top of page

గుడి మెట్టే ఆధారం

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #GudiMetteAdharam, #గుడిమెట్టేఆధారం, #TeluguStories, #తెలుగుకథలు


'Gudi Mette Adharam' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 20/10/2024

'గుడి మెట్టే ఆధారం' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


 "ఏరా పైడిగా, ఈనెల మామూలు ఇవ్వనేదేటి? పోయిన నెల

కూడా ఆలశ్యం చేసినావ్. ఇలాగైతె నిన్ను కింద మెట్టు కాడకు తోలెయ్యగలను. జాగ్రత్త !" బిచ్చగాళ్ల యూనియన్ లీడర్ సైదయ్య హెచ్చరించాడు. 


"లేదు మేస్త్రీ, ఈ నెల చిట్టీకి డబ్బులు తక్కువైతె నీకు ఇవ్వవల్సిన మామూలు డబ్బులు కట్టినా. బేగె నీ డబ్బులు జమచేస్తా" జవాబిచ్చాడు పైడయ్య. 

  *


 ఊళ్లో దందాలు చేసే గురయ్య నగరానికి వచ్చి గుడి మెట్ల దగ్గర కూర్చుని ముష్టి అడక్కునేవాడు. కడుపులో చల్ల కదలకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు డబ్బులు జమ అయేవి. పూజారి గారు పెట్టే ప్రసాదంతో కడుపు నిండేది. 


 క్రమంగా ఆలయానికి హంగులు చెయ్యడంతో భక్తుల రాక పెరిగి ఆదాయం కూడా మెరుగు పడింది. వచ్చిన డబ్బులతో చిట్టీలు కట్టడం కిస్తీలకు ఇవ్వడం మొదలెట్టేడు. తను వచ్చిన ముందు రోజుల్లో గుడి దగ్గర బిచ్చగాళ్లు తక్కువ ఉండేవారు. అందరూ ముసలివారైనందున గురయ్యదే పెత్తనమైంది. 


 అలా గుడి దగ్గర బిచ్చగాళ్లకు లీడరై యూనియన్ మొదలెట్టాడు. కొత్త బిచ్చగాళ్ల దగ్గర నెలవారీ మామూళ్లు వసూలు చేస్తు దాదాగిరి చేస్తున్నాడు. ఇలా నగరంలోని ఆదాయం వచ్చే పెద్ద దేవాలయాలు, గుళ్ళు దగ్గర పైమెట్టు నుంచి కింద మెట్టు వరకు రేట్లు పెట్టి అమ్ముతున్నాడు. 


 చిట్టీల వల్ల దందాల వల్ల సంపాదించిన డబ్బుతో లేబర్ బస్తీలో స్థలం కొని గుడిసె వేయించేడు. ఊరి నుంచి పెళ్లాన్ని కొడుకు సైదుల్ని నగరం రప్పించి కాపురం పెట్టేడు. 


 గురయ్యకు ముసలితనం రావడంతో తన దందాలన్ని కొడుకు సైదులికి అప్పగించేడు. తర్వాత గురయ్య జబ్బుతో చనిపోవడంతో ఇప్పుడు సైదులే బిక్షగాళ్ల లీడరై దందా నడుపుతున్నాడు. 

  *

 

బిక్షగాడు సైదయ్య బ్యాంకులో ఇంటి రుణాలకు డబ్బు లోన్

ఇస్తున్నారని తెలిసి పేరున్న ప్రభుత్వ బ్యాంకు కొచ్చి మానేజర్ని కలిసాడు. 


బిక్షగాడు సైదుల్ని చూసి బ్యాంక్ మానేజర్ "నువ్వు ఇల్లు ఎలా కడతావు? డబ్బు రుణానికి హామీ ఉందా? " ప్రశ్నల వర్షం కురిపించారు. 


 వెంటనే సైదులు తన భుజానికున్న గుడ్డ సంచిలోంచి

ఇంటి రిజిస్టర్డు డాక్యుమెంట్లు పైకి తీసి " సారూ, ఇదిగో నానుంటున్న ఇంటి కాయితాలు. ఇప్పుడు ఈ ఇంటిపైన మరో అంతస్థు కట్టి కిరాయి కివ్వాలనుంది. తమరు డబ్బులు ఇప్పిస్తే పని మొదలెడతా. 


 నాను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన పెద్దమ్మ గుడి

పెద్ద మెట్టుకాడ కూకుని వచ్చిన పైసలు కిస్తీ(వడ్డీ)ల కిచ్చి ఆ డబ్బుతో బస్తీలో గుడిశె తీసి డాబా కట్టించిండు. 


నాయన సచ్చి పోయినాక నాను పెద్దమ్మ తల్లి పెద్ద మెట్టు

కాడ కూకుని ఇంటికి కరెంటు పంకాలు ఏయించినా. 

ఇప్పుడు ఈ ఇంటి పైన మరో అంతస్థు కట్టి కిరాయి

కివ్వాలనుంది. " వచ్చిన పని చెప్పేడు సైదులు. 


 ఇంటి స్థలం డాక్యుమెంట్లు మా ఆఫీసు సిబ్బంది తనిఖీ చేసిన తర్వాత నిర్ణయం తెలియ చేస్తామని చెప్పి పంపేసారు బ్యాంకు మానేజర్. 


“మీరే నయం, చీకూ చింతా లేని బతుకులు. ఇన్కమ్

టేక్స్ వారికి కానరాని ఆదాయం. బయటకు కనబడని

లక్షాధికారులు. మాలాంటి వాళ్లం రోజంతా ఒత్తిళ్లు, ఆందోళన,

భయంతో జీవితాలు గడుపుతుంటాం ' అని మనసులో

అనుకున్నారు బేంక్ మానేజర్. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

   కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


34 views0 comments

Comments


bottom of page