'Gramaseema - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 07/11/2023
'గ్రామసీమ' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
పట్టణమందు నుండ మది గిట్టక
చెట్టు చేమలున్ దట్టముగుండెడి ఊర చెరువు
గట్టున జేరి సేద్యమున్ చెబట్టగ
తట్టసమాయె మది నింకీ పట్టణ మేలా
సహకార వనంబులున్ పరస్పర
సహకార గుణంబుల జనంబులుండు ఊరునందునన్
సహన శీలురు సహవాస ప్రీతులున్ గాక
కుహన నీతుల కూడలి కూడదక్కడన్
అరుణ కిరణు డడుగిడక ముందె
ఆరు బయట ఊడ్చి చల్లి ముగ్గేతు రతివలచట
కరుణ గుణమెరిగిన కర్షక జనులు గూడ
ఊరు బయటకు వేంచేతురు ఉదయమందె
చదువు లెరుగరు సంస్కార నిధులు వారు
పదవు లెరుగరు పంటల విధులు దప్ప
చదను జేసియు పొలమునకు పదను బెట్టి
అదను జూసెదరు కుదురు పంటల విధము లెరిగి
తప్పటడుగుల నాడె పొట్ట తిప్పలెరిగి
చొప్ప దంటును చేబూని తలిదండ్రులు చెప్పకున్న
దుప్పటొక్కటి పై గప్ప దుమ్ము దులుపుకుంటు
గొప్ప గుణమున పల్లె పిల్ల లేగెదరు పసుల వెంట
పందెమేసిన విధమున ఇరు
సందె వేళలందు సూరీడు
నందుకొనునట్టు గోమందలందు
చిందులేతురు సిసింద్రీలందమనగ.
పేద గడియారమని పేరు గాంచి
వేద కాలమునుండి యాది మరుపు లేక
నాద మొక్కటి జేసి మేల్కొల్పు నరు
ణోదయంబు నందు కుక్కుటంబు జనుల నొక్కసారి.
పచ్చని చేలయందు నును
పెచ్చగ వీచెడి అచ్చపు గాలులందేలగ నచ్చట
మచ్చిక జేకొని మనుజులకడ
కొచ్చెడి పిచ్చుకల విచ్చలవిడికచ్చెరువొందున్.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments