top of page

గాయత్రి మంత్రం - అర్థం - విశిష్టత

Updated: Oct 19, 2024

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #GayathriManthramArthamVisishtatha, #గాయత్రిమంత్రంఅర్థంవిశిష్టత, #పురాణం, #ఆధ్యాత్మికం, #TeluguDevotional


'Gayathri Manthram - Artham - Visishtatha' - New Telugu Story Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 27/09/2024

'గాయత్రి మంత్రం - అర్థం - విశిష్టత' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



మనం  ప్రతినిత్యం   ప్రార్ధన  చేసే మహామహిమాన్వితమైన  గాయత్రి  మంత్రంని, దాని విశిష్టతను, అర్ధాన్ని  ఈ క్రింద  వ్రాస్తున్నాను. దయచేసి  అందరూ గమనించ ప్రార్ధన. 

మంత్రం  అర్థం, దాని విశిష్టత తెలుసుకుని  భక్తితో  ఉఛ్ఛరిస్తే   దాని ఫలితం  ఎక్కువ  ఉంటుందని  నా భావన. ఇది  మన గృహాలలో, దేవాలయాలలో, పవిత్రమైన స్ధలాలలో  శుచిగా   ప్రతి  నిత్యం   భక్తితో  ధ్యానం  చేయవచ్చు. విశేష మైన  ఫలితం  సంప్రాప్తి.

   

“గాయత్ర్యాః  పరమ్ మంత్రమ్ నమాతుః  పరదైవతమ్!! “

అనునది  విశిష్ట  శ్లోకం. 

అనగా  తల్లిని  మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు  అని  దీని  భావము. 

గాయత్రి  మంత్రము మొదటగా ఋగ్వేదంలో  చెప్పబడినది. “గాయత్రి”  అనే పదము 'గయ', 'త్రాయతి'  అను పదములతో కూడుకుని ఉంది. 


"గయాన్‌  త్రాయతే  ఇతి గాయత్రీ" అని  ఆదిశంకరులవారు తన భాష్యములో వివరించారు. 

'గయలు'  అనగా ప్రాణములు  అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక  ప్రాణములను రక్షించే  మంత్రం  గాయత్రి మంత్రం. 

వాల్మీకి  మహర్షి  ప్రతి వేయి శ్లోకాలకు  మొదట  ఒక్కొక్క గాయత్రి  మంత్రాక్షరమునుచేర్చి  24 అక్షరములతో 24,000  శ్లోకాలతో  శ్రీమద్రామాయణమును  రచించారు.

గాయత్రి  మంత్రంలోని   ప్రతి అక్షరం  బీజాక్షరమని, మహిమాన్వితమైనదని  విజ్ఞుల భావన. 


ఈ మంత్రాన్ని నిత్యం  శుచిగా  జపిస్తే  సకల  దేవతలను స్తుతించినట్లని  పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని  ప్రతి పదానికి  అర్ధం క్రింద వివరిస్తున్నాను. 


ఓమ్ = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.

భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).

భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).

స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).

తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.

సవితుః = ఈ సృష్టి కర్త.

వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.

భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).

దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.

ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)

ధియో = బుద్ధి

యో = ఏది

నః = మాది, మనది

ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.


గాయత్రి  మంత్రమనేది  ఒకటి ఉందని  తెలిసినా, అదేమిటో? దానిని అసలు  ఎలా జపించాలో? నేటియాంత్రిక  యుగంలో చాలా మందికి  తెలియదు.


 కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు  పరిగెడుతూ హడావిడిగా  జీవితాలను గడపాల్సిరావటం వల్ల  ఈ మంత్రాన్ని గబగబ  బట్టీ పట్టినట్టు మొక్కుబడిగా  దేవుని ముందు అప్పగించేసి  ‘హమ్మయ్య  ఈ రోజుకి  ఈ మంత్రము  చదివేసాను’  అనుకుంటారు.


నిజానికి  'గాయత్రి  మంత్రాన్ని'  ఎలా పడితే  అలా  చదవకూడదు. అసలు గాయత్రి  మంత్రమేమిటో? అది  ఎలా జపించాలో?   నాకు మహామేరువు మంత్ర దీక్షనిచ్చిన మా గురుదేవులు  చెప్పిన  విధంగా అందరూ  తెలుసుకోవాలని  నా యీ  చిన్న ప్రయత్నం.


గాయత్రీ మంత్రము మహామహిమాన్వితమైన మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా  చదవకుండా మంత్రాన్ని  నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…


ఓమ్

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్!


ఇలా  మంత్రం  మధ్యలో  నాలుగు సార్లు  ఆపి చదవాలి.


ఈ మంత్రములో “ఓమ్” అనేది “ప్రణవము”. “భూర్భువస్సువః” లోని  భూః, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి  దివ్యశక్తిని  కలిగిన పదాలు. ఇవి  మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.


గాయత్రి మంత్రంలో  24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని  నిర్మితమైన కొన్ని  గొప్ప ఆలయాలను ఒకసారి గుర్తుచేసుకుందాము.


1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి  24 బీజాక్షరాలకు ప్రతీకలు.


2. కోణార్క్ లోని  సూర్య దేవాలయ  సముదాయం ఒక పెద్ద రధం  మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి  గాయత్రి మంత్రానికి  ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని  ఆంగ్లేయులు  24 గంటలని  తెలిపారు.


3. పురాణ కధల   ప్రకారం  24మంది  ఋషులు  వారి  మంత్రశక్తిని  ఈ 24 బీజాక్షరాలలో  నిక్షిప్తం  చేశారు. ధర్మచక్రంలో  ఉన్న  24 గీతలు  వాటికి  ప్రతీకలు. దానినే  మనం  ’కాలచక్రం'  అని   అంటాము.


4. జైన  సిద్ధాంతంలో  24 తీర్ధంకరులు – ఇది అ వైధిక మతమైనా  వాటికి మూలం  మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భుతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు


7. ఛందస్సులలో  ఒకానొక  గొప్ప ఛందస్సు  గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో  శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”


8. రామాయణంలో  24 సహస్ర శ్లోకాలు.


9. రామాయణం  గాయత్రి మంత్రాన్నే  ప్రతిపాదిస్తోంది. కావాలంటే  మీరే  ఒకసారి  తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక  మనకు   గాయత్రి మంత్రమే కనబడుతుంది. 


10. ఒక వీణలో  24 చిర్రలు వుంటాయి. సంగీతశాస్త్రం తెలిసినవాళ్ళు  దీన్నే ‘గాయత్రి ఉపాసన’  అని అంటారు.


11. మన  వెన్ను బాములో  24 మ్రుదులాస్తులు ( Cartilage) ఉంటాయి.  వాటికి  అధి దేవతలే గాయత్రి  మంత్రాక్షరాలు12. మనకు  గల  సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం  మనలను   కాపాడుతూ ఉంటుంది.


 ఆ గాయత్రి మాత 

 “న గాయత్రీ త్రాహ్య  పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయి. సకల దోషాలు తొలగి పోతాయి. సకల దేవతా  స్వరూపం గాయత్రీ. రామాయణ సారం  గాయత్రీ . కోర్కెలు తీర్చే  మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ . సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రి మాత. 24 బీజాక్షర సంపుటి గాయత్రి. అలాంటి గాయత్రి మాతను నిత్యం త్రికరణశుధ్ధిగా  స్మరణం  చేసుకోవడం అంటే  నిజంగా పూర్వ జన్మ సుకృతము.


ఇరువది  నాలుగు దేవతా మూర్తుల క్రమ సంఖ్య  అక్షరములలో 


1. తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి

2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు

3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు

4 తుః శివుడు 16 ధి సీతాదేవి

5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు

6 రే రాధాదేవి 18 యో యముడు

7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ

8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు

9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు

10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు

11 వ దుర్గాదేవి 23 య హంసదేవత

12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత

ఈ ఇరవైనాలుగు  దేవతా మూర్తులకు  మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త  శుభాలు కలుగుతాయి. ఇది నాకు  అనుభవేకవేద్యము. 


గాయత్రి మాత  సర్వ జగద్రక్ష 🙏


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery








Yorumlar


bottom of page