వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Goppa Samskaram' - New Telugu Story Written By Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 19/01/2024
'గొప్ప సంస్కారము' తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“శేఖర్! నీవు బ్యాంకుకి వెళ్లే టప్పుడు చెప్తే నేనుకూడా వస్తా. ఈ నెలలో పెన్షన్ వెరిఫికేషన్ చేయిన్చు కోవాలి” అన్నాడు చలపతి, కొడుకుతో.
“సరే నాన్నా! శుక్రవారం పదకొండు గంటలకి వెళదాము” అన్నాడు శేఖర్..
చలపతి రిటైర్ అయిన తర్వాత శేఖర్ దగ్గరే ఉంటున్నాడు. అత్తా కోడలు కలివిడిగా ఉంటూ ఎవ్వరికీ ఇబ్బంది కలగ కుండా మెసులు కుంటున్నారు. ఈ విషయములో చలపతి చాలా అదృష్టవంతుడిని చెప్పొచ్చు. కూతురు సుధా ఏడాదికి ఒకసారి పిల్లలతో వచ్చి పది రోజులు ఉండి వెళ్లి పోతుంది.
శుక్రవారం అనుకొన్న విధముగా పదకొండు గంటలకి శేఖర్, చలపతి బ్యాంకుకి వెళ్లారు.
“నాన్నా! మీ పెన్షన్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడే కూర్చోండి. నేను హోసింగ్ లోన్ విషయము కనుక్కొని వస్తాను” అని చెప్పి లోన్ సెక్షన్ కి వెళ్ళాడు శేఖర్. ఇంతలో బ్రాంచ్ మేనేజర్ ఇద్దరు సహా అధికారులతో ముఖ ద్వారము దగ్గరకి వచ్చి నిలబడతారు.
ఐదు నిముషాల తర్వాత డి. జి. మ్. రాంప్రసాద్, తన సిబ్బందితో వస్తారు. బ్యాంకు మేనేజర్ వారిని సాదరముగా ఆహ్వానిస్తారు. రాంప్రసాద్ హాల్ లో నలుమూలల పరిశీలించి మెచ్చుకోలుగా మేనేజర్ వైపు చూస్తాడు.
ఇంతలో రాంప్రసాదుకి ఏదో గుర్తుకు వచ్చినట్టు దూరంగా కూర్చున్న చలపతిని చూసి వడివడిగా చలపతి దగ్గరకి వచ్చి “నమస్కారమండి” అని నిలబడి చెప్తాడు.
చలపతి ప్రతి నమస్కారము చేసి, రాంప్రసాద్ ఎవరో గుర్తుకు రాక నిలబడతాడు.
“నేను రాంప్రసాదు ని. వరంగల్ లో మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళము” అంటాడు. ఇంతలో శేఖర్ వస్తే ముగ్గురు రాంప్రసాద్ కేబిన్ లోకి వెళ్లారు.
రాంప్రసాద్ తన గురించి క్లుప్తముగా తెలిపి, చలపతి గారి క్షేమ సమాచారాలు కనుక్కొని, శేఖర్ హోసింగ్ లోన్ పెండింగ్ లో ఉన్న విషయము తెలుసుకున్నాడు. శేఖర్ రాంప్రసాద్ మాట్లాడు కుంటున్నారు.
చలపతి, రాంప్రసాద్ మరియు వాళ్ళ అమ్మ రాములమ్మతో వరంగల్ లో ముప్పయ్ సంవత్సరాల క్రితము ఉన్నప్పటి రోజులు జుజాయిగా గుర్తు తెచ్చుకుంటున్నాడు. అప్పట్లో పనిమనిషి దొరక్క చాల ఇబ్బంది పడే విషయము గుర్తుకొచ్చింది.. ఆరు నెలల తర్వాత రాములమ్మ పనిమనిషి వరంగల్ లో ఉన్న నాలుగు సంవత్సరాలు తమ ఇంట్లో సజావుగా పని చేసి అందరి మెప్పు పొందింద. అప్పట్లో తనతో పాటు ఆరేళ్ళ కొడుకుని అప్పుడప్పుడు తమ ఇంటికి తీసుకు వచ్చేది. తన భార్య జానకి రాములమ్మ కొడుకుకి పుస్తకాలూ పెన్సిళ్లు స్కూల్ బాగ్ ఇచ్చి ఆప్యాయముగా మరియు ఆభిమానముగా చూసుకునేది.
ఒకరోజు జానకి వచ్చి ‘రాములమ్మ T. V. కొనుక్కుందా మనుకుంటోంది’ అని చెప్పింది. మీరు షూరిటీ ఇస్తే తను వాయిదాల పద్దతిలో తీసుకుంటుంది అని చెప్పింది. తను షూరిటీ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. తను చెప్పిన కారణము జానకి కూడా అర్ధమయ్యిన్ది.
“జానకీ, మనము ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు,. ఒకవేళ రాములమ్మ కిస్తు కట్టక పోయినా లేక మనకు బదిలీ అయినాv మనకే ఇబ్బంది. పిల్లలు ఎదిగే వయస్సు మరియు నాన్న ఆరోగ్యము సరిగా లేదు. ఈ సమయములో ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోవడము కష్టము” అని వివరముగా జానకికి చెప్పాను. తను కూడా మౌనముగా ఉండిపొయిన్ది.
‘సార్’ అనే పిలుపుతో చలపతి ఊహాలోకం నుంచి వాస్తవానికి వచ్చాడు. రాంప్రసాద్ ని చూడాలంటే చలపతి కి అపరాధ భావము అడ్డు వస్తోంది.
చలపతి పరిస్థితి గమనించి, “సార్! మీరు పాత సంగతుల గురించి ఆలోచించ వద్దు” అని చెప్పాడు. “ఆరోజు మీరు ఆ విధముగా చేయటంవలన నా ప్రమేయము లేకుండానే నాలో పట్టుదల పెరిగి ఈ స్ధాయికి చేరాను. ఇంకా అమ్మగారి అభిమానము మరియు ప్రోత్సాహము నా ఎదుగుదలకు తోడ్పడ్డాయి. మీరు మీ అబ్బాయి లోన్ గురించి ఆలోచించ వద్దు. లోన్ ఇచ్చే ఏర్పాటు నేచేస్తాను. మీరు నిశ్చితంగా ఉండండి” అని హామీ ఇచ్చాడు.
చలపతి, శేఖర్ చేతులు జోడించి నమస్కరించబోతే రాంప్రసాద్ ఎదురు చలపతి గారికి నమస్కరించి, “మీ ఆశీర్వాదము నాకు బలము” అని చలపతి గారికి పాదాభి వందనము చేస్తాడు.
“బాబు రాంప్రసాద్! నీవు కుటుంబసమేతముగా మా ఇంటికి రండి” అని ఆహ్వానించారు చలపతి.
“తప్పకుండ వస్తాను. అమ్మగారిని చూడాలని వుంది” అని ఆహ్వానము స్వీకరిస్తాడు రాంప్రసాద్. --------------------------------------------------------------------------------------------------------------------------
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Comments