మాకు అది చాలు"
"ఉండండి మేడం.. మీలాంటి వారు ఆకలి తో ఉండడమా.. ? " అంటూ పునుగులు తెమ్మని బాయ్ ని పంపించాడు
"ఇప్పుడు చెప్పండి మీ విషయాలు.. " పునుగులు తింటూ అడిగింది హారిక
"జానకికి వాళ్ళాయన పది రుపాయలైన ఇచ్చాడు.. నాకైతే మరీ ఐదు ఇచ్చి పంపించాడు మా ఆయన. ఏమైనా అంటే, మీ ఆడవారికి బస్సు ఫ్రీ ఏ కదా అంటున్నారు" అంటూ తన బాధ చెప్పుకుంది పావని
"ఏమిటే ఈ మగాళ్ళు.. ఆడవాళ్ళ షాపింగ్ స్వేచ్ఛని హరిస్తున్నారు.. ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన దగ్గరనుంచి మనకి డబ్బులు ఇవ్వడమే మానేసారు.. ఫ్రెండ్స్ తో సరదాగా కాస్ట్లీ కాఫీ తాగుదామన్నా అవట్లేదాయే" కోపంగా అంది హారిక
"మా ఆయన ఇంట్లో వంట చెయ్యడట.. కష్టంగా ఉన్నాదంట.. నాకా ఉప్మా తప్పితే ఏమీ రాదు.. ఏం చెయ్యాలి హారిక.. ?" అంటూ తన బాధ చెప్పుకుంది పావని
" 'వంట చెయ్యకపోతే, నా దగ్గరకు రాకండి.. నాతో మాట్లడకండి' అని షరతు పెట్టు.. ఆయనే దారిలోకి వస్తాడు.. అప్పుడు అంట్లు తోమమన్నా తోముతాడు.. అదే మనకున్న పవర్.. ఉపయోగించుకోవాలె"
"హారికకు బాగా ఎక్స్పీరియన్స్ ఏమో " అంటూ చమత్కరించింది జానకి
"మగాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంతేనే.. ! మా ఆయన కూడా ఇలాగే ఏమీ కొనివ్వక పొతే.. ఆన్లైన్ లో ఫేక్ అకౌంట్ లో అందమైన అమ్మాయి పిక్ తో చాట్ చేసి, ఒక నెక్లెస్ అడిగాను"
"ఇచ్చాడా.. ?" ఆత్రుతగా అడిగింది జానకి
"మగాడి బలహీనతే అది.. అప్పు చేసి మరీ కొని ఇచ్చాడు.. "
"అదే డైరెక్ట్ గా కొనమని అడిగితే.. డబ్బులేమైన చెట్లకు కాస్తున్నాయా అంటారు.. " అంటూ అందుకుంది పావని
"ఎంతైనా.. నీ అంత తెలివి మాకు లేకే, నిన్ను సలహా అడుగుతున్నాము.. నువ్వే మా 'గ్యాంగ్ లీడర్' హారిక" అంటూ అందరూ ఒకేసారి అన్నారు
"హారికా.. ! మాట్లాడి.. మాట్లాడి గొంతు ఎండిపోయింది. కూల్ డ్రింక్ ఏమైనా దొరుకుతుందా ఇక్కడ? ఈ సేల్స్ మాన్ ఇక వర్కౌట్ అవడే.. ఇంకొకటి ఆలోచించవే "
"అంతేగా.. ! అందరూ కింద నగల సెక్షన్ కు పదండి.. అక్కడ ఎలాగో కూల్ డ్రింక్ ఇస్తారు.. తాగి ఎంజాయ్ చెయ్యండి"
"మరి షాప్ వాడు ఏమైనా అంటేను.. " సందేహంగా అడిగింది పావని
"బయట వాన తగ్గిన తర్వాత.. అర్జెంటు గా వెళ్ళాలి.. మళ్ళీ వస్తాము అని ఏదో సాకు చెబుదాము. ఇది మన ఏరియా కాదు.. మనం మళ్ళీ ఇక్కడకు ఎలాగో రావడం ఉండదు. కావాలంటే, మీరు నగలతో మంచి ఫోటోలు తీసుకోండి" అంది హారిక కన్ను కొడుతూ
"నిజమే.. ఆ పిక్స్ మా కాలనీ గ్రూప్ లో పెడతాను. చూసి, అందరూ కుళ్ళు కోవాలి మరి.. ! నీ తెలివి సూపర్ గ్యాంగ్ లీడర్.. !" అంటూ అందరూ వంత పాడారు
కింద నగలు చాలా మోడల్స్ చూసారు.. మధ్య లో సర్వ్ చేసిన కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత..
"ఈ మోడల్స్ అన్నీ మా దగ్గర ఉన్నవే.. ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలి" అని సాకు చెప్పి బయటకు వచ్చేసారు అంతా..
"మనం ఇక ఫ్రీ బస్సు ఎక్కి ఇంటికి వెళ్దాము.. నెక్స్ట్ మంత్ ఇంకొక చీరల షాప్ లో కలుద్దాము.. " అంటూ బై చెప్పింది హారిక
"ఈసారి పెద్ద షాప్ కి వెళ్దాము.. అక్కడ అయితే చిప్స్, సమోసా కూడా పెడతారంట" అడిగింది పావని
"అలాగే ప్లాన్ చేస్తాను.. మళ్ళీ కలుద్దాం.. " అంటూ కట్టిన చీర తీసి బ్యాగ్ లో పెట్టి, లోపల జీన్స్ తో బస్ ఎక్కింది హారిక
********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments