top of page
Writer's picturePitta Govinda Rao

గోల్డెన్ హార్ట్



'Golden Heart' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 25/02/2024

'గోల్డెన్ హార్ట్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


అది ఓ ప్రభుత్వ ఆసుపత్రి. జిల్లాకే పెద్ద ఆసుపత్రి. అక్కడ అత్యవసర విభాగంలో శివ అనే పేషెంట్ కి సర్జరీ చేయవల్సి ఉంది. ఆ సర్జరీని అక్కడ సాధారణ వైద్యులు చేతులెత్తేయగా అదే ఆసుపత్రిలో ఒక గొప్ప వైద్యుడిగా పేరొందిన రామానాయుడుని పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు బతిమలాడుతున్నారు. 


డాక్టర్ ఏమో కనికరం చూపకుండా "చేయను" అని ఖరాఖండిగా చెప్పాడు. 


 అది ప్రభుత్వ ఆసుపత్రి కదా! అక్కడ పేదలకు వైద్యం అందించటం ఏ వైద్యుడికైనా బాధ్యత. చేయకపోతే పై నుండి ఏమంటారో అనే భయం కూడా ఉంటుంది. కానీ.  రామానాయుడికి అవేం లేవు. తర్వాత మరలా తన గతాన్ని, తన వ్యక్తిత్వాన్ని తలుచుకుని పేషెంట్ తరుపువారికి చెప్పకుండానే సర్జరీకి అన్ని పరీక్షలు చేసి అనంతరం సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి వారందరినీ ఆనందంలో ముంచెత్తాడు. 


పేషెంట్ కి ప్రాణాపాయం లేదని సర్జరీ సక్సస్ అనగానే కుటుంబ సభ్యులు, బందువులు కేరింతలు కొట్టి డాక్టర్ కి వంగి మోకాళ్ళపై నిల్చుని నమస్కారం చేశారు. అవేమి పట్టించుకోకుండా రామానాయుడు దిగాలుగా వెళ్ళిపోతుండగా రోగి కుటుంబ సభ్యులు ఆపి

 "సార్! నిజంగా మేము చేసింది తప్పే సార్. మమ్మల్ని క్షమించండి " ప్రాధేయపడ్డారు. 


"చూడండి! పేదవాళ్ళు అంటే ఇష్టపడే కొద్దిమందిలో నేనొకడిని. కానీ. . ! పేదలు కూడా తమ తోటి వారిని, లేదా ఆపదలో ఉన్నవారికి చిన్న సహాయం కూడా చేయలేని వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. పాపం అనే మాట మనిషి మనసు నుండి కాకుండా మనిషి అవసరం బట్టి వస్తుందంటే నిజంగా బాధపడాల్సిన విషయం. "అంటూ తన గతాన్ని వివరించాడు. 


తన పేరు రామానాయుడు. పేదింటి విద్యా కుసుమం. వైద్యుడు అవ్వాలనేది అతడి కల. ఆ కలకు తగ్గట్టు తన చదువు సాగాలని చిన్నప్పుడే సంకల్పించుకున్నాడు. అలాగే సాగుతోంది కూడా. . 


ఎంతటివారైనా ఒక్కోసారి విది ఆడే నాటకానికి బలికావాల్సిందే కదా. . రామానాయుడు తొమ్మిదో తరగతిలో ఉండగా ఘోరమైన యాక్సిడెంట్ కి గురై తన రెండు కాళ్ళు కోల్పోయాడు. దీంతో మోకాళ్ళ వరకు వాటిని తీసివేయాల్సి వచ్చింది. కళ్ళెదుటే చక్కగా ఆడుకునే కన్నకొడుకు ఇలా అయిపోవటంతో తల్లిదండ్రులు ఇద్దరు శోకసంద్రంలో మునిగిపోయారు. కాళ్ళు లేని తాను పాఠశాలకు వెళ్ళనని మారం చేసేవాడు. 


తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగ పత్రం కోసం అప్లై చేశారు. అప్లై అయితే చేశారు కానీ. . ! రోజులు, నెలలు, సంవత్సరాలు తిరిగినా సర్టిఫికెట్ రావటం లేదు. రోగుల పై డాక్టర్ల వైఖరి కళ్ళతో దగ్గరుండి చూశాడు, మరియు తాను కూడా ఒక రోగిగా ఆ డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైయ్యాడు. 


జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒకటి గొప్పగా సాదించాలంటే. . అసహ్యించుకునే మనషులు, అవమానపడే సంఘటనలు జరిగితేనే ఒకరకమైన పౌరషం, సాదించాలనే కసి పెరుగుతుంది కదా. . రామానాయుడుకి సర్టిఫికేట్ అందుకోటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో. . సర్టిఫికేట్ విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వలన కొడుకు భవిష్యత్ పై ఆందోళనతో తండ్రి మరణించాడు. 


 ఎలాగైనా చదువు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో తల్లి భుజాలుపై పట్టుకుని పాఠశాలకు తీసుకెళ్ళేది. దుఃఖాన్ని దిగమింగి, కష్టాలను ఓర్చి పది పూర్తి చేసి టాపర్ గా నిలిచాడు. రామానాయుడు ప్రతిభ గుర్తించిన ఒక స్వచ్ఛంద సంస్థ అతడికి వీల్ చైర్ ఇచ్చింది. అతడు ఎదుగుతు వీల్ చైర్ కి అలవాటు పడ్డాడు. రామానాయుడు, అతడి తల్లి కష్టాన్ని చూసినవాళ్ళు ఎందరో వారికి ఆర్థికంగా సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. 


అయితే. . ! వారి సహాయానికి ధన్యవాదాలు చెప్తూనే వారి ఆర్థిక సహాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అలా సహాయం చేయటానికి వచ్చిన వారిలో అందరూ పేదలే ఉండగా వారి దాత్రృత్వాన్ని రామానాయుడు మనసులో పెట్టుకున్నాడు. మూడుపూటలు తినటానికి కూడా తిండి లేకపోయినా పస్తులున్నాడే కానీ ఎవరి వద్ద చెయ్యి చాచలేదు. అలా ఎమ్ బి బి యస్ లో సీటు కోసం కష్టపడి చదివాడు. తన చదువుకు తల్లి తెచ్చే సంపాదన సరిపోకపోవటంతో ఒక్కోసారి రెండు పూటల పస్తులుంటు డబ్బులు ఆదా చేసేవాడు. 


వీల్ చైర్ లో ఉన్నాడని చాలామంది చిన్నచూపు చూసేవారు, అవమానించేవాళ్ళు. ఆత్మాభిమానం ఉన్నోడు కదా దేన్నైనా సహిస్తాడు కానీ అవమానాన్ని ఎలా సహిస్తాడు. . . ? ఆ అవమానాలనే పునాది రాళ్ళుగా, పౌరుషంగా మార్చుకుని అనుకున్నది సాధించాడు. పట్టా అందుకున్నప్పుడు, ట్రైనీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా తక్కువ అంచన వేసేవారు. అన్నీ భరించాడు. 


కాలం ముందుకు వెళ్ళగా విధులకు ఒక్క నిమిషం కూడా డుమ్మ కొట్టకుండా నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నందుకు అతడికి గుర్తింపుగా జిల్లా ఆసుపత్రికి డైరెక్టర్ గా నియామించింది ప్రభుత్వం. అయినా కష్టసాద్యమైన సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు రామానాయుడు వైద్యంలో పాలుపంచుకునేవాడు.

 

 ఏ ఆసుపత్రిలో అయితే తనకు వికాలంగత్వ ధ్రువీకరణ పత్రం ఇవ్వటానికి నిర్లక్ష్యం చేశారో అదే ఆసుపత్రికి ఇప్పుడు డైరక్టర్ గా వచ్చాడు రామానాయుడు. దీని వెనుక రామానాయుడు పట్టుదల, తల్లి కష్టం దాగి ఉన్నాయి. 


అది అలా ఉంటే. . ఆసుపత్రిలో డాక్టర్లు నిజాయితీగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాడు. అలాగే రోగులు బందువులు ఎలాంటి మనస్తత్వం కలవారో తెలుసుకునేందుకు వీల్ చైర్ లో ఉన్న తనను పై ప్లోర్స్ కి తీసుకెళ్ళమనేవాడు. అలా చేసేటప్పుడు కనీసం డాక్టర్ లా కూడా ఉండేవాడు కాదు. మనుషులు మనస్తత్వాలను అలా గమనించటం కూడా అలవాటు చేసుకున్నాడు. 


అలా. . శివ అనే పేషెంట్ ఎమర్జెన్సీ విభాగంలో ఉండటంతో సర్జరీ అవసరమని రామానాయుడుకి వైద్యులు చెప్పగా. . అదే సమయంలో శివ బందువులను అతడు గేటు నుండి ఆసుపత్రి లోపలికి రావటానికి సహాయం అడిగాడు. సహాయం చేయలేదు సరికదా ఎగతాళి చేశారు. తర్వాత వీల్ చైర్ పేషెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశం దగ్గర 

" తనను పై ప్లోర్ కి తీసుకెళ్ళండి " అడుగుతాడు. 


 " ప్రతి ఒక్కడికి మీదకి ఎక్కించటానికి ఉన్నామా. . వెనుక ఎవడికో తీసుకురాకుండా దర్జాగా ఒక్కడు వచ్చాడు. వీడికి మనం సహాయం చేసుకుంటు కూర్చుంటే అక్కడ శివ చచ్చిపోతాడు. ఎవడి బాధ వాడిది" అంటూ అవమానించారు. 


తర్వాత అతడు డాక్టర్ అని తెలిసి విచారించారు. అలా రామానాయుడు తన జీవిత గాథని చెప్పి

"మానవత్వం అనేది ధనవంతులుకే కాదు, పేదవారికి కూడా ఉండదని ఇప్పుడే తెలిసిందని. మనం మంచిగా ఉంటే జరగల్సిన పనులు అవే జరుగుతాయి. మంచి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది " అని చెప్పి తన పని తాను చేసుకోటానికి వెళ్ళిపోయాడు. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 



25 views0 comments

Comments


bottom of page