top of page

గొంతెమ్మ కోరికలు

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #GonthemmaKorikalu, #గొంతెమ్మ కోరికలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Gonthemma Korikalu - New Telugu Story Written By Vemparala Durga Prasad

Published In manatelugukathalu.com On 18/04/2025

గొంతెమ్మ కోరికలు - తెలుగు కథ

రచన: వెంపరాల దుర్గాప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రామా రావు గారి ఇంట్లో అడుగుపెడుతూనే, ఎదురు వచ్చిన వాళ్ళ అమ్మాయి నవ్య ని చూసి నిర్ఘాంత పోయాడు వెంకట శాస్త్రి. కారణం ఆ అమ్మాయి అందం. చదువుల నిమిత్తం చాలా కాలం నుండీ నాగపూర్ లో బి. టెక్ చదువుకి రామా రావు గారు పంపించేసేరేమో, గత నాలుగు సంవత్సరాలుగా ఆ పిల్ల ఆయన కంట పడలేదు. ‘కుందనపు బొమ్మలా వుంది’ అని మనసులో అనుకున్నారు. 


వెంకట శాస్త్రి ఆ ఇంటి పురోహితుడు. రామారావు గారు బ్యాంకు లో జనరల్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యేరు. వాళ్ళ ఆవిడ, ఆయన, కొద్దిగా దైవ భక్తి పరులు. శాస్త్రి గారి సంప్రతింపులతో కానీ వాళ్ళు ఏ పనీ చేయరు. 5 ఏళ్ళ కిందట రామారావు గారి అబ్బాయి పెళ్లి చేయించేరు. అప్పటికి నవ్య ఇంకా చిన్న పిల్ల. 


“రండి శాస్త్రి గారు, మీ గురించే అనుకుంటున్నాను. సంకష్ట హర చతుర్థి పూజ చేయించాలి మీరు. అందుకే మిమ్మల్ని పిలిపించాను " అని, రామారావు గారు ఆయన్ని లోపలికి ఆహ్వానించేరు. 


సోఫాలో కూలబడ్డ శాస్త్రి గారికి మంచి నీళ్లు ఇచ్చి, నమస్కారం పెట్టేరు రామారావు గారి భార్య కమల. 

వాళ్ళకి కావలసిన సరుకులు, తదితర వివరాలు చెప్పి, మనసులో మాట బైట పెట్టేరు శాస్త్రి. 


"మీ అమ్మాయి లా వుంది! ఏం చేస్తోంది?" అన్నారు. 


"అవునండీ. చెన్నై లో వుద్యోగం చేస్తోంది. మా అమ్మాయికి. వర్క్ ఫ్రొం హోమ్ పర్మిషన్ ఇచ్చారు. ఓ 4 నెలలు ఇక్కడే ఉంటుంది. మంచి సంబంధం ఉంటే చూడండి. మా వివరాలు అన్నీ మీకు తెలుసు కదా! " అన్నారు రామారావు గారు. 


“4 రోజుల్లో సంకష్ట హర చతుర్థి పూజ కి వస్తాను కదా, అప్పుడు కొన్ని సంబంధాలు తీసుకుని వస్తాను లెండి” అనేసి ఇంటికి బయలు దేరారు శాస్త్రి గారు. 


ఇక్కడ శాస్త్రి గారి గురించి కొంత చెప్పాలి. 


శాస్త్రి గారు చేసేది పౌరోహిత్యం అయినా, రెండు చేతులా సంపాదిస్తూ, స్టేటస్ బాగా పెంచుకున్నారు. ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చెన్నై లో ఇన్ఫోసిస్ లో వుద్యోగం. చిన్న వాడు JNTU కాకినాడ లో బి. టెక్ 2 వ సంవత్సరం చదువుతున్నాడు. పిల్లలు ఎదిగి మంచి చదువులు చదువుకోవడం, తానూ కూడా 4 రాళ్లు వెనకేసుకోవడం తో ఇప్పుడు ఆయన కళ్ళు, పెద్ద కొడుక్కి మంచి అమ్మాయి ని చూసే పని లో పడ్డాయి. తనకి పౌరోహిత్యం లో మంచి పేరు, డబ్బు వస్తున్నా, అదనపు సంపాదన కోసం, బ్రాహ్మణా వివాహ వేదిక కూడా నడుపుతున్నారు ఆయన. 

ఇంటికి వెళ్ళేక బాగా ఆలోచించారు శాస్త్రి గారు. “ఆ నవ్య ని తన కొడుకు శేఖర్ కి అడిగితే ఎలా ఉంటుంది ?” అని భార్య దగ్గర ప్రస్తావించారు. 


ఆవిడ మొదట సంశయించింది. 


“వాళ్ళ తాహతు కి, మన అబ్బాయికి వాళ్ళ పిల్లని ఇస్తారా.. అనవసరంగా అడిగి ఒక మంచి కస్టమర్ ని కోల్పోతారేమో?” అంది. 


డబ్బు రుచి బాగా తెలిసిన శాస్త్రి గారికి అహం మీద కొట్టినట్లయింది. 


"నీ మొహం. మన తాహతు కి ఏమి తక్కువ. ఏదో పిల్ల అందంగా వుంది, మన శేఖర్ కి ఈడు, జోడు గా ఉంటుంది, పైగా ఇద్దరూ చెన్నై లోనే వుద్యోగం. అది కూడా కలిసి వస్తుంది అని ఆలోచిస్తున్నా. మన శేఖర్ కేమి తక్కువ ?" అన్నారు బింకంగా. 


"ఎందుకయినా మంచిది.. ఈ రోజుల్లో ఆడపిల్లల కోరికలు చెప్పలేము. అన్నీ వివరంగా తెలుసుకున్నాక మన అబ్బాయి ప్రస్తావన తెండి” అంది ఆవిడ ముందుచూపుగా. 


మరో నాలుగు రోజుల్లో సంకష్ట హర చతుర్థి నాడు పూజ చేయించేరు రామారావు గారి ఇంట్లో. బుధ్ధిగా తల్లి పక్కన కూర్చుని పూజ చేసుకున్న నవ్య ని చూసిన శాస్త్రి గారికి ఇంకా నచ్చేసింది. 

పూజ అయిపోయి, హారతి ఇచ్చేసి, తాంబూలం తీసుకున్నాక, కాఫీ సేవిస్తూ, రామారావు గారితో మాటలు కలిపారు. 


"అమ్మాయికి కొన్ని సంబంధాలు నా ఎరుకలో వున్నాయి. చెప్పమంటారా? ” అన్నారు. 


“ముందు అమ్మాయి కి వరుడు ఎలా ఉండాలో మీరు అడిగి తెలుసుకోండి " అన్నారు రామారావు గారు. 


ఆశ్చర్య పోవడం శాస్త్రి గారి వంతు అయింది. 


“ఇప్పటి కాలం పద్ధతులే వేరు” అనుకుంటూ.. “అమ్మాయి నవ్యా! ఒకసారి ఇలా కూర్చోమ్మా “అన్నారు మర్యాదగా. 


నవ్వుతూ వచ్చి కూర్చుంది. 


"ఏం లేదమ్మా! నాన్నగారు నీకు మంచి సంబంధం చూడమన్నారు. నీకు కావలసిన వరుడి లక్షణాలు కొద్దిగా వివరిస్తే, బావుంటుంది ” అన్నారు. 


"దానిదేముంది లెండి అంకుల్, మీ పెద్ద వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలా" అని అంటుంది అనుకున్న శాస్త్రి గారు, ఆ అమ్మాయి రెస్పాన్స్ కి ఉలిక్కి పడ్డారు. 


నవ్య తన కోరికలు వివరించడం మొదలు పెట్టింది:

 "అంకుల్.. నాక్కావలసిన అబ్బాయి సినిమా హీరో మహేష్ లా అందంగా ఉండాలి, ప్రభాస్ అంత ఫిట్ బాడీ ఉండాలి, కోహ్లీ లా క్రికెట్ రావాలి, అంబానీ అంత ఆస్తి ఉండాలి, సునీల్ లాగ మంచి కామెడీ టైమింగ్ ఉండాలి, ఇంకా”.. అని ఏదో చెప్పబోతోంది. 


శాస్త్రి గారు రామారావు గారి కోసం చుట్టూ చూసేడు. రామారావు గారు, కమల గారు దరిదాపుల్లో లేరు. 


నోరు తడారి పోతుండగా.. ”ఇంతకీ నీ హైట్ యెంత తల్లి?” అన్నారు ఆయన గుటకలు మింగుతూ. 


“నేను 5.3 వుంటాను అంకుల్.. అయినా నా పొడుగు తో సంబంధం ఏముంది, నాకు పొడుగు భర్త కావాలి” అంది నిక్కచ్చి గా. 


నిర్ఘాంత పోవడం శాస్త్రి గారి వంతు అయింది. 

“సరే నమ్మా.. ఎరుకలో ఏమయినా ఉంటే చెపుతాను”.. అని ఇంక అక్కడ క్షణం ఉండకుండా బయటకు పరుగు తీసేరు. 


"ఈకాలం ఆడపిల్లల కోరికలు తీర్చడం కంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని మెప్పించడం సులువు సుమా.. " అని స్వగతం గా అనుకుంటూ, స్కూటర్ స్టార్ట్ చేసేరు. 


సమాప్తం

 

వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.





Comments


bottom of page