top of page

గోల

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Gola, #గోల, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Gola - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 22/03/2025

గోలతెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్.. " అంటూ విసుక్కున్నాడు సుబ్బారావు


"కొత్త ఫోన్ కి కాల్స్ రావడం మంచిదే కదరా.. " అన్నాడు పక్కన ఉన్న ఫ్రెండ్ అప్పారావు 


"ఏం కొత్త ఫోనో.. అవసరానికి తక్కువ.. అనవసరానికి ఎక్కువగా తయారైంది"


"అంతేలే.. ! మనం ఫోన్ చేసేది తక్కువ.. సుత్తి కాల్స్ కోసం మాట్లాడేది ఎక్కువ మరి. పోనీ ఆ నంబర్స్ బ్లాక్ చెయ్యలేకపోయావా?" అడిగాడు అప్పారావు


"ఒక నెంబర్ బ్లాక్ చేస్తే, మరొక నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు.. ఒకటే గోల అనుకో"


"ఇంతకీ.. ఏమిటో ఆ కాల్స్.. ?"


"నాలుగు రోజుల కిందట ఒకడు ఫోన్ చేసి.. మీరు కారు అమ్మాలనుకుంటున్నారా.. ? మీకోసం మేము అమ్మి పెడతాము" అని ఒకటే గోల.


"నాకు కారు లేదు అంటే, ‘పర్వాలేదు.. మీరు కొత్త కార్ కొన్న తర్వాత అమ్మాలనుకుంటే, ఈ నెంబర్ కి కాల్ చెయ్యం’డని అంటాడు. ఇంకా నేను కారు కోనేలేదు, అప్పుడే అమ్మమంటాడా.. వీడూ వీడి అపశకున మాటలు.. "


"మొన్న ఇంకొకడు ఫోన్ చేసి, మీకు ఇన్సూరెన్స్ ఉందా.. ? " అని అడిగాడు 


"ఉన్నాది అంటే.. అయినా పర్వాలేదు! ఇంకొకటి తీసుకోండి.. రేపు మీకు పెద్ద యాక్సిడెంట్ జరిగితే, రెండవది ఉండడం బెటర్ కదా అన్నాడు. వీడి ఇన్సూరెన్స్ కోసం ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వాలా.. ? వీడి మొహం మండా.. !"


"మొన్న ఇంకో కాల్ వచ్చింది.. మీరు ప్లాట్స్ కొనాలని అనుకుంటున్నారా.. ? హైవే కి దగ్గర.. కమంతా ఇంటికి పక్కనే ప్లాట్స్ చాలా చవకగా ఉన్నాయి. ఫ్యూచర్ లో సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడికే వచ్చేస్తోంది.. అప్పుడు మీరు కొనలేరు.. ఒక్కటి తీసుకోండి.. " అని ఒకటే నస రా బాబు!


ఇంకా నిన్న.. మా ఆవిడ చేసిన గుత్తి వంకాయ కూర నోట్లో పెట్టుకోబోతున్నాను.. ఒక ఫోన్ కాల్.. " మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండిందా.. ? ఎంత కంపు కొట్టినా సరే, మాదే బాధ్యత. అలాగే మీకు గజ్జి, తామర ఉన్నా.. మాకు కాల్ చెయ్యండి.. " అంటూ వచ్చిన కాల్ కి నేను నాకు నచ్చిన కూర కూడా తినలేకపోయాను తెలుసా.. ! అదే ముద్ద గుర్తొచ్చింది" 


"బిజినెస్ కోసం వాళ్ళు ఏమైనా చేసేటట్టే ఉన్నారు.. ఏం చేస్తాం చెప్పు?" అన్నాడు అప్పారావు


"ఏమో రా.. బొత్తిగా మనశ్శాంతి లేదనుకో ఈ గోల వలన.. కలలో కూడా వాళ్ళే కనిపిస్తున్నారు.. అక్కడ కూడా వదలట్లేదు"


"మొన్న మా ఫ్రెండ్ కి ఎదురైనా అనుభవం చెబితే.. నీకే తెలుస్తుంది ఎంత దారుణంగా ఉన్నారో వీళ్ళు.. అప్పుడు మనం ఎంత బెటర్ గా ఉన్నామో అనిపిస్తుంది.. " అంటూ చెప్పడం స్టార్ట్ చేసాడు అప్పారావు 


మా ఫ్రెండ్ ఒకడు పాపం జాబ్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసాడు. జాబ్ కాల్స్ కోసం పాపం ఫోన్ ఫుల్ ఛార్జ్ పెట్టుకుని రోజూ ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వచ్చింది మొదటి కాల్.. 


*****


"హలో.. !"


"హలో.. !" అంటూ అవతల చాలా స్వీట్ వాయిస్ వినిపించింది


'కంపెనీ హెచ్‌ఆర్‌ అయి ఉంటుంది' "ఎస్ మేడం.. యాం ఐ సెలెక్టెడ్.. ?"


"మీకు జీతం పది వేలు ఉంటే చాలు.. వెంటనే ఒక కార్డు ఇచ్చేస్తాము.. " అంటూ అవతల నుంచి రెస్పాన్స్.


"అది లేకే కదా ఈ తిప్పలు.. " అంటూ ఫోన్ పెట్టేసాడు.


తర్వాత ఇంకో కాల్.. 


"హలో.. ! మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా.. ? ఏదైనా సరే, మేము మీకు సర్వీస్ చేస్తాము.. "


"ఏ కంపెనీ మేడం?"


"జిడ్డు సోప్స్ నుంచి సర్.. మీకు ఏమైనా మరకలు వదలకపోతే, మేము మా సోప్స్ తో మీ ఇంటికి వచ్చి ఉతుకుతాము.. "


"నాకు వొళ్ళు మండుతోంది.. కాస్త రుద్దుతారా?"


"ఆ సర్వీసు కి కనెక్ట్ చేస్తాను.. మినిట్ కి వెయ్యి సర్.. "


ఇలా పాపం.. ! రోజూ చాలా వెరైటీ కాల్స్ వచ్చేవి.. 


మర్నాడు మళ్ళీ "హలో.. ! "అంటూ ఈసారి ఇంకా స్వీట్ హస్కీ వాయిస్ తో అమ్మాయి పలకరించింది.. 


"నాకు ఏమీ వద్దు.. ప్లీజ్ కాల్ చెయ్యకండి.. " అంటూ ఫ్రస్ట్రేషన్ లో అనేసాడు మా ఫ్రెండ్.


"ఆర్ యు ష్యూర్?"


"నాకు ఏమీ వద్దు.. వద్దు.. "


"మీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తునాము.. ధన్యవాదాలు.. " అంటూ ఫోన్ పెట్టేసింది.


"అయ్యో.. ! నా ఉద్యోగం వచ్చీ పోయిందే.. అంటూ ఫోన్ నేలకేసి కొట్టాడు.. "


మళ్ళీ.. "హలో.. ! మీ ఇంట్లో బొద్దింకలు, ఎలుకలు, దోమలు, ఏమున్నా మీకు మేమున్నాము.. మాదే హామీ" అంటూ ఇంకో గొంతు ఫోన్ లో. 


కింద పడి, ఇంకా వాగుతున్న ఫోన్ ని కాలుతో తొక్కి పడేసాడు.. 


*****


"ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు.. ?"అడిగాడు సుబ్బారావు. 


"మెంటల్ హాస్పిటల్ లో.. 'జాబ్.. ఓ మై జాబ్.. ' అంటూ పిచ్చి పాటలు పాడుకుంటున్నాడు.. "


"అయ్యో.. ! పాపం!"


ఇంకా విను.. ఇంకో ఫ్రెండ్ ఒకడు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడు, అతని ఫోన్ మోగింది.. పొరపాటున లిఫ్ట్ చేసాడు.


******


"హలో ఎవరు.. ?" అన్నాడు అతను. 


"నేను మేఘన.. "


హస్కీ వాయిస్ వినగానే మనవాడు ఫుల్ ఫ్లాట్.. పొరపాటున స్పీకర్ బటన్ నోక్కేసాడు.. 


"మీ బాస్ మిమల్ని వేధిస్తున్నాడా.. ? లీవ్ ఇవ్వట్లేదా.. ? ఇంకేమైనా ప్రాబ్లెమ్స్ ఉంటే, మమల్ని సంప్రదించండి. మేము మీకోసం బూతులు తిట్టే నలుగురిని.. అవసరమైతే కొట్టే ఒక నలుగురు వస్తాదులని పంపిస్తాము" అంటూ అవతల నుంచి స్వీట్ వాయిస్.


******


"ఆ తర్వాత అతని పరిస్థితి ఏమిటి.. ?" ఆత్రుతగా అడిగాడు సుబ్బారావు.


"కావాలనే ఇలా చేసాడని.. బాస్ అతనిని ఫైర్ చేసేసాడు. ఇప్పుడు అతను జాబ్స్ మేళా చుట్టూ తిరుగుతున్నాడు.. " బదులిచ్చాడు అప్పారావు.


"అయ్యో.. పాపం! నువ్వన్నది నిజమే.. ! అయితే మనం చాలా బెటర్ " అని ముక్కు మీద వేలు వేసుకున్నాడు సుబ్బారావు.


*********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


1件のコメント


Ra Sud
Ra Sud
3月23日

చాలా బాగుంది 😄

いいね!
bottom of page