top of page

గుంటూరు గోంగూర - పార్ట్ 1



'Gunturu Gongura - Part 1/3' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao Published In manatelugukathalu.com On 24/05/2024

'గుంటూరు గోంగూర - పార్ట్ 1/3' పెద్ద కథ ప్రారంభం

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


అది టెన్ స్టార్ 🔯 హోటల్.. హోటల్ పై భాగం గగనాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. గగనాన్ని చేతితో పట్టుకుందామని పైకి వెళితే గగనం అందదు. నిజానికి, కళ్ళు చూసే కొన్ని సంఘటనలకు అంత తేడా ఉంటుంది. నిజమైన నిజం వేరు. కళ్ళు చూసే కొన్ని నిజాలనుకునే సంఘటనలు వేరు. 

 

జిగేల్ జిగేల్ మనే రంగు రంగుల లైట్లతో హోటల్ బయట అంత అలంకరించబడి ఉంది. ఇది నిజం. పైన పటారం లోన లొటారం అన్నట్లు కాకుండా హోటల్ లోపలకూడ సెంట్రల్ ఏ. సీ. తో, అందమైన ఆ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల చిత్రాలతో హోటల్ గోడలు, పర్నీచర్ తదితరాలు చూసే వారి మనసులను అయస్కాంతం లా లాగేస్తున్నాయి. ఆనంద ఊసులను పంచుతున్నాయి. కవిత్వం వ్రాసేవారి మెదడుల్లో రకరకాల మెరుపులను నింపుతున్నాయి. 


హోటల్ పైన మహి ఆడుతూ,పాడుతూ, తాగుతూ, హాయ్ అన్న ఆడపిల్లలను కౌగిలి లోకి లాక్కొని ముద్దు కావాలా? బెడ్ కావాలా? అని అడుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అతని చూపులకు,అతని మాటలకు ఆడ పిల్లల బుగ్గల సిగ్గులు మొగ్గలై  కైపెక్కిపోతున్నాయి. 

మహి లుక్ కు అక్కడి వయ్యారులు విరహం తో సలసల కాగి పోతున్నారు. అతనిని అంటుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. 


 "రతి సుందరుడా.. నవ మన్మథుడా.. " అంటూ కొందరు కన్యలు రతి గానమాలపిస్తున్నారు. 

 

 ఆ హోటల్లో ప్రతి నెల చివరి అయిదురోజులు హోటల్ వారు హోటల్ పైన పార్టీ ఏర్పాటు చేస్తారు. ప్రతి మనిషి కి అయిదు రోజులకు రమారమి అరకోటి బిల్లు వేస్తారు. బిల్లుకు తగ్గ సదుపాయాలను సమకూరుస్తారు. 


అక్కడ అయిదు రోజులు రకరకాల శృంగార క్రీడ లను ఏర్పాటు చేస్తారు. ఆ క్రీడల్లో అందంగా, అసభ్య రహితంగా ఆడవారు తమ అందాలను ఆరబోస్తారు. అలాగే అవక్ర పరాక్ర విక్రమోపేత క్రీడలను కూడా ఏర్పా టు చేస్తారు. ఇక అక్కడ తినడానికి అన్ని రాష్ట్రాల,అన్ని దేశాల ఐటమ్స్ ఉంటాయి. 


అక్కడ తినడానికి గుంటూరు గోంగూర పచ్చడి, నత్త 🐌 ముక్కల కూర, ఉలవచారు,ఇంగువ చారు, ఫిష్ ఆవడ, ఘీ ఆవడ వంటి అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అక్కడికి వచ్చిన వారికి తినడంలో, ఆడటంలో, పాడటంలో,అరవడంలో, ఫైట్ లో అన్నిట పోటీలు ఉంటాయి. 


నాడు అన్నిట మహి ప్రథమ స్థానంలో నిలిచాడు. 

అరకోటి పైన బిల్లు కట్టివచ్చిన వారందరూ మహిని పలు రీతులల్లో స్తుతించారు. మహి అందరి స్తుతులను గౌరవ పూర్వకంగా స్వీకరించాడు. తనని స్తుతించిన వారందరిని తగిన రీతిలో సన్మానించాడు. 


తను సన్మానించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నటభూషణ శోభన్ బాబు వంటి అనేకమంది ప్రముఖులు ఉన్నారు. ఇంకా వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు అనేకమంది ఉన్నారు. 


అదేమిటి? స్వర్గానికి పోయినవారిని మహి ఎలా సన్మానిస్తాడు? అని కొందరు అనుకోవచ్చు. మనసుంటే మార్గాలు అనేకం ఉంటాయి. మహి స్వర్గానికి పోయిన వారి చిత్ర పటాలకు సన్మానం చేస్తుంటాడు. అలా చేయడం మహికి మహాదానం కలిగిస్తుంది. సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి. అలాగే కృష్ణుడి.. సుఖం కృష్ణుడిది. ఆంజనేయుని సుఖం ఆంజనేయునిది. 


అలాగే మహి లాప్ టాప్ లో పని లేనివాడు పిల్లి తలను ఎలా గొరుగుతాడు అన్న వీడియోలను చూస్తుంటాడు. ఇలా మహి చేసే పనులు చిత్రం భళారే విచిత్రం అన్నట్లు ఉంటాయి. 

 మహి ఏ పని చేసినా మహా రిచ్ గా ఉంటుంది. ఆడపిల్లకి కన్నుకొట్టిన రిచ్ గా కన్ను కొట్టాలంటాడు. అలా అలా హోటల్ లో అయిదురోజులు గడిచి పోయాయి.. 


అయిదవ రోజు రాత్రి అక్కడివారందరూ ఆనందంగా గుంటూరు గోంగూర పచ్చడి వేసుకుని అన్నం తింటున్నారు. అప్పుడే మహి ప్రాణ స్నేహితుడు మురళి అవమాన భారంతో పెద్దగా అరిచాడు.. ఆ అరుపు సౌండ్ కొందరికి ఆకాశాన్ని తాకినట్లనిపించింది. మురళి పై అంతస్తునుండి కిందికి దూకాడు. మురళి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి... రంగు రంగుల లైట్ల వెలుతురులో గుంటూరు గోంగూర అన్న లైటింగ్ కాంతి మాత్రం మహా అందంగా ఉంది. 

................................. 


మహి అసలు పేరు మహేష్. అతగాడు డైమెండ్ స్పూన్ తో పుట్టాడు. అతనాడిందే ఆటగా, పాడిందే పాటగా పెరిగాడు. 

మహేష్ తండ్రి అమర్నాథ్. అతడూ ఉన్నత కుటుంబంలోనే పుట్టాడు. తండ్రీ కొడుకులు అచ్చు గుద్దినట్లు ఒకే పోలికలో ఉంటారు. వారి మాట తీరు చూపు తీరు కూడా ఒకే రీతిలో ఉంటుంది. 


 అమర్నాథ్ అయితే తను వయసులో ఉన్నప్పుడు అన్నీ ఉన్నా తాను అనుభవించాల్సి నంత ఆనందాన్ని అనుభవించలేదు. 


"మహి, నా పెద్దలు నాకు వయసు పైబడిన పిదప ఆస్తులు పంచారు. అప్పటికి అనుభవించాల్సిన సమయం మించిపోయింది. నా పెద్దలు క్రమశిక్షణ పేరుతో నాకు చిన్నప్పుడు నాకు కావల్సిన చిన్న చిన్న సరదాలను కూడ తీర్చలేదు. అంతేగాక నాలో ఏం చేయాలన్న భయపడే తత్వాన్ని పెంచారు. మీకు అలా కాకూడదని నా ముగ్గురు సంతానానికి ఇప్పుడే ఆస్తులు పంచేసాను. నీకిచ్చిన ఆస్తిలో అప్పుడే కోటి రూపాయల పైన ఖర్చు చేసేసావు. నువ్వింకా పెళ్ళికూడా చేసుకోలేదు. ఇప్పుడేం చేయాలను కుంటున్నావు?" అమర్నాథ్ మహేష్ ని అడిగాడు. 


"డాడీ.. ఐ డోంట్ లైక్ మ్యారేజ్.. మ్యారేజ్.. వైఫ్.. చిల్డ్రన్స్.. హేట్.. హేట్.. హేట్.. బంధువులే రాబంధువులనే సిద్దాంతాన్ని నేను బాగా నమ్ముతాను. పుట్టు.. అనుభవించు.. సంపాదించు.. అనుభవించు... చావు అన్నది నా సిద్దాంతం.. ఖర్చుపెట్టడం తెలిసిన నాకు సంపాదించడం కూడా తెలుసు.. ఈ పైవ్ డేస్ ఖర్చు పెట్టడమే కాదు. సంపాదించాను కూడా... 


నా సంపాదనకు, నా తెలివికి ఈ ఇండియా చాలద నిపిస్తుంది. అందుకే అమెరికా వెళ్ళాలను కుంటున్నాను. " తండ్రితో అన్నాడు మహేష్. 


 అలా తండ్రీకొడుకులు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి ఇన్స్పెక్టర్ ఇంద్ర వచ్చాడు. 


"హాయ్.. మహి! మురళి సూసైడ్ కి సరైన కారణాలు చెప్పి, మా డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తారని వచ్చాను. " అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్ర. 


“షూర్... తప్పకుండా హెల్ప్ చేస్తాను. " అన్నాడు మహేష్. 


"మీరు ఫైవ్ డేస్ లో గెల్చుకున్న క్యాష్. ఇన్కమ్ టాక్స్ వంటివి పోనూ చట్టబద్దంగా మీకు రావల్సిన క్యాష్ ఇది. తీసుకోండి. " అంటూ ఇన్స్పెక్టర్ ఇంద్ర మహేష్ కి క్యాష్ బాక్స్ అందించాడు. 


"మీరు నలబైలక్షలు కావాలన్నారు కదా? తీసుకోండి. " అంటూ మహేష్ క్యాష్ బాక్స్ తెరచి ఇన్స్పెక్టర్ ఇంద్ర ముందుంచాడు. 


"సిష్టర్ మ్యారేజ్ చేస్తున్నాను. అందుకు అవసరం పడింది. " అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్ర. 


"నో ప్రాబ్లం. నేను అమెరికా వెళుతున్నాను. మీకు వీలైనప్పుడే డాడీకి మనీ హ్యండ్వర్ చెయ్యండి. " అన్నాడు మహేష్. 


"మురళీ సూసైడ్ చేసుకున్నాడా! ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు?" ఇన్స్పెక్టర్ ఇంద్ర ని అడిగాడు అమర్నాథ్. 


"అదే అర్థం కావడం లేదంకుల్. మురళి హోటల్ లో పై అంతస్తు నుండి కిందికి దూకి సూసైడ్ చేసుకున్నాడా? లేదా అతను సూసైడ్ చేసుకునేటట్లు ఎవరైనా చేసారా? లేదా అతనిని పైనుంచి కిందికి ఎవరైనా తోసారా? తెలియడం లేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. " తను తీసుకునే మనీ కట్టలను ముందున్న టేబుల్ మీద పెడుతూ అమర్నాథ్ తో అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్ర. 


"ఇంద్ర! నేను ఈ రోజే అమెరికా వెళుతున్నాను. టికెట్ బుక్ అయిపోయింది. నేను మురళికి సంబంధించిన మేటరంతా మెయిల్ లో పంపుతాను. " ఇన్స్పెక్టర్ ఇంద్రతో అన్నాడు మహేష్. 


"ఓ. కే. నా సీక్రెట్ మెయిల్ కి పంపు. నీకు తెలుసు కదా? నా సీక్రెట్ మెయిల్. ?" అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంద్ర.

 

"తెలుసు. దానికే పంపుతాను. " అన్నాడు మహేష్. ఇన్స్పెక్టర్ ఇంద్ర మనీ తీసుకుని ఇద్దరి దగ్గర సెలవు తీసుకున్నాడు. 


" మురళి సూసైడ్ చేసుకోలేదు. సూసైడ్ చేసుకునేటట్లు చేసారు కొందరు. ఆ కొందరు ఎవరు? ఆ కొందరిలో నేనూ ఉన్నానా?" అని ఆలోచించసాగాడు మహేష్.

=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు




62 views0 comments

Comments


bottom of page