'Gated Community - Part 1/2' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 21/03/2024
'గేటెడ్ కమ్యూనిటీ - పార్ట్ 1/2' తెలుగు పెద్ద కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అదొక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లోపల పెద్ద అంతస్తుల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అప్పట్లో, వచ్చిన కొత్త కంపెనీ ప్రారంభ ఆఫర్ పేరిట చాలా తక్కువకే ఫ్లాట్స్ ఇచ్చింది. సొంత ఇంటి కల ఉన్న మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ అందరూ.. ఎగబడి మరీ కొన్నారు. అక్కడ ఫ్లాట్స్ సిటీ కి దూరంగా ఉన్నా.. ఆఫర్స్ అనగానే, చాలా మంది.. ఏమీ ఆలోచించకుండా ఫ్లాట్స్ కొనడానికి రెడీ అయిపోయారు. సిటీ కి దూరం అయితే ఏముంది.. ? ఒక కార్ కొనుక్కుంటే సరిపోతుందని అనుకునే వాళ్ళు చాలా మంది. ఖర్చు లో ఖర్చు.. అని ఒక కార్ తీసుకుంటే సరి అని.. ఇంకొంత మంది. ఫ్లాట్ తక్కువ లో వస్తుంది కాబట్టి.. కార్ తీసుకోవచ్చని కొందరు. ఎలాగైతే నేమి.. ఫ్లాట్స్ అన్నీ హాట్ కేక్ లాగ అమ్ముడుపోయాయి.
ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఒక్కకరిదీ ఒక్కోరకం మనస్తత్వం. గేటెడ్ కమ్యూనిటీ అంటే, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ.. ఉంటాయని అందరి నమ్మకం. అన్నీ సరిగ్గా ఉంటే.. అది అక్షరాల నిజమే.. దేనికీ భయపడనవసరం లేదు.
సరళ ఐదవ ఫ్లోర్ లో.. తన ఫ్లాట్ నుంచి గబగబా బయటకు వస్తోంది. పక్కనే.. తన ఐదు ఏళ్ళ కొడుకు ఉన్నాడు. డోర్ లాక్ చెయ్యడానికి తాళాలు కోసం వెతుకుతుంది సరళ..
"ఏరా సన్నీ.. ! డోర్ తాళాలు ఎక్కడ పెట్టావు? నిన్న రాత్రి వాటితో ఆడావు కాదరా!"
"లేదమ్మా! నేను తీయలేదు.. "
"ఓహ్! డోర్ కే వదిలేసాము.. నిన్నటినుంచి.. "
"తొందరగా పద.. స్కూల్ బస్సు వచ్చేస్తుంది.. బస్సు మిస్ అయితే, మళ్ళీ కష్టం సన్నీ!" అంది తల్లి సరళ
"షూ వేసుకో.. లిఫ్ట్ దగ్గరకు వెళ్లి ఉండు. నేను వస్తాను.. "
"అలాగే అమ్మ!"
సరళ సన్నీ బ్యాగ్ భుజాన వేసుకుని, డోర్ లాక్ చేసి.. లిఫ్ట్ దగ్గరకు పరుగులు తీసింది. లిఫ్ట్ చూస్తే, ఎక్కడో ఆగిపోయింది. టెన్షన్ పడుతోంది సరళ. చివరకి లిఫ్ట్ వచ్చింది. హమ్మయ్య.. ! అనుకుంది సరళ. ఇద్దరూ వెళ్లి బస్సు టైం కు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ వలన బస్సు లేట్ అయ్యింది.. అందుకే మనం చేరుకున్నామనుకుంది సరళ. సన్నీ ని స్కూల్ బస్సు ఎక్కించి.. మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తోంది సరళ.
****
సరళ కు సంతోష్ తో పెళ్ళయి ఆరు ఏళ్ళు అయ్యింది. సంతోష్ ది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఎప్పుడూ కాల్స్ తో బిజీ గానే ఉంటాడు. షిఫ్ట్స్ లో పనిచేస్తాడు.. అందుకే ఎప్పుడూ సరళ.. సన్నీ ని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది..
సరళ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయి, మూడు నెలలు అయ్యింది. అందుకే, అక్కడ అందరూ కొత్త ముఖాలే. సరళ భర్త ఎప్పుడు బిజీ కావడం చేత భార్య ను పట్టించునే అంత తీరిక లేదు.
"ఏమండీ! ఇంట్లో పనులకు పనిమనిషి ని పెట్టుకుందామండి. !" అడిగింది సరళ
"ఎందుకే! ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లో చాలా ఎక్కువ డబ్బులు అడుగుతారు. అయినా.. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా!.. మెల్లగా పనులు చేసుకోవచ్చుగా.. " అన్నాడు భర్త..
"కాదండీ!.. పనులు ఎక్కువ కదా! అందుకే.. "
"చెప్పింది చెయ్యి సరళ!"
"మన అబ్బాయి.. గురించి ఏం ఆలోచించారు? వాడికి ఉన్నసమస్య గురించి.. ?"
"కొంత వయసు వస్తే.. అదే సర్దుకుంటుందని డాక్టర్ చెప్పారుగా.. అందుకే నీకు ఉద్యోగం కూడా వద్దన్నానుగా.. !"
"నేను ఫార్మసీ చదివాను. మీకు తెలుసుగా.. పెళ్ళికి ముందు నేను మెడికల్ షాప్ చూసుకునే దానిని.. ఇప్పుడు పిల్లలు పుట్టాకా.. మానేసాను.. నాకు మళ్ళీ ఉద్యోగం చెయ్యాలని ఉంది.. "
"తర్వాత చూద్దాం లే సరళ.. !"
"మన చిన్నవాడి గురించి ఏం ఆలోచించారు మరి?"
"మీ అమ్మ దగ్గర ఊరిలో ఉన్నాడు గా.. కొన్ని రోజులు పోయాక తీసుకొద్దాము లే !"
"అప్పుడు నేను ఖచ్చితంగా పనిమనిషిని పెట్టుకుంటాను.. ఇద్దరి పిల్లల్ని చూసుకోవడం నా వల్ల కాదు.. "
"చూద్దాం లే సరళ!"
****
ఏదో ఆలోచిస్తూ.. మెల్లగా నడచుకుంటూ వస్తున్న సరళ ని.. పక్కనే వస్తున్న అమ్మాయి పలకరించింది..
"హలో.. ! నా పేరు సరిత.. మీ పేరు?"
"హలో.. ! నా పేరు సరళ.. "
ఈ లోపు ఇద్దరు లిఫ్ట్ దగ్గరకు వచ్చారు. లిఫ్ట్ లోపలికి వెళ్లి.. సరళ బటన్ 'ఫైవ్' నొక్కింది. సరిత బటన్ 'త్రీ' నొక్కింది. అయితే మీరు మా పైన ఉంటారా?" అంది సరిత
"అవునండి.. !" అంది సరళ
లిఫ్ట్ దిగి.. ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం.. మళ్ళీ అదే హడావిడి. సరళ, సరిత ఇద్దరూ తమ పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించారు. బస్సు ఎక్కిన తర్వాత, నడచుకుంటూ వస్తుంటే.. లిఫ్ట్ దగ్గర ఇంకో అమ్మాయి కలిసింది. లిఫ్ట్ లో ఆ అమ్మాయి 'ఫోర్' బటన్ నొక్కింది.
"మీరు మా కింద ఫ్లోర్ లో ఉంటారా.. ?" అడిగింది సరళ
"అవునండి.. "
"మీ పేరు.. ?"
"నా పేరు శాంతి.. "
"శాంతిగారు.. ! మీరు మీ అబ్బాయి ని బస్సు ఎక్కించి చక చకా వచ్చేస్తారు.. "
"అవునండి! మా అయనకు రెండో సారి కాఫీ ఇవ్వాలి.. వెయిట్ చేస్తూ ఉంటారు.. " అంది శాంతి
"మీరు ఉదయాన్నే చీర కట్టుకుని వస్తారు.. అంత తీరిక ఉంటుందా మీకు.. ?"
"మా ఆయనకి నన్నుచీరలో చూడడం అంటే ఇష్టం.. అందుకే ఉదయాన్నే స్నానం చేసి, చీర కట్టుకుని వస్తాను.. " అంది శాంతి
"అలాగే శాంతి గారు.. రేపు కలుద్దాం.. బై"
శాంతి తన పేరుకు తగ్గట్టుగానే చాలా శాంతంగా ఉంటుంది. తనకి హైదరాబాద్ కొత్త. మునుపు వైజాగ్ లో ఉండేవారు. అక్కడ నుంచి భర్త కు హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అవడం చేత.. ఇక్కడకు వచ్చేసారు. గేటెడ్ కమ్యూనిటీ అయితే బాగుంటుందని శాంతి అడిగితే.. బర్త్ డే గిఫ్ట్ గా శాంతికి కొని ఇచ్చాడు భర్త.
ఇంతకుముందు సరళ తనకు వేసిన ప్రశ్నలు తలచుకుని.. ముసి ముసి గా నవ్వుకుంటూ.. తన గతం గుర్తు చేసుకుంది శాంతి..
*****
అప్పట్లో తనకి ఇంకా పెళ్ళి అవలేదు. శాంతి ఒక చిన్న కంపెనీ లో జాబ్ చేస్తుంది. ఇంట్లో కూతురు కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తండ్రి. ఇంత శాంతంగా, అమాయకంగా ఉండే అమ్మాయిని.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అబ్బాయిని తేవడానికి ప్రయత్నం. తండ్రి తెలిసిన సంబంధాలు అన్నీ ప్రయత్నించాడు. అబ్బాయిలకి ఈ రోజుల్లో అభిరుచులు వేరు. అమ్మాయిలు ఫాస్ట్ గా ఉండాలి.. మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవాలని అంటారు.
శాంతి.. చిన్నప్పటినుంచి లంగా వోణి వేసుకోవడమే అలవాటు. ఆ తర్వాత ఇప్పుడు పద్దతిగా చీర కట్టుకోవడం అలవాటు..
"ఎందుకు బాధ పడతారు నాన్న.. ! నాకు ఎప్పుడు రాసిపెట్టి ఉంటే.. అప్పుడే పెళ్ళి జరుగుతుంది. ఎక్కువ టెన్షన్ పడకండి.. !"
"లేదు తల్లీ! నీకు పెళ్ళి చేస్తే.. నా బాధ్యత తీరిపోతుంది. నువ్వు సుఖంగా ఉంటే, నాకు అదే చాలు. నా ఆరోగ్యం కుడా అంతగా బాగోలేదు. నిల్చుంటే కూర్చోలేను.. కూర్చుంటే లేవలేను.. కీళ్ళ నొప్పులు కదా! మీ అమ్మ పోతూ, నిన్ను బాగా చదివించి.. మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయమని నా దగ్గర మాట తీసుకుంది.. "
"నేను మాట్రిమోనీ లో నా ప్రొఫైల్ పెట్టాను నాన్నా! నచ్చిన అబ్బాయి దొరికితే.. మీకీ శ్రమ ఉండదు లెండి.. !"
కొన్నిరోజుల తర్వాత.. మాట్రిమోనీ లో శాంతికి నచ్చిన ఒక అబ్బాయి చాట్ లో కలిసాడు. ఇద్దరి అభిప్రాయలు బాగా కలిసాయి.. అతని పేరు వంశీ. శాంతి మాట తీరు, ఆ చీరకట్టు వంశీ కి బాగా నచ్చాయి. అలాగే, వంశీ కాఫీ ప్రియుడు అని శాంతి కి తెలిసింది. పెళ్ళయిన తర్వాత.. రోజూ శాంతి అందమైన చీర కట్టుకుని, పసందైన కాఫీ.. తన చేతితో ఇస్తే, వంశీ కి హ్యాపీ..
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comentários